Akkineni Family to Meet PM Modi: అక్కినేని నాగేశ్వరరావుపై రాసిన పుస్తకాన్ని మోదీకి అందజేసిన లక్ష్మీప్రసాద్, అక్కినేని కుటుంబం

అక్కినేని నాగేశ్వరరావుపై మాజీ ఎంపీ, విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రచించిన 'మహాన్ అభినేత అక్కినేని కావిరాట్ వ్యక్తిత్వ' అనే పుస్తకాన్ని పార్లమెంట్ భవనంలో ప్రధాని మోదీకి ఆందజేశారు. లక్ష్మీప్రసాద్‌తో పాటు సినీ హీరో అక్కినేని నాగార్జున, సతీమణి అమల, కుమారుడు నాగ చైతన్య, కోడలు శోభిత తదితరులు ఉన్నారు.
ఈ సందర్బంగా.. ప్రధాని మోదీ అక్కినేని నాగేశ్వరరావును ఉద్భవించిన గొప్ప వ్యక్తిత్వంగా, ఒక అద్భుత నటుడిగా అభినందించారు. ఆయన తెలుగు సినిమా రంగానికి చేసిన అద్భుత కృషిని గుర్తించి, తెలుగులో సినిమా పరిశ్రమను క్రమంగా అభివృద్ధి చేసిన గొప్ప నాయకుడిగా ఆయనను స్మరించారు.
మోదీ చెప్పినట్లుగా, అక్కినేని నాగేశ్వరరావు తాము ఎక్కడినుంచి వచ్చామో, ఎంత కష్టాలు పడినప్పటికీ నిలబడి, సినిమా రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం గొప్ప సాధన అని అన్నారు.
Experium Eco Park: ఎక్స్‌పీరియం ఎకో పార్క్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి