Skip to main content

Ban on Peach Candy: తమిళనాడులో పీచు మిఠాయిపై నిషేధం

పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టపడే ఈ పీచు మిఠాయిపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడు వ్యాప్తంగా పీచు మిఠాయి విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లదించింది.
Ban on Peach Candy in Tamil Nadu   Announcement of ban on peach candies in Tamil Nadu.   Health Department of Tamil Nadu announces ban on peach sweets.

పీచు మిఠాయి తయారీకి ఉపయోగించే వాటిలో క్యాన్సర్‌ కారక రసాయనాలు ఉన్నట్లు పరిశోధనల్లో తేలిందని, అందుకే దీన్ని నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. పరిశోధనల్లో భాగంగా పీచు మిఠాయిల్లో రోడమైన్‌–బీ అనే కెమికల్‌ను గుర్తించారు. కృత్రిమ రంగుల కోసం దీన్ని పీచు మిఠాయిల్లో వినియోగిస్తున్నట్లు తేలింది. సాధారణంగా ఈ రోడమైన్‌ బీని ఇండస్ట్రియల్‌ డైగా పిలుస్తారు. దీన్ని ఎక్కువగా దుస్తుల కలరింగ్, పేపర్‌ ప్రింటింగ్‌లో వినియోగిస్తారు. ఫుడ్‌ కలరింగ్‌ కోసం దీన్ని ఉపయోగించడం వల్ల దీర్ఘకాలంలో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తెలిపారు. రోడమైన్‌–బీ అనే కెమికల్‌ మన శరీరంలోకి వెళ్తే.. కిడ్నీ, లివర్‌ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు. అంతేకాకుండా అల్సర్‌ వంటి సమస్యలతో పాటు క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

Published date : 28 Feb 2024 01:30PM

Photo Stories