Skip to main content

TS Highcourt న్యాయమూర్తిగా విజయభాస్కర్ రెడ్డి

ప్రభుత్వ న్యాయవాది చాడ విజయభాస్కర్‌రెడ్డికి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జిగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు.
Chada Vijaya Bhaskar Reddy
Chada Vijaya Bhaskar Reddy

తెలంగాణ హైకోర్టుకు 12 మంది న్యాయమూర్తులను నియమించాలని సీజేఐ ఎన్వీ రమణ ఆధ్వర్యంలోని సుప్రీంకోర్టు కొలీజి యం ఫిబ్రవరి తొలి వారంలో కేంద్రానికి సిఫార్సు చేసింది. వీరిలో 10 మందికి నాటి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మార్చి 22న ఆమోదముద్ర వేశారు. మిగిలిన ఇద్దరిలో ఒకరైన చాడ విజయభాస్కర్‌రెడ్డికి ఆగస్టు 3న ఆమోదముద్ర పడింది. ఆగస్టు 4న హైకోర్టులోని ఫస్ట్‌కోర్టు హాల్‌లో చాడ విజయభాస్కర్‌రెడ్డితో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. 

Also read: Daily Current Affairs in Telugu: 2022, ఆగష్టు 3rd కరెంట్‌ అఫైర్స్‌

జస్టిస్‌ చాడ నేపథ్యమిది
1968, జూన్‌ 28న ఉమ్మడి మెదక్‌ జిల్లా దుబ్బాకలో పుష్పమ్మ, కేశవరెడ్డి దంపతులకు సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. 1992, డిసెంబర్‌ 31న బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. జస్టిస్‌ వీవీఎస్‌ రావు దగ్గర జూనియర్‌గా న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 1999లో జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ(ఎన్‌ఐఆర్‌డీ), స్మాల్‌స్కేల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. 2006 నుంచి 2009 మధ్య కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా సేవలందించారు. 2010–15 మధ్య వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పనిచేశారు. 2014 నుంచి ప్రభుత్వ న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్నారు.  ప్రస్తుతం హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య సీజేతో కలిపి 27 ఉండగా... చాడ రాకతో ఈ సంఖ్య 28కి చేరనుంది. అలాగే.. తాజాగా సుప్రీంకోర్టు కొలీజియం గత వారం సిఫార్సు చేసిన ఆరుగురికి ఆమోదం లభిస్తే ఈ సంఖ్య 34కు చేరనుంది. ఈ నేపథ్యంలో మొత్తం 42 మందిలో మరో 8 న్యాయమూర్తుల ఖాళీలను భర్తీ చేయాల్సి  ఉంటుంది. 

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 04 Aug 2022 05:31PM

Photo Stories