Skip to main content

Geographical Identification: తాండూరు కందికి భౌగోళిక గుర్తింపు

Geographical Identification of Tandur Kandipappuna

ఎంతో ప్రత్యేకత కలిగిన తాండూరు కంది పప్పుకు భౌగోళిక గుర్తింపు(జీఐ) లభించింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని(కొత్త జిల్లా వికారాబాద్‌) తాండూరు ప్రాంతంలో ఇది అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఈ పప్పులో ప్రొటీన్‌ శాతం 22–24 వరకు ఉంటుంది. మిగతా పప్పులతో పోల్చితే ఇది మూడింతలు ఎక్కువ. ఇతర రకాల పప్పుతో పోల్చితే రుచి ఎక్కువ. జీఐ గుర్తింపుతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తాండూరు కంది పప్పు మరింత ప్రాచుర్యం పొందనుంది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 23 Dec 2022 06:32PM

Photo Stories