జులై 2017 జాతీయం
Sakshi Education
బిహార్‌లో జేడీయూ-బీజేపీ ప్రభుత్వం
లాలు ప్రసాద్ యాదవ్ కుటుంబంపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో.. సీఎం నితీశ్ కుమార్(జేడీయూ) ఆర్జేడీతో తెగతెంపులు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన జూలై 26న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుశీల్ మోదీ.. నితీశ్‌కు మద్దతు తెలుపుతూ గవర్నర్‌కు లేఖనందించారు. దీంతో జూలై 27న బిహార్ సీఎంగా జేడీయూ నేత నితీశ్ ప్రమాణం చేశారు.
2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ మహాకూటమిగా ఏర్పడ్డాయి. 243 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 178 స్థానాలు గెలిచాయి. జేడీయూ నేత నితీశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. లాలూ ఇద్దరు కుమారుల్లో ఒకరు ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టగా మరొకరికి మంత్రి పదవి దక్కింది. అనంతరం.. లాలూ కుటుంబంపై అవినీతి ఆరోపణలతో సీబీఐ, ఈడీ దాడుల నేపథ్యంలో.. ప్రజలకు వివరణ ఇవ్వాలని లాలూ కుమారులను నితీశ్ కొంతకాలం క్రితమే కోరారు. దీన్ని లాలూ కుటుంబం బాహాటంగానే ఖండించింది. జూలై 26న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ మీడియా సమావేశం ఏర్పాటుచేసి మరీ తన కుమారులు రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఘంటాపథంగా చెప్పారు. దీంతో ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని నడపటం కష్టమని భావించిన నితీశ్ కుమార్.. కూటమితో తెగతెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించారు.
అసెంబ్లీలో బలాబలాలు
ఏమిటి : గంగా నది ప్రక్షాళనకు మార్గదర్శకాలు జారీ
ఎప్పుడు : జూలై 13
ఎవరు : జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్
గుజరాత్‌లో హైస్పీడ్ రైలు శిక్షణ కేంద్రం
దేశంలో తొలి హైస్పీడ్ రైలు శిక్షణ కేంద్రం గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్‌లో ఏర్పాటు కానుంది. 2023 నాటికి దేశంలో తొలి హై స్పీడ్ రైలుని ప్రవేశపెట్టాలన్న ప్రణాళికలో భాగంగా దీనిని ఏర్పాటు చేస్తున్నారు. 2020 నాటికి ఈ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి. హైస్పీడ్ రైలు వ్యవస్థలో ప్రపంచ వ్యాప్తంగా అమలవుతున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ఈ కేంద్రంలో శిక్షణ ఇస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హైస్పీడ్ రైలు శిక్షణ కేంద్రం
ఎప్పుడు : జూలై 13
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : గాంధీనగర్, గుజరాత్
సహకార ఎన్నికల్లో పోటీకి కనీస అర్హత నిర్ణయించిన రాజస్తాన్
దేశంలోనే తొలిసారిగా రాజస్తాన్ ప్రభుత్వం సహకార సంఘాల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కనీస విద్యార్హతలు నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయ, చేనేత, డైరీ తదితర సొసైటీలకు జరిగే పాలకవర్గ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు 5 నుంచి 8వ తరగతి విద్యార్హతలు నిర్దేశిస్తూ జూలై 13న కొత్త నిబంధనలు జారీ చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సహకార ఎన్నికల్లో పోటీకి కనీస అర్హత
ఎప్పుడు : జూలై 13
ఎవరు : రాజస్తాన్ ప్రభుత్వం
ఎక్కడ : రాజస్తాన్‌లో
రైల్వేల్లో బహుళ సేవలకు ‘సార్థి’ యాప్
బహుళ రైల్వే సేవలను ఒకేచోట పొందేందుకు వీలుగా రైల్వేశాఖ ‘రైల్ సార్థి’ అనే సరికొత్త యాప్‌ను ఆవిష్కరించింది. టికెట్ బుకింగ్, భోజనం ఆర్డర్ ఇవ్వడం, మహిళల రక్షణ తదితర అంశాలున్న ఈ యాప్‌ను రైల్వే మంత్రి సురేష్ ప్రభు జూలై 14న న్యూఢిల్లీలో ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ యాప్ వల్ల ప్రయాణికులకు వేర్వేరు వెబ్‌సైట్లను వెతికే ఇబ్బంది తప్పుతుందన్నారు. రైల్వే సేవలన్నీ ఒకేచోట లభించడమే ఇందుకు కారణమన్నారు. సార్థి యాప్ ద్వారా విమానం టికెట్లను సైతం బుక్ చేసుకోవచ్చని ప్రభు తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రైల్ సార్థి యాప్ ఆవిష్కరణ
ఎప్పుడు : జూలై 14
ఎవరు : రైల్వే మంత్రి సురేశ్ ప్రభు
ఎక్కడ : న్యూఢిల్లీలో
ఎందుకు : రైల్వే సేవలన్నీ ఒకేచోట పొందేందుకు వీలుగా
కరువు నిర్ధారణకు కొత్త మార్గదర్శకాలు
కరువు నిర్ధారణ మార్గదర్శకాల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. ప్రస్తుతం తీవ్ర కరువు, మధ్యస్థ కరువు, సాధారణ కరువు కేటగిరీలున్నాయి. వాటిల్లో మధ్యస్థ కరువు అనే కేటగిరీని ఎత్తివేస్తూ మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఆ ప్రకారం ఇప్పుడు రెండు కేటగిరీలే ఉంటాయి. ఇక సాధారణ కరువు అంటే కరువు లేనట్లేనని ప్రకటించే అవకాశముంది. మధ్యస్థ కరువు ప్రాంతాలన్నీ కూడా సాధారణ కరువు కేటగిరీలోకి రానున్నాయని అధికారులు విశ్లేషిస్తున్నారు. అంటే తీవ్ర కరువుగా గుర్తిస్తే తప్ప ఆయా రాష్ట్రాల రైతులకు జాతీయ విపత్తు సహాయ నిధి (ఎన్‌డీఆర్‌ఎఫ్) నుంచి ఆర్థిక సాయం వచ్చే పరిస్థితి ఉండదని అంటున్నారు.
6 అంశాల ఆధారంగా కరువు నిర్ణయం
కేంద్ర నిబంధనల ప్రకారం ఆరు అంశాలను కరువు నిర్ధారణకు పరిగణనలోకి తీసుకుంటారు. అందులో
1) వర్షాభావ పరిస్థితులు
2) వర్షానికి వర్షానికి మధ్య అంతరం (డ్రెస్పైల్)
3) తేమ సమగ్ర సూచిక (ఎంఏఐ)
4) నార్మలైజ్డ్ డిఫరెన్స్ వెజిటేషన్ ఇండెక్స్ (ఎన్‌డీవీఐ), నార్మలైజ్డ్ డిఫరెన్స్ వాటర్ ఇండెక్స్ (ఎన్‌డీడబ్ల్యూఐ)
5) సాగు విస్తీర్ణం
6) దిగుబడుల లెక్క
ఏమిటి : కరువు నిర్ధారణ మార్గదర్శకాల్లో మార్పులు
ఎప్పుడు : జూలై 14
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ప్రజాదరణలో మోదీ సర్కారు టాప్
ప్రపంచంలో అత్యధిక ప్రజాదరణ చూరగొన్న ప్రభుత్వాల జాబితాలో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు అగ్రస్థానం దక్కించుకుంది. 2016 సంవత్సరానికి ‘ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థ’(ఓఈసీడీ) నిర్వహించిన అంతర్జాతీయ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 73 శాతం భారతీయులు ఎన్డీఏ ప్రభుత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారుకు కేవలం 30% అమెరికన్లు మాత్రమే మద్దతు పలికారు.
అత్యధిక ప్రజాదరణ పొందిన ప్రభుత్వాలు
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రజాదరణలో మొదటి స్థానంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం
ఎప్పుడు : జూలై 14
ఎవరు : ఓఈసీడీ
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
ఫేస్‌బుక్ యూజర్లలో భారత్ టాప్
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు ఎక్కువ యాక్టివ్ యూజర్లున్న అతిపెద్ద దేశంగా భారత్ అవతరించింది. మొత్తం 241 మిలియన్ మంది యాక్టివ్ యూజర్లతో భారత్ ఈ స్థానాన్ని దక్కించుకుంది. అమెరికాలో 240 మిలియన్ మందే యాక్టివ్ యూజర్లున్నారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఎక్కువ యాక్టివ్ యూజర్లున్న దేశాల్లో అమెరికాను భారత్ అధిగమించిందని నెక్స్ట్‌వెబ్ సంస్థ జూలై 13న వెల్లడించింది. గత ఆరునెలల కాలంలోనే భారత్‌లో యాక్టివ్ యూజర్లు 27 శాతం పెరిగారు. ఇదే కాలంలో అమెరికాలో 12 శాతం వృద్ధి మాత్రమే కనిపించింది. మొత్తంగా 2 బిలియన్ యూజర్ల మార్కును దాటినట్లు ఫేస్‌బుక్ ఇటీవలే ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫేస్‌బుక్ యూజర్లలో తొలిస్థానంలో భారత్
ఎప్పుడు : జూలై 13
ఎవరు : నెక్స్ట్‌వెబ్ సంస్థ
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
ఎందుకు : భారత్‌లో 241 మిలియన్ మంది యాక్టివ్ యూజర్లు
సీఎస్‌ఐ సర్వేలో రాయ్‌పూర్ విమానాశ్రయం టాప్
2017 జనవరి - జూన్ మధ్య కాలానికి గాను వెల్లడించిన ప్రయాణికుల సంతృప్తి సూచీ (సీఎస్‌ఐ)లో ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ స్వామి వివేకానంద విమానాశ్రయం తొలి స్థానంలో నిలిచింది. ఓ స్వతంత్ర ఏజెన్సీ.. రవాణా, పార్కింగ్, ప్రయాణికుల సౌకర్యం, పరిశుభ్రత అంశాలను పరిగణలోకి తీసుకొని 49 విమానాశ్రయాలతో ఈ జాబితాను రూపొందించింది. ఇందులో మొత్తం 5 మార్కులకు గాను రాయ్‌పూర్ విమానాశ్రయం 4.84 మార్కులు సాధించి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఉదయ్‌పూర్, అమృత్‌సర్, డెహ్రాడూన్ విమానాశ్రయాలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విమానాశ్రయాలపై సీఎస్‌ఐ సర్వే
ఎప్పుడు : జూలై 14
ఎవరు : తొలి స్థానంలో రాయ్‌పూర్ విమానాశ్రయం
ఎక్కడ : దేశవ్యాప్తంగా
సౌరవిద్యుత్‌తో నడిచే తొలి రైలు ప్రారంభం
సౌరవిద్యుత్(1600 హెచ్‌పీ) వ్యవస్థతో కూడిన తొలి డీఈఎమ్‌యూ(డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్) రైలుని కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు జూలై 14న సఫ్దర్‌జంగ్(న్యూఢిల్లీ) రైల్వేస్టేషన్‌లో ప్రారంభించారు. ఈ రైలు ఢిల్లీలోని సరై రోహిల్లా - హర్యానాలోని ఫరూక్‌నగర్ మధ్య నడుస్తుంది. రైలులోని చివరి ఆరు భోగీల్లో సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఒక్కో భోగీలో 16 సోలార్ పలకలను అమర్చారు. భోగీల్లోని లైట్లు, ఫ్యాన్లకు వీటి ద్వారా విద్యుత్ సరఫరా అవుతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సౌరవిద్యుత్‌తో కూడిన డీఈఎమ్‌యూ రైలు ప్రారంభం
ఎప్పుడు : జూలై 14
ఎవరు : భారతీయ రైల్వే
ఎక్కడ : న్యూఢిల్లీ
కేరళలో ఆటజిం ఇనిస్టిట్యూట్
ఆటిజం వ్యాధి(మెదడు అభివృద్ధిలో లోపాలు)తో బాధపడే చిన్నారులకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు కేరళలో Center for Autism and other Disabilities Rehabilitation Research and Education (CADRRE) ఏర్పాటు కానుంది. 2017 సెప్టంబర్‌లో ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.
National Institute of Speech and Hearing (NISH) ఫౌండర్ డెరైక్టర్ జి.విజయరాఘవన్ ఈ కేంద్రం నిర్వహణ బాధ్యతలు చేపడతారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆటజిం ఇనిస్టిట్యూట్
ఎప్పుడు : 2017 సెప్టెంబర్‌లో
ఎవరు : ఎన్‌ఐఎస్‌హెచ్
ఎక్కడ : కే రళలో
రాష్ట్రపతి ఎన్నికలో 99 శాతం పోలింగ్
భారత 15వ రాష్ట్రపతి ఎన్నిక జూలై 17న ప్రశాంతంగా జరిగింది. దేశవ్యాప్తంగా 99 శాతం పోలింగ్ జరగగా.. అరుణాచల్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అస్సాం, గుజరాత్, బిహార్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, ఉత్తరాఖండ్, పుదుచ్చేరిల్లో వందశాతం పోలింగ్ నమోదైంది. ఢిల్లీలోని పార్లమెంటు భవన్‌లో 99 శాతం ఓటింగ్ జరిగింది. ఇప్పటివరకు జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఇదే అత్యధిక శాతం పోలింగ్.
ఢిల్లీలో ఓటేయాల్సిన 717 మంది ఎంపీల్లో 714 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఎన్డీఏ అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్ పోటీ చేయగా.. యూపీఏ అభ్యర్థిగా మీరా కుమార్ పోటీ చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాష్ట్రపతి ఎన్నికల్లో 99 శాతం పోలింగ్
ఎప్పుడు : జూలై 17
ఎవరు : భారత ఎన్నికల సంఘం
ఎక్కడ : దేశవ్యాప్తంగా
మహిళా సిబ్బందితో నడిచే తొలి రైల్వే స్టేషన్
దేశంలో తొలిసారిగా పూర్తిగా మహిళా సిబ్బందితో నడిచే మొదటి రైల్వే స్టేషన్‌గా ముంబైలోని మతుంగా సబర్బన్ రైల్వే స్టేషన్ గుర్తింపు పొందింది. టికెట్ బుకింగ్ క్లర్క్, టీటీ, రైల్వే పోలీస్ తదితర హోదాల్లో ఈ స్టేషన్‌లో మొత్తం 30 మంది మహిళా సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ స్టేషన్‌కు మేనేజర్‌గా ఉన్న మమతా కులకర్ణి.. సెంట్రల్ రైల్వేలో ఈ హోదా పొందిన తొలి మహిళా అధికారిగా గుర్తింపు పొందారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పూర్తిగా మహిళా సిబ్బందితో నడిచే తొలి రైల్వేస్టేషన్
ఎప్పుడు : జూలై 17
ఎక్కడ : మతుంగ రైల్వే స్టేషన్, ముంబై
గోప్యత హక్కుపై 9 మంది సభ్యుల ధర్మాసనం
భారత రాజ్యాంగం ప్రకారం వ్యక్తిగత వివరాల గోప్యతను ప్రాథమిక హక్కుగా ప్రకటించవచ్చా లేదా అనే విషయాన్ని తేల్చేందుకు 9 మంది సభ్యుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు జూలై 18న నిర్ణయించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్.ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గోప్యత హక్కుకు సంబంధించి 1950 నాటి ఎం.పీ.శర్మ కేసు, 1960 నాటి ఖరక్ సింగ్ కేసుల్లో ఇచ్చిన తీర్పుల్లో కూడా తప్పులున్నాయేమో సరిచూస్తామంది. గోప్యత ప్రాథమిక హక్కు కాదని ఈ కేసుల్లో సుప్రీంకోర్టు అప్పట్లో తీర్పునిచ్చింది.
9 మంది సభ్యుల ధర్మాసనం జూలై 19 నుంచే విచారణ ప్రారంభించి.. రాజ్యాంగంలోని మూడవ భాగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కుల కిందకు గోప్యత వస్తుందా లేదా అనే విషయాన్ని తేలుస్తుందని కోర్టు స్పష్టం చేసింది. ఆధార్ పథకం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోందంటూ వచ్చిన కొన్ని పిటిషన్లను విచారిస్తూ కోర్టుపై ఆదేశాలిచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గోప్యత హక్కుపై 9 మంది సభ్యుల ధర్మాసనం
ఎప్పుడు : జూలై 18
ఎవరు : సుప్రీంకోర్టు
ఎందుకు : వ్యక్తిగత వివరాల గోప్యతను ప్రాథమిక హక్కుగా ప్రకటించవచ్చా లేదా అనే విషయాన్ని తేల్చేందుకు
కర్ణాటకకు ప్రత్యేక జెండాకు కమిటీ ఏర్పాటు
రాష్ట్రానికి ప్రత్యేక జెండా ఏర్పాటు చేయాలని నిర్ణయించిన కర్ణాటక ప్రభుత్వం.. జెండా రూపకల్పనకు 9 మంది సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కాగా.. ప్రత్యేక జెండా ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమేమీ కాదని సీఎం సిద్ధరామయ్య తన చర్యను సమర్థించుకున్నారు.
దేశానికంతటికీ త్రివర్ణ పతాకం ఒక్కటే ఉంటుందని.. ఏ రాష్ట్రమైనా ప్రత్యేక జెండా ఏర్పాటు చేసుకునే అవకాశం రాజ్యాంగం ఇవ్వలేదని కేంద్రం కర్ణాటకకు స్పష్టం చేసింది. గతంలో డీవీ సదానంద గౌడ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన ప్రత్యేక జెండా ప్రతిపాదనలను ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్రానికి ప్రత్యేక జెండా అనేది జాతీయ సమగ్రతను, ఐక్యత స్ఫూర్తి దెబ్బతీసేవిధంగా ఉంటుందని హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.
కర్ణాటకకు ప్రత్యేక జెండా వచ్చినట్లయితే జమ్మూ కశ్మీర్ తర్వాత ప్రత్యేక జెండా కలిగిన రెండో రాష్ట్రంగా చరిత్రలో నిలవనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాష్ట్రానికి ప్రత్యేక జెండా కోసం కమిటీ
ఎప్పుడు : జూలై 18
ఎవరు : కర్ణాటక సీఎం సిద్ధారామయ్య
ఎక్కడ : కర్ణాటక

పార్టీ | సీట్లు |
ఆర్‌జేడీ | 80 |
జేడీ(యూ) | 71 |
కాంగ్రెస్ | 27 |
బీజేపీ | 53 |
ఇతరులు | 12 |
క్విక్ రివ్యూ:
ఏమిటి : కొలువుదీరిన జేడీయూ-బీజేపీ ప్రభుత్వం
ఎప్పుడు : జూలై 27
ఎవరు : సీఎం నితీశ్ కుమార్
ఎక్కడ : బిహార్‌లో
ఎందుకు : ఆర్జేడీతో జేడీయూ తెగతెంపుల నేపథ్యంలో
కనీస వేతన బిల్లుకు కేబినెట్ ఆమోదం
అన్ని రంగాల్లోనూ కార్మికులకు కనీస వేతనం అమలు చేయడమే లక్ష్యంగా రూపొందించిన నూతన కనీస వేతన బిల్లుకు కేంద్ర కేబినెట్ జూలై 27న ఆమోద ముద్ర వేసింది. నాలుగు కార్మిక చట్టాలను విలీనం చేసి ఈ బిల్లును తీసుకొచ్చారు. ఇది చట్టరూపం దాల్చితే దేశవ్యాప్తంగా సుమారు 4 కోట్ల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుంది.
కనీస వేతనాల చట్టం-1948, వేతనాల చెల్లింపు చట్టం-1936, బోనస్ చెల్లింపు చట్టం-1965, సమాన వేతనాల చట్టం-1976లు ఇందులో భాగం కానున్నాయి. బిల్లు ప్రకారం కేంద్రం నిర్దేశించే కనీస వేతనాలను రాష్ట్రాలు కూడా అమలుచేయాల్సి ఉంటుంది. అంతకుమించి కనీస వేతనాలను ఇచ్చే వెసులుబాటును రాష్ట్రాలకు కల్పించారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కనీస వేతన బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : జూలై 26
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : అన్ని రంగాల్లోనూ కార్మికులకు కనీస వేతనం అమలు చేయడమే లక్ష్యంగా
గోప్యత హక్కుకి కొన్ని పరిమితులు ఉండాలి : కేంద్రం
రాజ్యాంగం ప్రకారం గోప్యతను ప్రాథమిక హక్కుగా పరిగణించవచ్చని, అయితే దానికి కొన్ని పరిమితులు ఉండాలని కేంద్రం జూలై 26న సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ మేరకు గోప్యతకు సంబంధించిన ప్రతి అంశాన్నీ ప్రాథమిక హక్కుగా పరిగణించకూడదని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్.. చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని జస్టిస్ జె.చలమేశ్వర్, జస్టిస్ అబ్దుల్ నజీర్ తదితర 9 మంది సభ్యుల ధర్మాసనానికి నివేదించారు. ప్రైవసీకి సంబంధించిన చాలా అంశాలను ప్రాథమిక హక్కుల పరిధిలోకి తీసుకురాకూడదని పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్, పంజాబ్, పుదుచ్చేరి, పంజాబ్‌ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తూ.. ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో గోప్యతను ప్రాథమిక హక్కుగా ప్రకటించాల్సిన అవసరముందన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గోప్యత హక్కుకి కొన్ని పరిమితులు ఉండాలన్న కేంద్రం
ఎప్పుడు : జూలై 26
ఎవరు : సుప్రీంకోర్టు
బస్సులకు డిజైన్ కోడ్
ప్రయాణికులు, డ్రైవర్లకు సౌకర్యవంతంగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏఐఎస్-052 కోడ్ పేరిట బస్ బాడీ కోడ్‌ను అమల్లోకి తేనుంది. 2017 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ విధానంతో ఇక దేశవ్యాప్తంగా బస్సులన్నీ కేటగిరీల వారీగా ఒకే తరహాలో ఉండనున్నాయి. ప్రమాదాలను నివారించేలా, ఒకవేళ ప్రమాదాలు జరిగితే సులువుగా బయటపడేలా బస్‌బాడీ నిర్మాణం, ప్రయాణికులకు వీలైనంత ఎక్కువ సౌకర్యవంతమైన సీట్లు, డ్రైవర్ క్యాబిన్ విషయంలో ప్రత్యేక నిబంధనలను ఇందులో పొందుపరిచారు. ఈ విషయమై ఇప్పటికే బస్‌బాడీ నిర్మాణ సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేశారు. వీటిపై అవగాహన కల్పించేందుకు పుణెలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్‌సపోర్టు ప్రతినిధులు దేశవ్యాప్తంగా ప్రత్యేక వర్క్‌షాపులు నిర్వహిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బస్సులకు ప్రత్యేకంగా ఏఐఎస్-052 కోడ్
ఎప్పుడు : జూలై 28
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : ప్రయాణికులు, డ్రైవర్లకు సౌకర్యవంతంగా ఉండేందుకు
ఐఐఎం బిల్లు - 2017కు లోక్‌సభ ఆమోదం
దేశంలోని 20 అత్యుత్తమ ఐఐఎం(ఇండియన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్)లకు స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు ఉద్దేశించిన ఐఐఎం బిల్లు - 2017ను లోక్‌సభ జూలై 29న ఆమోదించింది. విద్యా, పరిశోధన రంగాల్లో ఐఐఎంలు ప్రపంచ ప్రమాణాలను అందుకునేందుకు ఈ బిల్లు దోహదపడుతుందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. ఈ విద్యా సంస్థల నిర్వహణలో ప్రభుత్వ జోక్యం ఉండదని చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐఐఎం బిల్లు - 2017కు ఆమోదం
ఎప్పుడు : జూలై 28
ఎవరు : లోక్‌సభ
ఎందుకు : దేశంలోని 20 అత్యుత్తమ ఐఐఎంలకు స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు
భూకంపాల జోన్‌లో 29 నగరాలు
దేశంలో 29 నగరాలు భూకంపాల జోన్‌లో ఉన్నాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్‌సీఎస్) నివేదిక వెల్లడించింది. వాటిలో దేశ రాజధాని ఢిల్లీతో పాటు తొమ్మిది రాష్ట్రాల రాజధానులున్నాయి. ఇవి ఎక్కువగా హిమాలయాల పరిధిలో ఉన్నాయి. దీనికి ప్రపంచంలోనే ఎక్కువ భూకంపాలు సంభవించే ప్రాంతంగా గుర్తింపు ఉంది.
ఢిల్లీ, పట్నా, శ్రీనగర్, కొహిమా, పుదుచ్చేరి, గువాహటి, గ్యాంగ్‌టక్, సిమ్లా, డెహ్రాడూన్, ఇంఫాల్, చండీగఢ్‌లు భూకంపం సంభవించే ప్రాంతాలలో మొదటి, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. ది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ దేశంలో భూకంపం సంభవించే ప్రాంతాలను ఐదు జోన్లుగా వర్గీకరించింది. ఐదో జోన్ అత్యంత తీవ్రత కలిగిన ప్రాంతం. ఈ జోన్‌లో ఈశాన్య ప్రాంతమైన జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్‌లోని కచ్, ఉత్తర బిహార్‌లోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భూకంపాల జోన్‌లో 29 నగరాలు
ఎప్పుడు : జూలై 30
ఎవరు : నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ
ఎక్కడ : దేశవ్యాప్తంగా
2022 నాటికి నవభారత నిర్మాణం : ప్రధాని మోదీ
2022 నాటికి(దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా) దేశంలోని కుల, మతతత్వాలతోపాటుగా పేదరికం, అవినీతి, ఉగ్రవాదం, చెత్తలను పారద్రోలేందుకు క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలని దేశ ప్రజలకు నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జూలై 30న మాసాంతపు ‘మన్‌కీ బాత్’లో దేశప్రజలనుద్దేశించి మాట్లాడిన ప్రధాని.. జీఎస్టీని చారిత్రక ఘట్టంగా పేర్కొన్నారు.
దేశానికి ప్రధాన సమస్యలుగా మారిన మతతత్వం, కుల వ్యవస్థ, అవినీతి, ఉగ్రవాదం, పేదరికాన్ని 2022 నాటికి దేశం నుంచి నిర్మూలించేలా ప్రతి భారతీయుడు కృషిచేయాలని.. ఈ దిశగా ప్రతిజ్ఞ చేయాలని మోదీ పిలుపునిచ్చారు. దీని ద్వారానే దేశ స్వాతంత్య్రానికి 75 ఏళ్లు పూర్తయ్యేలోపు నవభారత నిర్మాణం జరుగుతుందన్నారు. 1942, ఆగస్టు 9న మహాత్ముడు ప్రారంభించిన క్విట్ ఇండియా ఉద్యమం కారణంగానే.. 1947లో బ్రిటిషర్లు దేశాన్ని వదిలిపెట్టి వెళ్లారని గుర్తుచేసిన మోదీ.. 2017లో నవభారత నిర్మాణానికి ప్రతి భారతీయుడు ప్రతినబూనటం ద్వారా 2022 కల్లా ఫలితాలు సాధించగలమన్నారు.
జాతీయ బీసీ కమిషన్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించేందుకు ఉద్దేశించిన 123వ రాజ్యాంగ సవరణ బిల్లు-2017 జూలై 31న రాజ్యసభ ఆమోదం పొందింది. విపక్షాలు సూచించిన విధంగా బిల్లుకు కొన్ని సవరణలు ప్రతిపాదించి అమోదించారు. ఈ బిల్లును లోక్‌సభ ఏప్రిల్‌లో ఆమోదించి రాజ్యసభకు పంపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ బీసీ కమిషన్ బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : జూలై 31
ఎవరు : రాజ్యసభ
ఎందుకు : బీసీ కమీషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించేందుకు
టపాసులలో 5 లోహాల వినియోగంపై నిషేధం
వాతావరణ కాలుష్యానికి కారణం అవుతున్న 5 హానికర లోహాలను టపాసులలో వినియోగించడాన్ని సుప్రీంకోర్టు నిషేధించింది. జస్టిస్ మదన్ బి లోకూర్ నేతృత్వంలోని ధ ర్మాసనం ఈ మేరకు జూలై 31న ఆదేశాలు జారీ చేసింది. టపాసుల తయారీలో లిథియం, మెర్క్యురీ, ఆర్సెనిక్, ఆంటిమోని, లెడ్ లోహాలను వాడరాదని పేర్కొంది. పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పీఈఎస్‌ఓ) ఈ ఆదేశాలు అమలయ్యేలా చూడాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టపాసులలో వినియోగించే 5 లోహాలపై నిషేధం
ఎప్పుడు : జూలై 31
ఎవరు : సుప్రీంకోర్టు
ఎందుకు : పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా
ఈశాన్య రాష్ట్రాలకు 2,350 కోట్ల వరద సహాయం
ఈశాన్య రాష్ట్రాలకు వరద సాయంగా రూ.2,350 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రధాని మోదీ ఆగస్టు 1న ప్రకటించారు. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, అసోం రాష్ట్రాల్లోని వరదలపై తాజా పరిస్థితిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు, మంత్రులతో సమీక్షించిన మోదీ.. అసోం రాష్ట్రానికి తక్షణసాయంగా రూ. 250 కోట్ల నిధులను విడుదల చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఈశాన్య రాష్ట్రాలకు రూ.2,350 కోట్లు
ఎప్పుడు : ఆగస్టు 1
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలండ్, అసోం
ఎందుకు : వరద సహాయంగా
ఐసిస్, చైనాలతోనే భారత్‌కు ముప్పు
ఐసిస్, వాతావరణ మార్పులు, చైనా దుందుడుకుతనం.. ఈ మూడు భారత్‌కు పొంచి ఉన్న ప్రధాన ముప్పులని అత్యధిక శాతం మంది భారతీయులు భావిస్తున్నారు. ప్రముఖ పరిశోధనా సంస్థ ‘ప్యూ’ చేసిన తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. భారత్ నుంచి సర్వేలో పాల్గొన్న వారిలో 66 శాతం మంది ఐసిస్ వల్ల భారత్‌కు ముప్పు ఉందనే అభిప్రాయాన్ని వెల్లడించారు. వాతావరణంలో మార్పుల వల్ల ఇబ్బందులు తప్పవని 47 శాతం మంది చెప్పారు. 44 శాతం మంది భారత్‌కు ఉన్న అతిపెద్ద ముప్పు చైనాయేనని పేర్కొన్నారు. మరో 43 శాతం మంది సైబర్ దాడులే అత్యంత ప్రమాదకరంగా మారాయన్నారు. అమెరికాతోపాటు ఐరోపా, ఆసియా ఖండాల్లోని 18 దేశాల్లో సర్వే చేసిన ప్యూ.. ఆ నివేదికలను ఆగస్టు 1న విడుదల చేసింది. చైనా, రష్యా, అమెరికాల్లో ఏది అత్యంత ప్రమాదకర దేశమని అడగ్గా, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలు చైనాయేనని చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 18 దేశాలకు పొంచి ఉన్న ముప్పుపై సర్వే
ఎప్పుడు : ఆగస్టు 1
ఎవరు : ప్యూ సంస్థ
దేశంలో రెండు టైమ్‌జోన్ల అమలు పరిశీలన
దేశంలో రెండు వేర్వేరు టైమ్‌జోన్ల అమలు అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్రం జులై 19న లోక్‌సభలో తెలిపింది. తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో సూర్యోదయమయ్యే సమయాల్లో సుమారు 2 గంటల వ్యత్యాసం ఉంది. కాబట్టి రెండు భిన్న టైమ్ జోన్లు అమలుచేస్తే 2.7 బిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని, కార్యాలయాల పనితీరు మెరుగుపడుతుందని బీజేడీ సభ్యుడు బి.మెహతబ్ లేవనెత్తిన అంశంపై ఈ మేరకు వివరణ ఇచ్చింది. ప్రస్తుతం దేశ ప్రామాణిక సమయాన్ని నిర్వచిస్తున్న 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని అరగంట ముందుకు జరిపితే అస్సాం-పశ్చిమ బెంగాల్ సరిహద్దు సమీపంలోని 90 డిగ్రీల తూర్పు రేఖాంశం ప్రామాణికం కానుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలో రెండు టైం జోన్ల అమలు పరిశీలన
ఎప్పుడు : జూలై 19
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : బీజేడీ సభ్యుడు బి.మెహతబ్ లేవనెత్తిన అంశంపై
‘ఆహార భద్రత’కు సుప్రీం కోర్టు ఆదేశాలు
జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి సుప్రీం కోర్టు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 31లోగా వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ కార్యదర్శి.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సంబంధిత కార్యదర్శులతో కనీసం ఒకసారైనా సమావేశమై చట్టం అమలవుతున్న తీరును సమీక్షించాలని పేర్కొంది. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేసేలా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఒప్పించాలని సూచించింది. ఆహార కమిషన్‌లను ఏడాదిలోగా ఏర్పాటు చేసేలా అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించాలని కోరింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆహార భద్రత అమలుకు ఆదేశాలు
ఎప్పుడు : జూలై 21
ఎవరు : సుప్రీంకోర్టు
ప్రతి పదినిమిషాలకో సైబర్ నేరం: సెర్ట్ ఇన్
భారత్‌లో సగటున ప్రతి పది నిమిషాలకు ఒక సైబర్ నేరం నమోదైనట్లు కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్‌స టీమ్ (సీఈఆర్‌టీ-ఇన్) తెలిపింది. 2016లో సగటున ప్రతి 12 నిమిషాలకు ఒక నేరం జరిగేదని ప్రస్తుతం ఆ సంఖ్య పెరిగిందని సెర్ట్ నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం 2017 జనవరి నుంచి జూన్ మధ్య ఫిషింగ్, నెట్‌వర్క్ స్కానింగ్, సైట్లలోకి చొరబాటు, వైరస్, ర్యాన్సమ్‌వేర్ వంటి తదితర మొత్తం 27,482 సైబర్ కేసులు నమోదయ్యాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సైబర్ కేసుల్లో పెరుగుదల
ఎప్పుడు : 2017 ప్రథమార్థంలో
ఎవరు : సెర్ట్-ఇన్
ఎక్కడ : భారత్‌లో
మహిళా ఉద్యోగుల కోసం షీ బాక్సు
కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగుల రక్షణ కోసం కేంద్రం షీ బాక్స్ (సెక్సువల్ హరాస్‌మెంట్ ఎలక్ట్రానిక్ బాక్సు) పేరుతో ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాం ప్రారంభించింది. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ వెబ్‌సైట్‌లో ఉండే ఈ బాక్స్ ద్వారా పనిచేసే ప్రాంతాల్లో మహిళలు ఎదుర్కొనే లైంగిక వేధింపులపై ఫిర్యాదులు చేయవచ్చు. మొదట దీన్ని ప్రభుత్వరంగ సంస్థలకు మాత్రమే వర్తింపచేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగుల కోసం షీ బాక్స్
ఎప్పుడు : జూలై 24
ఎక్కడ : ఆన్‌లైన్‌లో
ఎందుకు : పనిచేసే ప్రాంతాల్లో లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు
వందేమాతరం తప్పనిసరి : మద్రాస్ హైకోర్టు
తమిళనాడులోని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమలలో తప్పనిసరిగా వందేమాతర గేయాన్ని ఆలపించాలని మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువరించింది. పాఠశాలల్లో సోమ, శుక్రవారం అలాగే కార్యాలయాల్లో నెలకు ఒకసారి తప్పనిసరిగా పాడాలని న్యాయమూర్తి ఎంవీ మురళీధరన్ తీర్పులో స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తమ విద్యార్థులతో వారానికి రెండుసార్లు జాతీయ గేయాన్ని ఆలపించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాదు ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కూడా నెలకు ఒకసారైనా వినిపించాలని అన్నారు. బెంగాలీ, సంస్కృతంలో పాడటం కష్టంగా ఉంటే దాన్ని తమిళంలోకి తర్జుమా చేయాలన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వందేమాతరం తప్పనిసరిగా ఆలపించాలి
ఎప్పుడు : జూలై 25
ఎవరు : మద్రాస్ హైకోర్టు
ఎక్కడ : పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలు
పెట్టుబడులకు అనువైన రాష్ట్రంగా గుజరాత్
పెట్టుబడులు పెట్టేందుకు అనువైన రాష్ట్రాల జాబితాను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకన మిక్ రీసెర్చ్ (ఎన్‌సీఏఈఆర్) జూలై 18న ప్రకటించింది. మొత్తం 20 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం(ఢిల్లీ)తో రూపొందిం చిన ఈ జాబితాలో గుజరాత్‌కు మొదటి స్థానం దక్కింది. ఢిల్లీ రెండో స్థానంలో నిల వగా; ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు మూడు, ఐదు స్థానాలు లభించాయి. వీటితో పాటు హరియాణా(4), తమిళనాడు(6), కేరళ(7), కర్ణాటక(9), మధ్యప్రదేశ్(10).. టాప్ 10లో నిలిచాయి. ఆయా రాష్ట్రాల్లో లభించే కార్మిక శక్తి, మౌలిక వసతులు, ఆర్థిక వాతావరణం, పాలన-రాజకీయ స్థిరత్వం, అవగాహన, భూములు వంటి ఆరు ముఖ్యాంశాలు, 51 ఉప అంశాలను బేరీజు వేసి ర్యాంకులను నిర్ణయించారు. 2016 జాబితాతో పోలిస్తే గుజరాత్, ఢిల్లీలు తిరిగి తమ స్థానాలను నిలబెట్టుకోగా.. హరియాణా, తెలంగాణ వేగంగా టాప్-5లోకి అడుగుపెట్టాయి. ఆర్థిక వాతావరణానికి సంబంధించి గుజరాత్ అగ్రస్థానంలో నిలవగా..మౌలిక సదుపాయాల కల్పనలో ఢిల్లీ తొలి ర్యాంకు సాధించింది. కార్మిక సమస్యలను తీర్చడంలో తమిళనాడు, భూముల విషయంలో మధ్యప్రదేశ్ ముందువరుసలో ఉన్నాయి.
నదుల అనుసంధానానికి 30 లింకుల గుర్తింపు
దేశంలో నదుల అనుసంధానానికి 30 లింకుల్ని గుర్తించినట్లు కేంద్ర జలవనరుల శాఖ సహాయమంత్రి సంజీవ్ కుమార్ బల్యాన్ లోక్‌సభలో తెలిపారు. ఇందులో ఎనిమిది లింకులు ఆంధ్రా, తెలంగాణ పరిధిలో ఉన్నట్లు వెల్లడించారు. జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ నదుల అనుసంధానం కోసం గుర్తించిన 30 లింకుల్లో 16 నైరుతి రాష్ట్రాల్లో, 14 హిమాలయ ప్రాంతాల్లో ఉన్నట్లు వెల్లడించారు. వీటిపై సర్వే, పరిశోధన అనంతరం నైరుతి రాష్ట్రాల్లోని 14 లింకుల్ని, హిమాలయ ప్రాంతంలోని 2 లింకుల్ని పూర్తి చేసేందుకు గల అవకాశాలపై నివేదిక రూపొందించినట్లు వెల్లడించారు. వీటికి డీపీఆర్‌లు రూపొందించేటప్పుడు పర్యావరణ, సామాజిక ఆర్థిక ప్రభావాలపై అధ్యయనం చేస్తామన్నారు.
ఆంధ్ర, తెలంగాణల్లో గుర్తించినవి
మహానది(మణిభద్ర)-గోదావరి(ధవళేశ్వరం)
గోదావరి(ఇచ్ఛంపల్లి)-కృష్ణా(పులిచింతల)
గోదావరి(ఇచ్ఛంపల్లి)-కృష్ణా(నాగార్జునసాగర్)
గోదావరి(పోలవరం)-కృష్ణా(విజయవాడ)
కృష్ణా (ఆల్మట్టి)-పెన్నా
కృష్ణా (శ్రీశైలం)-పెన్నా
కృష్ణా (నాగార్జునసాగర్)-పెన్నా(సోమశిల)
పెన్నా(సోమశిల)- కావేరి (గ్రాండ్ ఆనికట్)
పారామిలటరీ వైద్యుల ‘రిటైర్మెంట్’ పెంపు
కేంద్ర సాయుధ బలగాల్లో పనిచేస్తున్న వైద్యుల రిటైర్మెంట్ వయసును 60 నుంచి 65 ఏళ్లకు పెంచుతూ కేంద్ర కేబినెట్ జూలై 12న నిర్ణయం తీసుకుంది. సీఆర్పీఎఫ్, బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్ మొదలైన కేంద్ర బలగాలతోపాటుగా అస్సామ్ రైఫిల్స్‌లో పనిచేస్తున్న జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసును మరో ఐదేళ్లు పెంచాలంటూ చాలాకాలంగా ప్రతిపాదన ఉంది. ఈ మేరకు వీరితోపాటుగా స్పెషలిస్టు మెడికల్ ఆఫీసర్ల రిటైర్మెంట్ వయసునూ 60 నుంచి 65కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
అలాగే, ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరితోపాటుగా కల్యాణి (పశ్చిమబెంగాల్), నాగ్‌పూర్ (మహారాష్ట్ర) ఎయిమ్స్ ఆసుపత్రులకు ఒక్కో డెరైక్టర్ పోస్టును ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు కేబినెట్ అంగీకారం తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పారామిలటరీ వైద్యుల పదవీకాలం 65 ఏళ్లకు పెంపు
ఎప్పుడు : జూలై 12
ఎవరు : కేంద్ర కేబినెట్
మహారాష్ట్రలో ఉచిత గర్భనిరోధక ఇంజెక్షన్లు
దేశంలోనే తొలిసారిగా మహారాష్ట్ర ప్రభుత్వం ఉచిత గర్భ నిరోధక ఇంజెక్షన్ల కార్యక్రమాన్ని ప్రారంభించింది. "అంతర" పేరుతో ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా.. గర్భ నివారణకు మాత్రలు వాడే మహిళలకు ఉచితంగా గర్భ నిరోధక ఇంజెక్షన్లు ఇస్తారు. గర్భ నిరోధకానికి ఇది సురక్షితమైన పద్ధతని పేర్కొన్న ప్రభుత్వం... ఈ ఇంజెక్షన్ 3 నెలల పాటు పనిచేస్తుందని పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంతర కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : జూలై 12
ఎవరు : మహారాష్ట్ర ప్రభుత్వం
ఎక్కడ : మహారాష్ట్రలో
ఎందుకు : ఉచితంగా గర్భ నిరోధక ఇంజెక్షన్ల ఇచ్చేందుకు
‘సుస్థిర అభివృద్ధి’లో 116వ స్థానంలో భారత్
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకునే దేశాల తాజా జాబితాలో భారత్‌కు 116వ స్థానం దక్కింది. మొత్తం 157 దేశాల్లో 17 అంతర్జాతీయ లక్ష్యాలను పరిశీలించి ఈ జాబితాను రూపొందించారు. ఇందులో 58.1 పాయింట్లు పొందిన భారత్.. నేపాల్, ఇరాన్, శ్రీలంక, భూటాన్, చైనా కన్నా వెనుకంజలో ఉంది. పాకిస్తాన్ 122వ స్థానంలో నిలిచింది.
నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిస్తున్న దేశాలు ఆర్థికంగా బలమైన దేశాలేమీ కావని నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో స్వీడన్ మొదటి స్థానంలో ఉండగా డెన్మార్క్, ఫిన్‌లాండ్ దేశాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సుస్థిర అభివృద్ధిలో భారత్‌కు 116వ స్థానం
ఎప్పుడు : జూలై 13
ఎవరు : Sustainable Development Solutions Network
గంగా నది ప్రక్షాళనకు నూతన మార్గదర్శకాలు
కలుషితమవుతున్న గంగా నది ప్రక్షాళనకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా పర్యావరణ సమస్య నేటికీ తీవ్రంగానే ఉందని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్‌జీటీ) ప్రభుత్వాన్ని ఆక్షేపించింది. ఈ మేరకు నదిని పరిరక్షించేందుకు జూలై 13న మార్గదర్శకాలు జారీ చేసింది.
మార్గదర్శకాలు..

- ‘అభివృద్ధి రహిత ప్రాంతం’(నో డెవలప్‌మెంట్ జోన్)గా హరిద్వార్- ఉన్నావోల మధ్య గంగా నది తీర ప్రాంతం. ఈ ప్రాంతంలో తీరం నుంచి 100 మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలూ చేపట్టవద్దు.
- నదికి 500 మీటర్ల పరిధిలో వ్యర్థాలను డంప్ చేయరాదు.
- నిబంధనలకు విరుద్ధంగా నదిలో చెత్త డంప్ చేసినవారు పర్యావరణ పరిహారం కింద రూ.50 వేల జరిమానా.
- నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (ఎన్‌ఎంజీసీ) కింద చేపట్టిన ప్రక్షాళన పనులను రెండేళ్లలో పూర్తి చేయాలి.
ఏమిటి : గంగా నది ప్రక్షాళనకు మార్గదర్శకాలు జారీ
ఎప్పుడు : జూలై 13
ఎవరు : జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్
గుజరాత్‌లో హైస్పీడ్ రైలు శిక్షణ కేంద్రం
దేశంలో తొలి హైస్పీడ్ రైలు శిక్షణ కేంద్రం గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్‌లో ఏర్పాటు కానుంది. 2023 నాటికి దేశంలో తొలి హై స్పీడ్ రైలుని ప్రవేశపెట్టాలన్న ప్రణాళికలో భాగంగా దీనిని ఏర్పాటు చేస్తున్నారు. 2020 నాటికి ఈ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి. హైస్పీడ్ రైలు వ్యవస్థలో ప్రపంచ వ్యాప్తంగా అమలవుతున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ఈ కేంద్రంలో శిక్షణ ఇస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హైస్పీడ్ రైలు శిక్షణ కేంద్రం
ఎప్పుడు : జూలై 13
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : గాంధీనగర్, గుజరాత్
సహకార ఎన్నికల్లో పోటీకి కనీస అర్హత నిర్ణయించిన రాజస్తాన్
దేశంలోనే తొలిసారిగా రాజస్తాన్ ప్రభుత్వం సహకార సంఘాల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కనీస విద్యార్హతలు నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయ, చేనేత, డైరీ తదితర సొసైటీలకు జరిగే పాలకవర్గ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు 5 నుంచి 8వ తరగతి విద్యార్హతలు నిర్దేశిస్తూ జూలై 13న కొత్త నిబంధనలు జారీ చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సహకార ఎన్నికల్లో పోటీకి కనీస అర్హత
ఎప్పుడు : జూలై 13
ఎవరు : రాజస్తాన్ ప్రభుత్వం
ఎక్కడ : రాజస్తాన్‌లో
రైల్వేల్లో బహుళ సేవలకు ‘సార్థి’ యాప్
బహుళ రైల్వే సేవలను ఒకేచోట పొందేందుకు వీలుగా రైల్వేశాఖ ‘రైల్ సార్థి’ అనే సరికొత్త యాప్‌ను ఆవిష్కరించింది. టికెట్ బుకింగ్, భోజనం ఆర్డర్ ఇవ్వడం, మహిళల రక్షణ తదితర అంశాలున్న ఈ యాప్‌ను రైల్వే మంత్రి సురేష్ ప్రభు జూలై 14న న్యూఢిల్లీలో ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ యాప్ వల్ల ప్రయాణికులకు వేర్వేరు వెబ్‌సైట్లను వెతికే ఇబ్బంది తప్పుతుందన్నారు. రైల్వే సేవలన్నీ ఒకేచోట లభించడమే ఇందుకు కారణమన్నారు. సార్థి యాప్ ద్వారా విమానం టికెట్లను సైతం బుక్ చేసుకోవచ్చని ప్రభు తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రైల్ సార్థి యాప్ ఆవిష్కరణ
ఎప్పుడు : జూలై 14
ఎవరు : రైల్వే మంత్రి సురేశ్ ప్రభు
ఎక్కడ : న్యూఢిల్లీలో
ఎందుకు : రైల్వే సేవలన్నీ ఒకేచోట పొందేందుకు వీలుగా
కరువు నిర్ధారణకు కొత్త మార్గదర్శకాలు
కరువు నిర్ధారణ మార్గదర్శకాల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. ప్రస్తుతం తీవ్ర కరువు, మధ్యస్థ కరువు, సాధారణ కరువు కేటగిరీలున్నాయి. వాటిల్లో మధ్యస్థ కరువు అనే కేటగిరీని ఎత్తివేస్తూ మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఆ ప్రకారం ఇప్పుడు రెండు కేటగిరీలే ఉంటాయి. ఇక సాధారణ కరువు అంటే కరువు లేనట్లేనని ప్రకటించే అవకాశముంది. మధ్యస్థ కరువు ప్రాంతాలన్నీ కూడా సాధారణ కరువు కేటగిరీలోకి రానున్నాయని అధికారులు విశ్లేషిస్తున్నారు. అంటే తీవ్ర కరువుగా గుర్తిస్తే తప్ప ఆయా రాష్ట్రాల రైతులకు జాతీయ విపత్తు సహాయ నిధి (ఎన్‌డీఆర్‌ఎఫ్) నుంచి ఆర్థిక సాయం వచ్చే పరిస్థితి ఉండదని అంటున్నారు.
6 అంశాల ఆధారంగా కరువు నిర్ణయం
కేంద్ర నిబంధనల ప్రకారం ఆరు అంశాలను కరువు నిర్ధారణకు పరిగణనలోకి తీసుకుంటారు. అందులో
1) వర్షాభావ పరిస్థితులు
2) వర్షానికి వర్షానికి మధ్య అంతరం (డ్రెస్పైల్)
3) తేమ సమగ్ర సూచిక (ఎంఏఐ)
4) నార్మలైజ్డ్ డిఫరెన్స్ వెజిటేషన్ ఇండెక్స్ (ఎన్‌డీవీఐ), నార్మలైజ్డ్ డిఫరెన్స్ వాటర్ ఇండెక్స్ (ఎన్‌డీడబ్ల్యూఐ)
5) సాగు విస్తీర్ణం
6) దిగుబడుల లెక్క
- వీటిలో ఐదు అంశాలు అనుకూలంగా ఉంటే కరువుగా ప్రకటిస్తారు. ఒక్కోసారి సడలింపులు ఇస్తారు. అప్పుడు నాలుగింటిని గీటురాయిగా తీసుకుంటారు.
- వర్షపాతం విషయానికి వస్తే 50 శాతానికి తక్కువగా ఉండాలి. వర్షానికి వర్షానికి మధ్య 21 రోజులకు మించి అంతరం ఉండాలి.
- సాగు విస్తీర్ణాన్నీ లెక్కిస్తారు. పంటల దిగుబడి 50 శాతానికి పడిపోవాలి. పశుగ్రాసానికి కొరత ఏర్పడాలి. అందులో ఇప్పటివరకు మధ్యస్థ, తీవ్ర కరువు ఉన్నప్పుడు కరువు మండలాలు ప్రకటించారు. ఆ ప్రకారం కేంద్రం సాయం ప్రకటించేది. ఇకనుంచి కరువు సాధారణంగా ఉంటే ఆయా మండలాలను లెక్కలోకి తీసుకోరని అధికారులు అంటున్నారు. మధ్యస్థ కరువు అనే కేటగిరీని ఎత్తివేయడం వల్ల కరువు మండ లాలు తగ్గే అవకాశముందని అంటున్నారు. మొత్తంగా తీవ్ర కరువు పరిస్థితులను ఈ ఆరు అంశాల తీవ్రతను బట్టి నిర్ణయిస్తారని తెలుస్తోంది.
ఏమిటి : కరువు నిర్ధారణ మార్గదర్శకాల్లో మార్పులు
ఎప్పుడు : జూలై 14
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ప్రజాదరణలో మోదీ సర్కారు టాప్
ప్రపంచంలో అత్యధిక ప్రజాదరణ చూరగొన్న ప్రభుత్వాల జాబితాలో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు అగ్రస్థానం దక్కించుకుంది. 2016 సంవత్సరానికి ‘ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థ’(ఓఈసీడీ) నిర్వహించిన అంతర్జాతీయ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 73 శాతం భారతీయులు ఎన్డీఏ ప్రభుత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారుకు కేవలం 30% అమెరికన్లు మాత్రమే మద్దతు పలికారు.
అత్యధిక ప్రజాదరణ పొందిన ప్రభుత్వాలు
స్థానం | దేశం | ప్రజాదరణ శాతం |
1 | భారత్ | 73 % |
2 | కెనడా | 62 % |
3 | టర్కీ | 58 % |
4 | రష్యా | 58 % |
5 | జర్మనీ | 55 % |
6 | దక్షిణాఫ్రికా | 48 % |
7 | ఆస్ట్రేలియా | 45 % |
8 | యూకే | 41 % |
9 | జపాన్ | 36 % |
10 | అమెరికా | 30 % |
ఏమిటి : ప్రజాదరణలో మొదటి స్థానంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం
ఎప్పుడు : జూలై 14
ఎవరు : ఓఈసీడీ
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
ఫేస్‌బుక్ యూజర్లలో భారత్ టాప్
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు ఎక్కువ యాక్టివ్ యూజర్లున్న అతిపెద్ద దేశంగా భారత్ అవతరించింది. మొత్తం 241 మిలియన్ మంది యాక్టివ్ యూజర్లతో భారత్ ఈ స్థానాన్ని దక్కించుకుంది. అమెరికాలో 240 మిలియన్ మందే యాక్టివ్ యూజర్లున్నారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఎక్కువ యాక్టివ్ యూజర్లున్న దేశాల్లో అమెరికాను భారత్ అధిగమించిందని నెక్స్ట్‌వెబ్ సంస్థ జూలై 13న వెల్లడించింది. గత ఆరునెలల కాలంలోనే భారత్‌లో యాక్టివ్ యూజర్లు 27 శాతం పెరిగారు. ఇదే కాలంలో అమెరికాలో 12 శాతం వృద్ధి మాత్రమే కనిపించింది. మొత్తంగా 2 బిలియన్ యూజర్ల మార్కును దాటినట్లు ఫేస్‌బుక్ ఇటీవలే ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫేస్‌బుక్ యూజర్లలో తొలిస్థానంలో భారత్
ఎప్పుడు : జూలై 13
ఎవరు : నెక్స్ట్‌వెబ్ సంస్థ
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
ఎందుకు : భారత్‌లో 241 మిలియన్ మంది యాక్టివ్ యూజర్లు
సీఎస్‌ఐ సర్వేలో రాయ్‌పూర్ విమానాశ్రయం టాప్
2017 జనవరి - జూన్ మధ్య కాలానికి గాను వెల్లడించిన ప్రయాణికుల సంతృప్తి సూచీ (సీఎస్‌ఐ)లో ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ స్వామి వివేకానంద విమానాశ్రయం తొలి స్థానంలో నిలిచింది. ఓ స్వతంత్ర ఏజెన్సీ.. రవాణా, పార్కింగ్, ప్రయాణికుల సౌకర్యం, పరిశుభ్రత అంశాలను పరిగణలోకి తీసుకొని 49 విమానాశ్రయాలతో ఈ జాబితాను రూపొందించింది. ఇందులో మొత్తం 5 మార్కులకు గాను రాయ్‌పూర్ విమానాశ్రయం 4.84 మార్కులు సాధించి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఉదయ్‌పూర్, అమృత్‌సర్, డెహ్రాడూన్ విమానాశ్రయాలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విమానాశ్రయాలపై సీఎస్‌ఐ సర్వే
ఎప్పుడు : జూలై 14
ఎవరు : తొలి స్థానంలో రాయ్‌పూర్ విమానాశ్రయం
ఎక్కడ : దేశవ్యాప్తంగా
సౌరవిద్యుత్‌తో నడిచే తొలి రైలు ప్రారంభం
సౌరవిద్యుత్(1600 హెచ్‌పీ) వ్యవస్థతో కూడిన తొలి డీఈఎమ్‌యూ(డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్) రైలుని కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు జూలై 14న సఫ్దర్‌జంగ్(న్యూఢిల్లీ) రైల్వేస్టేషన్‌లో ప్రారంభించారు. ఈ రైలు ఢిల్లీలోని సరై రోహిల్లా - హర్యానాలోని ఫరూక్‌నగర్ మధ్య నడుస్తుంది. రైలులోని చివరి ఆరు భోగీల్లో సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఒక్కో భోగీలో 16 సోలార్ పలకలను అమర్చారు. భోగీల్లోని లైట్లు, ఫ్యాన్లకు వీటి ద్వారా విద్యుత్ సరఫరా అవుతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సౌరవిద్యుత్‌తో కూడిన డీఈఎమ్‌యూ రైలు ప్రారంభం
ఎప్పుడు : జూలై 14
ఎవరు : భారతీయ రైల్వే
ఎక్కడ : న్యూఢిల్లీ
కేరళలో ఆటజిం ఇనిస్టిట్యూట్
ఆటిజం వ్యాధి(మెదడు అభివృద్ధిలో లోపాలు)తో బాధపడే చిన్నారులకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు కేరళలో Center for Autism and other Disabilities Rehabilitation Research and Education (CADRRE) ఏర్పాటు కానుంది. 2017 సెప్టంబర్‌లో ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.
National Institute of Speech and Hearing (NISH) ఫౌండర్ డెరైక్టర్ జి.విజయరాఘవన్ ఈ కేంద్రం నిర్వహణ బాధ్యతలు చేపడతారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆటజిం ఇనిస్టిట్యూట్
ఎప్పుడు : 2017 సెప్టెంబర్‌లో
ఎవరు : ఎన్‌ఐఎస్‌హెచ్
ఎక్కడ : కే రళలో
రాష్ట్రపతి ఎన్నికలో 99 శాతం పోలింగ్
భారత 15వ రాష్ట్రపతి ఎన్నిక జూలై 17న ప్రశాంతంగా జరిగింది. దేశవ్యాప్తంగా 99 శాతం పోలింగ్ జరగగా.. అరుణాచల్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అస్సాం, గుజరాత్, బిహార్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, ఉత్తరాఖండ్, పుదుచ్చేరిల్లో వందశాతం పోలింగ్ నమోదైంది. ఢిల్లీలోని పార్లమెంటు భవన్‌లో 99 శాతం ఓటింగ్ జరిగింది. ఇప్పటివరకు జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఇదే అత్యధిక శాతం పోలింగ్.
ఢిల్లీలో ఓటేయాల్సిన 717 మంది ఎంపీల్లో 714 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఎన్డీఏ అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్ పోటీ చేయగా.. యూపీఏ అభ్యర్థిగా మీరా కుమార్ పోటీ చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాష్ట్రపతి ఎన్నికల్లో 99 శాతం పోలింగ్
ఎప్పుడు : జూలై 17
ఎవరు : భారత ఎన్నికల సంఘం
ఎక్కడ : దేశవ్యాప్తంగా
మహిళా సిబ్బందితో నడిచే తొలి రైల్వే స్టేషన్
దేశంలో తొలిసారిగా పూర్తిగా మహిళా సిబ్బందితో నడిచే మొదటి రైల్వే స్టేషన్‌గా ముంబైలోని మతుంగా సబర్బన్ రైల్వే స్టేషన్ గుర్తింపు పొందింది. టికెట్ బుకింగ్ క్లర్క్, టీటీ, రైల్వే పోలీస్ తదితర హోదాల్లో ఈ స్టేషన్‌లో మొత్తం 30 మంది మహిళా సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ స్టేషన్‌కు మేనేజర్‌గా ఉన్న మమతా కులకర్ణి.. సెంట్రల్ రైల్వేలో ఈ హోదా పొందిన తొలి మహిళా అధికారిగా గుర్తింపు పొందారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పూర్తిగా మహిళా సిబ్బందితో నడిచే తొలి రైల్వేస్టేషన్
ఎప్పుడు : జూలై 17
ఎక్కడ : మతుంగ రైల్వే స్టేషన్, ముంబై
గోప్యత హక్కుపై 9 మంది సభ్యుల ధర్మాసనం
భారత రాజ్యాంగం ప్రకారం వ్యక్తిగత వివరాల గోప్యతను ప్రాథమిక హక్కుగా ప్రకటించవచ్చా లేదా అనే విషయాన్ని తేల్చేందుకు 9 మంది సభ్యుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు జూలై 18న నిర్ణయించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్.ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గోప్యత హక్కుకు సంబంధించి 1950 నాటి ఎం.పీ.శర్మ కేసు, 1960 నాటి ఖరక్ సింగ్ కేసుల్లో ఇచ్చిన తీర్పుల్లో కూడా తప్పులున్నాయేమో సరిచూస్తామంది. గోప్యత ప్రాథమిక హక్కు కాదని ఈ కేసుల్లో సుప్రీంకోర్టు అప్పట్లో తీర్పునిచ్చింది.
9 మంది సభ్యుల ధర్మాసనం జూలై 19 నుంచే విచారణ ప్రారంభించి.. రాజ్యాంగంలోని మూడవ భాగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కుల కిందకు గోప్యత వస్తుందా లేదా అనే విషయాన్ని తేలుస్తుందని కోర్టు స్పష్టం చేసింది. ఆధార్ పథకం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోందంటూ వచ్చిన కొన్ని పిటిషన్లను విచారిస్తూ కోర్టుపై ఆదేశాలిచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గోప్యత హక్కుపై 9 మంది సభ్యుల ధర్మాసనం
ఎప్పుడు : జూలై 18
ఎవరు : సుప్రీంకోర్టు
ఎందుకు : వ్యక్తిగత వివరాల గోప్యతను ప్రాథమిక హక్కుగా ప్రకటించవచ్చా లేదా అనే విషయాన్ని తేల్చేందుకు
కర్ణాటకకు ప్రత్యేక జెండాకు కమిటీ ఏర్పాటు
రాష్ట్రానికి ప్రత్యేక జెండా ఏర్పాటు చేయాలని నిర్ణయించిన కర్ణాటక ప్రభుత్వం.. జెండా రూపకల్పనకు 9 మంది సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కాగా.. ప్రత్యేక జెండా ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమేమీ కాదని సీఎం సిద్ధరామయ్య తన చర్యను సమర్థించుకున్నారు.
దేశానికంతటికీ త్రివర్ణ పతాకం ఒక్కటే ఉంటుందని.. ఏ రాష్ట్రమైనా ప్రత్యేక జెండా ఏర్పాటు చేసుకునే అవకాశం రాజ్యాంగం ఇవ్వలేదని కేంద్రం కర్ణాటకకు స్పష్టం చేసింది. గతంలో డీవీ సదానంద గౌడ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన ప్రత్యేక జెండా ప్రతిపాదనలను ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్రానికి ప్రత్యేక జెండా అనేది జాతీయ సమగ్రతను, ఐక్యత స్ఫూర్తి దెబ్బతీసేవిధంగా ఉంటుందని హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.
కర్ణాటకకు ప్రత్యేక జెండా వచ్చినట్లయితే జమ్మూ కశ్మీర్ తర్వాత ప్రత్యేక జెండా కలిగిన రెండో రాష్ట్రంగా చరిత్రలో నిలవనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాష్ట్రానికి ప్రత్యేక జెండా కోసం కమిటీ
ఎప్పుడు : జూలై 18
ఎవరు : కర్ణాటక సీఎం సిద్ధారామయ్య
ఎక్కడ : కర్ణాటక
రాజస్తాన్‌లో ఆవుల పోషణకు రోజుకి రూ. 70
ఆవుల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రంగా గుర్తింపు పొందిన రాజస్తాన్ ఆవుల పోషణకు (ఒక్కో ఆవుకి) రోజుకు రూ.70 అందించనుంది. దూడ కూడా ఉంటే మరో రూ.35 అదనంగా ఇవ్వనుంది. సంరక్షణ లేక వేలాది ఆవులు చనిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మొత్తాన్ని సమకూర్చుకోవడానికి వివిధ రకాల లావాదేవీలపై 10 శాతం చొప్పున ఆవు పన్ను విధించారు. ఈ మొత్తం సరిగ్గా వినియోగమవుతుందా లేదా అన్నది చూసేందుకు గోశాలలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు.
రాజస్తాన్‌లో సామాన్యులకు ఉద్దేశించిన సంక్షేమ పథకాల కోసం వెచ్చిస్తున్న మొత్తం ఒక్కొక్కరికి రూ.26.65. ఇక్కడ నగరాల్లో నివసిస్తూ రోజుకు రూ.28 కంటే తక్కువ సంపాదిస్తున్న వారిని దారిద్య్ర రేఖకు దిగువన(బీపీఎల్) ఉన్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అలాగే గ్రామాల్లో రూ.25.16 కంటే తక్కువ ఆదాయం ఉన్న వారిని ఈ కేటగిరీలోకి చేర్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆవుల పోషణకు రోజుకి రూ. 70
ఎప్పుడు : జూలై 5
ఎవరు : రాజస్తాన్ ప్రభుత్వం
ఎక్కడ : రాజస్తాన్‌లో
ఎందుకు : ఆవుల సంరక్షణ కోసం
జీఎస్టీని ఆమోదించిన జమ్మూకశ్మీర్ అసెంబ్లీ
వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమలుపై ప్రతిపాదించిన తీర్మానాన్ని జమ్మూకశ్మీర్ అసెంబ్లీ జూలై 5న ఆమోదించింది. రాష్ట్రపతి ఆదేశాల మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హసీబ్ డ్రాబు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నేషనల్ కాన్ఫరెన్‌స(ఎన్‌సీ), కాంగ్రెస్, సీపీఎం ఎమ్మెల్యేలు, ఇండిపెండెంట్ సభ్యుడు తీర్మానాన్ని వ్యతిరేకించారు. విపక్షాల అభ్యంతరాలపై మంత్రి సమాధానమిస్తూ 370 ఆర్టికల్ ద్వారా జమ్మూకశ్మీర్‌కు సంక్రమించిన ప్రత్యేక ప్రతిపత్తికి, ప్రత్యేక పన్నుల విధానానికి ఎలాంటి ఢోకా ఉండబోదని స్పష్టం చేశారు.
కశ్మీర్ అసెంబ్లీ తీర్మానంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు జీఎస్టీ అమలుకు ఆమోదం తెలిపినట్లు అయింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జీఎస్టీకి ఆమోదం
ఎప్పుడు : జూలై 5
ఎవరు : జమ్మకశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీ
కశ్మీర్‌లో అమల్లోకి వస్తు సేవల పన్ను
వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) జూలై 6 అర్ధరాత్రి నుంచి జమ్మూకశ్మీర్‌లోనూ అమల్లోకి వచ్చింది. జమ్మూకశ్మీర్ జీఎస్టీ బిల్లు-2017ను మూజువాణి ఓటుతో అసెంబ్లీ ఆమోదించింది. ఈ బిల్లుతో రాష్ట్ర ప్రత్యేక హోదాకు విఘాతం కలుగుతుందని విపక్షాలు ఆరోపించగా.. జీఎస్టీ అమలుపై నెలకొన్న ఆందోళనలను పరిష్కారిస్తామని సీఎం మెహబూబా హామీ ఇచ్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జీఎస్టీ అమలు ప్రారంభం
ఎప్పుడు : జూలై 6
ఎవరు : జమ్ము కశ్మీర్ ప్రభుత్వం
ఎక్కడ : జమ్ముకశ్మీర్‌లో
సైబర్ భద్రతలో భారత్‌కు 23వ ర్యాంకు
ప్రపంచవ్యాప్తంగా సైబర్ భద్రతలో మొత్తం 165 దేశాల్లో భారత్ 23వ స్థానంలో నిలిచినట్లు ఇంటర్నేషనల్ టెలీకమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) తెలిపింది. ఈ మేరకు ప్రపంచ సైబర్ భద్రతా సూచీ(జీసీఐ) 2వ నివేదికను జూలై 6న విడుదల చేసింది. ఇందులో సింగపూర్ తొలిస్థానంలో నిలిచింది. అమెరికా, మలేసియా, ఒమన్, ఇస్తోనియా, మారిషస్, ఆస్ట్రేలియాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఈ జాబితాలోని 77 దేశాలు సైబర్ భద్రత కోసం ఇప్పటికే చర్యలు ప్రారంభించాయని ఐటీయూ తెలిపింది. గతేడాది పంపిన మొత్తం ఈ మెయిల్స్‌లో 1 శాతం సైబర్ దాడులకు ఉద్దేశించినవేనని ఐటీయూ తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సైబర్ భద్రతలో భారత్‌కు 23వ ర్యాంకు
ఎప్పుడు : జూలై 6
ఎవరు : ఇంటర్నేషనల్ టెలీకమ్యూనికేషన్ యూనియన్
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
ఆధార్‌కు ఎఫ్‌ఎస్‌బీ ప్రశంసలు
భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆధార్ పథకం అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. బ్యాంకింగ్ సేవలను ప్రజలందరికీ చేరువ చేయడానికి, నగదు వ్యవహారాలను తగ్గించడానికి భారత్ ఆధార్‌ను వినియోగిస్తోందని ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్(ఎఫ్‌ఎస్‌బీ) అనే సంస్థ తన నివేదికలో పేర్కొంది. భారత్‌లో ఆధార్ వినియోగం వల్ల రెమిటెన్‌స చెల్లింపుల్లో ఎదురవుతున్న సమస్యలు తగ్గే అవకాశమున్నట్లు వెల్లడించింది. అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక విధానాలను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి కరస్పాండెంట్ బ్యాంకింగ్ కోఆర్డినేషన్ గ్రూప్(సీబీసీజీ)ను ఎఫ్‌ఎస్‌బీ ఏర్పాటుచేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆధార్‌కు అంతర్జాతీయంగా ప్రశంసలు
ఎప్పుడు : జూలై 6
ఎవరు : ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్
మైనారిటీలకు 100 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు
మైనారిటీ యువత సంక్షేమం కోసం రానున్న ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో గరీబ్ నవాజ్ పేరిట వృత్తి విద్యా నైపుణ్య శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు జూలై 6న ప్రభుత్వ రంగ సంస్థ మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ సమావేశంలో కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. హైదరాబాద్‌తోపాటు నోయిడా, లక్నో, ముంబై, నాగపూర్, భోపాల్, పట్నా, రాంచీ తదితర జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మైనారిటీలకు 100 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు
ఎప్పుడు : జూలై 6
ఎవరు : మైనారిటీ శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ
ఎక్కడ : దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో
సూరత్‌లో పింక్ ఆటో సర్వీస్
మహిళా ప్రయాణికుల కోసం మహిళలే నడిపే ఆటో సేవలను గుజరాత్‌లోని సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్‌ఎంసీ) ప్రారంభించింది. ‘పింక్ ఆటో సర్వీస్’ పేరుతో జూలై 2న ఆరంభించిన ఈ కార్యక్రమం ద్వారా ఆర్థికంగా వెనుకబడ్డ మహిళలు గౌరవప్రదంగా జీవించేందుకు కార్పొరేషనే వారికి డ్రైవింగ్ నేర్పించి ఆటో కొనుక్కోవడానికి బ్యాంకు రుణాలను ఇప్పించింది. ఇందులో 25 శాతం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఒక్కో లబ్ధిదారు నెలకు రూ.18 వేల వరకు సంపాదించగలుగుతుందని ఎస్‌ఎంసీ భావిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పింక్ ఆటో సర్వీస్
ఎప్పుడు : జూలై 2
ఎవరు : సూరత్ మున్సిపల్ కార్పొరేషన్
ఎక్కడ : సూరత్, గుజరాత్
ఎందుకు : మహిళలకు స్వయం ఉపాధి కల్పించడానికి
ప్రపంచ వారసత్వ నగరంగా అహ్మదాబాద్
గుజరాత్‌లో 600 ఏళ్ల చరిత్ర కలిగిన అహ్మదాబాద్‌ను యునెస్కో ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తించింది. దీంతో అహ్మదాబాద్ పారిస్, వియన్నా, కైరా, బ్రసెల్స్, రోమ్ వంటి ప్రఖ్యాత నగరాల సరసన చేరింది. పోలండ్‌లోని క్రాకౌలో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశంలో ఢిల్లీ, ముంబై నగరాలను వెనక్కినెట్టి అహ్మదాబాద్ ఈ గౌరవాన్ని అందుకుంది. యునెస్కో నిర్ణయంతో భారత్ చాలా ఆనందంగా ఉందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ వారసత్వ నగరంగా అహ్మదాబాద్
ఎప్పుడు : జూలై 9
ఎవరు : యునెస్కో
డిజిటల్‌లోకి మూడు విద్యా కార్యక్రమాలు
విద్యారంగానికి సంబంధించిన మూడు డిజిటల్ కార్యక్రమాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జూలై 9న ప్రారంభించారు.
‘స్వయం’ ద్వారా విద్యార్థులు ఇంటర్నెట్ సదుపాయంతో ఆన్‌లైన్‌లో క్లాసులు వినొచ్చు.
‘స్వయం ప్రభ’ ద్వారా డీటీహెచ్ రూపంలో విద్యార్థులు వారి ఇంట్లోని టీవీల్లో వచ్చే 32 విద్యా చానళ్ల నుంచి పాఠాలు నేర్చుకోవచ్చు. ఈ సేవలు ఉచితం కాగా డీటీహెచ్ ఏర్పాటుకు మాత్రం రూ.1,500 ఖర్చవుతుంది.
అలాగే విద్యార్థులందరి ధ్రువపత్రాలను డిజిటల్ ఫార్మాట్‌లో భద్రపరచడం కోసం ‘నేషనల్ అకడమిక్ డిపాజిటరీ’ని కూడా ప్రణబ్ ప్రారంభించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్వయం, స్వయం ప్రభ, నేషనల్ అకడమిక్ డిపాజిటరీ కార్యక్రమాలు ప్రారంభం
ఎప్పుడు : జూలై 9
ఎవరు : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
ఎక్కడ : న్యూఢిల్లీలో
‘విద్య’లో ముస్లింల వెనుకబాటు
విద్యాపరంగా మైనార్టీలలో ముస్లింలు అత్యంత వెనుకబడి ఉన్నారని కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా నడిచే ఓ సంస్థ ఏర్పాటు చేసిన ప్యానెల్ వెల్లడించింది. కేంద్ర పాఠశాలలు, కమ్యూనిటీ కాలేజీలు, జాతీయస్థాయి విద్యాసంస్థలు మూడంచల్లో విద్యా సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా ముస్లింలలో సాధికారత వస్తుందని సూచించింది. వారికోసం 211 పాఠశాలలు, 25 కమ్యూనిటీ కాలేజీలు, 5 జాతీయ స్థాయి విద్యా సంస్థలను నెలకొల్పాలని పేర్కొంది. పాఠశాలలను కేంద్రీయ విద్యాలయాలు లేదా నవోదయ విద్యాలయాల మాదిరిగా నడపాలని సూచించింది.
మైనార్టీల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు కేంద్ర నిధుల ద్వారా నడిచే మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ గతేడాది డిసెంబర్ 29న 11 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి కేంద్ర మాజీ కార్యదర్శి అఫ్జల్ అమానుల్లా కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ కమిటీ ఇటీవల తన నివేదికను విడుదల చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విద్యలో ముస్లింల వెనుకబాటు
ఎప్పుడు : జూలై 9
ఎవరు : కేంద్ర నిధులతో నడిచే సంస్థ
ఎక్కడ : దేశవ్యాప్తంగా
సింథటిక్, నైలాన్ మాంజాలపై నిషేధం
గాలిపటాలకు ఉపయోగించే నైలాన్, సింథటిక్ మాంజాల వినియోగంపై దేశవ్యాప్తంగా జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) నిషేధం విధించింది. ఇది తక్షణం అమల్లోకి వస్తుందని అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకు జూలై 11న ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణానికి హాని కలిగించే నైలాన్, సింథటిక్ మాంజాల తయారీ, క్రయ విక్రయాలపై కూడా ఎన్జీటీ నిషేధం విధించింది.
దేశంలో అనేక పండుగలకు గాలిపటాలను ఎగర వేయడం మన సంస్కృతిలో భాగమైపోయింది. అయితే, వీటికి నైలాన్, సింథటిక్, చైనా మాంజాలను ఉపయోగిస్తున్నారు. అవి మనతో పాటు, పక్షులకు, జంతువులకు పర్యావరణానికి హాని కలిగించడమే కాకుండా కొన్ని ప్రాణాంతక ప్రమాదాలకూ కారణమవుతున్నాయని ఎన్జీటీ చైర్‌పర్సన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ నేతృత్వం లోని బెంచ్ వ్యాఖ్యానించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సింథటిక్, నైలాన్ మాంజాలపై నిషేధం
ఎప్పుడు : జూలై 11
ఎవరు : జాతీయ హరిత ట్రిబ్యునల్
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : పర్యావరణ, జంతు రక్షణలో భాగంగా
పశువుల విక్రయంపై ‘స్టే’ ఇక దేశవ్యాప్తం
కబేళాల కోసం పశువుల క్రయవిక్రయాలను నిషేధిస్తూ కేంద్రం తెచ్చిన నోటిఫికేషన్‌పై మద్రాసు హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు జూలై 11న దేశానికంతటికీ వర్తింపజేసింది. స్టేను ఎత్తివేయాలని తాము కోరడం లేదనీ, సలహాలు, ఫిర్యాదులను స్వీకరించి సవరించిన నోటిఫి కేషన్‌ను త్వరలోనే తెస్తామని కేంద్రం తరఫున్యాయవాది కోర్టుకు చెప్పారు. కేంద్రం నుంచి ఏ అభ్యంతరం లేకపోవడంతో ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్, మరో న్యాయ మూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం స్టేను దేశవ్యాప్తంగా అమలు చేసింది. అలాగే కొత్త నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా దానిపై ఏమైనా అభ్యంతరాలుంటే.. అది అమల్లోకి రాకముందైనా సరే ఎవరైనా సుప్రీం తలుపు తట్టవచ్చని ధర్మాసనం పేర్కొంది. జంతు వధశాలల కోసం పశువులను రైతులు అమ్మకుండా, వ్యాపారులు కొనకుండా నిషేధం విధిస్తూ కేంద్రం మే 23న నోటిఫికేషన్ జారీ చేయడం తెలిసిందే. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పశువుల విక్రయంపై దేశవ్యాప్తంగా స్టే
ఎప్పుడు : జూలై 11
ఎవరు : సుప్రీం కోర్టు
వివాహాల తప్పనిసరి నమోదుకు లా కమిషన్ సిఫారసు
వివాహాలను తప్పనిసరిగా నమోదు చేయాలని సూచిస్తూ జస్టిస్ బీఎస్ చౌహాన్ నేతృత్వంలోని భారత లా కమిషన్ కేంద్రానికి సిఫారసు చేసింది. ఈ మేరకు తన నివేదికను జూలై 4న సమర్పించింది. ఈ నివేదికలో పలు సూచనలు చేసింది. వివాహాల నమోదుకు అందరికీ వర్తించేలా ఒక సంస్థ ఏర్పాటుచేయాలని పేర్కొంది. దీంతో ప్రజల హక్కులకు మరింత రక్షణ కల్పిచడంతోపాటు మరిన్ని కొత్త హక్కులు లభిస్తాయని పేర్కొంది. ఏ సంప్రదాయం, వ్యక్తిగత చట్టాల(పర్సనల్ లా) ప్రకారం వివాహాలు జరిగినా నమోదు తప్పనిసరి చేయాలని, ప్రస్తుతం అమల్లో ఉన్న జనన, మరణ నమోదు చట్టం-1969 కింద ఈ అవకాశం కల్పిస్తూ చట్ట సవరణ చేయాలని సూచించింది. జనన, మరణాల నమోదుకు బాధ్యులుగా ఉన్నవారికే ఈ బాధ్యతాఅప్పగించాలని పేర్కొంది. సరైన కారణం లేకుండా వివాహ నమోదులో జాప్యం చేస్తే రోజుకు రూ.5 చొప్పున జరిమానా వసూలు చేయాలని, నమోదును ఆధార్‌తో అనుసంధానం చేయాలని సూచించింది.
వివాహాల నమోదుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, సంక్షేమ పథకాలు, ఇతరత్ర ప్రయోజనాలకు దరఖాస్తు చేసుకున్నప్పుడు అందులో భార్య పేరు రాయడంతోపాటు వివాహ ధ్రువీకరణ పత్రం జతచేయడాన్ని తప్పనిసరి చేయాలని సూచించింది. వివాహం ఏ దేశ చట్ట ప్రకారం జరిగినా భార్యాభర్తల్లో కనీసం ఒకరు భారతీయులైతే వారి వివాహాన్ని నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని నివేదించింది.
అమర్‌నాథ్ యాత్రపై ఉగ్రదాడి
జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో అమర్‌నాథ్ యాత్రపై జూలై 10న జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు యాత్రికులు మృతి చెందగా, 32 మంది గాయపడ్డారు. గుజరాత్‌కు చెందిన యాత్రికుల బృందం అమర్‌నాథ్ యాత్ర ముగించుకొని బస్సులో తిరిగి వస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
ఓటరు నమోదు కోసం ఫేస్‌బుక్‌తో ఈసీ జట్టు
ఓటర్ల నమోదు కార్యక్రమం గురించి ప్రజలకు గుర్తు చేసేందుకు ఫేస్‌బుక్ భారత ఎన్నికల కమిషన్‌తో కలిసి పనిచేయనుంది. ఈ మేరకు తెలుగు, హిందీ, ఇంగ్లిష్, తమిళం తదితర 13 భారతీయ భాషల్లో జూలై 1 నుంచి 4 మధ్యలో భారత్‌లోని ఫేస్‌బుక్ యూజర్లకు రిమైండర్లు పంపనుంది. ఇందులోని రిజిస్టర్ నౌ బటన్‌ను .. నేషనల్ ఓటర్స్ సర్వీసెస్ పోర్టల్‌కు అనుసంధానం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫేస్‌బుక్-ఈసీ ఆధ్వర్యంలో ఓటరు నమోదు డ్రైవ్
ఎప్పుడు : జూలై 1 - 4
ఎక్కడ : భారత్‌లో
ఎందుకు : ఓటరు నమోదు కార్యక్రమం గురించి ప్రజలకు గుర్తు చేసేందుకు

ఆగస్టు 5న ఉపరాష్ట్రపతి ఎన్నిక
ఉప రాష్ట్రపతి ఎన్నికలకు భారత ఎన్నికల కమిషన్ జూన్ 29న షెడ్యూల్ జారీ చేసింది. జూలై 4న నోటిఫికేషన్ విడుదల చేస్తామని, 18 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీం జైదీ వెల్లడించారు. జూలై 19న నామినేషన్ల పరిశీలన జరుగుతుందని, ఉపసంహరణ గడువు 21తో ముగుస్తుందని తెలిపారు. ఒకటి కన్నా ఎక్కువ నామినేషన్లు దాఖలైతే ఆగస్టు 5న పోలింగ్ నిర్వహిస్తామని, అదే రోజు కౌంటింగ్ ఉంటుందని వెల్లడించారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ పదవీకాలం ఆగస్టు 10తో ముగుస్తుంది.
2016లో రాజ్యసభ ఎన్నికల సందర్భంగా హరియాణాలో చోటుచేసుకున్న గందరగోళం నేపథ్యంలో ఈసారి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పోలింగ్‌లో ప్రత్యేక పెన్నులు ఉపయోగించనున్నారు. ఓటర్లు ఈ పెన్నుతో మాత్రమే తమ అభ్యర్థికి మార్కింగ్ చేయాలి. వేరే ఏ పెన్ను వాడినా ఓట్లు చెల్లదు. రహస్య బ్యాలెట్ ద్వారా జరిగే ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఎలాంటి విప్ జారీ చేయడానికి వీల్లేదనీ ఈసీ స్పష్టం చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉపరాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ విడుదల
ఎప్పుడు : ఆగస్టు 5
ఎవరు : భారత ఎన్నికల కమిషన్
ఎందుకు : ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ పదవీకాలం ఆగస్టు 10న ముగుస్తున్నందున
సౌని యోజన కింద అజి డ్యాంకు నీటి తరలింపు
సౌని యోజన (Saurashtra-Narmada Avataran Irrigation Yojana) కింద గుజరాత్‌లోని రాజ్‌కోట్ వద్ద ఉన్న అజీ జలాశయాన్ని నర్మదా నది నీటితో నింపే కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 29న ప్రారంభించారు. ఈ పథకం కింద నర్మదా నదిలో అధిక ప్రవాహం ఉన్నప్పుడు సౌరాష్ట్ర పరిధిలోని 115 జలాశయాలకు నీటిని తరలిస్తారు. తద్వారా 10 లక్షల 22 వేల 589 ఎకరాలకు నీటిని అందిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అజి డ్యాంకు నీటి తరలింపు కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : జూన్ 29
ఎవరు : నరేంద్రమోదీ
ఎక్కడ : గుజరాత్‌లోని రాజ్‌కోట్
నాథులా మార్గం ద్వారా మానస సరోవర యాత్ర రద్దు
చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో సిక్కిం నాథులా మార్గం ద్వారా ఏటా సాగే కైలాస మానస సరోవర యాత్రను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం జూన్ 30న నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద చైనా-భారత్ సరిహద్దులో ఇరు దేశాల భద్రతా దళాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. అయితే ఉత్తరాఖండ్‌లోని లిపులేక్ నుంచి వెళ్లే యాత్ర షెడ్యూల్ ప్రకారమే కొనసాగనుంది.
15,160 అడుగుల ఎత్తులో ఉన్న కైలాస మానస సరోవర యాత్ర రెండు మార్గాల ద్వారా ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాగుతుంది. హిందువులు, బౌద్ధులు, జైనులకు ఇది అత్యంత పవిత్రమైన యాత్రాస్థలం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మానస సరోవర యాత్ర రద్దు
ఎప్పుడు : జూన్ 30
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో
పిల్లల చదువుకు సగటు ఖర్చు రూ. 12 లక్షలు
భారత్‌లో తల్లిదండ్రులు తమ పిల్లల చదువు కోసం చేస్తున్న సగటు ఖర్చు రూ.12.22 లక్షలని హెచ్‌ఎస్‌బీసీ ‘ద వ్యాల్యూ ఎడ్యుకేషన్’ సిరీస్ ‘హయ్యర్ అండ్ హయ్యర్’ నివేదిక పేర్కొంది. ఇది.. ప్రాథమిక పాఠశాల నుంచి పన్నెండో తరగతి వరకు అవుతున్న వ్యయం. ప్రపంచ సగటు రూ.28.58 లక్షల (44,221 డాలర్లు)తో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఇందులో ట్యూషన్ ఫీజులు, పుస్తకాలు, రవాణా, వసతి తదితర ఖర్చులన్నీ ఉన్నాయి. అలాగే 59% మంది భారత తల్లిదండ్రులు పిల్లల విద్య కోసం వేతనాల నుంచి ఖర్చు చేస్తుండగా, మరికొంతమంది సేవింగ్‌స, పెట్టుబడులు, ఇన్సూరెన్‌స ద్వారా నిధులు సమకూర్చుకుంటున్నట్లు నివేదిక పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా చూస్తే... హాంకాంగ్ తల్లిదండ్రులు తమ పిల్లల చదువు కోసం అత్యధికంగా సగటున రూ.85.42 లక్షలు ఖర్చు పెడుతున్నారు. తరువాతి స్థానాల్లో యూఏఈ (రూ.64.23 లక్షలు), సింగపూర్ (రూ.45.85 లక్షలు) ఉన్నాయి. ఈ జాబితాలో భారత్ 13వ స్థానంలో ఉండగా... ఫ్రాన్‌స రూ.10.8 లక్షలతో అట్టడుగున ఉంది.
పీజీకే అధిక ప్రాధాన్యం
భారత్‌లోని ప్రతి పది మందిలో 9 మంది (94 శాతం) తల్లిదండ్రులు తమ పిల్లలతో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేయించాలని భావిస్తున్నారు. వీరిలో 79 శాతం మంది అందుకు తగిన నిధులు కూడా సమకూర్చుకుంటున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ద వ్యాల్యూ ఎడ్యుకేషన్ నివేదిక
ఎప్పుడు : జూలై 2
ఎవరు : హెచ్‌ఎస్‌బీసీ
ఎక్కడ : భారత్‌లో పిల్లల చదువు కోసం సగటు ఖర్చు రూ.12.22 లక్షలు
గుజరాత్‌లో టెక్స్‌టైల్ ఇండియా - 2017 సదస్సు
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో టైక్స్‌టైల్ ఇండియా - 2017 ప్రదర్శన జరిగింది. జూన్ 30న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ అంతర్జాతీయ ప్రదర్శన జూలై 2 వరకూ కొనసాగింది. కార్యక్రమంలో భాగంగా కేంద్ర జౌళి శాఖ - పలు దేశీయ, అంతర్జాతీయ సంస్థల మధ్య 65 ఒప్పందాలు కుదిరాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టెక్స్‌టైల్ ఇండియా - 2017
ఎప్పుడు : జూన్ 30 - జూలై 2
ఎవరు : కేంద్ర జౌళి శాఖ
ఎక్కడ : అహ్మదాబాద్, గుజరాత్
ఇన్నోవేట్ ఇన్ ఇండియా ప్రారంభం
బయో ఫార్మాసూటికల్స్ అభివృద్ధి కోసం కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఇన్నోవేట్ ఇన్ ఇండియా - i3 కార్యక్రమాన్ని జూలై 1న ప్రారంభించింది. జాతీయ స్థాయిలో ఉన్న బయో ఫార్మాసూటికల్స్ పరిశ్రమలను విద్యా సంస్థలతో అనుసంధానం చేయడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. తద్వారా దేశీయ ఫార్మా తయారీ రంగాన్ని అభివృద్ధి చేయాలన్నది లక్ష్యం.
ప్రపంచ బ్యాంకు సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమం కోసం భారత్ 250 మిలియన్ డాలర్లు వెచ్చించనుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ) ఆధ్వర్యంలోని బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బీఐఆర్‌ఏసీ) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇన్నోవెట్ ఇండియా కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : జూలై 1
ఎవరు : కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ
ఎందుకు : బయో ఫార్మా కంపెనీలు - విద్యా సంస్థల అనుసంధానం కోసం
యువత కోసం ప్రధాని మోదీ పుస్తకం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యువత కోసం ఓ పుస్తకం రాయాలని సంకల్పించారు. పరీక్షల ఒత్తిడిని అధిగమించడం, ఏకాగ్రత కోల్పోకుండా ఉండటం, మార్కుల కంటే విజ్ఞానం ఎందుకు ముఖ్యం, భవిష్యత్తు బాధ్యతను ఎలా స్వీకరించాలనే కీలక అంశాలను ఇందులో ప్రస్తావించనున్నారు. తద్వారా పదవిలో ఉండగా పుస్తకం రాస్తున్న తొలి ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించనున్నారు. పెంగ్విన్ రాండమ్ హౌస్ (పీఆర్‌హెచ్) ఇండియా ప్రచురిస్తున్న ఈ పుస్తకం డిసెంబర్‌లో పలు భాషల్లో మార్కెట్‌లోకి రానుంది. దీనికి స్వచ్ఛంద సేవాసంస్థ బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ సాంకేతిక విజ్ఞాన భాగస్వామిగా వ్యవహరిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యువత కోసం ప్రత్యేక పుస్తకం
ఎప్పుడు : జూలై 3
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : పది, పదకొండు తరగతుల విద్యార్థుల కోసం
పర్యాటక కేంద్రంగా మోదీ టీ స్టాల్
ప్రధాని మోదీ చిన్నతనంలో టీ అమ్మిన దుకాణాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కేంద్రం నిర్ణయించింది. గుజరాత్‌లోని మెహ్‌సన జిల్లా వడ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో ఓ ప్లాట్‌ఫాంపై ఆ టీ స్టాల్ ఉంది. మోదీ జన్మస్థలాన్ని ప్రపంచ పర్యాటక పటంలో కనిపించేలా తీర్చిదిద్దే భారీ ప్రాజెక్టులో భాగంగా టీ స్టాల్‌ను పర్యాటక ప్రాంతంగా మార్పు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మరియు పురావస్తు శాఖల అధికారులు వడ్‌నగర్ పట్టణాన్ని సందర్శించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పర్యాటక కేంద్రంగా మోదీ టీ స్టాల్
ఎప్పుడు : జూలై 3
ఎవరు : కేంద్ర పర్యాటక శాఖ
ఎక్కడ : వడ్‌నగర్ రైల్వే స్టేషన్, మెహ్‌సన జిల్లా, గుజరాత్
ఎందుకు : మోదీ జన్మస్థలాన్ని పర్యాటక కేంద్రంగా మార్చేందుకు

Published date : 22 Jul 2017 04:25PM