Supreme Court: ‘రెండు వేళ్ల’ పరీక్షను ఆపేయాలని, వైద్య పాఠ్యాంశాల్లోంచి కూడా తొలగించాలని కేంద్రానికి సూచన
ఇంత పురోగతి, అభివృద్ధి చెందిన తర్వాత కూడా ఆ విధంగా పరీక్షలు చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది వారిని మరింత బాధించడమేనని స్పష్టం చేసింది. ‘‘రెండువేళ్ల పరీక్ష ఇంకా కొనసాగుతుండటం విచారకరం. ఇది తిరోగమన పోకడే. అప్పటికే లైంగిక దాడికి గురై విపరీతంగా కుంగిపోయిన వారిని పదేపదే బాధితులుగా మార్చి తీవ్రంగా కించపరచడమే’’ అని పేర్కొంది. ‘‘దీన్ని కొనసాగించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు. ఎలాంటి శాస్త్రీయతా లేని ఈ పరీక్షను నిషేధించండి’’ అని కేంద్రానికి సూచించింది.
రేప్, లైంగిక వేధింపుల బాధితులు రెగ్యులర్‌గా సెక్స్‌లో పాల్గొనే అలవాటు ఉందా, లేదా అని తేల్చడానికి ఈ రెండు వేళ్ల పరీక్ష నిర్వహిస్తారు. అత్యాచారం, హత్య కేసులో నిందితుని హైకోర్టు విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ జార్ఖండ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం అక్టోబర్ 31న విచారణ జరిపింది.
బాధితురాలికి దేవగఢ్ సదర్ ఆస్పత్రి మెడికల్ బోర్డు రెండు వేళ్ల పరీక్ష జరపడాన్ని ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి కేసుల్లో మహిళ సాక్ష్యం ఆమె లైంగిక చరిత్రపై ఆధారపడి ఉండదని కుండబద్దలు కొట్టింది. ‘‘ఒక మహిళ కేవలం లైంగికంగా చురుకుగా ఉంటుందనే కారణంతో తనపై అత్యాచారం జరిగిందని ఆమె చెప్పే మాటలను నమ్మబోమనడం పితృస్వామ్యపు ఆధిపత్య వ్యవస్థకు సూచిక.
Also read: Weekly Current Affairs (Awards) Bitbank: అంబేద్కర్: ఎ లైఫ్' పుస్తకం ఎవరు రాశారు?
లైంగిక వేధింపులు, అత్యాచార బాధితులకు రెండు వేళ్ల పరీక్ష నిర్వహించడం వారికి కచ్చితంగా బాధాకరమే. కేవలం లైంగికంగా చురుగ్గా ఉండే మహిళపై అత్యాచారం జరగదన్న అపోహతో మాత్రమే ఈ రెండు వేళ్ల పరీక్ష నిర్వహిస్తున్నారు. అందుకే ఈ పరీక్షను నిలిపేయాలని సుప్రీంకోర్టు పదేపదే చెప్పింది. అయినా అవి ఆగడం లేదు’’ అంటూ ఆవేదన వెలిబుచి్చంది.
రేప్ జరిగిందా, లేదా తేల్చేందుకు బాధితురాలి లైంగిక చరిత్ర ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాతిపదిక కాబోదని పునరుద్ఘాటించింది. రెండు వేళ్ల పరీక్ష నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. దీన్ని నిషేధిస్తూ 2014లోనే కేంద్ర ఆరోగ్య శాఖ నిర్దేశకాలు జారీ చేసిందని గుర్తు చేసింది. ‘‘వాటిని మరోసారి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నింటికీ పంపండి.
Also read: Supreme Court: ఐటీ చట్టం సెక్షన్ 66-ఏ కింద ప్రాసిక్యూట్ చేయరాదు
లైంగిక వేధింపులకు గురైన వారిని పరీక్షించడానికి తగిన విధానాన్ని వైద్యులకు తెలియపరిచేందుకు వర్క్‌షాప్‌లు నిర్వహించండి’’ అని కేంద్రాన్ని ఆదేశించింది. రెండు వేళ్ల పరీక్షను ఎట్టి పరిస్థితుల్లోనూ సూచించకుండా వైద్య పాఠ్యాంశాలను సవరించాలని ఆదేశించింది. లైంగిక వేధింపులు, అత్యాచారాలకు గురై ప్రాణాలతో బయటపడిన వారికి రెండు వేళ్ల పరీక్ష జరపకుండా చూడాలని కేంద్ర ఆరోగ్య శాఖకు ధర్మాసనం సూచించింది. నిందితున్ని విడుదల చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. అతన్ని దోషిగా నిర్ధారిస్తూ ట్రయల్ కోర్టు విధించిన జీవిత ఖైదునే ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP