Skip to main content

Infant Mortality Rate: తెలంగాణ రాష్ట్రంలో తగ్గిన శిశు మరణాలు

Infant Mortality Rate drop in Telangana
Infant Mortality Rate drop in Telangana

తెలంగాణలో శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గింది. 2020లో శిశు మరణాలపై కేంద్రం ఆధ్వర్యంలోని శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టం(ఎస్‌ఆర్‌ఎస్‌) నిర్వహించిన సర్వే నివేదికను తాజాగా విడుదల చేసింది. ఏడాదిలోపు వయసున్న పిల్లలు దేశంలో ప్రతి వెయ్యికి 28 మంది మరణిస్తుండగా.. తెలంగాణలో 21 మంది శిశువులు మరణిస్తున్నారు. 2014లో రాష్ట్రంలో ప్రతి వెయ్యి శిశు జననాల్లో 35 మంది శిశువులు చనిపోయేవారని ఎస్‌ఆర్‌ఎస్‌ వెల్లడించింది. 1971లో దేశంలో శిశు మరణాల సంఖ్య 129గా ఉండేది. 21 రాష్ట్రాల్లో లెక్క చూస్తే శిశు మరణాల సంఖ్య అత్యంత తక్కువగా కేరళలో ఉంది. ఇక్కడ ప్రతి వెయ్యికి ఆరుగురు మరణిస్తున్నారు. అత్యంత ఎక్కువగా మధ్యప్రదేశ్‌లో 43 మంది మరణిస్తున్నారు. 9 చిన్న రాష్ట్రాల్లో చూస్తే అత్యంత తక్కువగా మిజోరాంలో ముగ్గురు, ఎక్కువగా మేఘాలయలో 29 మంది మరణిస్తున్నారు. 
 

Telangana Formation Day Ceremonies: తొలిసారిగా కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు

Published date : 07 Jun 2022 06:32PM

Photo Stories