Skip to main content

ICMR: ఒమిక్రాన్‌ను గుర్తించే కిట్‌ తయారీ

ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించేందుకు ఉపయోగపడే సరికొత్త కిట్‌ను ఐసీఎంఆర్‌ తయారు చేసింది.
Omicron Test
Omicron Test

దీన్ని వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసేందుకు ఆసక్తి వ్యక్తికరణ(ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌– ఈఓఐ) బిడ్లను ఆహ్వానించింది. ఆసక్తి వ్యక్తం చేసిన ఐవీడీ కిట్‌ తయారీదారులకు ఈ ఇన్‌విట్రో కిట్లకు(ఐవీడీ) కావాల్సిన సాంకేతికతను సంస్థ బదిలీ చేస్తుంది. నూతన సాంకేతికతతో ఈ రియల్‌టైమ్‌ ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షా కిట్‌ను ఐసీఎంఆర్‌ అ«దీనంలోని ఐసీఎంఆర్‌ రీజినల్‌ మెడికల్‌ రిసెర్చ్‌సెంటర్‌ రూపొందించింది. ఈ కిట్ల సాంకేతికత, ఐపీ హక్కులు, వాణిజ్యహక్కులు సంస్థ వద్దనే ఉంటాయని, ఎంపిక చేసిన ఉత్పత్తిదారులతో లైసెన్సు అగ్రిమెంట్లను సంస్థ కుదుర్చుకొని అవసరమైన సాంకేతికతను బదిలీ చేస్తుందని ఐసీఎంఆర్‌ ప్రకటన తెలిపింది. ప్రస్తుతం ఒమిక్రాన్‌ను గుర్తించేందుకు జీనోమ్‌ స్వీకెన్సింగ్‌ విధానాన్ని వాడుతున్నారు. ఇది ఖరీదైనదే కాకుండా, ఫలితాలకు సమయం పడుతోంది.

Published date : 21 Dec 2021 05:52PM

Photo Stories