మార్చి 2018 జాతీయం
Sakshi Education
గ్రాట్యుటీ చెల్లింపు బిల్లు(సవరణ)కు ఆమోదం
ఉద్యోగుల గ్రాట్యుటీపై రూ. 20 లక్షల వరకు పన్ను మినహాయింపునిచ్చే గ్రాట్యుటీ బిల్లు(సవరణ)ను పార్లమెంటు ఆమోదించింది. ఈ బిల్లును కేంద్ర కార్మిక మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్ మార్చి 22న రాజ్యసభలో ప్రవేశపెట్టగా ఎలాంటి చర్చా లేకుండా మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. ఈ బిల్లుకు లోక్‌సభ మార్చి 15 న ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి సంతకం అనంతరం బిల్లులోని సవరణలు అధికారికంగా అమల్లోకి వస్తాయి.
కేంద్ర ఉద్యోగులకు ఏడో వేతనసంఘం సిఫార్సుల అమలు నేపథ్యంలో.. పన్ను భారం లేని గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచారు. కేంద్ర సివిల్ సర్వీస్ నిబంధనలు(1972) వర్తించని ప్రైవేటు రంగంలోని సిబ్బందికి ఈ సవరణ లతో ప్రయోజనం చేకూరనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : గ్రాట్యుటీ బిల్లు(సవరణ)కు ఆమోదం
ఎప్పుడు : మార్చి 22
ఎవరు : పార్లమెంట్
ఎందుకు : ఉద్యోగుల గ్రాట్యుటీపై రూ. 20 లక్షల వరకు పన్ను మినహాయింపునిచ్చేందుకు
ఆధార్ వ్యవస్థ పటిష్టం: యూఐడీఏఐ
ఆధార్ కార్డు లేకపోవడం వల్ల ఎంత మంది ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమయ్యారో తమ వద్ద అధికారిక సమాచారం లేదని ఆధార్ ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆధార్ వల్ల పౌరులకు పటిష్టమైన, జీవితాంతం ఆన్‌లైన్‌లో ధ్రువీకరించుకోగల గుర్తింపుకార్డు లభించిందని ఉద్ఘాటించింది. ఆధార్ నమోదుకు వ్యక్తి ఫొటో, వేలి ముద్రలు, కంటి పాపకు సంబంధించిన వివరాలు మినహా కులం, మతం, భాష లాంటి సమాచారం కోరడం లేదంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ముందు యూఐడీఏఐ సీఈఓ అజయ్ పాండే ఆధార్ నిర్వహణ, అమలు తీరుతెన్నులను వివరిస్తూ మార్చి 22న పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
రాజ్యసభలో 69కి చేరిన బీజేపీ సభ్యుల సంఖ్య
రాజ్యసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో 11 సీట్లు అదనంగా గెలుచుకోవడంతో బీజేపీ తన సంఖ్యను 69కి పెంచుకుంది. కాంగ్రెస్ నాలుగు సీట్లు చేజార్చుకుని 50కి పడిపోయింది. మార్చి 23న 58 ద్వైవార్షిక రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించక ముందు బీజేపీకి 48, కాంగ్రెస్‌కు 54 సీట్లున్నాయి. వీరిలో బీజేపీ నుంచి 17 మంది, కాంగ్రెస్ నుంచి 14 మంది సభ్యులు పదవీ విరమణ చేశారు. తాజా ఎన్నికల్లో బీజేపీ నుంచి 28 మంది, కాంగ్రెస్ నుంచి 10 మంది ఎన్నికయ్యారు. అందులో రెండోసారి ఎన్నికైన వారూ కొందరున్నారు.
డౌన్‌లోడ్ స్పీడ్‌లో భారత్‌కు 109వ స్థానం
మొబైల్ డేటా వినియోగంలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నప్పటికీ ఇంటర్నెట్ డౌన్‌లోడ్ స్పీడ్‌లో వెనుకబడింది. గత కొన్నేళ్లలో ఇంటర్నెట్ యూజర్లు గణనీయంగా పెరిగినా డౌన్‌లోడ్ స్పీడ్‌లో మాత్రం 9.01 ఎంబీపీఎస్‌తో 109వ స్థానంలో నిలిచింది. ఓక్లా స్పీడ్ టెస్ట్ ఇండెక్స్ ఈ విషయాలను వెల్లడించింది.
మొబైల్ డౌన్‌లోడ్ స్పీడ్‌లో 62.07 ఎంబీపీఎస్‌తో నార్వే అగ్రస్థానాన్ని కై వసం చేసుకోగా, ఫిక్స్‌డ్ బ్రాడ్‌బాండ్ విభాగంలో 161.53 ఎంబీపీఎస్ స్పీడ్‌తో సింగపూర్ ప్రథమ స్థానంలో ఉంది. భారత్‌లో ఈ స్పీడ్ 20.72.
మొబైల్ డేటా వినియోగంలో నెలకు 150 కోట్ల గిగాబైట్స్‌తో భారత్ ప్రపంచంలోనే టాప్‌లో ఉంది. అమెరికా, చైనా రెండు దేశాల డేటా వినియోగం కన్నా ఇది ఎక్కువ.
క్విక్ రివ్యూ :
ఏమిటి : డౌన్‌లోడ్ స్పీడ్‌లో భారత్‌కు 109 వ స్థానం
ఎప్పుడు : మార్చి 26
ఎవరు : ఓక్లా స్పీడ్ టెస్ట్ ఇండెక్స్
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
ఖాప్ పంచాయతీలు చట్ట వ్యతిరేకం: సుప్రీంకోర్టు
కులాంతర వివాహాలు చేసుకున్న జంటలపై పరువు హత్యలకు పాల్పడుతున్న ఖాప్ పంచాయతీలు చట్ట వ్యతిరేకమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. వెంటనే ఖాప్ పంచాయతీల చట్ట వ్యతిరేక చర్యలను పూర్తిగా అదుపుచేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. పరువు హత్యలకు పాల్పడటమనేది సామాజిక రుగ్మత అని ఇది మనిషి హుందాతనాన్ని, చట్ట సార్వభౌమత్వాన్ని అవమానించడమేనని పేర్కొంది.
2010లో శక్తి వాహిని అనే స్వచ్ఛంద సంస్థ వేసిన పిటిషన్‌ను మార్చి 27న విచారించిన ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఖాప్ పంచాయతీలు చట్ట వ్యతిరేకం
ఎప్పుడు : మార్చి 27
ఎవరు : సుప్రీం కోర్టు
ఎందుకు : కులాంతర వివాహాలు చేసుకున్న జంటలపై పరువు హత్యలకు పాల్పడుతున్నందుకు
ఆప్ ఎమ్మెల్యేలపై అనర్హత ఎత్తివేత
లాభదాయక పదవుల కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే(20 మంది)లపై అనర్హత వేటువేయడాన్ని ఢిల్లీ హైకోర్టు మార్చి 23న కొట్టేసింది. ఈ మేరకు వెలువరించిన నోటిఫికేషన్ చట్ట ప్రకారం సరికాదని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ చందర్ శేఖర్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ అంశాన్ని మరోసారి విచారించి..తగిన నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల సంఘానికి సూచించింది.
ఈశాన్య రాష్ట్రాలకు పన్ను రాయితీలు పొడిగింపు
ఈశాన్య రాష్ట్రాలకు ఇస్తున్న పారిశ్రామిక పన్ను ప్రోత్సాహకాలను కేంద్రం 2020 మార్చి వరకు పొడిగించింది దీనికోసం రూ.3,000 కోట్లు కేటాయిస్తూ ప్రధాని నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈశాన్య రాష్ట్రాల పారిశ్రామిక అభివృద్ధి పథకం-2017 పేరుతో పన్ను ప్రోత్సాహకాలను అందించనున్నారు.
‘హ్యాపినెస్ ఇండెక్స్’లో 133వ స్థానంలో భారత్
ప్రపంచంలో సంతోషమయ జీవితాన్ని గడుపుతున్న దేశాల్లో భారత్ స్థానం దిగజారింది. 156 దేశాలతో కూడిన జాబితాలో భారత్ 133వ స్థానంతో సరిపెట్టుకుంది. గతంలో భారత్ ర్యాంకు 122 కావడం గమనార్హం. సార్క్‌దేశాలతో (దక్షిణాసియా) పోల్చితే యుద్ధ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అఫ్గానిస్తాన్ (145 ర్యాంక్) కన్నా మాత్రమే ఈసారి మెరుగైన స్థితిలో ఉంది. పొరుగుదేశాలైన పాకిస్తాన్-75, భూటాన్-97, నేపాల్-101, బంగ్లాదేశ్-115, శ్రీలంక-116 భారత్ కన్నా మెరుగైన ర్యాంకులు సాధించాయి. ఈ నెల 20న ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపినెస్’ను పురస్కరించుకుని ఐరాసకు చెందిన సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ సొల్యూషన్‌స నెట్‌వర్క్(ఎస్‌డీఎస్‌ఎన్) ఈ వార్షిక నివేదిక విడుదల చేసింది.
అత్యంత సంతోషమయ దేశంగా ఫిన్‌లాండ్ నిలవగా ఆ తరువాతి స్థానాల్లో వరసగా నార్వే, డెన్మార్క్ ఉన్నాయి. వలసదారుల స్థితిగతులు, తలసరి ఆదాయం, స్వేచ్ఛ, విశ్వాసం, దాతృత్వం, అవినీతిరాహిత్యం, ఆరోగ్యకర ఆయుఃప్రమాణం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని నివేదిక రూపొందించారు.
సంతోషంలో తొలి ఐదు
156. బురుండి
155. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్
154. దక్షిణ సూడాన్
153. టాంజానియా
152. యెమెన్
క్విక్ రివ్యూ :
ఏమిటి : గ్లోబల్ హ్యాపినెస్ ఇండెక్స్ - 2018
ఎప్పుడు : మార్చి 15
ఎక్కడ : 133వ స్థానంలో భారత్
ఎవరు : సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ సొల్యూషన్‌స నెట్‌వర్క్
ఆర్మీలో ఐదేళ్లు చేస్తేనే ప్రభుత్వ ఉద్యోగం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను ఆశించే అభ్యర్థులందరూ తప్పనిసరిగా ఐదేళ్లపాటు సైన్యంలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని రక్షణరంగంపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం కేంద్రానికి సిఫార్సు చేసింది. త్రివిధ దళాల్లో సైనిక సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కమిటీ ఈ మేరకు ఓ నివేదికను పార్లమెంటుకు సమర్పించింది. ఈ విషయాన్ని కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం(డీవోపీటీ) దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు కమిటీ తెలిపింది. ఈ సమస్య తీవ్రతను రక్షణశాఖ డీవోపీటీ దృష్టికి సరిగ్గా తీసుకెళ్లలేకపోయిందని ఆక్షేపించింది.
ప్రస్తుతం భారత ఆర్మీలో 7,679 మంది అధికారులతో పాటు 20,185 మంది జూనియర్ కమిషన్‌డ అధికారులు, నేవీలో 1,434 మంది అధికారులతో పాటు 14,730 మంది సెయిలర్లు, వాయుసేనలో 146 మంది అధికారులు, 15,357 మంది ఎయిర్‌మెన్ల స్థానాలు ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది.
‘అమ్మ’ పేరుతో దినకరన్ పార్టీ
అన్నాడీఎంకే బహిష్కృత నేత, చెన్నై ఆర్కేనగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం’ అనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. మదురై జిల్లా మేలూరులో మార్చి 15ననిర్వహించిన సభలో ఆయన పార్టీ పేరును ప్రకటించారు. పైన నలుపు, మధ్యలో తెలుపు, కిందిభాగంలో ఎరుపు, మధ్యలో జయలలిత ఫొటోతో కూడిన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ
ఎప్పుడు : మార్చి 15
ఎక్కడ : తమిళనాడులో
ఎవరు : టీటీవీదినకరన్
న్యూస్ 18 సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగం
‘న్యూస్ 18’ గ్రూప్ ఢిల్లీలో మార్చి 16న నిర్వహించిన రైజింగ్ ఇండియా సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు.. రైజింగ్ ఇండియా అంటే ఆర్థిక వ్యవస్థ, జీడీపీ, విదేశీ పెట్టుబడులు మొదలైనవి మాత్రమే కాదని.. రైజింగ్ ఇండియా అంటే 125కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. నోట్లరద్దు తర్వాత దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు పెరిగాయన్నారు.
చాలా తక్కువ సమయంలోనే స్వచ్ఛభారత్ మిషన్ ఓ ప్రజా ఉద్యమంగా మారిందని.. నేడు దేశవ్యాప్తంగా 13 కోట్ల కుటుంబాలకు మరుగుదొడ్లు ఉన్నాయని మోదీ పేర్కొన్నారు. నాలుగేళ్లలో దేశంలో పారిశుద్ధ్య పరిధి 38 శాతం నుంచి 80 శాతానికి పెరిగిందని చెప్పారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : న్యూస్ 18 రైజింగ్ ఇండియా సదస్సు
ఎప్పుడు : మార్చి 16
ఎక్కడ : న్యూఢిల్లీలో
ఎవరు : పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ
ఇంఫాల్‌లో 105 ఇండియన్ సైన్స్ కాంగ్రెస్
మణిపూర్‌లోని ఇంఫాల్‌లో 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌నుమార్చి 16 నుంచి 20 వరకు జరిగింది. దీన్నిప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతు.. ప్రజలకు మరింత మేలుకలిగేలా పరిశోధనల పరిధిని విసృ్తతం చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రయోగశాలల నుంచి క్షేత్రస్థాయికి ఈ పరిశోధనలు మారాల్సిన అవసరం ఉందన్నారు. పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ)ని పునర్నిర్వచించి.. దేశాభివృద్ధికి ప్రయోగాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఒక్కో శాస్త్రవేత్త.. ఏడాదిలో 100 గంటల సమయాన్ని కనీసం 100 మంది 9-12 తరగతుల విద్యార్థులతో గడిపి వారిని ప్రోత్సహించాలని ప్రధాని కోరారు.
"శాస్త్ర, సాంకేతికత ద్వారా ఇప్పటికీ చేరుకోలేని వర్గాలను చేరుకోవటం"అనేది ఈ సారి సైన్‌స కాంగ్రెస్ ఇతివృత్తం. భారతీయ సైన్‌స కాంగ్రెస్ సభలకోసం ముందుగా నిర్ణయించుకున్నట్లుగా హైదరాబాద్ కాకుండా చివరి నిమిషంలో ఇంఫాల్‌కు మారింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్
ఎప్పుడు : మార్చి 16 - 20
ఎక్కడ : ఇంఫాల్, మణిపూర్
ఎవరు : ప్రారంభించిన ప్రధాని మోదీ
దేశంలో పొగతాగుతున్న పిల్లలు 6.25 లక్షలు
దేశంలో 6.25 లక్షల కన్నా ఎక్కువ మంది పిల్లలు రోజూ సిగరెట్ తాగుతున్నారు. భారత్‌లో ధూమపానం దురలవాటు వల్లే ప్రతివారం 17,887 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అమెరికన్ కేన్సర్ సొసైటీ, వైటల్ స్ట్రాటెజీస్ రూపొందించిన ‘గ్లోబల్ టొబాకో అట్లాస్’ నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. స్మోకింగ్ వల్ల ఏటా భారత్‌కు వాటిల్లుతున్న నష్టం సుమారు రూ. 1,81,869 కోట్లుగా తేల్చింది.
నివేదిక ప్రకారం, భారత్‌లో రోజూ సుమారు 4 లక్షల మంది బాలురు, 2 లక్షల మంది బాలికలు సిగరెట్ తాగుతున్నారు. వయోజనుల్లో పురుషులు 9 కోట్లు, మహిళలు సుమారు కోటిన్నర మంది పొగతాగుతున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశంలో పొగతాగుతున్న పిల్లలు 6.25 లక్షలు
ఎప్పుడు : మార్చి 16
ఎక్కడ : భారత్‌లో
ఎవరు : అమెరికన్ కేన్సర్ సొసైటీ, వైటల్ స్ట్రాటెజీస్ ‘గ్లోబల్ టొబాకో అట్లాస్’ నివేదిక
చరిత్రలో అవిశ్వాస తీర్మానాలు
ప్రస్తుతం దేశంలో అవిశ్వాస తీర్మానాలపై చర్చ జరుగుతోంది. ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇవ్వడమే అందుకు కారణం. ఈ నేపథ్యంలో గతంలో పార్లమెంటులో వివిధ ప్రభుత్వాలు ఎదుర్కొన్న విశ్వాస పరీక్షలు, అవిశ్వాస తీర్మానాలను ఓసారి పరిశీలిద్దాం.
తొలి పదేళ్లలో అవిశ్వాసం రాలేదు..
పార్లమెంటు 66 ఏళ్ల చరిత్రలో లోక్‌సభలో ఇప్పటి వరకు అనేక విశ్వాస, అవిశ్వాస తీర్మానాలపై చర్చ జరిగింది. మెజారిటీ సభ్యుల మద్దతు ఉందని నిరూపించుకోలేకపోయిన ఐదుగురు ప్రధానులు రాజీనామా చేశారు.
1999 ఏప్రిల్‌లో బీజేపీ నేతృత్వంలోని కూటమి నుంచి అన్నాడీఎంకే బయటకు వెళ్లిపోవడంతో బలాన్ని నిరూపించుకోవాల్సిందిగా వాజ్‌పేయిని రాష్ట్రపతి ఆదేశించారు. ఈ విశ్వాస పరీక్షలో ఒక్క ఓటు తేడాతో వాజ్‌పేయి ప్రభుత్వం ఓడిపోయింది. రాజీవ్‌గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై 1987లో తెలుగుదేశం నేత సి.మాధవరెడ్డి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా అది మూజువాణి ఓటుతో వీగిపోయింది. పీవీ నరసింహారావు నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం (1991-96) మూడు అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొని ఐదేళ్లు నిలబడగలిగింది. చివరగా 2003లో వాజ్‌పేయి ప్రభుత్వంపై లోక్‌సభలో కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా వీగిపోయింది.
ఢిల్లీలో కృషి ఉన్నతి మేళాని సందర్శించిన ప్రధాని మోదీ
ఢిల్లీలో మార్చి 16-18 వరకు జరిగిన వ్యవసాయ సదస్సు ‘కృషి ఉన్నతి మేళా-2018’ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. మార్చి 17న ఈ సదస్సులో పాల్గొన్న ప్రధాని.. అనంతరం రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. రైతులు పంట వ్యర్థాలను తగులబెట్టకుండా కాలుష్యాన్ని తగ్గించడంలో తోడ్పడాలన్నారు. పంట పెట్టుబడి కంటే మద్దతు ధర కనీసం ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉండేందుకు.. పంట పండించడానికి అయ్యే అన్ని ప్రధాన ఖర్చులనూ పెట్టుబడి కింద లెక్కలోకి తీసుకుంటామని మోదీ భరోసానిచ్చారు.
మద్దతు ధర పెట్టుబడి కంటే కనీసం ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉండేలా చూస్తామని 2018-19 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.
కృషి ఉన్నతి మేళాలో దాదాపు 800 స్టాళ్లు ఏర్పాటు చేసి వ్యవసాయ ఉత్పత్తులు, నూతన విధానాలపై అవగాహన కల్పించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కృషి ఉన్నతి మేళా
ఎప్పుడు : మార్చి 16-18
ఎక్కడ : ఢిల్లీలో
ఎవరు : మేళాని సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ
చిన్నారులపై నేరాల్లో యూపీ టాప్
దేశవ్యాప్తంగా 2015 నుంచి 2016 వరకు చిన్నారులపై నేరాలు 11 శాతం పెరిగాయని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) నివేదిక విడుదల చేసింది. 2015లో దేశవ్యాప్తంగా 94,172 నేరాలు నమోదుకాగా 2016 నాటికి ఈ సంఖ్య 1,06,958కు చేరుకుందని పేర్కొంది. ఈ నివేదికను క్రై అనే ఎన్జీవో సంస్థ డెరైక్టర్ కోమల్ గనోత్రా విశ్లేషించారు. చిన్నారులపై నేరాల్లో 15 శాతంతో ఉత్తరప్రదేశ్ మొదటిస్థానంలో ఉండగా, మహారాష్ట్ర(14 శాతం), మధ్యప్రదేశ్(13 శాతం) తర్వాతి స్థానాల్లో నిలిచాయని ఆయన తెలిపారు. నేరాల్లో మాయమాటలు చెప్పి తీసుకెళ్లడం, కిడ్నాపింగ్‌లు(48.9 శాతం) తొలిస్థానంలో ఉండగా.. పిల్లలపై అత్యాచారాలు(18 శాతం) తర్వాతిస్థానంలో నిలిచినట్లు వెల్లడించారు. వృద్ధులపై నేరాల్లో ఆంధ్రప్రదేశ్ 4, తెలంగాణ 5వ స్థానాల్లో నిలిచాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదిక 2015-16
ఎప్పుడు : మార్చి 18
ఎందుకు : చిన్నారులపై నేరాల్లో మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్
ఐఎస్ అపహరించిన 39 మంది భారతీయులు మృతి: కేంద్రం
ఇరాక్‌లో నాలుగేళ్ల క్రితం ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులు అపహరించిన భారతీయుల కథ విషాదాంతమైంది. ఆ 39 మంది భారతీయులు చనిపోయారని, వారి మృతదేహాలను గుర్తించామని కేంద్రం ప్రకటించింది. వారిని ఉగ్రవాదులు ఊచకోత కోసి మోసుల్ పట్టణం సమీపంలోని బదోష్ అనే గ్రామంలో పూడ్చిపెట్టినట్లు గుర్తించామని తెలిపింది. డీఎన్‌ఏ పరీక్షల అనంతరం వారు అపహరణకు గురైన భారతీయులేనని నిర్ధారణకు వచ్చినట్లు మార్చి 20న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ రాజ్యసభకు తెలిపారు.
2014లో మోసుల్ పట్టణం ఐఎస్ ఉగ్రవాదుల అధీనంలో ఉండగా.. మొత్తం 40 మంది భారతీయులు అపహరణకు గురవగా, వారిలో ఒకరు బంగ్లాదేశ్‌కు చెందిన ముస్లింనని చెప్పుకుని సురక్షితంగా బయటపడ్డాడు.
ఇండియా ఇన్నోవేషన్ గ్రోత్ ప్రోగ్రామ్‌కు 2 మిలియన్ డాలర్లు
దేశీయంగా స్టార్టప్ సంస్థలకు ఊతమిచ్చేందుకు ఉద్దేశించిన రెండో విడత ఇండియా ఇన్నోవేషన్ గ్రోత్ ప్రోగ్రాం (ఐఐజీపీ) 2.0కి టాటా ట్రస్ట్స్, లాక్‌హీడ్ మార్టిన్, కేంద్ర సైన్‌స అండ్ టెక్నాలజీ విభాగం (డీఎస్‌టీ) ఈ ఏడాది కూడా 2 మిలియన్ డాలర్లు కేటాయించాయి. వ్యవసాయం, వైద్యం, నీరు, ఇంధనం మొదలైన రంగాల్లో సమస్యలకు సంబంధించిన సాంకేతిక పరిష్కారాల కనుగొనే ఔత్సాహిక వ్యాపారవేత్తలను తోడ్పడేందుకు ఈ నిధులను ఉపయోగించనున్నారు. డీఎస్‌టీ ప్రోగ్రామ్ హెడ్ (ఇన్నోవేషన్, ఎంట్రప్రెన్యూర్‌షిప్ విభాగం) హర్కేష్ మిట్టల్ ఈ విషయాలు తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండియా ఇన్నోవేషన్ గ్రోత్ ప్రోగ్రామ్‌కు 2 మిలియన్ డాలర్లు
ఎప్పుడు : మార్చి 21
ఎవరు : టాటా ట్రస్ట్స్, లాక్‌హీడ్ మార్టిన్, కేంద్ర సైన్‌స అండ్ టెక్నాలజీ విభాగం (డీఎస్‌టీ)
ఎక్కడ : భారత్‌లో
‘ఆయుష్మాన్ భారత్’కు కేంద్ర కేబినెట్ ఓకే
ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకంగా భావిస్తున్న ‘ఆయుష్మాన్ భారత్’ను ప్రారంభించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇటీవల బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఈ పథకం ద్వారా ఏటా 10 కోట్ల పేద కుటుంబాలకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా కల్పించాలని సంకల్పించిన సంగతి తెలిసిందే. అలాగే, పట్టు పరిశ్రమ అభివృద్ధికి రూ.2,161 కోట్లు కేటాయించడానికి సమ్మతించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మార్చి 21న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం కేంద్ర నిధులతో అమలవుతున్న రాష్ట్రీయ స్వస్థ్య బీమా యోజన(ఆర్‌ఎస్‌బీవై), సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్‌స స్కీం(ఎస్‌సీహెచ్‌ఐఎస్) పథకాలను ఆయుష్మాన్ భారత్‌లో విలీనం చేయనున్నారు.
ఇతర నిర్ణయాలు..
ఏమిటి : ‘ఆయుష్మాన్ భారత్’కు ఆమోదం
ఎప్పుడు : మార్చి 21
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : ఏటా 10 కోట్ల పేద కుటుంబాలకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా కల్పించేందుకు
ఆయుధాల దిగుమతిలో భారత్‌కు మొదటి స్థానం
దేశ రక్షణకు అవసరమైన ఆయుధాల దిగుమతిలో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2008-12; 2013-17 మధ్యకాలంలో భారత్ ఆయుధాల దిగుమతి 24 శాత ం పెరిగనట్లు స్టాక్‌హోమ్‌కు చెందిన ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(సిప్రీ) మార్చి 13న వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా గత ఐదేళ్ల దిగుమతులను పరిశీలిస్తే భారత్ వాటా 12 శాతంగా ఉంది. రష్యా, అమెరికా, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా నుంచి భారత్ ఎక్కువగా ఆయుధాలను కొనుగోలు చేస్తోంది.
అత్యంత చౌకైన నగరంగా బెంగళూరు
భారత్‌లో జీవించడానికి అత్యంత చౌకైన మెట్రో నగరంగా బెంగళూరు గుర్తింపు పొందింది. ఎకనమిక్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఈఐయూ) మార్చి 15న విడుదల చేసిన గ్లోబల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ రిపోర్ట్-2018లో బెంగళూరు ప్రపంచంలోనే ఐదో చౌకైన నగరంగా నిలిచింది. ఈ సర్వేను ప్రపంచంలోని 139 మహానగరాలపై నిర్వహించారు.
జాతీయ గీతం సవరణకు తీర్మానం
జాతీయ గీతంలోని ‘సింధ్’ స్థానంలో ‘ఈశాన్యం’ అని చేర్చాలని ప్రతిపాదిస్తూ కాంగ్రెస్ ఎంపీ రిపున్ బోరా మార్చి 16న రాజ్యసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత్‌లో ‘ఈశాన్యం’ కీలక ప్రాంతమైనా..దానికి జాతీయ గీతంలో చోటు లేకపోవడం దరుదృష్టకరమన్నారు. అదే సమయంలో పాకిస్తాన్ భూభాగంలో ఉన్న సింధ్‌ను జాతీయ గీతంలో ప్రస్తావిస్తున్నామన్నారు.
కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు సమ్మతి
కోలుకునే అవకాశం ఏమాత్రం లేని పరిస్థితుల్లో.. మృత్యువు కోసం ఎదురుచూస్తూ, మంచంపైనే కాలం వెళ్లదీస్తున్నవారికి ఊరటనిచ్చేలా దేశ అత్యున్నత న్యాయస్థానం మార్చి 9న కీలక తీర్పును వెలువరించింది. మరణం వాయిదా వేయడం మినహా మరే ఆశ లేనప్పుడు, శారీరక బాధను భరించలేని దయనీయ పరిస్థితిలో.. రోగి లేదా అతని తరఫున నమ్మకమైన వ్యక్తి అనుమతితో కారుణ్య మరణం ప్రసాదించవచ్చని పేర్కొంటూ పరోక్ష కారుణ్య మరణానికి(పాసివ్ యుథనేసియా) సమ్మతించింది. గౌరవప్రదమైన మరణం కూడా జీవించే హక్కులో భాగమేనని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
కారుణ్య మరణం అమలుకు సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని కచ్చితమైన మార్గదర్శకాలను కోర్టు పేర్కొంది. చికిత్స సాధ్యం కాదని, మరణం అనివార్యమని తెలిసినప్పుడు లేక చాన్నాళ్లుగా అచేతన స్థితిలో (కోమా) ఉన్నప్పుడు ఆ రోగి లేదా ఆ వ్యక్తి తరఫున.. కేవలం మరణాన్ని వాయిదా వేసే వైద్య చికిత్స తనకవసరం లేదని, ఆ ప్రాణాధార చికిత్సను నిలిపేయాలని కోరుతూ ‘అడ్వాన్స్డ్ మెడికల్ డెరైక్టివ్’ లేదా ‘లివింగ్ విల్’ను ఇవ్వొచ్చని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం వివరించింది. కారుణ్య మరణం కోసం ‘అడ్వాన్స్డ్ మెడికల్ డెరైక్టివ్’ని చట్టబద్ధం చేయకపోవడం.. ఆర్టికల్ 21 ప్రకారం రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ప్రశాంతంగా, గౌరవ ప్రదంగా మరణించే హక్కును పట్టించుకోకపోవడమేనని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ అంశంపై వీలైనంత త్వరగా చట్టం చేయాలని ప్రభుత్వానికి సూచించింది. తనతో పాటు జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ తరఫున ఆయన తీర్పు వెలువరించగా.. జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్‌లు వేర్వేరుగా తీర్పు వెలువరించారు.
చికిత్సకు సంబంధించిన స్వయంగా నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్న రోగికి అన్ని విధాలా దగ్గరివారైన, రోగి మనస్సును అర్థం చేసుకోగలవారైన వ్యక్తికి రోగి కారుణ్య మరణంపై నిర్ణయం తీసుకునే అధికారం అప్పగించడాన్నే మెడికల్ పవర్ ఆఫ్ అటార్నీ లేదా లివింగ్ విల్ లేదా అడ్వాన్స్డ్ మెడికల్ డెరైక్టివ్ అంటారు.
2011లోనే..: 2011లో అరుణా షాన్‌బాగ్ కేసు సమయంలో పరోక్ష కారుణ్య మరణాన్ని సుప్రీంకోర్టు గుర్తించింది. అనంతరం ఇలాంటి సంఘటనలో పరోక్ష కారుణ్య మరణం కోసం రోగి ఇచ్చే లివింగ్ విల్లును గుర్తించాలని కామన్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేయగా.. సుప్రీంకోర్టు తాజా తీర్పునిచ్చింది.
ఆ కేసుతోనే కారుణ్య మరణంపై చర్చ
అరుణ రామచంద్ర షాన్‌బాగ్.. 1973లో ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆస్పత్రిలో నర్సుగా చేస్తున్న సమయంలో వార్డు బాయ్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె మెడకు గొలుసు బిగించి గాయపర్చడంతో అరుణ మెదడుకి రక్తప్రసారం నిలిచిపోయి అచేతన స్థితికి వెళ్లిపోయింది. 42 ఏళ్ల పాటు అలా మంచానికే పరిమితమయ్యారు. ట్యూబులతో ద్వారా వైద్యులు ఆహారం అందించారు. 2009లో సామాజిక కార్యకర్త పింకీ విరాని ఆమె స్థితికి చలించి ట్యూబుల్ని తొలగించి కారుణ్య మరణం ప్రసాదించాలని సుప్రీంలో పిటిషన్ వేశారు. కోర్టు ముగ్గురు ప్రముఖు వైద్యులతో కమిటీ వేయగా.. అరుణ బ్రెయిన్ డెడ్ అవలేదని, యుథనేసియా ఈ కేసుకి వర్తించదని ఆ కమిటీ తెలిపింది. దీంతో విరానీ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత అరుణ న్యుమోనియా సోకడంతో 2015, మే 18న మరణించారు.
యుథనేసియా రకాలు..
స్వచ్ఛంద(వాలంటరీ):
రోగి అంగీకారం, అనుమతి మేరకు అతడికి మరణాన్ని అందించడం. బెల్జియం, లక్సెంబర్గ్, నెదర్లాండ్‌సలో ఈ రకం యూథనేసియా చట్టబద్ధం.
స్వచ్ఛందం కాని(నాన్‌వాలంటరీ):
రోగి అనుమతి, అంగీకారం తీసుకునే పరిస్థితి లేనప్పుడు నిర్వహించే మరణ ప్రక్రియ ఇది. పసిపిల్లల విషయంలో అరుదుగా ఉపయోగిస్తుంటారు. ఏ దేశంలోనూ ఇది చట్ట సమ్మతం కాదుగానీ.. నెదర్లాండ్‌సలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం అనుమతిస్తారు.
బలవంతపు(ఇన్‌వాలంటరీ):
పేరులో ఉన్నట్లే రోగికి ఇష్టం లేకపోయినా అతడిని చంపేసే ప్రక్రియను ఇన్‌వాలంటరీ యూథనేసియా అని పిలుస్తారు.
పాసివ్, యాక్టివ్:
పాసివ్ యుథనేసియాలో రోగికి అందిస్తున్న వైద్యాన్ని ఆపివేయడం ద్వారా మరణించేలా చేస్తారు. యాక్టివ్ యుథనేసియాలో వెంటనే చనిపోయేలా విషపు ఇంజెక్షన్లు ఇస్తారు.
న్యూఢిల్లీలో ‘వియ్ ఫర్ డెవలప్‌మెంట్’ సదస్సు
మార్చి 10న పార్లమెంటు సెంట్రల్ హాలులో ‘వియ్ ఫర్ డెవలప్‌మెంట్’ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్రాలకు చెందిన శాసన సభ్యుల్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. అత్యంత వెనకబడ్డ జిల్లాల అభివృద్ధికి పాటుపడటం సామాజిక న్యాయం దిశగా అడుగులు వేయడమేనని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. ఆ క్రమంలో దేశంలోని 115 వెనకబడ్డ జిల్లాల అభివృద్ధి కోసం చట్ట సభ్యులు కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యంతో చట్టసభ్యులు నిజాయతీగా ఒక ఏడాది పనిచేస్తే.. గొప్ప మార్పు సాధించవచ్చని, మానవ అభివృద్ధి సూచీలో భారత్ పైకి ఎగబాకుతుందని చెప్పారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ‘వియ్ ఫర్ డెవలప్‌మెంట్’ సదస్సు
ఎప్పుడు : మార్చి 10
ఎక్కడ : న్యూఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో
ఎవరు : సదస్సులో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీలో అంతర్జాతీయ సౌర కూటమి సదస్సు
అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్‌ఏ) వ్యవస్థాపక సదస్సు మార్చి 11న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ సహా ఆరుదేశాల ఉపాధ్యక్షులు, ఉప ప్రధానులతో పాటు 19 దేశాల నుంచి మంత్రుల స్థాయి బృందాలు సదస్సులో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా మోదీ మాట్లాడతూ.. ప్రపంచంలోని అన్ని దేశాలకు చవకైన సౌరవిద్యుత్ సులువుగా అందేలా చూడాలని పిలుపునిచ్చారు. ఇంధన రంగంలో సోలార్ ఉత్పత్తి వాటాను పెంచాలని, అందుకోసం సోలార్ ప్రాజెక్టులకు రాయితీలపై రుణాలు సమకూర్చాలని ఆయన సూచించారు. 2022 నాటికి పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా భారత్ 175 గిగావాట్స్ విద్యుదుత్పత్తిని సాధించగలదని, ప్రస్తుత సామర్థ్యానికి అది రెండింతలని పేర్కొన్నారు. అలాగే... సోలార్ లక్ష్యాల్ని సాధించేందుకు 10 కార్యాచరణ సూత్రాల్ని ఈ సమావేశంలో ప్రధాని మోదీ ప్రతిపాదించారు. చవకైన సోలార్ ఇంధనాన్ని అందుబాటులోకి తేవడం, కూటమి సమర్థంగా పనిచేసేలా నిబంధనలు, ప్రామాణికాల రూపకల్పన తదితర అంశాల్ని ఆయన ప్రస్తావించారు.
సోలార్ ఇంధనాన్ని పోత్సహించే లక్ష్యంతో 121 దేశాల్ని ఒకే వేదికపైకి తేవాలన్న మోదీ ఆలోచన నుంచి పుట్టిందే ఐఎస్‌ఏ(ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్).
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతర్జాతీయ సౌర కూటమి సదస్సు
ఎప్పుడు : మార్చి 11
ఎక్కడ : న్యూఢిల్లీలో
భవిష్యత్ ఆణిముత్యాల కోసం రిలయన్స్ యూనివర్సిటీ
పరిశోధన, ఆవిష్కరణలతోపాటు భవిష్యత్తు నేతలు, సంగీత విద్వాంసులు, శాస్త్రవేత్తలు, ఒలింపిక్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్టు రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ తెలిపారు. ఇండియా టుడే సదస్సులో పాల్గొన్న ఆమె క్రీడలు, విద్యకు సంబంధించిన అంశంపై మాట్లాడుతూ... ఈ రెండూ రేపటి రోజున భారత్ ఎదిగేందుకు గల శిఖరాలుగా పేర్కొన్నారు.
యూపీలో అతిపెద్ద సోలార్ విద్యుత్ కేంద్రం ప్రారంభం
భారత పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ దంపతులతోపాటు ప్రధాని మోదీ వారణాసిలో పర్యటించారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ కేంద్రంలో ఏర్పాటు చేసిన చేనేత ప్రదర్శనను సందర్శించారు. అనంతరం వారణాసి-పాట్నాల మధ్య నడిచే రైలును మోదీ ప్రారంభించారు. అంతకుముందు, మోదీ, మాక్రాన్ కలిసి ఉత్తరప్రదేశ్‌లోనే అతిపెద్ద సోలార్ విద్యుదుత్పత్తి కేంద్రాన్ని మిర్జాపూర్ జిల్లా ఛాన్వే బ్లాక్‌లో ప్రారంభించారు. 75 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యమున్న ఈ సోలార్ ప్లాండ్‌ను రూ.500 కోట్ల వ్యయంతో ఫ్రెంచ్ కంపెనీ ఎంజీ (ఈఎన్‌జీఐఈ) సాంకేతిక సహకారంతో నిర్మించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : యూపీలో అతిపెద్ద సోలార్ విద్యుత్ కేంద్రం ప్రారంభం
ఎప్పుడు : మార్చి 12
ఎవరు : ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్
ప్రపంచ స్మార్ట్ సిటీల్లో భువనేశ్వర్‌కు 20 వ స్థానం
ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు ప్రపంచ స్మార్ట్ సిటీల జాబితాలో 20వ స్థానం దక్కింది. జునిపర్ రీసెర్చ్ అనే సంస్థ ఇంటెల్ సాయంతో ‘గ్లోబల్ స్మార్ట్‌సిటీ పర్ఫామెన్స్ ఇండెక్స్’ పేరుతో నిర్వహించిన సర్వే ఫలితాలను తాజాగా విడుదల చేసింది.
ఈ జాబితాలో చోటు సాధించిన ఏకై క భారతీయ నగరం భువనేశ్వర్. రవాణా సౌకర్యాలు, ఆరోగ్య సదుపాయాలు, భద్రత, ఉత్పాదకత అనే నాలుగు అంశాల్లో ర్యాంకింగ్స్ ఇచ్చారు. భద్రతలో ప్రపంచంలోనే 13వ ర్యాంకు దక్కించుకున్న భవనేశ్వర్.. రవాణా, ఆరోగ్యం, ఉత్పాదకత సూచీల్లో 20 స్థానంలో నిలిచింది. 2016లో భారత ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్ సిటీల జాబితాలోనూ భువనేశ్వర్ తొలిస్థానంలో నిలిచింది.
ఈ సర్వేలో సింగపూర్ నాలుగు అంశాల్లోనూ తొలిస్థానం సాధించింది. రెండో స్థానం రవాణా అంశంలో శాన్‌ఫ్రాన్సిస్కోకు, ఆరోగ్యంలో సియోల్‌కు, భద్రతలో న్యూయార్క్‌కు, ఉత్పాదకతలో లండన్‌కు దక్కింది. ఇక మూడో స్థానంలో రవాణా, ఆరోగ్య రంగాల్లో లండన్.. భద్రత, ఉత్పాదకతల్లో షికాగో నగరాలు నిలిచాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ స్మార్ట్ సిటీల్లో భారత నగరానికి 20 స్థానం
ఎప్పుడు : మార్చి 13
ఎవరు : ఒడిశా రాజధాని భువనేశ్వర్
ఆధార్ అనుసంధానం గడువు పొడిగించిన సుప్రీంకోర్టు
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలకు, ఆధార్ అనుసంధాన గడువును సుప్రీంకోర్టు మరోసారి పొడిగించింది. ముందుగా నిర్ణయించినట్లుగా మార్చి 31 తో అనుసంధానం పూర్తి కాలేదన్న కారణంతో ఈ తీర్పు వెలువరించింది. ఆధార్ చట్టబద్ధతను నిర్ధారించేందుకు ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు ఇచ్చేవరకు, మార్చి 31 తరువాత కూడా ఈ గడువు కొనసాగుతుందని స్పష్టం చేసింది. అయితే సంఘటిత నిధి నుంచి నిధులందే ఉపాధి హామీ, ఆహార భద్రత తదితర సంక్షేమ పథకాల లబ్ధిదారుల నుంచి ప్రభుత్వం ఆధార్ సంఖ్యను యథావిధిగా కోరవచ్చు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆధార్ అనుసంధాన గడువు మరోసారి పొడిగింపు
ఎప్పుడు : మార్చి 13
ఎవరు : సుప్రీంకోర్టు
ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో భాజపా ఓటమి
ఉత్తరప్రదేశ్‌లోని అధికార బీజేపీకి ఉప ఎన్నికల్లో ఊహించని పరాజయం ఎదురైంది. గోరఖ్‌పూర్, ఫుల్పూర్ నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ కూటమి విజయం సాధించింది. గోరఖ్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి ఉపేంద్రదత్ శుక్లాను ఎస్పీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ నిషాద్ 21 వేల ఓట్లతో ఓడించగా, ఫుల్పూర్‌లో ఎస్పీ అభ్యర్థి నాగేంద్ర ప్రతాప్ సింగ్ పటేల్ బీజేపీ అభ్యర్థి కుశలేంద్ర సింగ్‌పై 59,613 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అలాగే బిహార్‌లో ఒక లోక్‌సభ, రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆర్జేడీ, బీజేపీలు తమ స్థానాలను నిలబెట్టుకున్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో భాజపా ఓటమి
ఎప్పుడు : మార్చి 14
ఎక్కడ : గోరఖ్‌పూర్, పుల్పూర్
త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ ఎన్నికల ఫలితాలు
ఈశాన్య భారతదేశంలోని త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మార్చి 3న వెలువడ్డాయి. ఇప్పటికే అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్‌లలో అధికారంలో ఉన్న బీజేపీ.. తాజాగా కమ్యూనిస్టుల కంచుకోట అయిన త్రిపురలో భారీ విజయాన్ని సాధించింది. మేఘాలయలో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్.. త్రిపుర, నాగాలాండ్‌లలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు.
త్రిపురలో బీజేపీ విజయం
60 స్థానాలు ఉన్న త్రిపురలో బీజేపీ కూటమి (బీజేపీ 35, ఇండిజినెస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర(ఐపీటీఎఫ్)-8 ) 43 స్థానాలు గెలుచుకుని ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీని సాధించింది. మాణిక్ సర్కార్ నేతృత్వంలోని సీపీఎం 16 స్థానాలకే పరిమితమైంది. మాణిక్ సర్కార్ త్రిపుర ముఖ్యమంత్రిగా వరుసగా 20 ఏళ్లు కొనసాగారు.
మేఘాలయలో హంగ్
మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారం చేపట్టేందుకు కావాల్సిన పూర్తి మెజారిటీ సాధించలేకపోయింది. 60 స్థానాలున్న ఆ రాష్ట్ర అసెంబ్లీలో 59 స్థానాలకు ఎన్నికలు జరగగా.. అధికార కాంగ్రెస్ 21 స్థానాలు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా నిలిచింది. నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్‌పీపీ) 19 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. బీజేపీ 2, యునెటైడ్ డెమొక్రటిక్ పార్టీ(యూడీపీ) 6, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్(పీడీఎఫ్) 4 చోట్ల గెలుపొందాయి. మేఘాలయలో ఏ పార్టీ లేదా సంకీర్ణ కూటమైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 30 స్థానాలు అవసరం.
నాగాలాండ్‌లో అతిపెద్ద పార్టీగా ఎన్‌పీఎఫ్
నాగాలాండ్‌లో.. నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్), బీజేపీ-నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ(ఎన్‌డీపీపీ) కూటములు చెరో 29 స్థానాల్లో గెలుపొందాయి. ఇతరులు రెండు చోట్ల విజయం సాధించారు. 60 సీట్లున్న నాగాలాండ్ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సాధారణ మెజారిటీ 31 కాగా, ఆ మార్కును ఏ పార్టీ, కూటమి చేరుకోలేక పోయింది.
బెంగళూరులో హెలీ ట్యాక్సీలు ప్రారంభం
బెంగళూరులో ట్రాఫిక్ రద్దీ పెరిగిపోవడంతో పలు ప్రాంతాలకు తక్కువ సమయంలో చేరుకునేందుకు హెలీ ట్యాక్సీలు అందుబాబులోకి వచ్చాయి. దేశంలోనే మొట్టమొదటిగా కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం- ఎలక్ట్రానిక్ సిటీ మధ్య ఈ హెలికాప్టర్ ట్యాక్సీ సేవలను మార్చి 5న ప్రారంభించారు. కేరళలోని కొచ్చికి చెందిన తంబి ఏవియేషన్ సంస్థ ఈ సేవలను ప్రవేశపెట్టింది. బెంగళూరు విమానాశ్రయం నుంచి ఎలక్ట్రానిక్ సిటీకి రోడ్డు మార్గంలో వెళ్లాలంటే ట్రాఫిక్‌లో 1 నుంచి 3 గంటల సమయం పడుతుంది. అయితే హెలికాప్టర్‌లో 15 నిమిషాల్లోనే గమ్యం చేరుకోవచ్చు. ఒక్కొక్కరికి అన్ని పన్నులు కలిపి టిక్కెట్ ధరను రూ.4 వేలుగా నిర్ణయించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశంలో తొలిసారి హెలీట్యాక్సీ సేవలు ప్రారంభం
ఎప్పుడు : మార్చి 5
ఎక్కడ : బెంగళూరు
ఎవరు : తంబి ఏవియేషన్ సంస్థ
గ్రామీణ విద్యార్థుల కోసం "C మైనస్ 4 "
గ్రామీణ విద్యార్థుల కోసం ఖరగ్‌పూర్ ఐఐటీ సరికొత్త ప్రాజెక్టును ప్రారంభించింది. చదువులో ముందు నిలిచేవారిని, ఆత్మవిశ్వాసం కలిగిన గ్రామీణ విద్యార్థుల్నే ఈ ప్రాజెక్టులో భాగస్వాములను చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు ‘ C మైనస్ 4’ అని నామకరణం చేశారు. ఇక్కడ సీ అంటే.. క్లాస్, మైనస్ 4 అంటే.. తమకంటే నాలుగు తరగతులు తక్కువగా ఉన్నవారు. మొత్తానికి ‘ C మైనస్ 4’ అంటే.. తమకంటే నాలుగు తరగతులు తక్కువగా ఉన్న పిల్లలకు.. పిల్లలే బోధించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఇందుకోసం ఎంపిక చేసిన పిల్లలను మంచి బోధకులుగా తీర్చిదిద్దుతారు.
పలువురు ఐఐటీ ప్రొఫెసర్ల ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన ‘C మైనస్ 4’ ప్రాజెక్టు 2016లోనే ప్రారంభమైంది. దక్షిణ బెంగాల్‌లోని 12 పాఠశాలల్లో, చెన్నైలోని 11 పాఠశాలల్లో ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా అమలుచేశారు. దీనివల్ల విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం స్థాయి పెరిగినట్లు స్పష్టంగా గుర్తించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : గ్రామీణ విద్యార్థుల కోసం "C మైనస్ 4 " ప్రాజెక్టు
ఎప్పుడు : మార్చి 6
ఎవరు : ఐఐటీ ఖరగ్‌పూర్
ఎంపీల అలవెన్సుల పెంపునకు ఆమోదం
పార్లమెంటు సభ్యులకుఅందజేస్తున్న అలవెన్సులను పెంచాలన్న పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ప్రతిపాదనకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ 2018, ఫిబ్రవరి 28న ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ప్రకారం-ఎంపీలకు ప్రతినెలా చెల్లించే నియోజకవర్గ అలవెన్స్ రూ.45వేల నుంచి రూ.70వేలకు చేరుకోనుంది.
అలాగే ఆఫీస్ ఖర్చుల కోసం అందిస్తున్న అలవెన్‌స రూ.45 వేల నుంచి రూ.60 వేలకు చేరుకోనుంది. వీటికి అదనంగా ఐదేళ్లకోసారి అందించే ఫర్నిచర్ అలవెన్‌సను రూ.75 వేల నుంచి రూ.లక్షకు పెంచారు. ఎంపీల మూలవేతనాన్ని ప్రస్తుతమున్న రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది.

- ఫిన్లాండ్
- నార్వే
- డెన్మార్క్
- ఐస్‌లాండ్
- స్విట్జర్లాండ్

- తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వం మొదటి పదేళ్లలో(1952-62) ప్రతిపక్షాల నుంచి ఎటువంటి అవిశ్వాస తీర్మానాలనూ ఎదుర్కొనలేదు.
- 1963 ఆగస్ట్‌లో మొదటిసారి నెహ్రూ సర్కారుపై లోక్‌సభలో సోషలిస్ట్ నేత జేబీ కృపలానీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.
- లాల్‌బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉన్న ఏడాదిన్నర కాలంలో ఆయన ప్రభుత్వంపై ఏకంగా మూడు అవిశ్వాస తీర్మానాలను (1964లో ఒకటి, 65లో రెండు) ప్రతిపక్షాలు ప్రవేశపెట్టాయి. అయితే నెహ్రూ, శాస్త్రిల హయాంలో కాంగ్రెస్‌కు పార్లమెంటులో భారీ మెజారిటీ ఉన్న కారణంగా ఆ అవిశ్వాసాలన్నీ వీగిపోయాయి.
- ఇందిరాగాంధీ ప్రభుత్వంపై రికార్డు స్థాయిలో 15 అవిశ్వాస తీర్మానాలను ప్రతిపక్షాలు ప్రవేశపెట్టాయి.
1999 ఏప్రిల్‌లో బీజేపీ నేతృత్వంలోని కూటమి నుంచి అన్నాడీఎంకే బయటకు వెళ్లిపోవడంతో బలాన్ని నిరూపించుకోవాల్సిందిగా వాజ్‌పేయిని రాష్ట్రపతి ఆదేశించారు. ఈ విశ్వాస పరీక్షలో ఒక్క ఓటు తేడాతో వాజ్‌పేయి ప్రభుత్వం ఓడిపోయింది. రాజీవ్‌గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై 1987లో తెలుగుదేశం నేత సి.మాధవరెడ్డి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా అది మూజువాణి ఓటుతో వీగిపోయింది. పీవీ నరసింహారావు నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం (1991-96) మూడు అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొని ఐదేళ్లు నిలబడగలిగింది. చివరగా 2003లో వాజ్‌పేయి ప్రభుత్వంపై లోక్‌సభలో కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా వీగిపోయింది.
ఢిల్లీలో కృషి ఉన్నతి మేళాని సందర్శించిన ప్రధాని మోదీ
ఢిల్లీలో మార్చి 16-18 వరకు జరిగిన వ్యవసాయ సదస్సు ‘కృషి ఉన్నతి మేళా-2018’ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. మార్చి 17న ఈ సదస్సులో పాల్గొన్న ప్రధాని.. అనంతరం రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. రైతులు పంట వ్యర్థాలను తగులబెట్టకుండా కాలుష్యాన్ని తగ్గించడంలో తోడ్పడాలన్నారు. పంట పెట్టుబడి కంటే మద్దతు ధర కనీసం ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉండేందుకు.. పంట పండించడానికి అయ్యే అన్ని ప్రధాన ఖర్చులనూ పెట్టుబడి కింద లెక్కలోకి తీసుకుంటామని మోదీ భరోసానిచ్చారు.
మద్దతు ధర పెట్టుబడి కంటే కనీసం ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉండేలా చూస్తామని 2018-19 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.
కృషి ఉన్నతి మేళాలో దాదాపు 800 స్టాళ్లు ఏర్పాటు చేసి వ్యవసాయ ఉత్పత్తులు, నూతన విధానాలపై అవగాహన కల్పించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కృషి ఉన్నతి మేళా
ఎప్పుడు : మార్చి 16-18
ఎక్కడ : ఢిల్లీలో
ఎవరు : మేళాని సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ
చిన్నారులపై నేరాల్లో యూపీ టాప్
దేశవ్యాప్తంగా 2015 నుంచి 2016 వరకు చిన్నారులపై నేరాలు 11 శాతం పెరిగాయని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) నివేదిక విడుదల చేసింది. 2015లో దేశవ్యాప్తంగా 94,172 నేరాలు నమోదుకాగా 2016 నాటికి ఈ సంఖ్య 1,06,958కు చేరుకుందని పేర్కొంది. ఈ నివేదికను క్రై అనే ఎన్జీవో సంస్థ డెరైక్టర్ కోమల్ గనోత్రా విశ్లేషించారు. చిన్నారులపై నేరాల్లో 15 శాతంతో ఉత్తరప్రదేశ్ మొదటిస్థానంలో ఉండగా, మహారాష్ట్ర(14 శాతం), మధ్యప్రదేశ్(13 శాతం) తర్వాతి స్థానాల్లో నిలిచాయని ఆయన తెలిపారు. నేరాల్లో మాయమాటలు చెప్పి తీసుకెళ్లడం, కిడ్నాపింగ్‌లు(48.9 శాతం) తొలిస్థానంలో ఉండగా.. పిల్లలపై అత్యాచారాలు(18 శాతం) తర్వాతిస్థానంలో నిలిచినట్లు వెల్లడించారు. వృద్ధులపై నేరాల్లో ఆంధ్రప్రదేశ్ 4, తెలంగాణ 5వ స్థానాల్లో నిలిచాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదిక 2015-16
ఎప్పుడు : మార్చి 18
ఎందుకు : చిన్నారులపై నేరాల్లో మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్
ఐఎస్ అపహరించిన 39 మంది భారతీయులు మృతి: కేంద్రం
ఇరాక్‌లో నాలుగేళ్ల క్రితం ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులు అపహరించిన భారతీయుల కథ విషాదాంతమైంది. ఆ 39 మంది భారతీయులు చనిపోయారని, వారి మృతదేహాలను గుర్తించామని కేంద్రం ప్రకటించింది. వారిని ఉగ్రవాదులు ఊచకోత కోసి మోసుల్ పట్టణం సమీపంలోని బదోష్ అనే గ్రామంలో పూడ్చిపెట్టినట్లు గుర్తించామని తెలిపింది. డీఎన్‌ఏ పరీక్షల అనంతరం వారు అపహరణకు గురైన భారతీయులేనని నిర్ధారణకు వచ్చినట్లు మార్చి 20న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ రాజ్యసభకు తెలిపారు.
2014లో మోసుల్ పట్టణం ఐఎస్ ఉగ్రవాదుల అధీనంలో ఉండగా.. మొత్తం 40 మంది భారతీయులు అపహరణకు గురవగా, వారిలో ఒకరు బంగ్లాదేశ్‌కు చెందిన ముస్లింనని చెప్పుకుని సురక్షితంగా బయటపడ్డాడు.
ఇండియా ఇన్నోవేషన్ గ్రోత్ ప్రోగ్రామ్‌కు 2 మిలియన్ డాలర్లు
దేశీయంగా స్టార్టప్ సంస్థలకు ఊతమిచ్చేందుకు ఉద్దేశించిన రెండో విడత ఇండియా ఇన్నోవేషన్ గ్రోత్ ప్రోగ్రాం (ఐఐజీపీ) 2.0కి టాటా ట్రస్ట్స్, లాక్‌హీడ్ మార్టిన్, కేంద్ర సైన్‌స అండ్ టెక్నాలజీ విభాగం (డీఎస్‌టీ) ఈ ఏడాది కూడా 2 మిలియన్ డాలర్లు కేటాయించాయి. వ్యవసాయం, వైద్యం, నీరు, ఇంధనం మొదలైన రంగాల్లో సమస్యలకు సంబంధించిన సాంకేతిక పరిష్కారాల కనుగొనే ఔత్సాహిక వ్యాపారవేత్తలను తోడ్పడేందుకు ఈ నిధులను ఉపయోగించనున్నారు. డీఎస్‌టీ ప్రోగ్రామ్ హెడ్ (ఇన్నోవేషన్, ఎంట్రప్రెన్యూర్‌షిప్ విభాగం) హర్కేష్ మిట్టల్ ఈ విషయాలు తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండియా ఇన్నోవేషన్ గ్రోత్ ప్రోగ్రామ్‌కు 2 మిలియన్ డాలర్లు
ఎప్పుడు : మార్చి 21
ఎవరు : టాటా ట్రస్ట్స్, లాక్‌హీడ్ మార్టిన్, కేంద్ర సైన్‌స అండ్ టెక్నాలజీ విభాగం (డీఎస్‌టీ)
ఎక్కడ : భారత్‌లో
‘ఆయుష్మాన్ భారత్’కు కేంద్ర కేబినెట్ ఓకే
ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకంగా భావిస్తున్న ‘ఆయుష్మాన్ భారత్’ను ప్రారంభించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇటీవల బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఈ పథకం ద్వారా ఏటా 10 కోట్ల పేద కుటుంబాలకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా కల్పించాలని సంకల్పించిన సంగతి తెలిసిందే. అలాగే, పట్టు పరిశ్రమ అభివృద్ధికి రూ.2,161 కోట్లు కేటాయించడానికి సమ్మతించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మార్చి 21న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం కేంద్ర నిధులతో అమలవుతున్న రాష్ట్రీయ స్వస్థ్య బీమా యోజన(ఆర్‌ఎస్‌బీవై), సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్‌స స్కీం(ఎస్‌సీహెచ్‌ఐఎస్) పథకాలను ఆయుష్మాన్ భారత్‌లో విలీనం చేయనున్నారు.
ఇతర నిర్ణయాలు..
- దేశంలో సెరీకల్చర్‌ను ప్రోత్సహించడానికి పట్టు పరిశ్రమ అభివృద్ధికి వచ్చే రెండేళ్లలో రూ.2,161.68 కోట్లు వెచ్చించాలని నిర్ణయం. అలాగే ఈ రంగంలో ఉత్పాదక ఉద్యోగుల సంఖ్య 85 లక్షల నుంచి కోటికి పెరిగే అవకాశాలున్నాయి.
- ఓబీసీల ఉపవర్గీకరణపై ఏర్పాటైన జస్టిస్ జి.రోహిణి కమిటీ పదవీ కాలం జూన్ 20 వరకు పొడిగింపు.
- వాణిజ్య సరోగసీని నిషేధించి, షరతులకు లోబడి పిల్లలు లేని దంపతులకు నైతిక సరోగసీకి వీలుకల్పించేలా చట్టంలో సవరణ చేయడానికి ఆమోదం.
ఏమిటి : ‘ఆయుష్మాన్ భారత్’కు ఆమోదం
ఎప్పుడు : మార్చి 21
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : ఏటా 10 కోట్ల పేద కుటుంబాలకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా కల్పించేందుకు
ఆయుధాల దిగుమతిలో భారత్‌కు మొదటి స్థానం
దేశ రక్షణకు అవసరమైన ఆయుధాల దిగుమతిలో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2008-12; 2013-17 మధ్యకాలంలో భారత్ ఆయుధాల దిగుమతి 24 శాత ం పెరిగనట్లు స్టాక్‌హోమ్‌కు చెందిన ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(సిప్రీ) మార్చి 13న వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా గత ఐదేళ్ల దిగుమతులను పరిశీలిస్తే భారత్ వాటా 12 శాతంగా ఉంది. రష్యా, అమెరికా, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా నుంచి భారత్ ఎక్కువగా ఆయుధాలను కొనుగోలు చేస్తోంది.
అత్యంత చౌకైన నగరంగా బెంగళూరు
భారత్‌లో జీవించడానికి అత్యంత చౌకైన మెట్రో నగరంగా బెంగళూరు గుర్తింపు పొందింది. ఎకనమిక్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఈఐయూ) మార్చి 15న విడుదల చేసిన గ్లోబల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ రిపోర్ట్-2018లో బెంగళూరు ప్రపంచంలోనే ఐదో చౌకైన నగరంగా నిలిచింది. ఈ సర్వేను ప్రపంచంలోని 139 మహానగరాలపై నిర్వహించారు.
జాతీయ గీతం సవరణకు తీర్మానం
జాతీయ గీతంలోని ‘సింధ్’ స్థానంలో ‘ఈశాన్యం’ అని చేర్చాలని ప్రతిపాదిస్తూ కాంగ్రెస్ ఎంపీ రిపున్ బోరా మార్చి 16న రాజ్యసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత్‌లో ‘ఈశాన్యం’ కీలక ప్రాంతమైనా..దానికి జాతీయ గీతంలో చోటు లేకపోవడం దరుదృష్టకరమన్నారు. అదే సమయంలో పాకిస్తాన్ భూభాగంలో ఉన్న సింధ్‌ను జాతీయ గీతంలో ప్రస్తావిస్తున్నామన్నారు.
కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు సమ్మతి
కోలుకునే అవకాశం ఏమాత్రం లేని పరిస్థితుల్లో.. మృత్యువు కోసం ఎదురుచూస్తూ, మంచంపైనే కాలం వెళ్లదీస్తున్నవారికి ఊరటనిచ్చేలా దేశ అత్యున్నత న్యాయస్థానం మార్చి 9న కీలక తీర్పును వెలువరించింది. మరణం వాయిదా వేయడం మినహా మరే ఆశ లేనప్పుడు, శారీరక బాధను భరించలేని దయనీయ పరిస్థితిలో.. రోగి లేదా అతని తరఫున నమ్మకమైన వ్యక్తి అనుమతితో కారుణ్య మరణం ప్రసాదించవచ్చని పేర్కొంటూ పరోక్ష కారుణ్య మరణానికి(పాసివ్ యుథనేసియా) సమ్మతించింది. గౌరవప్రదమైన మరణం కూడా జీవించే హక్కులో భాగమేనని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
కారుణ్య మరణం అమలుకు సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని కచ్చితమైన మార్గదర్శకాలను కోర్టు పేర్కొంది. చికిత్స సాధ్యం కాదని, మరణం అనివార్యమని తెలిసినప్పుడు లేక చాన్నాళ్లుగా అచేతన స్థితిలో (కోమా) ఉన్నప్పుడు ఆ రోగి లేదా ఆ వ్యక్తి తరఫున.. కేవలం మరణాన్ని వాయిదా వేసే వైద్య చికిత్స తనకవసరం లేదని, ఆ ప్రాణాధార చికిత్సను నిలిపేయాలని కోరుతూ ‘అడ్వాన్స్డ్ మెడికల్ డెరైక్టివ్’ లేదా ‘లివింగ్ విల్’ను ఇవ్వొచ్చని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం వివరించింది. కారుణ్య మరణం కోసం ‘అడ్వాన్స్డ్ మెడికల్ డెరైక్టివ్’ని చట్టబద్ధం చేయకపోవడం.. ఆర్టికల్ 21 ప్రకారం రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ప్రశాంతంగా, గౌరవ ప్రదంగా మరణించే హక్కును పట్టించుకోకపోవడమేనని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ అంశంపై వీలైనంత త్వరగా చట్టం చేయాలని ప్రభుత్వానికి సూచించింది. తనతో పాటు జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ తరఫున ఆయన తీర్పు వెలువరించగా.. జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్‌లు వేర్వేరుగా తీర్పు వెలువరించారు.
చికిత్సకు సంబంధించిన స్వయంగా నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్న రోగికి అన్ని విధాలా దగ్గరివారైన, రోగి మనస్సును అర్థం చేసుకోగలవారైన వ్యక్తికి రోగి కారుణ్య మరణంపై నిర్ణయం తీసుకునే అధికారం అప్పగించడాన్నే మెడికల్ పవర్ ఆఫ్ అటార్నీ లేదా లివింగ్ విల్ లేదా అడ్వాన్స్డ్ మెడికల్ డెరైక్టివ్ అంటారు.
2011లోనే..: 2011లో అరుణా షాన్‌బాగ్ కేసు సమయంలో పరోక్ష కారుణ్య మరణాన్ని సుప్రీంకోర్టు గుర్తించింది. అనంతరం ఇలాంటి సంఘటనలో పరోక్ష కారుణ్య మరణం కోసం రోగి ఇచ్చే లివింగ్ విల్లును గుర్తించాలని కామన్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేయగా.. సుప్రీంకోర్టు తాజా తీర్పునిచ్చింది.
ఆ కేసుతోనే కారుణ్య మరణంపై చర్చ
అరుణ రామచంద్ర షాన్‌బాగ్.. 1973లో ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆస్పత్రిలో నర్సుగా చేస్తున్న సమయంలో వార్డు బాయ్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె మెడకు గొలుసు బిగించి గాయపర్చడంతో అరుణ మెదడుకి రక్తప్రసారం నిలిచిపోయి అచేతన స్థితికి వెళ్లిపోయింది. 42 ఏళ్ల పాటు అలా మంచానికే పరిమితమయ్యారు. ట్యూబులతో ద్వారా వైద్యులు ఆహారం అందించారు. 2009లో సామాజిక కార్యకర్త పింకీ విరాని ఆమె స్థితికి చలించి ట్యూబుల్ని తొలగించి కారుణ్య మరణం ప్రసాదించాలని సుప్రీంలో పిటిషన్ వేశారు. కోర్టు ముగ్గురు ప్రముఖు వైద్యులతో కమిటీ వేయగా.. అరుణ బ్రెయిన్ డెడ్ అవలేదని, యుథనేసియా ఈ కేసుకి వర్తించదని ఆ కమిటీ తెలిపింది. దీంతో విరానీ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత అరుణ న్యుమోనియా సోకడంతో 2015, మే 18న మరణించారు.
యుథనేసియా రకాలు..
స్వచ్ఛంద(వాలంటరీ):
రోగి అంగీకారం, అనుమతి మేరకు అతడికి మరణాన్ని అందించడం. బెల్జియం, లక్సెంబర్గ్, నెదర్లాండ్‌సలో ఈ రకం యూథనేసియా చట్టబద్ధం.
స్వచ్ఛందం కాని(నాన్‌వాలంటరీ):
రోగి అనుమతి, అంగీకారం తీసుకునే పరిస్థితి లేనప్పుడు నిర్వహించే మరణ ప్రక్రియ ఇది. పసిపిల్లల విషయంలో అరుదుగా ఉపయోగిస్తుంటారు. ఏ దేశంలోనూ ఇది చట్ట సమ్మతం కాదుగానీ.. నెదర్లాండ్‌సలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం అనుమతిస్తారు.
బలవంతపు(ఇన్‌వాలంటరీ):
పేరులో ఉన్నట్లే రోగికి ఇష్టం లేకపోయినా అతడిని చంపేసే ప్రక్రియను ఇన్‌వాలంటరీ యూథనేసియా అని పిలుస్తారు.
పాసివ్, యాక్టివ్:
పాసివ్ యుథనేసియాలో రోగికి అందిస్తున్న వైద్యాన్ని ఆపివేయడం ద్వారా మరణించేలా చేస్తారు. యాక్టివ్ యుథనేసియాలో వెంటనే చనిపోయేలా విషపు ఇంజెక్షన్లు ఇస్తారు.
న్యూఢిల్లీలో ‘వియ్ ఫర్ డెవలప్‌మెంట్’ సదస్సు
మార్చి 10న పార్లమెంటు సెంట్రల్ హాలులో ‘వియ్ ఫర్ డెవలప్‌మెంట్’ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్రాలకు చెందిన శాసన సభ్యుల్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. అత్యంత వెనకబడ్డ జిల్లాల అభివృద్ధికి పాటుపడటం సామాజిక న్యాయం దిశగా అడుగులు వేయడమేనని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. ఆ క్రమంలో దేశంలోని 115 వెనకబడ్డ జిల్లాల అభివృద్ధి కోసం చట్ట సభ్యులు కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యంతో చట్టసభ్యులు నిజాయతీగా ఒక ఏడాది పనిచేస్తే.. గొప్ప మార్పు సాధించవచ్చని, మానవ అభివృద్ధి సూచీలో భారత్ పైకి ఎగబాకుతుందని చెప్పారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ‘వియ్ ఫర్ డెవలప్‌మెంట్’ సదస్సు
ఎప్పుడు : మార్చి 10
ఎక్కడ : న్యూఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో
ఎవరు : సదస్సులో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీలో అంతర్జాతీయ సౌర కూటమి సదస్సు
అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్‌ఏ) వ్యవస్థాపక సదస్సు మార్చి 11న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ సహా ఆరుదేశాల ఉపాధ్యక్షులు, ఉప ప్రధానులతో పాటు 19 దేశాల నుంచి మంత్రుల స్థాయి బృందాలు సదస్సులో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా మోదీ మాట్లాడతూ.. ప్రపంచంలోని అన్ని దేశాలకు చవకైన సౌరవిద్యుత్ సులువుగా అందేలా చూడాలని పిలుపునిచ్చారు. ఇంధన రంగంలో సోలార్ ఉత్పత్తి వాటాను పెంచాలని, అందుకోసం సోలార్ ప్రాజెక్టులకు రాయితీలపై రుణాలు సమకూర్చాలని ఆయన సూచించారు. 2022 నాటికి పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా భారత్ 175 గిగావాట్స్ విద్యుదుత్పత్తిని సాధించగలదని, ప్రస్తుత సామర్థ్యానికి అది రెండింతలని పేర్కొన్నారు. అలాగే... సోలార్ లక్ష్యాల్ని సాధించేందుకు 10 కార్యాచరణ సూత్రాల్ని ఈ సమావేశంలో ప్రధాని మోదీ ప్రతిపాదించారు. చవకైన సోలార్ ఇంధనాన్ని అందుబాటులోకి తేవడం, కూటమి సమర్థంగా పనిచేసేలా నిబంధనలు, ప్రామాణికాల రూపకల్పన తదితర అంశాల్ని ఆయన ప్రస్తావించారు.
సోలార్ ఇంధనాన్ని పోత్సహించే లక్ష్యంతో 121 దేశాల్ని ఒకే వేదికపైకి తేవాలన్న మోదీ ఆలోచన నుంచి పుట్టిందే ఐఎస్‌ఏ(ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్).
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతర్జాతీయ సౌర కూటమి సదస్సు
ఎప్పుడు : మార్చి 11
ఎక్కడ : న్యూఢిల్లీలో
భవిష్యత్ ఆణిముత్యాల కోసం రిలయన్స్ యూనివర్సిటీ
పరిశోధన, ఆవిష్కరణలతోపాటు భవిష్యత్తు నేతలు, సంగీత విద్వాంసులు, శాస్త్రవేత్తలు, ఒలింపిక్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్టు రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ తెలిపారు. ఇండియా టుడే సదస్సులో పాల్గొన్న ఆమె క్రీడలు, విద్యకు సంబంధించిన అంశంపై మాట్లాడుతూ... ఈ రెండూ రేపటి రోజున భారత్ ఎదిగేందుకు గల శిఖరాలుగా పేర్కొన్నారు.
యూపీలో అతిపెద్ద సోలార్ విద్యుత్ కేంద్రం ప్రారంభం
భారత పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ దంపతులతోపాటు ప్రధాని మోదీ వారణాసిలో పర్యటించారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ కేంద్రంలో ఏర్పాటు చేసిన చేనేత ప్రదర్శనను సందర్శించారు. అనంతరం వారణాసి-పాట్నాల మధ్య నడిచే రైలును మోదీ ప్రారంభించారు. అంతకుముందు, మోదీ, మాక్రాన్ కలిసి ఉత్తరప్రదేశ్‌లోనే అతిపెద్ద సోలార్ విద్యుదుత్పత్తి కేంద్రాన్ని మిర్జాపూర్ జిల్లా ఛాన్వే బ్లాక్‌లో ప్రారంభించారు. 75 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యమున్న ఈ సోలార్ ప్లాండ్‌ను రూ.500 కోట్ల వ్యయంతో ఫ్రెంచ్ కంపెనీ ఎంజీ (ఈఎన్‌జీఐఈ) సాంకేతిక సహకారంతో నిర్మించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : యూపీలో అతిపెద్ద సోలార్ విద్యుత్ కేంద్రం ప్రారంభం
ఎప్పుడు : మార్చి 12
ఎవరు : ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్
ప్రపంచ స్మార్ట్ సిటీల్లో భువనేశ్వర్‌కు 20 వ స్థానం
ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు ప్రపంచ స్మార్ట్ సిటీల జాబితాలో 20వ స్థానం దక్కింది. జునిపర్ రీసెర్చ్ అనే సంస్థ ఇంటెల్ సాయంతో ‘గ్లోబల్ స్మార్ట్‌సిటీ పర్ఫామెన్స్ ఇండెక్స్’ పేరుతో నిర్వహించిన సర్వే ఫలితాలను తాజాగా విడుదల చేసింది.
ఈ జాబితాలో చోటు సాధించిన ఏకై క భారతీయ నగరం భువనేశ్వర్. రవాణా సౌకర్యాలు, ఆరోగ్య సదుపాయాలు, భద్రత, ఉత్పాదకత అనే నాలుగు అంశాల్లో ర్యాంకింగ్స్ ఇచ్చారు. భద్రతలో ప్రపంచంలోనే 13వ ర్యాంకు దక్కించుకున్న భవనేశ్వర్.. రవాణా, ఆరోగ్యం, ఉత్పాదకత సూచీల్లో 20 స్థానంలో నిలిచింది. 2016లో భారత ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్ సిటీల జాబితాలోనూ భువనేశ్వర్ తొలిస్థానంలో నిలిచింది.
ఈ సర్వేలో సింగపూర్ నాలుగు అంశాల్లోనూ తొలిస్థానం సాధించింది. రెండో స్థానం రవాణా అంశంలో శాన్‌ఫ్రాన్సిస్కోకు, ఆరోగ్యంలో సియోల్‌కు, భద్రతలో న్యూయార్క్‌కు, ఉత్పాదకతలో లండన్‌కు దక్కింది. ఇక మూడో స్థానంలో రవాణా, ఆరోగ్య రంగాల్లో లండన్.. భద్రత, ఉత్పాదకతల్లో షికాగో నగరాలు నిలిచాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ స్మార్ట్ సిటీల్లో భారత నగరానికి 20 స్థానం
ఎప్పుడు : మార్చి 13
ఎవరు : ఒడిశా రాజధాని భువనేశ్వర్
ఆధార్ అనుసంధానం గడువు పొడిగించిన సుప్రీంకోర్టు
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలకు, ఆధార్ అనుసంధాన గడువును సుప్రీంకోర్టు మరోసారి పొడిగించింది. ముందుగా నిర్ణయించినట్లుగా మార్చి 31 తో అనుసంధానం పూర్తి కాలేదన్న కారణంతో ఈ తీర్పు వెలువరించింది. ఆధార్ చట్టబద్ధతను నిర్ధారించేందుకు ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు ఇచ్చేవరకు, మార్చి 31 తరువాత కూడా ఈ గడువు కొనసాగుతుందని స్పష్టం చేసింది. అయితే సంఘటిత నిధి నుంచి నిధులందే ఉపాధి హామీ, ఆహార భద్రత తదితర సంక్షేమ పథకాల లబ్ధిదారుల నుంచి ప్రభుత్వం ఆధార్ సంఖ్యను యథావిధిగా కోరవచ్చు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆధార్ అనుసంధాన గడువు మరోసారి పొడిగింపు
ఎప్పుడు : మార్చి 13
ఎవరు : సుప్రీంకోర్టు
ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో భాజపా ఓటమి
ఉత్తరప్రదేశ్‌లోని అధికార బీజేపీకి ఉప ఎన్నికల్లో ఊహించని పరాజయం ఎదురైంది. గోరఖ్‌పూర్, ఫుల్పూర్ నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ కూటమి విజయం సాధించింది. గోరఖ్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి ఉపేంద్రదత్ శుక్లాను ఎస్పీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ నిషాద్ 21 వేల ఓట్లతో ఓడించగా, ఫుల్పూర్‌లో ఎస్పీ అభ్యర్థి నాగేంద్ర ప్రతాప్ సింగ్ పటేల్ బీజేపీ అభ్యర్థి కుశలేంద్ర సింగ్‌పై 59,613 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అలాగే బిహార్‌లో ఒక లోక్‌సభ, రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆర్జేడీ, బీజేపీలు తమ స్థానాలను నిలబెట్టుకున్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో భాజపా ఓటమి
ఎప్పుడు : మార్చి 14
ఎక్కడ : గోరఖ్‌పూర్, పుల్పూర్
త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ ఎన్నికల ఫలితాలు
ఈశాన్య భారతదేశంలోని త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మార్చి 3న వెలువడ్డాయి. ఇప్పటికే అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్‌లలో అధికారంలో ఉన్న బీజేపీ.. తాజాగా కమ్యూనిస్టుల కంచుకోట అయిన త్రిపురలో భారీ విజయాన్ని సాధించింది. మేఘాలయలో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్.. త్రిపుర, నాగాలాండ్‌లలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు.
త్రిపురలో బీజేపీ విజయం
60 స్థానాలు ఉన్న త్రిపురలో బీజేపీ కూటమి (బీజేపీ 35, ఇండిజినెస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర(ఐపీటీఎఫ్)-8 ) 43 స్థానాలు గెలుచుకుని ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీని సాధించింది. మాణిక్ సర్కార్ నేతృత్వంలోని సీపీఎం 16 స్థానాలకే పరిమితమైంది. మాణిక్ సర్కార్ త్రిపుర ముఖ్యమంత్రిగా వరుసగా 20 ఏళ్లు కొనసాగారు.
మేఘాలయలో హంగ్
మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారం చేపట్టేందుకు కావాల్సిన పూర్తి మెజారిటీ సాధించలేకపోయింది. 60 స్థానాలున్న ఆ రాష్ట్ర అసెంబ్లీలో 59 స్థానాలకు ఎన్నికలు జరగగా.. అధికార కాంగ్రెస్ 21 స్థానాలు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా నిలిచింది. నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్‌పీపీ) 19 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. బీజేపీ 2, యునెటైడ్ డెమొక్రటిక్ పార్టీ(యూడీపీ) 6, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్(పీడీఎఫ్) 4 చోట్ల గెలుపొందాయి. మేఘాలయలో ఏ పార్టీ లేదా సంకీర్ణ కూటమైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 30 స్థానాలు అవసరం.
నాగాలాండ్‌లో అతిపెద్ద పార్టీగా ఎన్‌పీఎఫ్
నాగాలాండ్‌లో.. నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్), బీజేపీ-నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ(ఎన్‌డీపీపీ) కూటములు చెరో 29 స్థానాల్లో గెలుపొందాయి. ఇతరులు రెండు చోట్ల విజయం సాధించారు. 60 సీట్లున్న నాగాలాండ్ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సాధారణ మెజారిటీ 31 కాగా, ఆ మార్కును ఏ పార్టీ, కూటమి చేరుకోలేక పోయింది.
బెంగళూరులో హెలీ ట్యాక్సీలు ప్రారంభం
బెంగళూరులో ట్రాఫిక్ రద్దీ పెరిగిపోవడంతో పలు ప్రాంతాలకు తక్కువ సమయంలో చేరుకునేందుకు హెలీ ట్యాక్సీలు అందుబాబులోకి వచ్చాయి. దేశంలోనే మొట్టమొదటిగా కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం- ఎలక్ట్రానిక్ సిటీ మధ్య ఈ హెలికాప్టర్ ట్యాక్సీ సేవలను మార్చి 5న ప్రారంభించారు. కేరళలోని కొచ్చికి చెందిన తంబి ఏవియేషన్ సంస్థ ఈ సేవలను ప్రవేశపెట్టింది. బెంగళూరు విమానాశ్రయం నుంచి ఎలక్ట్రానిక్ సిటీకి రోడ్డు మార్గంలో వెళ్లాలంటే ట్రాఫిక్‌లో 1 నుంచి 3 గంటల సమయం పడుతుంది. అయితే హెలికాప్టర్‌లో 15 నిమిషాల్లోనే గమ్యం చేరుకోవచ్చు. ఒక్కొక్కరికి అన్ని పన్నులు కలిపి టిక్కెట్ ధరను రూ.4 వేలుగా నిర్ణయించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశంలో తొలిసారి హెలీట్యాక్సీ సేవలు ప్రారంభం
ఎప్పుడు : మార్చి 5
ఎక్కడ : బెంగళూరు
ఎవరు : తంబి ఏవియేషన్ సంస్థ
గ్రామీణ విద్యార్థుల కోసం "C మైనస్ 4 "
గ్రామీణ విద్యార్థుల కోసం ఖరగ్‌పూర్ ఐఐటీ సరికొత్త ప్రాజెక్టును ప్రారంభించింది. చదువులో ముందు నిలిచేవారిని, ఆత్మవిశ్వాసం కలిగిన గ్రామీణ విద్యార్థుల్నే ఈ ప్రాజెక్టులో భాగస్వాములను చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు ‘ C మైనస్ 4’ అని నామకరణం చేశారు. ఇక్కడ సీ అంటే.. క్లాస్, మైనస్ 4 అంటే.. తమకంటే నాలుగు తరగతులు తక్కువగా ఉన్నవారు. మొత్తానికి ‘ C మైనస్ 4’ అంటే.. తమకంటే నాలుగు తరగతులు తక్కువగా ఉన్న పిల్లలకు.. పిల్లలే బోధించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఇందుకోసం ఎంపిక చేసిన పిల్లలను మంచి బోధకులుగా తీర్చిదిద్దుతారు.
పలువురు ఐఐటీ ప్రొఫెసర్ల ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన ‘C మైనస్ 4’ ప్రాజెక్టు 2016లోనే ప్రారంభమైంది. దక్షిణ బెంగాల్‌లోని 12 పాఠశాలల్లో, చెన్నైలోని 11 పాఠశాలల్లో ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా అమలుచేశారు. దీనివల్ల విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం స్థాయి పెరిగినట్లు స్పష్టంగా గుర్తించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : గ్రామీణ విద్యార్థుల కోసం "C మైనస్ 4 " ప్రాజెక్టు
ఎప్పుడు : మార్చి 6
ఎవరు : ఐఐటీ ఖరగ్‌పూర్
ఎంపీల అలవెన్సుల పెంపునకు ఆమోదం
పార్లమెంటు సభ్యులకుఅందజేస్తున్న అలవెన్సులను పెంచాలన్న పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ప్రతిపాదనకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ 2018, ఫిబ్రవరి 28న ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ప్రకారం-ఎంపీలకు ప్రతినెలా చెల్లించే నియోజకవర్గ అలవెన్స్ రూ.45వేల నుంచి రూ.70వేలకు చేరుకోనుంది.
అలాగే ఆఫీస్ ఖర్చుల కోసం అందిస్తున్న అలవెన్‌స రూ.45 వేల నుంచి రూ.60 వేలకు చేరుకోనుంది. వీటికి అదనంగా ఐదేళ్లకోసారి అందించే ఫర్నిచర్ అలవెన్‌సను రూ.75 వేల నుంచి రూ.లక్షకు పెంచారు. ఎంపీల మూలవేతనాన్ని ప్రస్తుతమున్న రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది.
Published date : 15 Mar 2018 12:50PM