ఆగస్టు 2020 జాతీయం
Sakshi Education
విమానాశ్రయాల లీజుకు కేబినెట్ ఆమోదం
మరో మూడు విమానాశ్రయాలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో(పీపీపీ) లీజుకు ఇచ్చేందుకు ఆగస్టు 19న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. ఈ మూడు.. జైపూర్, తిరువనంతపురం, గువాహటి విమానాశ్రయాలు కాగా, వీటి నిర్వహణ హక్కులను అదానీ ఎంటర్‌ప్రైజెస్ బిడ్ రూపంలో 2019 ఏడాది గెలుచుకుంది. ఈ మూడింటితోపాటు లక్నో, అహ్మదాబాద్, మంగళూరు విమానాశ్రయాలను కూడా 2019 ఫిబ్రవరిలో అదానీ దక్కించుకుంది. ఈ ఆరింటిలో అహ్మదాబాద్, మంగళూరు, లక్నో విమానాశ్రయాలను అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు లీజుకు ఇచ్చేందుకు అనుకూలంగా 2019 జూలైలోనే కేంద్రం ఆమోదం తెలిపింది. మిగిలిన మూడు విమానాశ్రయాలనూ పీపీపీ విధానంలో లీజునకు తాజాగా ఆమోదముద్ర వేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: జైపూర్, తిరువనంతపురం, గువాహటి విమానాశ్రయాల లీజుకు ఆమోదం
ఎప్పుడు: ఆగస్టు 19
ఎవరు: కేంద్ర కేబినెట్
ఉద్యోగార్థుల కోసం గూగుల్ కొర్మో జాబ్స్
ఉద్యోగార్థుల కోసం తమ ‘కొర్మో జాబ్స్’ యాప్‌ను భారత్‌లో ప్రవేశపెడుతున్నట్లు టెక్ దిగ్గజం గూగుల్ ఆగస్టు 19న వెల్లడించింది. రిటైల్, హాస్పిటాలిటీ తదితర రంగాల వ్యాపార సంస్థల్లో ఉద్యోగాల కోసం తెలుసుకునేందుకు, దరఖాస్తు చేసుకునేందుకు గూగుల్ 2019 ఏడాది ‘జాబ్స్’ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీన్ని ఇకపై ‘కొర్మో జాబ్స్’ కింద రీబ్రాండ్ చేయనున్నట్లు గూగుల్ తెలిపింది. వాస్తవానికి జాబ్స్ ఫీచర్‌ను 2018లో బంగ్లాదేశ్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షించామని, ఆ తర్వాత కొర్మొ జాబ్స్ పేరిట ఇండొనేసియాలో ప్రవేశపెట్టామని పేర్కొంది.
బిగాస్‌తో మనీట్యాప్ ఒప్పందం
గ్లోబల్ ఎలక్ట్రికల్ తయారీ కంపెనీ ఆర్‌ఆర్ గ్లోబల్‌కు చెందిన ఆటోమోబైల్ బ్రాండ్ బిగాస్ దేశంలోని తొలి యాప్ ఆధారిత క్రెడిట్ లైన్ స్టార్టప్ మనీటాప్‌తో ఒప్పందం చేసుకుంది. దీంతో బిగాస్ అన్ని రకాల ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోళ్లకు రుణాలను అందిస్తామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. నెలవారీ వాయిదా (ఈఎంఐ) మీద సున్నా శాతం వడ్టీ రేట్లకు ఈ లోన్లను అందిస్తున్నామని పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: అందుబాటులోకి కొర్మో జాబ్స్ యాప్
ఎప్పుడు: ఆగస్టు 19
ఎవరు: గూగుల్
ఎక్కడ : భారత్
ఎందుకు:ఉద్యోగార్థుల కోసం
చెరకు సేకరణ ధర రూ.10 పెంపు
చక్కెర మిల్లులు రైతులకు చెల్లించే చెరకు సేకరణ ధరను క్వింటాలుకు పది రూపాయలు పెంచాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. 2020–21 (అక్టోబర్– సెప్టెంబర్) మార్కెటింగ్ సంవత్సరానికి చెరకు సేకరణ ధరను పది రూపాయలు పెంచి క్వింటాలుకు రూ.285గా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయించిందనికేంద్ర సమాచార శాఖ మంత్రి జవదేకర్ ఆగస్టు 19న తెలిపారు.
డిస్కంలకు వెసులుబాటు
గత ఏడాది ఆదాయంలో 25 శాతానికి మించి డిస్కంలకు అప్పులు ఇవ్వకూడదనే నిబంధనను కేంద్రం సవరించింది. ఉదయ్ కింద 90 వేల కోట్ల రూపాయలను డిస్కంలకు రుణాలుగా అందించాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. కరోనా లాక్‌డౌన్ మూలంగా వినియోగం తగ్గి, మరోవైపు బిల్లులు వసూలు కాక డిస్కంలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. అందువల్ల వర్కింగ్ క్యాపిటల్ కింద ఆదాయంలో 25 శాతానికి మించి రుణాలు ఇవ్వకూడదనే నిబంధనను ఈ ఒక్కసారికి సడలిస్తున్నాం అని జవదేకర్ తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: చక్కెర మిల్లులు రైతులకు చెల్లించే చెరకు సేకరణ ధరను క్వింటాలుకు పది రూపాయలు పెంపు
ఎప్పుడు: ఆగస్టు 19
ఎవరు: కేంద్ర ప్రభుత్వం
జాతీయ నియామక సంస్థ ఏర్పాటుకు ఆమోదం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలో సంస్కరణలకు మార్గం సుగమం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆగస్టు 19న సమావేశమైన కేంద్ర కేబినెట్ జాతీయ నియామక సంస్థ (ఎన్ఆర్‌ఏ) ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ (ఎన్ఆర్‌ఏ) గ్రూప్ బి, గ్రూప్ సి (నాన్–టెక్నికల్) పోస్టులకు అభ్యర్థులను పరీక్షించడానికి, షార్ట్‌లిస్ట్ చేయడానికి కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీఈటీ) నిర్వహిస్తుంది. ఎన్ఆర్‌ఏలో రైల్వే మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, ఐబీపీఎస్‌కు చెందిన ప్రతినిధులు ఉంటారు.
రూ.1,517 కోట్ల వ్యయం...
ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, ఐబీపీఎస్ సంస్థలు ఇక వేర్వేరుగా నియామక పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేకుండా.. ఎన్ఆర్‌ఏ ప్రిలిమినరీ స్థాయి పరీక్షగా సీఈటీ నిర్వహించి స్కోరు కేటాయిస్తుంది. కేంద్రం ఎన్ఆర్‌ఏ కోసం రూ.1,517.57 కోట్లు ఖర్చు చేయనుంది. 117 ఆకాంక్ష జిల్లాల్లో పరీక్షాకేంద్రాలు, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు నిధులను వెచ్చిస్తారు.
ఇవీ ప్రయోజనాలు
ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలనుకునే అభ్యర్థులు వివిధ పోస్టుల కోసం బహుళ నియామక సంస్థలు నిర్వహించే విభిన్న పరీక్షలకు హాజరు కావాల్సి వస్తోంది. బహుళ నియామక సంస్థలకు ఫీజులు చెల్లించాల్సి రావడం, వివిధ పరీక్షల్లో హాజరు కావడానికి చాలా దూరం ప్రయాణించాల్సి రావడం, ఆయా పరీక్షలు అభ్యర్థులపై, అలాగే సంబంధిత నియామక ఏజెన్సీలపై ఆర్థిక భారం మోపుతుండడం, సెక్యూరిటీ సంబంధిత సమస్యలు, వేదిక లభ్యత వంటి అనేక సమస్యలు ప్రస్తుత విధానంలో ఉత్పన్నమవుతున్నాయి. సగటున 2.5 కోట్ల నుంచి 3 కోట్ల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతారు. వీటన్నింటికీ పరిష్కారంగా ప్రిలిమినరీ పరీక్షగా ఒక సాధారణ అర్హత పరీక్ష నిర్వహించడం ద్వారా అభ్యర్థులు ఒకే సారి హాజరు కావడానికి, అలాగే తదుపరి దశలో ఉన్నత స్థాయి పరీక్ష కోసం ఈ నియామక ఏజెన్సీలలో ఏదైనా లేదా అన్నింటికీ దరఖాస్తు చేసుకోవడానికి ఎన్ఆర్ఏ వీలు కల్పిస్తుంది. దేశంలోని ప్రతి జిల్లాలో పరీక్షా కేంద్రాల ఏర్పాటు ద్వారా సుదూర ప్రాంతాల్లో ఉన్న అభ్యర్థులకు పరీక్ష కేంద్రాలను చేరువ చేస్తుంది. 117 ఆకాంక్ష జిల్లాల్లో పరీక్షా మౌలిక సదుపాయాలను సృష్టించడంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం సాధ్యం అవుతుంది. దూర ప్రాంతాలలో నివసించే గ్రామీణ అభ్యర్థులను పరీక్ష రాయడానికి ప్రేరేపిస్తుంది.సీఈటీని ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: జాతీయ నియామక సంస్థ (ఎన్ఆర్‌ఏ) ఏర్పాటుకు ఆమోదం
ఎప్పుడు: ఆగస్టు 19
ఎవరు: కేంద్ర కేబినెట్
ఎందుకు :ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలనుకునే అభ్యర్థుల సమస్యల పరిష్కారం కోసం
మేఘా ఇంజనీరింగ్ కు జోజిల్లా టన్నెల్ పనులు
నిర్మాణ రంగ దిగ్గజం మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్).. ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును దక్కించుకుంది. హిమాలయాల్లోని జమ్మూకశ్మీర్–లద్దాఖ్‌లోనిజోజిల్లా పాస్ టన్నెల్ నిర్మాణ పనుల ప్రాజెక్టును చేజిక్కించుకుంది. ఈ విషయాన్ని నేషనల్ హైవేస్, ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆగస్టు 21న వెల్లడించింది. ప్రాజెక్టు వ్యయం రూ.4,509.50 కోట్లుగా ఉందని పేర్కొంది. ప్రాజెక్టును 72 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుందని వివరించింది. మొత్తం పనిని దాదాపు 33 కిలోమీటర్ల మేర 2 విభాగాలుగా చేపట్టాల్సి ఉంటుంది.
జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్ నుంచి లద్దాఖ్ లేహ్ ప్రాంతంలో ఉన్న రహదారిని ఏడాదిలో 6నెలలపాటు పూర్తిగా మూసివేస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో సుదీర్ఘ దూరం ప్రయాణించడానికి అత్యధిక వ్యయ ప్రయాసలతో పాటు సమయం కూడా వృధా అవుతోంది. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా సోనామార్గ్ నుంచి కార్గిల్ మీదుగా లేహ్, లడఖ్‌కు ఈ రహదారి టన్నెల్ నిర్మించాలని ప్రతిపాదించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: జోజిల్లా పాస్ టన్నెల్ నిర్మాణ పనుల ప్రాజెక్టు కైవసం
ఎప్పుడు: ఆగస్టు 21
ఎవరు:మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్)
ఎక్కడ : జమ్మూకశ్మీర్–లద్దాఖ్
పాపులేషన్ స్టేటస్ రిపోర్టులు విడుదల
ఇండియన్స్ అసోసియేషన్స్ ఆఫ్ పార్లమెంటేరియన్స్ ఫర్ పాపులేషన్స్ అండ్ డెవలప్‌మెంట్ తయారుచేసిన ‘‘స్టేటస్ ఆఫ్ సెక్స్ రేషియోఎట్ బర్త్ ఇన్ ఇండియా’’, ‘‘ఎల్డర్లీపాపులేషన్ ఇన్ ఇండియా...స్టేటస్ అండ్ సపోర్ట్ సిస్టమ్స్ ’’రిపోర్టులు విడుదలయ్యాయి. ఆగస్టు 20న జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఈ రిపోర్టులను విడుదల చేశారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ... పార్లమెంటు, అసెంబ్లీలలో మహిళలకు తగిన రిజర్వేషన్లు కల్పించాలని, ఈ విషయంపై అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయానికి రావాలని కోరారు. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యానికి సంబంధించిన ఈ ప్రతిపాదన చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉండడం దురదృష్టకరమని తెలిపారు.
27 శాతం మందికి స్మార్ట్‌ఫోన్ లు లేవు
ఆన్లైన్ క్లాసులకు హాజరయ్యేందుకు దేశంలోని కనీసం 27 శాతం మంది విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు అందుబాటులో లేవని ఎన్సీఈఆర్‌టీ సర్వేలో తేలింది. అంతేకాకుండా... విద్యుత్తు సరఫరాలో అంతరాయం, కరెంటు సౌకర్యం లేకపోవడం కూడా ఆన్లైన్ క్లాసులకు విఘాతమేనని 28 శాతం విద్యార్థులు, తల్లిదండ్రులు అభిప్రాయపడినట్లు సర్వే తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ‘‘స్టేటస్ ఆఫ్ సెక్స్ రేషియోఎట్ బర్త్ ఇన్ ఇండియా’’, ‘‘ఎల్డర్లీపాపులేషన్ ఇన్ ఇండియా...స్టేటస్ అండ్ సపోర్ట్ సిస్టమ్స్’’రిపోర్టులు విడుదల
ఎప్పుడు: ఆగస్టు 20
ఎవరు: ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు
లద్దాఖ్‌లోఇగ్లా క్షిపణుల మోహరింపు
భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.తూర్పు లద్దాఖ్‌లోనివాస్తవాధీన రేఖ వెంబడి చైనా ఇప్పటికే హెలికాప్టర్లను మోహరించి కవ్వింపు చర్యలకు దిగుతోంది. దీంతో భారత్ బలగాలు ఎక్కడికైనామోసుకుపోగలిగే పోర్టబుల్ ఇగ్లా క్షిపణుల్ని అత్యంత ఎత్తయిన ప్రాంతాల్లో మోహరించాయి. సైనికులు భుజం మీద మోస్తూనే ఈ క్షిపణులతో శత్రువులపై గుళ్ల వర్షం కురిపించవచ్చు. ఈ క్షిపణి వ్యవస్థను ఆర్మీ, వైమానిక దళం వినియోగిస్తాయి. చైనా సైన్యం కదలికల్ని అనుక్షణం కనిపెట్టేందుకు నిఘాను పెంచారు. భూమ్మీద నుంచే గగన తలంలో జరిగే ప్రతీ కదలికను పసిగట్టేందుకు రాడార్లు ఏర్పాటు చేశారు.
రుణరహిత సంస్థగా టాటా మోటార్స్..
వాహనాల తయారీ దిగ్గజం టాటా మోటార్స్ రాబోయే మూడేళ్లలో రుణభారాన్ని దాదాపు సున్నా స్థాయికి తగ్గించుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అలాగే వ్యాపారంపై ఆర్థిక భారాన్ని తగ్గించుకునే క్రమంలో ప్రధాన వ్యాపారేతర పెట్టుబడులను కూడా సొమ్ము చేసుకోవాలని భావిస్తోంది. కంపెనీ 75వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా షేర్‌హోల్డర్లతో టాటా మోటార్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఆగస్టు 25న ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం టాటా మోటార్స్ గ్రూప్‌నకు రూ. 48,000 కోట్ల రుణభారం ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: పోర్టబుల్ ఇగ్లా క్షిపణుల మోహరింపు
ఎప్పుడు: ఆగస్టు 26
ఎవరు: భారత్ బలగాలు
ఎక్కడ :తూర్పు లద్దాఖ్‌లోనివాస్తవాధీన రేఖ వెంబడి
ఎందుకు:చైనా ఇప్పటికే హెలికాప్టర్లనుమోహరంచడంతో
సీఎస్‌ఆర్ నిబంధనలకు కేంద్రం సవరణలు
కరోనా వైరస్ నివారణ దిశగా టీకాలు (వ్యాక్సిన్లు), ఔషధాల అభివృద్ధిని పెద్ద ఎత్తున ప్రోత్సహించే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. కోవిడ్–19కు సంబంధించిన నూతన టీకాలు, ఔషధాలు, వైద్య పరికరాల పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) కార్యక్రమాలను కార్పొరేట్ సామాజిక బాధ్యత పథకం (సీఎస్‌ఆర్) పరిధిలోకి తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించి నిబంధనలను సవరించింది. మూడు ఆర్థిక సంవత్సరాల (2020–21, 2021–22, 2022–23) వరకు కొన్ని షరతుల మేరకు ఇది అమలవుతుంది. ఈ చర్య వైద్య పరిశోధన సంస్థలకు ప్రోత్సాహాన్నిచ్చేది కానుంది. కంపెనీలు గత మూడేళ్ల కాలంలో పొందిన వార్షిక సగటు లాభాల్లోంచి 2 శాతాన్ని తప్పకుండా సీఎస్‌ఆర్ కింద సామాజిక కార్యక్రమాల కోసం ఖర్చు చేయాలన్నది కంపెనీల చట్టం నిబంధనల్లో ఉంది.
యూఎస్ ఓపెన్ కు ఒస్టాపెంకో దూరం
ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌కు మరో స్టార్ క్రీడాకారిణి దూరమైంది. ఆగస్టు 31న న్యూయార్క్‌లో మొదలయ్యే ఈ మెగా టోర్నీలో తాను ఆడటం లేదని 2017 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, ప్రపంచ 42వ ర్యాంకర్ జెలెనాఒస్టాపెంకో ఆగస్టు 25న ప్రకటించింది. తన వ్యక్తిగత షెడ్యూల్‌లో మార్పు కారణంగానే తానీ నిర్ణయం తీసుకున్నానని 23 ఏళ్ల ఒస్టాపెంకో తెలిపింది. కరోనా వైరస్ నేపథ్యంలో... ఇప్పటికే యూఎస్ ఓపెన్ నుంచి ప్రపంచ నంబర్‌వన్యాష్లేబార్టీ (ఆస్ట్రేలియా), రెండో ర్యాంకర్ హలెప్ (రొమేనియా), డిఫెండింగ్ చాంపియన్ బియాంకాఆండ్రెస్కూ (కెనడా), ఐదో ర్యాంకర్ స్వితోలినా (ఉక్రెయిన్), ఏడో ర్యాంకర్ కికిబెర్‌టెస్ (నెదర్లాండ్స్), ఎనిమిదో ర్యాంకర్ బెలిండా బెన్ చిచ్ (స్విట్జర్లాండ్) వైదొలిగారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: సీఎస్‌ఆర్ నిబంధనలకుసవరణలు
ఎప్పుడు: ఆగస్టు 25
ఎవరు:కేంద్ర ప్రభుత్వం
ఎందుకు:కరోనా వైరస్ నివారణ దిశగా టీకాలు (వ్యాక్సిన్లు), ఔషధాల అభివృద్ధిని పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు
యూపీ, తమిళనాడులో పరిశ్రమల కారిడార్
కేంద్రం ప్రకటించిన ‘ఆత్మనిర్భర్ భారత్’ విధానం దేశ శక్తి సామర్థ్యాలను పెంచేందుకు తోడ్పడుతుందని, రక్షణ రంగంలో మనం స్వావలంబన సాధిస్తే, ప్రపంచంలో భారత్ స్థాయి పెరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఆటోమేటిక్ విధానంలో రక్షణ రంగంలోకి 75 శాతం ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామన్నారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో రక్షణ రంగ పరిశ్రమల కారిడార్ ఏర్పాటు దిశగా చర్యలు సాగుతున్నాయని వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో ఇందుకుగాను ప్రభుత్వం రూ.20 వేల కోట్లు వ్యయం చేస్తుందని పేర్కొన్నారు. ఆగస్టు 26న జరిగిన రక్షణరంగ పరిశ్రమల సదస్సునుద్దేశించి ప్రసంగించిన ప్రధాని ఈ మేరకు తెలిపారు.
41వ జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశం
కరోనా వైరస్ దేశ ఆర్థిక వ్యవస్థను గట్టిగానే తాకిందని, ఈ ప్రకృతి చర్యతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(2020–21) వృద్ధి పడిపోనుందని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. 41వ జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశం ఆగస్టు 27న ముగిసిన అనంతరం మంత్రి ఈ మేరకు పేర్కొన్నారు. 2020–21లో రాష్ట్రాలు జీఎస్‌టీ ఆదాయాల రూపంలో రూ.2.35 లక్షల లోటును ఎదుర్కోవచ్చని కేంద్రం అంచనా వేస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రక్షణ రంగ పరిశ్రమల కారిడార్ ఏర్పాటు
ఎప్పుడు : ఆగస్టు 26
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ఉత్తరప్రదేశ్, తమిళనాడు
ఎందుకు : రక్షణ రంగంలో స్వావలంబన కోసం
పన్ను చెల్లింపుదారుల పోర్టల్ ఆవిష్కరణ
దేశంలో నిజాయితీగా పన్నులు చెల్లించేవారిని గుర్తించి ప్రోత్సహించే లక్ష్యంతో ‘‘పారదర్శక పన్ను విధానం–నిజాయితీపరుల గుర్తింపు’’ పేరుతో ఏర్పాటైన ఓ వేదికను ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 13న ఆన్లైన్ పద్ధతిలో ఆవిష్కరించారు. అలాగే అవినీతిని గణనీయంగా తగ్గించే దిశగా సిద్ధం చేసిన పలు సంస్కరణలను ప్రారంభించారు. పారదర్శక పన్ను విధానం–నిజాయితీపరుల గుర్తింపు ప్లాట్‌ఫార్మ్ ద్వారా ప్రత్యక్ష పన్నుల విధానాల్లో సంస్కరణలను అమలు చేయనున్నారు. ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఇటీవలి కాలంలో ప్రత్యక్ష పన్నుల విధానంలో పలు మార్పులు తీసుకొచ్చిందని ప్రభుత్వం తెలిపింది. పన్నుల మదింపు, వివాదాలపై అప్పీళ్లు అంశాల్లో వ్యక్తుల ప్రమేయం (ఫేస్‌లెస్ అసెస్‌మెంట్, అప్పీల్స్) లేకుండా చేయడం ఈ సంస్కరణల్లో ఒకటి.
ఫేస్‌లెస్ అసెస్‌మెంట్..
తాజా సంస్కరణల్లో భాగంగా పన్ను చెల్లింపుదారుల చార్టర్, వ్యక్తుల ప్రమేయం లేని పన్ను మదింపును అమలు చేయడం ద్వారా పన్ను చెల్లింపులను అధికం చేయడంతో పాటు, నిజాయితీగా పన్నులు చెల్లించే వారికి ప్రోత్సహించడం వీలవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కొత్త సంస్కరణల ఫలితంగా పన్ను చెల్లింపుదారులు ఏ పనికోసమైనా ఐటీ కార్యాలయాన్ని, అధికారిని సంప్రదించాల్సిన పరిస్థితి ఏర్పడదు. చార్టర్ కూడా ఆగస్టు 14 నుంచే అమల్లోకి రానుండగా ఫేస్‌లెస్ అసెస్‌మెంట్ అనేది 2020, సెప్టెంబర్ 25 నుంచి అమలు కానుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: పారదర్శక పన్ను విధానం–నిజాయితీపరుల గుర్తింపు పోర్టల్ ఆవిష్కరణ
ఎప్పుడు: ఆగస్టు 14
ఎవరు: ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు :నిజాయితీగా పన్నులు చెల్లించేవారిని గుర్తించి ప్రోత్సహించే లక్ష్యంతో
జాన్సన్ సంస్థతో బయాలాజికల్ ఒప్పందం
ఔషధ తయారీ కంపెనీ బయాలాజికల్–ఈ (బీఈ) తాజాగా జాన్సన్ అండ్ జాన్సన్ కు చెందిన జాన్సన్ ఫార్మాస్యూటికాతో ఒప్పందం చేసుకుంది. కోవిడ్–19 వ్యాక్సిన్ క్యాండిడేట్ సాంకేతిక బదిలీ కోసం ఈ ఒప్పందం కుదిరింది. జాన్సన్ తయారు చేసిన కోవిడ్–19 వ్యాక్సిన్ క్యాండిడేట్‌కై ఔషధ పదార్థం సృష్టి, ఉత్పత్తి సామర్థ్యం పెంపు ప్రక్రియను బీఈ స్వీకరిస్తుంది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ క్యాండిడేట్ ఫేజ్ 1/2ఏ దశల్లో ఉందని కంపెనీ వెల్లడించింది.యూఎస్‌కు చెందిన బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ తో బీఈ లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా సురక్షితమైన, మెరుగ్గా పనిచేసే చవకైన వ్యాక్సిన్ ను బీఈ అభివృద్ధి చేస్తుంది. బేలర్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ క్యాండిడేట్ లైసెన్స్ ను బీఈకి బదిలీ చేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: జాన్సన్ ఫార్మాస్యూటికాతో ఒప్పందం
ఎప్పుడు: ఆగస్టు 14
ఎవరు: బయాలాజికల్–ఈ (బీఈ)
ఎందుకు :కోవిడ్–19 వ్యాక్సిన్ క్యాండిడేట్ సాంకేతిక బదిలీ కోసం
విశ్వాస పరీక్షలో గహ్లోత్ ప్రభుత్వం గెలుపు
రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ప్రభుత్వం ఆగస్టు 14న అసెంబ్లీలో విశ్వాస పరీక్షను విజయవంతంగా ఎదుర్కొంది. సచిన్ పైలట్ నేతృత్వంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలు తిరిగి పార్టీ గూటికి చేరడంతో బల నిరూపణ సునాయాసమైంది. దాంతో దాదాపు నెల రోజులుగా సాగుతున్న రాజస్థాన్ రాజకీయ సంక్షోభం ముగిసింది. శాసనసభ వ్యవహారాల మంత్రి శాంతి ధరివాల్ విశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. చర్చ అనంతరం, సభ ఆ తీర్మానాన్ని మూజువాణి ఓటుతో ఆమోదించింది.
200 మంది సభ్యుల రాజస్తాన్ అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 107గా ఉంది. మిత్రపక్షాలు బీటీపీ(2), సీపీఎం(2), ఆరెల్డీ(1), స్వతంత్రులు(13)తో కలిసి కాంగ్రెస్‌కు మద్దతిచ్చే వారి సంఖ్య 125 వరకు ఉంటుంది. బీజేపీ సభ్యుల సంఖ్య 72. మిత్రపక్షం(ఆర్‌ఎల్పీ 3)తో కలుపుకుని బీజేపీకి 75 మంది సభ్యుల మద్దతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: విశ్వాస పరీక్షలో గహ్లోత్ ప్రభుత్వం గెలుపు
ఎప్పుడు: ఆగస్టు 14
ఎవరు: రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ప్రభుత్వం
రాష్ట్రపతి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం
2020, ఆగస్టు 15న 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆగస్టు 14న ప్రసంగించారు. భారత్ శాంతికాముక దేశమని ఈ సందర్భంగా కోవింద్ పేర్కొన్నారు. అయితే, ఎవరైనా ఆక్రమణవాద దుస్సాహసానికి పాల్పడితే తగిన గుణపాఠం చెప్పగల సామర్థ్యం ఉన్న దేశమని స్పష్టం చేశారు.
రాష్ట్రపతి ప్రసంగం-ముఖ్యాంశాలు
ప్రతిష్టాత్మక జంప్ స్టార్ట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) https://indiadataportal.com/jri పోర్టల్‌ను ఆగస్టు 13న ప్రారంభించింది. నూతనంగా కంపెనీల నమోదు, ఎరువుల అమ్మకాలు, వ్యవసాయ ఉత్పత్తుల క్రయ విక్రయాలు, వాహనాల నమోదు, డిజిటల్ లావాదేవీలు, చెల్లింపులు, ఎంజీఎన్ఆర్‌ఈజీఏ కింద కార్మికుల డిమాండ్, జీఎస్టీ వసూళ్లు, ఎఫ్‌డీఐ, ఎఫ్‌పీఐ, రైల్వే ఫ్రైట్ వంటి అంశాల సమాచారం పొందుపరుస్తారు. ఈ వివరాల ఆధారంగా జర్నలిస్టులు, పౌరులు, విధానకర్తలు భారత ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ తీరుతెన్నులను రియల్ టైంలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో తెలుసుకోవడానికి పోర్టల్ తోడ్పడుతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: రికవరీ వివరాలకు ప్రత్యేక పోర్టల్ ప్రారంభం
ఎప్పుడు: ఆగస్టు 13
ఎవరు: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)
ఎందుకు:ప్రతిష్టాత్మక జంప్ స్టార్ట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా
నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ప్రారంభం
దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోట వేదికగా జాతినుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఢిల్లీలో ఎర్రకోటలో ఆగస్టు 15న జరిగిన దేశ 74వ స్వాతంత్ర దిన వేడుకలకు సంప్రదాయబద్ధంగా కాషాయం, తెలుపు రంగుల్లో ఉన్న కుర్తా, పైజామా తలపాగా ధరించి వచ్చిన ప్రధాని గంటా 26 నిమిషాల సేపు ప్రసంగించారు. కేంద్ర పథకాలైన ఆత్మ నిర్భర్ భారత్, వోకల్ ఫర్ లోకల్, మేకిన్ ఇండియా టు మేక్ ఫర్ వరల్డ్, నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ లు, దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆర్థిక రంగ పురోగతికి చేపట్టిన సంస్కరణల గురించి ప్రధాని వివరించారు. కరోనా వ్యాక్సిన్ నుంచి మహిళా సాధికారత వరకు ప్రతీ అంశాన్ని స్పృశిస్తూ ఆయన ప్రసంగం సాగింది.
నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్
ఎర్రకోట సాక్షిగా ఆగస్టు 15న ప్రధాని మోదీ ఆరోగ్య రంగాన్ని డిజిటలైజ్ చేసే పథకానికి శ్రీకారం చుట్టారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు కింద ప్రతీ పౌరుడికి హెల్త్ ఐడీ నంబర్ ఇస్తారు. ఈ హెల్త్ ఐడీ డిజిటల్ రూపంలోనే ఉంటుంది. అందులో వారి ఆరోగ్య సమాచారం, వాడే మందులు, మెడికల్ రిపోర్ట్స్ నిక్షిప్తం చేస్తారు. ఈ ఐడీలన్నింటినీ దేశ వ్యాప్తంగానున్న ఆరోగ్య కేంద్రాలు, రిజిస్టర్డ్ వైద్యులతో అనుసంధానం చేస్తారు. దీనివల్ల దేశంలో ఎవరైనా అనారోగ్యంతో వైద్యుల్ని సంప్రదిస్తే ఒక్క క్లిక్‌తో వారి సమస్యలన్నీ తెలుసుకోవచ్చు.
మేక్ ఫర్ వరల్డ్
మోదీ తన ప్రసంగంలో ఆత్మనిర్భర్ భారత్‌పై అత్యధికంగా దృష్టి పెట్టారు. ఆత్మ నిర్భర్ భారత్ అంటే దిగుమతులు తగ్గించుకోవడమే కాదు, మన సామర్థ్యం, సృజనాత్మకత, నైపుణ్యం ప్రపంచం గుర్తించేలా చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ఇక మేకిన్ ఇండియా కాదు, మేక్ ఫర్ వరల్డ్ దిశగా భారత్ ప్రయాణం సాగాలని అన్నారు. ప్రపంచం ఆదరించేలా భారత్‌లో నాణ్యమైన వస్తువుల్ని ఉత్పత్తి చేయాలని మోదీ అన్నారు.
అన్ని గ్రామాలకు ఫైబర్ నెట్
రాబోయే మూడేళ్ల కాలంలో దేశంలో ఆరు లక్షలకు పైగా గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించే ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ ప్రాజెక్టుని ప్రధాని ప్రకటించారు. గత అయిదేళ్లలో 1.5 లక్షల గ్రామ పంచాయితీలకు ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించామని మరో మూడేళ్లలో ప్రతీ గ్రామానికి నెట్ సదుపాయం ఉంటుందని అన్నారు. ఆన్లైన్ కార్యకలాపాలు అధికమైన నేపథ్యంలో సైబర్ భద్రతపై త్వరలోనే కొత్త విధానాన్ని తీసుకొస్తామన్నారు.
ప్రధాని ప్రసంగం-ముఖ్యాంశాలు
గణనీయంగా పట్టణ జనాభా పెరుగుదల
దేశంలో పట్టణ జనాభా 2021–36 మధ్య కాలంలో రికార్డు స్థాయిలో పెరగనుందని ‘నేషనల్ కమిషన్ ఆన్ పాప్యులేషన్’ తన తాజా నివేదికలో వెల్లడించింది. కేంద్ర ఆరోగ్య –కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఈ సంస్థ దేశ జనాభాపై నిర్వహించిన అధ్యయనంలో.. 2011–21తో పోలిస్తే 2021–36లో దేశ జనాభా పెరుగుదల రేటు బాగా తగ్గనుందని పేర్కొంది. అయితే, మొత్తం జనాభాలో మాత్రం భారత్ చైనాను అధిగమించి మొదటి స్థానానికి చేరుకోనుందని వివరించింది.
నివేదికలోని ప్రధాన అంశాలు
ఏమిటి: 2021–36 మధ్య కాలంలో గణనీయంగా పట్టణ జనాభా పెరుగుదల
ఎప్పుడు: ఆగస్టు 16
ఎవరు: నేషనల్ కమిషన్ ఆన్ పాప్యులేషన్
ఎక్కడ:దేశంలో
డేటా అండ్ ఏఐ నివేదిక ఆవిష్కరణ
నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కాం) రూపొందించిన ‘అన్లాక్ వాల్యూ ఫ్రం డేటా అండ్ ఏఐ : ద ఇండియన్ ఆపర్చునిటీ’ నివేదిక విడుదలైంది. ఆగస్టు 18న జరిగిన వర్చువల్ కాన్ఫరెన్స్ లో కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఈ నివేదికను ఆవిష్కరించారు. కోవిడ్ సంక్షోభం నుంచి భారత్ పటిష్టంగా ఎదిగేందుకు ఈ నివేదిక దోహదం చేస్తుందని నాస్కాం ప్రెసిడెంట్ దేబ్జానీ ఘోష్ తెలిపారు.
ఎక్స్‌పీరియన్స్ ఏఐ సమ్మిట్..
తెలంగాణ ఏఐ మిషన్ భాగస్వామ్యంతో 2020, సెప్టెంబర్ 1–4 తేదీల్లో ఎక్స్‌పీరియన్స్ ఏఐ సమ్మిట్‌ను నిర్వహించనున్నట్లు నాస్కాం వెల్లడించింది. సమ్మిట్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగ నిపుణులు, కంపెనీలు, సంస్థలు ఒకే వేదికపైకి రానున్నాయి. అలాగే భారత్ పునరుద్ధరణకు, వృద్ధికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా దోహదం చేస్తుందో ఓ కార్యాచరణకు రూపకల్పన చేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: అన్లాక్ వాల్యూ ఫ్రం డేటా అండ్ ఏఐ : ద ఇండియన్ ఆపర్చునిటీనివేదిక ఆవిష్కరణ
ఎప్పుడు: ఆగస్టు 18
ఎవరు: కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్
పీఎం కేర్స్ నిధుల మళ్లింపు అనవసరం
కోవిడ్–19 విపత్తును ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్ నిధులను జాతీయ విపత్తు నిధి (ఎన్డీఆర్‌ఎఫ్)కి బదిలీ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ఒక పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని బెంచ్ ఆగస్టు 18న ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. పీఎం కేర్స్ ఫండ్, ఎన్డీఆర్‌ఎఫ్‌లు పూర్తిగా భిన్నమైనవని, వేర్వేరు ఉద్దేశాలతో ఏర్పాటైనవని పేర్కొంది. కోవిడ్ విపత్తును ఎదుర్కొనడానికి ఎన్డీఆర్‌ఎఫ్ నిధులను కేంద్రం వాడుకోవడంపై ఎలాంటి ఆంక్షలు లేవని తెలిపింది. ఎన్డీఆర్‌ఎఫ్‌కు స్వచ్ఛందంగా ఎప్పుడైనా విరాళాలు ఇవ్వవచ్చని పేర్కొంది.
జూమ్‌కార్‌తో ఎంజీ మోటార్స్ ఒప్పందం
ప్రముఖ స్పోర్ట్స్ కార్ల బ్రాండ్ ఎంజీ మోటార్స్ దేశంలోని అతిపెద్ద మొబిలిటీ ఫ్లాట్‌ఫామ్ జూమ్‌కార్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ద్వారా 12, 24, 36 నెలల సబ్ర్‌స్కిప్షన్లకు ఎంజీ మోటార్స్ కార్లను అద్దెకు తీసుకోవచ్చని ఎంజీ మోటార్స్ కంపెనీ తెలిపింది. ఈ విధానంతో కొనుగోలుదారులు ఎంజీ కార్లను కొనుగోలు చేయడానికి ముందే కారులోని టెక్నాలజీ, ఫీచర్లు, డ్రైవింగ్ అనుభవం వంటివి తెలుస్తాయని ఎంజీ మోటార్స్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ గౌరవ్ గుప్తా తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: పీఎం కేర్స్ ఫండ్ నిధులను జాతీయ విపత్తు నిధి (ఎన్డీఆర్‌ఎఫ్)కి బదిలీ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చేందుకు తిరస్కరణ
ఎప్పుడు: ఆగస్టు 17
ఎవరు: సుప్రీంకోర్టు
ఎందుకు:పీఎం కేర్స్ ఫండ్, ఎన్డీఆర్‌ఎఫ్‌లు పూర్తిగా భిన్నమైనవని, వేర్వేరు ఉద్దేశాలతో ఏర్పాటైనవని
భారత్‌లో ఉపాధిపై ఐఎల్‌ఓ–ఏడీబీ సర్వే
భారత్‌లో ఉపాధిపై కరోనా ప్రభావం అనే అంశంపై ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్(ఐఎల్‌ఓ), ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఏడీబీ) సంయుక్త సర్వే నిర్వహించింది. దేశంలో కరోనా ప్రభావంతో 41లక్షల మంది యువత ఉద్యోగాలను కోల్పోయినట్లు ఈ సర్వే తెలిపింది. మహమ్మారి వ్యాప్తితో 2020 ఏడాది చివరికల్లా ఆసియా, పసిఫిక్ దేశాల్లోని కోటి నుంచి కోటిన్నర మంది యువత ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉందని సర్వే హెచ్చరించింది. 25ఏళ్ల పైబడిన వారి కంటే 15–24ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారిపై దీర్ఘకాలంలో ఆర్థిక, సామాజిక భద్రతపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపవచ్చని సర్వే అంచనా వేసింది.
మెడ్‌లైఫ్‌లో ఫార్మ్‌ఈజీ విలీనం
ఆన్లైన్ ఫార్మసీ సంస్థ ఫార్మ్‌ఈజీ మెడ్‌లైఫ్‌లో విలీనం కానుంది. ఇందుకు సంబంధించి ఇరు సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. మెడ్‌లైఫ్‌లో విలీనానికి ఆమోదం కోరుతూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)కి ఫార్మ్‌ఈజీ దరఖాస్తు చేసుకుంది. ఒప్పందం ప్రకారం... ఫార్మ్‌ఈజీ మాతృసంస్థ ఏపీఐ హోల్డింగ్స్‌లో మెడ్‌లైఫ్, దాని ప్రమోటర్లకు 19.59 శాతం వాటా లభిస్తుంది. ఈ వాటా విలువ దాదాపు 230 మిలియన్ డాలర్లు. మిగతా వాటా ఫార్మ్‌ఈజీకి ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: కరోనా ప్రభావంతో 41లక్షల మంది యువత ఉద్యోగాలు కోల్పోయారు
ఎప్పుడు: ఆగస్టు 18
ఎవరు: ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్(ఐఎల్‌ఓ), ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఏడీబీ) సంయుక్త సర్వే

ఎక్కడ: భారత్
ఎందుకు :ఉద్యోగార్థుల కోసం

రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు నంబర్ 2 బ్రాండ్ హోదా
యాపిల్ తరువాత బిలియనీర్ ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) అంతర్జాతీయంగా నంబర్ 2 బ్రాండ్ హోదాను సంపాదించుకుంది.ఫ్యూచర్‌బ్రాండ్ ఆగస్టు 5న విడుదల చేసిన ఫ్యూచర్‌బ్రాండ్ ఇండెక్స్ 2020 ఈ విషయాన్ని తెలిపింది.ఈ ఇండెక్స్‌లో శాంసంగ్ మూడవ స్థానంలో నిలవగా, ఎన్విడియా, మౌటాయ్, నైకీ, మైక్రోసాఫ్ట్, ఏఎస్‌ఎంఎల్, పేపాల్, నెట్‌ఫ్లిక్స్ తరువాత స్థానాల్లో నిలిచాయి. ఇండెక్స్‌లో కొత్తగా 15 సంస్థలకు చోటు లభించగా ఇందులో ఏఎస్‌ఎంఎల్ హోల్డింగ్స్, పేపాల్, దనాహెర్, సౌదీ ఆరాంకో, అమెరికన్ టవర్ కార్పొరేషన్ లు ఉన్నాయి.
పీడబ్ల్యూసీ ఆధారంగా...
ప్రైస్ వాటర్ కూపర్స్ (పీడబ్ల్యూసీ) గ్లోబల్ టాప్ 100 కంపెనీల మార్కెట్ క్యాప్, ఆర్థిక పటిష్టత, దేశీయ, అంతర్జాతీయ క్రియాశీలత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఫ్యూచర్‌బ్రాండ్‌ఇండెక్స్ రూపొందించింది. పీడబ్ల్యూసీ 2020 జాబితాలో రిలయన్స్ ర్యాంక్ 91. ప్రస్తుత కంపెనీల క్రియాశీలతతోపాటు వచ్చే కొద్ది సంవత్సరాల్లో ఆయా కంపెనీల పరిస్థితులపైనా మదింపుచేయడం ఇండెక్స్ ప్రత్యేకత. తదుపరి ఇండెక్స్‌లో రిలయన్స్ నంబర్ 1 స్థానానికి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయని ఫ్యూచర్ బ్రాండ్ పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి:రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు నంబర్ 2 బ్రాండ్ హోదా
ఎప్పుడు: ఆగస్టు 5
ఎవరు: ఫ్యూచర్‌బ్రాండ్ ఇండెక్స్ 2020
ఎక్కడ: ప్రపంచంలో
కేరళలోని కోళీకోడ్‌లో ఘోర విమానం ప్రమాదం
కేరళలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. వందేభారత్ మిషన్ లో భాగంగా దుబాయ్ నుంచి వస్తున్న దుబాయ్–కాళికట్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఆగస్టు 7న కోళీకోడ్ ఎయిర్‌పోర్ట్‌లోని టేబుల్ టాప్ రన్ వేపై దిగుతున్న సమయంలో ప్రమాదానికి లోనైంది. భారీగా వర్షం పడుతుండటంతో రన్ వే నుంచి పక్కకు జారీ పక్కనే ఉన్న దాదాపు 50 అడుగుల లోతైన లోయవంటి ప్రదేశంలో పడిపోయింది. దాంతో ఆ బీ737 విమానం రెండు ముక్కలైంది. ఆ ఘోర ప్రమాదంలో పైలట్ కెప్టెన్ దీపక్ సాథే సహా 17 మంది(ఆగస్టు 7నాటి వివరాల ప్రకారం) ప్రాణాలు కోల్పోయారు. 125 మంది వరకు గాయాలపాలయ్యారు. వారిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఆ విమానంలో 10 మంది చిన్నారులు సహా 184 మంది ప్రయాణీకులు, ఇద్దరు పైలట్లు, ఐదుగురు సిబ్బంది కలిపి మొత్తం 191 మంది ఉన్నారని ఎయిర్ ఇండియా తెలిపింది. రన్ వేపై చివరి వరకు విమానం వేగంగా వెళ్లి లోయలో పడి, రెండు ముక్కలుగా విరిగిపోయిందని డీజీసీఏ ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి:విమానం ప్రమాదంలో 17 మంది మృతి
ఎప్పుడు: ఆగస్టు 7
ఎక్కడ: కోళీకోడ్ ఎయిర్‌పోర్ట్, కేరళ
ఎందుకు:భారీ వర్షం కారణంగా
దేశంలో తొలి కిసాన్ రైలు ప్రారంభం
దేశంలో తొలి కిసాన్ రైలు ఆగస్టు 7న ప్రారంభమైంది. మహారాష్ట్రలోని దేవ్‌లాలి నుంచి బీహార్‌లోని దానాపూర్‌కి వరకు బయలుదేరిన ఈ రైలును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సర్వీసు ప్రస్తుతానికి వారానికి ఒకసారి దేవ్‌లాలి నుంచి ప్రతి శుక్రవారం, తిరుగుప్రయాణంలో ప్రతి ఆదివారం దానాపూర్ నుంచి బయలుదేరుతుంది. రైతుల కోసం తెచ్చిన కిసాన్ రైల్‌లోరిఫ్రిజిరేటర్ కోచ్‌లు ఉంటాయి. త్వరగా పాడైపోయే పండ్లు, కూరగాయలు వంటి వాటిని తరలించడానికి రైలు ఉపయుక్తంగా ఉంటుంది. తక్కువ ధరలకే రైతుల పంటలను రవాణా చేసేందుకు కిసాన్ రైలు ఉపకరిస్తుందని మంత్రి తోమర్ వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి:దేశంలో తొలి కిసాన్ రైలు ప్రారంభం
ఎప్పుడు: ఆగస్టు 7
ఎవరు: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్
ఎక్కడ: మహారాష్ట్రలోని దేవ్‌లాలి నుంచి బీహార్‌లోని దానాపూర్‌కి వరకు
ఎందుకు:త్వరగా పాడైపోయే పండ్లు, కూరగాయలు వంటి వాటిని తరలించడానికి
బ్రిటిష్ కాలంనాటి కళాసీ వ్యవస్థ రద్దు
బ్రిటిష్ జమానా నుంచి కొనసాగుతున్న కళాసీ వ్యవస్థకు రైల్వే శాఖ స్వస్తి పలకనుంది. రైల్వే శాఖ సీనియర్ అధికారుల ఇళ్లలో పని చేసేందుకు ‘కళాసీలు’లేదా ‘బంగ్లా ప్యూన్ల’నియామకాలనునిలిపివేయనున్నట్లు ఆగస్టు 6వ తేదీన జారీ చేసిన ఆదేశాల్లో రైల్వే బోర్డు పేర్కొంది. టెలిఫోన్ అటెండెంట్–కం– డాక్ కళాసీ(టీఏడీకే) పోస్టుల కొనసాగింపుపై సమీక్ష జరుపుతున్నామని ఉత్తర్వుల్లో పేర్కొంది. తాత్కాలిక ఉద్యోగులుగా జాయినయినటీఏడీకేలుమూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నాకస్క్రీనింగ్ ప్రక్రియ అనంతరం గ్రూపు ‘డి’ఉద్యోగులుగా గుర్తింపు పొందుతున్నారు. సుదూర ప్రాంతాల్లో, క్షేత్ర స్థాయిలో పనిచేసే అధికారులకు రక్షణగా, సహాయకులుగా ఉండేందుకు బ్రిటిష్ పాలనా కాలంలో టీఏడీకే వ్యవస్థ ఏర్పాటైంది. క్రమంగా ఆఫీసుల్లో ప్యూన్లు, ఇళ్లలో పనివారిగా మారిపోయారు. వీరిని వేధిస్తున్నారంటూ అధికారులపై ఫిర్యాదులు రావడంతో 2014లో రైల్వే శాఖ సమీక్షకు ఆదేశించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి:బ్రిటిష్ జమానా నుంచి కొనసాగుతున్న కళాసీ వ్యవస్థకు స్వస్తి
ఎప్పుడు: ఆగస్టు 7
ఎవరు: రైల్వే శాఖ
రాష్ట్రీయ సచ్ఛతా కేంద్రం ప్రారంభం
2020, ఆగస్టు 8 నుంచి 15 వరకు కొనసాగే స్వచ్ఛభారత్ వారోత్సవాలను ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 8న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద రాష్ట్రీయ సచ్ఛతా కేంద్రాన్ని ప్రారంభించి కార్యక్రమానికి హాజరైన విద్యార్థులనుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. మహాత్మాగాంధీ చేపట్టిన చంపారన్ సత్యాగ్రహం కార్యక్రమం వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సచ్ఛతా ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోదీ2017లో ప్రకటించారు.
ప్రధాని ప్రసంగం-ముఖ్యాంశాలు
ఏమిటి:రాష్ట్రీయ సచ్ఛతా కేంద్రం ప్రారంభం
ఎప్పుడు: ఆగస్టు 8
ఎవరు: ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ: రాజ్‌ఘాట్, ఢిల్లీ
ఎందుకు:మహాత్మాగాంధీ చేపట్టిన చంపారన్ సత్యాగ్రహం కార్యక్రమం వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా
అండమాన్ ఆప్టికల్ ఫైబర్ వ్యవస్థ ప్రారంభం
తమిళనాడు రాజధాని చెన్నై నుంచి అండమాన్ నికోబార్ దీవుల పోర్ట్‌బ్లెయిర్ వరకు సముద్ర గర్భంలో ఏర్పాటు చేసిన ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌ను ఆగస్టు 10న ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. రూ.1,224 కోట్లతో చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్ , అక్కడ్నుంచి ఇతర ద్వీపసమూహాలకు2,312కి.మీ. పొడవున వేసిన ఈ కేబుల్‌తో అండమాన్ నికోబర్ దీవుల్లో ప్రజలకు 4జీ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ట్రాన్స్షిప్‌మెంట్ పోర్ట్ నిర్మాణం...
ఆప్టికల్ ఫైబర్ ప్రారంభం సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ... భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీలో అండమాన్ నికోబార్ దీవులు మరింత కీలకంగా మారాయన్నారు. సెకండ్‌కి 2200జీబీపీఎస్ సామర్థ్యం గల ఈ కేబుల్ వ్యవస్థ ద్వారా అండమాన్ ద్వీప సమూహానికి స్వాతంత్య్ర దినోత్సవ కానుక ముందే లభించినట్టయిందని వ్యాఖ్యానించారు. సరకు రవాణా ద్వారా వాణిజ్య కార్యకలాపాలను పెంచడానికి 10 వేల కోట్లతో గ్రేట్ నికోబార్ ద్వీపసమూహంలో ట్రాన్స్ షిప్‌మెంట్ ఏర్పాటు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి:అండమాన్ ఆప్టికల్ ఫైబర్ వ్యవస్థ ప్రారంభం
ఎప్పుడు: ఆగస్టు 10
ఎవరు: ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు:అండమాన్ నికోబర్ దీవుల్లో ప్రజలకు 4జీ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు
ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ డాష్‌బోర్డ్ ప్రారంభం
దేశవ్యాప్తంగా అమలవుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సమాచారం అంతా ఒకే చోట లభించేలా జాతీయ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (ఎన్ఐపీ) ఆన్లైన్ డ్యాష్‌బోర్డు అందుబాటులోకి వచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆగస్టు 10న ఈ డ్యాష్‌బోర్డును ప్రారంభించారు. స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్య సాధనకు ఇది తోడ్పడగలదని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ఇండియా ఇన్వెస్ట్‌మెంట్ గ్రిడ్ (ఐఐజీ)లోని ఎన్ఐపీ ద్వారా ప్రాజెక్టుల అప్‌డేటెడ్ సమాచారం ఎప్పటికప్పుడు లభిస్తుందని వివరించారు.
అమల్లో 40 శాతం...
రూ. 111 లక్షల కోట్ల ఇన్ఫ్రా పెట్టుబడులకు సంబంధించి ప్రస్తుతం రూ. 44 లక్షల కోట్ల (సుమారు 40 శాతం) ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయి. రూ. 33 లక్షల కోట్ల ప్రాజెక్టులు ప్రతిపాదన స్థాయిలో ఉన్నాయి. మిగతావి వివిధ స్థాయిల్లో ఉన్నాయి.
బీఎస్‌ఈ స్టార్ ఎంఎఫ్ పోర్టల్
కార్పొరేట్లు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు వీలుగా బీఎస్‌ఈ స్టార్ ఎంఎఫ్ కార్ప్ డైరెక్ట్ పేరుతో ప్రత్యేక పోర్టల్ ను అభివృద్ధి చేసింది. అస్సెట్ మేనేజ్ మెంట్ కంపెనీలకు, డిస్ట్రిబ్యూటర్లకు, ఇన్వెస్టర్లకు, మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ భాగస్వాములకు ఎండ్ టు ఎండ్ సేవలను అందించడంతోపాటు, పెట్టుబడుల ప్రక్రియను ఇది సులభతరం చేస్తుందని బీఎస్‌ఈ ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి:జాతీయ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (ఎన్ఐపీ) ఆన్ లైన్ డ్యాష్‌బోర్డు ప్రారంభం
ఎప్పుడు: ఆగస్టు 10
ఎవరు:కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఎందుకు:మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సమాచారం అంతా ప్రజలకు ఒకే చోట లభించేలా
ఆస్తిలో కూతుళ్లకు సమాన వాటా
ఉమ్మడి హిందూ కుటుంబ ఆస్తిలో కొడుకులతో పాటు, కూతుళ్లకు సమాన హక్కులుంటాయని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. హిందూ వారసత్వ సవరణ చట్టం 2005కి ముందు తండ్రి మరణించినప్పటికీ కూతురుకి ఆ హక్కులు దక్కుతాయని స్పష్టం చేసింది. సమానత్వ హక్కుని కూతుళ్ళకి నిరాకరించతగదని కూడా స్పష్టం చేసింది. హిందూ వారసత్వ చట్టం–1956లోని సెక్షన్ 6ప్రకారం, చట్టంలో సవరణలకి ముందు లేదా తరువాత పుట్టిన కూతుళ్ళకు కూడా కొడుకులకు మాదిరిగానే హక్కులు, బాధ్యతలు సమానంగా ఉంటాయని జస్టిస్ ఆరుణ్ మిశ్రా, జస్టిస్ ఎస్.నజీర్, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం ఆగస్టు 11న తీర్పునిచ్చింది.
సవరణ చట్టం ద్వారా...
హిందూ వారసత్వ చట్టం 1956కి చేసిన సవరణ ద్వారా కూతుళ్ళకు కూడా పూర్వీకుల ఆస్తిలో సమాన వాటా ఉంటుందని కోర్టు తీర్పు స్పష్టం చేసింది. సెప్టెంబర్ 9, 2005 నాటికి జీవించి ఉన్నవారి కూతుళ్ళకు మాత్రమే ఈ చట్టం వర్తిస్తుందంటూ 2015లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని తోసిరాజని ‘‘కూతురు ఎప్పటికీ ప్రియమైన కూతురే’’అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి:ఉమ్మడి హిందూ కుటుంబ ఆస్తిలో కొడుకులతో పాటు, కూతుళ్లకు సమాన హక్కులు
ఎప్పుడు: ఆగస్టు 11
ఎవరు: సుప్రీంకోర్టు
ఉపరాష్ట్రపతి సచిత్ర పుస్తకం ఆవిష్కరణ
భారత ఉపరాష్ట్రపతిగా ఎం. వెంకయ్య నాయుడు మూడేళ్ళ పదవీకాలాన్ని పూర్తి చేస్తుకున్న సందర్భంగా ఉపరాష్ట్రపతి సచివాలయం ‘‘కనెక్టింగ్, కమ్యూనికేటింగ్, చేంజింగ్’’పేరుతో రూపొందించిన సచిత్ర పుస్తకాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆవిష్కరించారు. ఈ పుస్తకానికి సంబంధించిన డిజిటల్ వెర్షన్ ను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ ఆవిష్కరించారు. ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సమావేశ మందిరంలో ఆగస్టు 11న ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. బలమైన సంకల్పం, సమష్టి కృషితోనే ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమౌతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్య ఈ సందర్భంగా తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి:కనెక్టింగ్, కమ్యూనికేటింగ్, చేంజింగ్ పుస్తకం ఆవిష్కరణ
ఎప్పుడు: ఆగస్టు 11
ఎవరు: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్
ఎక్కడ: ఉపరాష్ట్రపతి భవన్, ఢిల్లీ
ప్రపంచంలోని అగ్రశ్రేణి 100 కంపెనీల్లో రిలయన్స్
భారత పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) తాజాగా మరోసారి ప్రపంచంలోనే అగ్రశ్రేణి 100 కంపెనీల జాబితాలో చోటు దక్కించుకుంది. 2020 సంవత్సరానికి గాను ఫార్చూన్ గ్లోబల్ 500 జాబితాలో గతేడాదితో పోలిస్తే 10 స్థానాలు ఎగబాకి 96వ స్థానానికి చేరింది. ఫార్చూన్ గ్లోబల్ 500లో ఇప్పటివరకు ఒక భారతీయ సంస్థ దక్కించుకున్న అత్యధిక ర్యాంకు ఇదే. 2012లో రిలయన్స్ తొలిసారిగా 99వ ర్యాంకు దక్కించుకుంది. అయితే, 2016లో 215 ర్యాంకుకు తగ్గింది. ఆ తర్వాత నుంచి మళ్లీ క్రమంగా మెరుగుపడి, టాప్ 100లో చోటు దక్కించుకుంది.
151వ స్థానంలో ఐవోసీ...
ఫార్చూన్ గ్లోబల్ 500 జాబితాలో... ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) 34 ర్యాంకులు తగ్గి 151వ స్థానంలో, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్ జీసీ) 30 ర్యాంకులు తగ్గి 190వ స్థానంలో నిల్చాయి. ఎస్‌బీఐ 15 ర్యాంకులు మెరుగుపడి 221వ స్థానంలో ఉంది. భారత్ పెట్రోలియం (309), టాటా మోటార్స్ (337), రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ (462) కూడా లిస్టులో ఉన్నాయి.
అగ్రస్థానంలో వాల్‌మార్ట్..
ఫార్చూన్ 2020 లిస్టులో అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. వాల్‌మార్ట్ ఆదాయం 524 బిలియన్ డాలర్లు. ఇక చైనాకు చెందిన సైనోపెక్ గ్రూప్, స్టేట్ గ్రిడ్, చైనా నేషనల్ పెట్రోలియం తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
ఆదాయాల ప్రాతిపదిక...
2020 మార్చి ఆఖరు లేదా అంతకు ముందు ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయాల ప్రాతిపదికన కంపెనీల ర్యాంకింగ్‌లను నిర్ణయించినట్లు ఫార్చూన్ తెలిపింది. రిలయన్స్ ఆదాయం 86.2 బిలియన్ డాలర్లు కాగా, ఐవోసీ 69.2 బిలియన్ డాలర్లు, ఓఎన్జీసీ 57 బిలియన్ డాలర్లు, ఎస్‌బీఐ 51 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి:ప్రపంచంలోని అగ్రశ్రేణి 100 కంపెనీల్లో రిలయన్స్
ఎప్పుడు: ఆగస్టు 11
ఎవరు: ఫార్చూన్ గ్లోబల్ 500 జాబితా
10 లక్షల మంది భారతీయులు వెనక్కి
వివిధ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఉద్దేశించిన వందేభారత్ మిషన్ లో భాగంగా దాదాపు 10 లక్షల మందిని భారత్‌కు తిరిగితెచ్చినట్లు విదేశీ వ్యవహారాల శాఖ ఆగస్టు 11న ప్రకటించింది. కరోనా సంక్షోభ నేపథ్యంలో ప్రవాస భారతీయుల కోసం ఈ మిషన్ ను మే 7న ఆరంభించారు. ఇదే సమయంలో భారత్ నుంచి దాదాపు 1.3 లక్షల మంది వివిధ దేశాలకు విమానాల ద్వారా వెనక్కు వెళ్లారని పౌరవిమానయాన శాఖ తెలిపింది. ప్రస్తుతం వందేభారత్ మిషన్ లో 5వ దశ నడుస్తోంది. ఇందులో దాదాపు 1.3 లక్షల భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు.
రూ.400 కోట్లతో సచివాలయం నిర్మాణం
కొత్త సచివాలయం భవన సముదాయం నిర్మాణానికి రూ.400 కోట్ల అంచనా వ్యయంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులు జారీచేసింది. చెన్నైకు చెందిన ఆస్కార్ పొన్ని ఆర్కిటెక్స్ సంస్థ రూపకల్పన చేసిన కొత్త సచివాలయం భవన డిజైన్‌ను ఆమోదించడంతో పాటు కొత్త సచివాలయం నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త సచివాలయం నిర్మాణానికి పరిపాలనా అనుమతులను సాధారణ పరిపాలన శాఖ జారీచేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి:విదేశాల నుంచి 10 లక్షల మంది భారతీయులు వెనక్కి
ఎప్పుడు: ఆగస్టు 11
ఎవరు: భారత విదేశీ వ్యవహారాల శాఖ
ఎందుకు:వందేభారత్ మిషన్ లో భాగంగా
యూఎస్‌ఎయిడ్‌తో రిలయన్స్ ఫౌండేషన్ జట్టు
డిజిటల్ అవగాహనకు సంబంధించి మహిళలు, పురుషుల్లో అసమానతలను తగ్గించే దిశగా యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యూఎస్‌ఎయిడ్), డబ్ల్యూ–జీడీపీతో కొత్తగా భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు రిలయన్స్ ఫౌండేషన్ వెల్లడించింది. అమెరికా అధ్యక్ష సలహాదారు ఇవాంకాట్రంప్ నిర్వహించిన ఉమెన్స్ గ్లోబల్ వలప్‌మెంట్ అండ్ ప్రాస్పరిటీ (డబ్ల్యూ–జీడీపీ) కార్యక్రమంలో ఈ భాగస్వామ్యం కుదిరినట్లు వివరించింది.
ఆర్థిక సాధికారత కోసం...
మహిళల ఆర్థిక సాధికారత సాధనకు తోడ్పడేందుకు డబ్ల్యూ–జీడీపీ ఫండ్ ఏర్పాటైనట్లుఇవాంకా తెలిపారు. దేశవ్యాప్తంగా డబ్ల్యూ–జీడీపీ ఉమెన్స్ కనెక్ట్ చాలెంజ్‌ను త్వరలో నిర్వహించనున్నట్లు రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యూఎస్‌ఎయిడ్), డబ్ల్యూ–జీడీపీతో కొత్తగా భాగస్వామ్యం
ఎప్పుడు: ఆగస్టు 12
ఎవరు: రిలయన్స్ ఫౌండేషన్
ఎందుకు:డిజిటల్ అవగాహనకు సంబంధించి మహిళలు, పురుషుల్లో అసమానతలను తగ్గించే దిశగా
పంజాబ్ స్మార్ట్ కనెక్ట్ స్కీం ప్రారంభం
పంజాబ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 12వ తరగతి విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్లను అందజేసే పథకం ‘పంజాబ్ స్మార్ట్ కనెక్ట్ స్కీం’ పంజాబ్ ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఆగస్టు 12న ఈ పథకాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం కింద మొదటి దశలో నవంబర్‌కల్లా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించిన 26 ప్రాంతాల్లో 1,74,015 మంది విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్లను పంపిణీ చేయనున్నారు.
భారత్ కు రూ.7,000 కోట్ల సాయం
భారత రహదారులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల్లో (ఎంఎస్‌ఎంఈ) మరిన్ని పెట్టుబడులు పెట్టాలని అంతర్జాతీయ సంస్థలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కోరారు. ఇండో ఆ్రస్టేలియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మంత్రి ఈ మేరకు పేర్కొన్నారు. రహదారి భద్రత విషయంలో భారత్–ఆ్రస్టేలియా సహకారం అందించుకుంటున్నాయని చెప్పారు. రోడ్డు ప్రమాదాల తగ్గింపునకు ఎన్నో చర్యలు తీసుకున్నామని, ఇందుకు సంబంధించి రూ.7,000 కోట్ల నిధుల సాయానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీలు అంగీకరించినట్టు మంత్రి వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: పంజాబ్ స్మార్ట్ కనెక్ట్ స్కీం ప్రారంభం
ఎప్పుడు: ఆగస్టు 12
ఎవరు: పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్
ఎందుకు:ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 12వ తరగతి విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్లను అందజేసేందుకు
ఏపీలో తొలిసారిగా కరోనాపై అధ్యయనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్‌పై కర్నూలు మెడికల్ కాలేజీ (కేఎంసీ) మైక్రో బయాలజీ విభాగంలో బయోఇన్ఫర్మాటిక్ అధ్యయనం చేశారు. కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్) పరిధిలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజీఐబీ)తో కర్నూలు ప్రాంతం నుంచి 90 మంది కరోనా బాధితుల శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్(ఎన్‌జీఎస్) చేశారు. ఈ వివరాలను ఆగస్టు 12న కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.చంద్రశేఖర్‌తో కలిసి మైక్రోబయాలజీ స్పెషలిస్టు డాక్టర్ పి.రోజారాణి విలేకరులకు వివరించారు. చైనాలోని వూహాన్‌లో మొదలైన కోవిడ్–19 వైరస్‌తో పోలిస్తే కర్నూలులో ఉన్న వైరస్ కొద్దిగా మార్పులు చేసుకుందని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ఆరు ప్రతిష్టాత్మక సంస్థలు ఈ అధ్యయనంలో పాల్గొన్నాయి. ఏపీ నుంచి మొదటి అధ్యయనం ఇదే.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఏపీలో తొలిసారిగా కరోనాపై అధ్యయనం
ఎప్పుడు: ఆగస్టు 12
ఎవరు: కర్నూలు మెడికల్ కాలేజీ (కేఎంసీ)
ఎక్కడ:కర్నూలు
వార్‌మెమొరియల్‌పై గల్వాన్ అమరులు
తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్లోయలో చైనా సైన్యంతో పోరాడి, వీరమరణం పొందిన 20 మంది అమరజవాన్ల పేర్లను ఢిల్లీలోని నేషనల్ వార్‌మెమొరియల్‌పై లిఖించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ పేర్లు చేర్చడానికి కొద్ది నెలల సమయం పట్టనున్నట్టు తెలిపారు. ఐదు దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా జూన్ 15వ తేదీన గల్వాన్లోయలో చైనా సైనికులతో భీకర పోరాటం జరిగింది. ఈ పోరాటంలో బిహార్ రెజిమెంట్ 16కి చెందిన కల్నల్ బి.సంతోష్ బాబుతో సహా 20 మంది సైనికులు అసువులు బాశారు. చైనా వైపు ఈ ఘర్షణలో ఎంత మంది చనిపోయారనేది ప్రకటించలేదు. అమెరికా నిఘా వర్గాల ప్రకారం 35 మంది చైనా సైనికులు చనిపోయినట్టు తెలుస్తోంది.
అదనపు బలగాలు...
చైనాతో ఉన్న సరిహద్దుల వెంబడి అదనంగా మరో 35 వేల మందిని నియమించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. భారత్ చైనా సరిహద్దులు 3,488 కిలోమీటర్ల పొడవు ఉండగా వాస్తవా«దీన రేఖ వెంబడి సరిహద్దులను కాపాడుకునేందుకు భారత్ ఇప్పటికే భారీగా ఖర్చు పెడుతోంది.
భారత్‌లో హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యం కాదు
భారత్‌లో కరోనా వైరస్‌ను హెర్డ్ ఇమ్యూనిటీ ద్వారా నియంత్రించలేమని వెల్లడైంది. భారత్‌లాంటి అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యం కాదని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. కొన్ని ప్రాంతాల్లో నివసించే జనాభాలో కరోనా వైరస్‌ను తట్టుకునే యాంటీబాడీలు బాగా అభివృద్ధి చెందినప్పటికీ అవి స్వల్పకాలం మాత్రమే ఉంటాయని వెల్లడించింది. టీకా కార్యక్రమం ద్వారా మాత్రమే ఇమ్యూనిటీని సాధించగలమని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారి రాజేష్ భూషణ్ జూలై 30న వెల్లడించారు.
ఆగస్ట్ 15లోగా రష్యా టీకా..
2020, ఆగస్ట్ 10 లేదా ఆగస్ట్ 12వ తేదీలోగా విడుదల చేసేందుకు రష్యా సిద్ధమవుతోంది. గామాలెయ ఇన్స్టిట్యూట్ రూపొందించిన ఈ టీకాకు సాధ్యమైనంత త్వరగా అనుమతి ఇవ్వాలని రష్యా భావిస్తోందని ఈ మొత్తం ప్రక్రియతో సంబంధమున్న అధికారిని ఉటంకిస్తూ ‘బ్లూమ్‌బర్గ్’ఒక కథనం ప్రచురించింది. ఆగస్ట్ 15లోగా ప్రజల వినియోగానికి అనుమతి లభించవచ్చని అధికార మీడియా ప్రకటించింది. మరోవైపు, ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ రూపొందిస్తున్న టీకాను ఉత్పత్తి చేసేందుకు ఆ్రస్టాజెనెకాతో రష్యాకు చెందిన ఆర్ ఫార్మా ఒప్పందం కుదుర్చుకుంది. ఆక్స్‌ఫర్డ్ టీకా పరిశోధనలను దొంగిలించేందుకు రష్యా హ్యాకర్లు ప్రయతి్నస్తున్నారని బ్రిటన్, కెనడా, అమెరికా ఆరోపిస్తుండగా ఈ ఒప్పందం కుదిరింది.
భారత్ లో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్
బ్రిటన్ లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ పై మూడో దశ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు పుణేలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ)కు అనుమతి ఇవ్వాలని కోవిడ్‌పై ఏర్పాటైన నిపుణుల కమిటీ జూలై 31న డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కు సిఫార్సు చేసింది. హ్యూమన్ ట్రయల్స్ అనుమతి కోరుతూ సీరమ్ సంస్థ నిపుణుల కమిటీకి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 17 ప్రాంతాల్లో 1,600 మందిపై ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ను పరీక్షిస్తామని సీరమ్ కంపెనీ తెలిపింది. ఇందులో విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కాలేజీ కూడా ఉంది.
పొగాకు నుంచి వ్యాక్సిన్
పొగాకు ఆకుల నుంచి సంగ్రహించిన ప్రొటీన్తో వ్యాక్సిన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు బ్రిటిష్ అమెరికన్ పొగాకు సంస్థ లూసీ స్ట్రైక్స్ సిగరెట్స్ తెలిపింది. ఆ కంపెనీకి చెందిన కెంటకీ బయో ప్రాసెసింగ్ తయారు చేస్తున్న వాక్సిన్ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: భారత్ లో ఆక్స్‌ఫర్డ్ కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్
ఎప్పుడు: జూలై 31
ఎవరు: కోవిడ్‌పై ఏర్పాటైన నిపుణుల కమిటీ
క్రెడాయ్ ఆవాస్ యాప్ ఆవిష్కరణ
రియల్టీ సంస్థలు–క్రెడాయ్, నరెడ్కో నివాసిత గృహ ప్రాజెక్టుల మార్కెటింగ్ కోసం రూపొందించిన డిజిటల్ వేదికలను కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పురి జూలై 31న ఆవిష్కరించారు. క్రెడాయ్ ఆవాస్ యాప్‌తోపాటు.. నరెడ్కో అభివృద్ధి చేసిన ‘హౌసింగ్ ఫర్ ఆల్ డాట్ కామ్’ పోర్టల్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి ప్రారంభించారు.
డిజిటలీకరణకు మోడల్‌గా బెంగళూరు
భారత్‌లో డిజిటలీకరణ ప్రక్రియకు బెంగళూరు సరైన నమూనాగా నిలవగలదని సీమెన్స్ ఏజీ సంస్థ జూలై 31న వెల్లడించింది. మొబిలిటీ, అవకాశాలు తదితర అంశాల ప్రాతిపదికన ఈ నగరాన్ని ఎంచుకున్నట్లు ’అట్లాస్ ఆఫ్ డిజిటలైజేషన్’ నివేదికలో వివరించింది. ప్రపంచవ్యాప్తంగా 9 నగరాలు రూపాంతరం చెందిన తీరును నివేదికలో విశ్లేషించింది. బెంగళూరు సహా బెర్లిన్, బ్యూనస్ ఎయిర్స్, లండన్, సింగపూర్, దుబాయ్, జొహానెస్‌బర్గ్, లాస్‌ఏంజెలిస్, తైపీ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి: క్రెడాయ్ ఆవాస్ యాప్‌తోపాటు, నరెడ్కో ‘హౌసింగ్ ఫర్ ఆల్ డాట్ కామ్’ పోర్టల్ ఆవిష్కరణ
ఎప్పుడు: జూలై 31
ఎవరు: కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పురి
ఎందుకు:నివాసిత గృహ ప్రాజెక్టుల మార్కెటింగ్ కోసం
2జీ రహిత భారత్: ముకేశ్ అంబానీ
ఎప్పుడో పాతికేళ్ల క్రితం ప్రారంభించిన 2జీ టెలిఫోనీ సర్వీసులను ఇక నిలిపివేయాల్సిన సమయం వచ్చిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) చైర్మన్ ముకేశ్ అంబానీ వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధానపరంగా తగు నిర్ణయం తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా తొలి మొబైల్ ఫోన్ కాల్ చేసి పాతికేళ్లయిన (సిల్వర్ జూబ్లీ) సందర్భంగా జూలై 31 నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అంబానీ ఈ వ్యాఖ్యలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో డేటా వినియోగానికి భారీ అవకాశాలు ఉన్నందున.. కనెక్టివిటీని మెరుగుపర్చడంపై టెలికం పరిశ్రమ దృష్టి పెట్టాలని టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాష్ సూచించారు.
ఫారెక్స్ నిల్వల రికార్డు...
ముంబై: భారత్ విదేశీ మారకపు నిల్వలు తాజాగా జూలై 24వ తేదీతో ముగిసిన వారంలో అంతకుముందు వారం (జూలై 17వ తేదీతో ముగిసిన)తో పోల్చి 5 బిలియన్ డాలర్లు పెరిగి మొత్తంగా 522.63 బిలియన్ డాలర్లకు ఎగశాయి. పసిడి నిల్వల విలువలు పెరగడం, దిగుమతులు అంతగా లేకపోవడంతో తగ్గిన విదేశీ మారక వినియోగం వంటి అంశాలు ఫారెక్స్ రికార్డులకు కారణం.
లిపులేఖ్ పాస్ లో చైనా మోహరింపులు
తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చల్లారక ముందే మరోవైపు నుంచి డ్రాగన్ దేశం చైనా దురాక్రమణకు సిద్ధమైంది. ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో లిపులేఖ్ పాస్‌లో సైనికుల్ని మోహరించింది. వెయ్యి మందికి పైగా చైనా సైనికులు లిపులేఖ్‌లో మోహరించినట్టుగా భారత్ మిలటరీ తెలిపింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నివారణకు లద్దాఖ్‌లో సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని జాతీయ భద్రతా సలహాదారు దోవల్, చైనా విదేశాంగ మంత్రి చాంగ్ యీ మధ్య జరిగిన చర్చల్లో ఒక అంగీకారానికి వచ్చినా చైనా మాట నిలబడలేదు. లిపులేఖ్ పాస్, ఉత్తర సిక్కింలో కొన్ని ప్రాంతాలు, అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా లిబరేషన్ ఆర్మీ సైన్యం తిష్ట వేసిందని భారత ఆర్మీ తెలిపింది.. చైనా ఆగడాలను దీటుగా ఎదుర్కోవడానికి భారత్ కూడా సన్నాహాలు చేస్తోంది. హిమాలయాల్లో గడ్డకట్టే చలిని తట్టుకోవడానికి భారతీయ సైన్యానికి దుస్తులు, టెంట్లను అమెరికా, రష్యా, యూరప్ నుంచి కొనుగోలు చేయనుంది.
ఏమిటీ లిపులేఖ్ పాస్?
హిందువులకి అత్యంత సాహసోపేతమైన యాత్ర మానస సరోవరానికి వెళ్లే మార్గంలో లిపులేఖ్ పాస్ ఉంది. 1992లో చైనాతో వాణిజ్య సంబంధాల కోసం ఈ లిపులేఖ్ మార్గంలో తొలిసారిగా ఒక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్నుంచి ప్రతీ ఏడాది జూన్ నుంచి అక్టోబర్ వరకు వాణిజ్య కార్యకలాపాల కోసం ఈ మార్గాన్ని తెరిచి ఉంచుతారు. ఆ సమయంలో సరిహద్దులకి రెండు వైపులా ఉండే ఆదివాసీలు వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తారు. ఈ ప్రాంతంలో హిమాలయాల వరకు భారత్ 80కి.మీ. రోడ్డుని నిర్మించడంపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో లిపులేఖ్ పాస్ తరచూ వార్తల్లోకెక్కుతోంది. ఇప్పుడు చైనా ఈ మార్గంపైనే కన్నేసింది.
ఎన్ఈపీలో చైనీస్ కు దక్కని చోటు
కేంద్ర కేబినెట్ జూలై 29న ఆమోదించిన నూతన జాతీయ విద్యావిధానం-2020 (ఎన్‌ఈపీ-2020)లో చైనా భాష చైనీస్ కు చోటు దక్కలేదు. ఎన్‌ఈపీ-2020 ప్రకారం... సెకండరీ స్కూలులో సాధారణంగా ప్రతీ విద్యార్థికి వారికి ఆసక్తి ఉన్న విదేశీ భాషను నేర్చుకునే అవకాశం ఉంటుంది. వేర్వేరు దేశాల్లో సంస్కృతులు, ఆయా దేశాల్లో సామాజిక స్థితిగతులపై జ్ఞానాన్ని పెంచుకోవడం కోసం ఈ విదేశీ భాషల కేటగిరీని ప్రవేశపెట్టారు. 2019 ఏడాది విడుదల చేసిన ఎన్ఈపీ ముసాయిదా ప్రతిలో ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, జపనీస్‌తో పాటుగా చైనీస్ భాష ఉంది. కానీ కేంద్రం తాజాగా ఆమోదించిన తుది ప్రతిలో చైనీస్‌ను తొలగించినట్టు జాతీయ మీడియాలో కథనాలొచ్చాయి. కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, రమేష్ పోఖ్రియాల్ విడుదల చేసిన ఎన్ఈపీలో రష్యన్, పోర్చుగీస్, థాయ్ భాషలకు చోటు దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: చైనా భాష చైనీస్ కు చోటు దక్కలేదు
ఎప్పుడు: ఆగస్టు 2
ఎక్కడ:నూతన జాతీయ విద్యావిధానం-2020 (ఎన్‌ఈపీ-2020)లో
నాలుగో ఎడిషన్ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆగస్టు 1న స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ నాలుగో ఎడిషన్ ను నిర్వహించింది. ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలకు విద్యార్థులు పరిష్కార మార్గాలు చూపడమే దీని ఉద్దేశం. 2020 ఏడాది 243 సమస్యల పరిష్కారానికి 10 వేల మందికిపైగా పోటీపడ్డారు. విజేతలకు నగదు బహుమతి అందజేశారు. హ్యాకథాన్ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.... ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్లు కాదు.. ఉద్యోగాలు ఇచ్చేవాళ్లను తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం నూతన విద్యా విధానం–2020ని ప్రకటించిందన్నారు. దేశంలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం సంకంల్పించిందన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ నాలుగో ఎడిషన్ నిర్వహణ
ఎప్పుడు: ఆగస్టు 1
ఎవరు: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ
ఎందుకు:ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలకు విద్యార్థులు పరిష్కార మార్గాలు చూపడమేలక్ష్యంగా
కరోనాపై నేషనల్ క్లినికల్ రిజిస్ట్రీ ఏర్పాటు
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ బారినపడి, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల సమగ్ర సమాచారంతో ఒక రిజిస్ట్రీని ఏర్పాటు చేయాలని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) నిర్ణయించింది. దీనిద్వారా వారికి అందిస్తున్న చికిత్సను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, మరింత చికిత్స అందించేందుకు వీలవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ, ఢిల్లీ ఎయిమ్స్ భాగస్వామ్యంతో నేషనల్ క్లినికల్ రిజిస్ట్రీని ఐసీఎంఆర్ ఏర్పాటు చేయనుంది. ఆసుపత్రుల్లోని బాధితుల సమాచారాన్ని 15 జాతీయ స్థాయి సంస్థలు సేకరించి, రిజిస్ట్రీకి అందజేస్తాయి.
కరోనా అందరికీ సోకదు: ఐఐపీహెచ్
కరోనా సోకిన వ్యక్తి ఉన్న కుటుంబంలో అందరికీ ఆ వైరస్ సోకుతుందని చెప్పలేమని తాజా అధ్యయనంలో తేలింది. కోవిడ్–19 నిర్ధారణ అయిన వ్యక్తి ఉన్న కుటుంబంలోని దాదాపు 80 శాతం నుంచి 90 శాతం సభ్యులకు ఆ వైరస్ సోకకపోవచ్చని గుజరాత్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సంస్థ నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. అందుకు కారణం వారిలో ఆ వైరస్ నిరోధక శక్తి పెరగడమే కావచ్చని స్పష్టమైంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: నేషనల్ క్లినికల్ రిజిస్ట్రీ ఏర్పాటు
ఎప్పుడు: ఆగస్టు 2
ఎవరు: భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్)
ఎందుకు: కరోనా బాధితుల చికిత్సను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, మరింత చికిత్స అందించేందుకు వీలవుతుందని
ప్రపంచంలోనే అతిఎత్తైన రైల్వే వంతెన
జమ్మూకశ్మీర్‌లో చీనాబ్ నదిపై నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిఎత్తైన రైల్వే వంతెన పనులు 2021 ఏడాదికి పూర్తికానున్నాయి. కశ్మీర్‌ను మిగతాదేశంతో కలిపే ఈ వారధిపై 2022 డిసెంబర్‌లో మొట్టమొదటి రైలు ప్రయాణం చేసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. ప్రత్యక్ష పర్యవేక్షణతో ఏడాదిగా పనులు వేగవంతం అయ్యాయన్నారు.
వంతెన విశేషాలు...
ఏమిటి: ప్రపంచంలోనే అతిఎత్తైన రైల్వే వంతెన
ఎప్పుడు: ఆగస్టు 2
ఎవరు: భారత ప్రభుత్వం
ఎక్కడ:చీనాబ్ నది, జమ్మూకశ్మీర్
వృద్ధిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భాగస్వామ్యం
దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం శరవేగంగా వృద్ధి చెందుతోందని, దీనివల్ల దేశీయ ఆర్థిక వృద్ధిరేటు 2035 నాటికి ఏటా 1.3 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని నీతి ఆయోగ్ అంచనా వేసింది. ఈ మేరకు ‘టూవర్డ్స్ రెస్పాన్సిబుల్ – ఏఐ ఫర్ ఆల్’ పేరిట నీతి ఆయోగ్ ఒక చర్చా పత్రాన్ని విడుదల చేసింది. కొన్ని కీలకమైన పరిశోధనలు చేయడానికి కేంద్రం ఫండింగ్ చేస్తుండటమే కాకుండా, విశ్వవిద్యాలయాల కరికులమ్‌లో కూడా ఏఐని ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ఏఐ వినియోగం వల్ల ఆటోమేషన్ పెరిగి చాలా రంగాల ఉద్యోగాలపై వ్యతిరేక ప్రభావం పడే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఎన్ఎండీసీ సారథిగా సుమిత్ దేవ్
మైనింగ్ రంగ దిగ్గజం ఎన్ఎండీసీ నూతన సీఎండీగా సుమిత్ దేవ్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న ఎన్.బైజేంద్ర కుమార్ పదవీ విరమణ చేశారు. నూతన బాధ్యతలు చేపట్టే ముందు వరకు సుమిత్ దేవ్ ఎన్ఎండీసీలో డైరెక్టర్‌గా (పర్సనల్) ఉ న్నారు. కంపెనీలో 2015లో కమర్షియల్ విభాగం జీఎంగా చేరారు. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీగా చేరి 25 ఏళ్లు వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: వృద్ధిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భాగస్వామ్యం
ఎప్పుడు: ఆగస్టు 2
ఎవరు: నీతి ఆయోగ్
ద్విభాషా విధానాన్నే కొనసాగిస్తాం: సీఎం పళనిస్వామి
జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ)–2020లో కేంద్రం ప్రతిపాదించిన త్రిభాషా సూత్రాన్ని తమిళనాడులోని ఏఐఏడీఎంకే ప్రభుత్వం తిరస్కరించింది. రాష్ట్రంలో ఎప్పటి నుంచో అమలవుతున్న ద్విభాషా విధానానికే కట్టుబడి ఉంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి ఆగస్టు 3న ప్రకటించారు. రాష్ట్రంలో 8 దశాబ్దాలుగా అమల్లో ఉన్న ద్విభాషా విధానం నుంచి వైదొలిగేది లేదని స్పష్టం చేశారు. 5వ తరగతి వరకు మాతృభాష లేదా ప్రాంతీయ భాషలో విద్యాబోధన జరపాలని ఎన్ఈపీ ప్రతిపాదించింది. అయితే, హిందీ, సంస్కృతాలను తమపై రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్షం డీఎంకే నేత ఎంకే స్టాలిన్ ఆరోపిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ద్విభాషా విధానానికే కట్టుబడి ఉంటాం
ఎప్పుడు: ఆగస్టు 3
ఎవరు: తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి
డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్స్ ముసాయిదా రూపకల్పన
2025 నాటికి రక్షణ ఉత్పత్తుల టర్నోవర్ రూ. 1.75 లక్షల కోట్లకు చేరాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థకే చోదక శక్తిగా మారే సామర్ధ్యం ఈ రంగానికి ఉందని భావిస్తోంది. దీనికి సంబంధించిన ‘డిఫెన్స్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ పాలసీ–2020’ ముసాయిదాను రక్షణ శాఖ రూపొందించింది. అందులో, రానున్న ఐదేళ్లలో అంతరిక్ష రక్షణ రంగ ఉత్పత్తులు, సేవల ఎగుమతుల లక్ష్యమే రూ. 35 వేల కోట్లని అందులో పేర్కొంది.
కుల్‌భూషణ్‌కు భారత్ లాయర్
మరణ శిక్ష ఎదుర్కొంటూ పాకిస్తాన్ జైల్లో మగ్గుతున్న భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్ తరఫున లాయర్‌ను నియమించేందుకు ఇస్లామాబాద్ హైకోర్టు భారత్‌కు వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు భారత్ అధికారులకు అవకాశమివ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. తదుపరి విచారణను 2020, సెప్టెంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది. జాధవ్ కేసులో పాక్ ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ పై విచారణ జరిపేందుకు ఇస్లామాబాద్ హైకోర్టు ఇద్దరు సభ్యులతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి: డిఫెన్స్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ పాలసీ–2020ముసాయిదా రూపకల్పన
ఎప్పుడు: ఆగస్టు 3
ఎవరు: కేంద్రరక్షణ శాఖ
దేశంలో ఉత్తమ వర్శిటీగా ఢిల్లీ విశ్వవిద్యాలయం
ఇండియా టుడే–మార్కెటింగ్ అండ్ డెవలప్‌మెంట్ రీసెర్చ్ అసోసియేట్స్(ఎండీఆర్‌ఏ) ప్రకటించిన ర్యాంకింగ్స్ ప్రకారం... దేశంలో అత్యుత్తమ యూనివర్సిటీల్లో ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్ యూ) మొదటిస్థానంలో నిలిచింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) ద్వితీయ స్థానం సంపాదించింది. కీర్తి, పాలన, అకడమిక్, రీసెర్చ్ ఎక్స్‌లెన్స్, ఇ్రన్ఫాస్ట్రక్చర్ అండ్ లివింగ్ ఎక్స్‌పీరియన్స్, పర్సనాలిటీ, నాయకత్వ అభివృద్ధి, కెరియర్ పురోగతి, ప్లేస్‌మెంట్ వంటి అంశాలలో సాధించిన ప్రగతి ఆధారంగా తాజా ర్యాంకింగ్స్‌ను ప్రకటించారు.
130 విశ్వవిద్యాలయాలకు...
ఇండియా టుడే ఉత్తమ విశ్వవిద్యాలయాల సర్వే కోసం దేశంలోని 995 విశ్వవిద్యాలయాల జాబితాను రూపొందించింది. దేశంలోని 30 నగరాల్లో సర్వేను నిర్వహించారు. చివరకు 130 విశ్వవిద్యాలయాలకు ర్యాంక్‌లను కేటాయించారు. పరిశోధకులు, గణాంక వేత్తలు, విశ్లేషకులు, సర్వే బృందాలతో కూడిన పెద్ద బృందం ఈ ప్రాజెక్టుపై 2019 డిసెంబర్ నుంచి 2020 జూలై వరకు పనిచేసి ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఉత్తమ వర్శిటీగా ఢిల్లీ విశ్వవిద్యాలయం
ఎప్పుడు: ఆగస్టు 2
ఎవరు: ఇండియా టుడే–మార్కెటింగ్ అండ్ డెవలప్‌మెంట్ రీసెర్చ్ అసోసియేట్స్(ఎండీఆర్‌ఏ)
ఎక్కడ:దేశంలో
దేశంలోనే తొలి కార్గో ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం
సాధారణ ప్రయాణికుల రైలు తరహాలో నిర్ధారిత వేళల ప్రకారం నడిచే (టైంటేబుల్డ్) సరుకు రవాణా ఎక్స్‌ప్రెస్‌ను భారతీయ రైల్వే తొలిసారి పట్టాలెక్కించింది. హైదరాబాద్ కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వే నిర్వహించే ఈ రైలు ఆగస్టు 5న సనత్‌నగర్(హైదరాబాద్) స్టేషన్ నుంచి బయలుదేరింది. ప్రతి బుధవారం సనత్‌నగర్ స్టేషన్ లో బయలుదేరే ఈ సరుకు రవాణా రైలు శుక్రవారం ఉదయం ఢిల్లీలోని ఆదర్శ్‌నగర్ స్టేషన్ కు చేరుకుంటుంది. గంటకు 50 కి.మీ. వేగంతో ప్రయాణించే ఈ సరుకు రవాణా రైలును ఆరు నెలల పాటు ప్రయోగాత్మకంగా నడిపించనున్నారు.
నిర్ధారిత వేళల్లో...
సాధారణంగా ఒక రేక్ (రైలు బోగీలన్నీ కలిపి)కు సరిపడా సరుకు ఉంటేనే సరుకు రవాణా రైలును నడుపుతారు. ముందస్తు బుకింగ్స్ ఆధారంగా ఈ రైళ్లు నడుస్తుంటాయి. దానికి భిన్నంగా సరుకు ఉన్నా లేకున్నా, ప్రయాణికుల రైళ్ల తరహాలో నిర్ధారిత వేళల్లో ఈ రైలు బయలుదేరుతుంది. కనిష్టంగా 60 టన్నుల సరుకైనా బుక్ చేసుకునే సదుపాయం రైల్వే కల్పిచింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: దేశంలోనే తొలి కార్గో ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం
ఎప్పుడు: ఆగస్టు 5
ఎవరు: దక్షిణ మధ్య రైల్వే
ఎక్కడ: సనత్ నగర్, హైదరాబాద్
రామ మందిర నిర్మాణానికి భూమిపూజ
అయోధ్యలో శ్రీరామచంద్రుడు జన్మించాడని భక్తులు విశ్వసించే ప్రదేశంలో భవ్యమైన రామ మందిరం ‘శ్రీ రామ జన్మభూమి మందిర్’ నిర్మాణానికి ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. సుముహూర్త సమయమైన మధ్యాహ్నం 12.44 గంటలకు శంకుస్థాపన జరిపారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్, శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చీఫ్ సంత్ నృత్య గోపాల్ దాస్ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అయోధ్యలో ఉత్సవ వాతావరణం నెలకొంది.
తొలి ప్రధాని మోదీనే...
భూమి పూజ సందర్భంగా ‘సియా(సీతా)వర్ రామచంద్రజీ కీ జై’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ... రామ్‌లల్లా ఆలయం భారతదేశ ఘన సంస్కృతికి ప్రతీకగా, మానవాళికిస్ఫూర్తిప్రదాయినిగానిలుస్తుందన్నారు. రాళ్లపై శ్రీ రామ అని రాసి ‘రామసేతు’ నిర్మించిన తీరుగానే.. దేశంలోని మూల మూలల నుంచి రామ మందిర నిర్మాణం కోసం ఇటుకలు వచ్చాయని వ్యాఖ్యానించారు. భూమి పూజ కంటే ముందుగా హనుమాన్ గఢీలోని ఆంజనేయుడి దేవాలయాన్ని సందర్శించారు. అయోధ్యలో రామ జన్మభూమిని, హనుమాన్ గఢీ ఆలయాన్ని సందర్శించిన తొలి ప్రధాని నరేంద్ర మోదీయేనని యూపీ ప్రభుత్వం తెలిపింది. భూమి పూజను పురస్కరించుకుని ప్రత్యేక స్మారక పోస్టల్ స్టాంప్‌ను మోదీ ఆవిష్కరించారు.
నాగర శైలిలో..
ఐదు గుమ్మటాలు.. 161 అడుగుల ఎత్తయిన గోపురంతో అలరారనున్న రామ మందిరం ‘నాగర’శైలిలో నిర్మాణం కానుంది. మూడు అంతస్తుల ఈ మందిర నిర్మాణానికి మూడున్నరేళ్ల సమయం పడుతుందని అంచనా. 1990లో సిద్ధమైన మందిర డిజైన్ లో తాజాగా పలు మార్పులు చేశారు. మందిర నిర్మాణానికి ఆర్కిటెక్ట్ అశీష్ సోంపుర డిజైన్ ఇచ్చారు. దేవాలయ నిర్మాణ శైలుల్లో ‘నాగర‘అనేది ఒకటి కాగా, ద్రావిడ, బాసర్ అనేవి మిగతావి. రూ.300 కోట్ల అంచనా వ్యయంతో మందిరాన్ని నిర్మిస్తున్నారు
1528 నుంచి 2019 తీర్పు వరకు...
కొన్ని దశాబ్దాలుగా అయోధ్య భూ వివాదం దేశంలో రాజకీయ, చారిత్రక, సామాజిక మతపరమైన చర్చగా కొనసాగుతూ వచ్చింది. హిందూ, ముస్లింల మధ్య దశాబ్దాల వివాదానికి కారణం హిందువుల ఆరాధ్య దైవం రాముడి జన్మభూమిగా భావించే ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని భూమికి సంబంధించింది. అయోధ్యలో బాబ్రీ మసీదు ఉన్న స్థలంలో ఒకప్పుడు హిందూ దేవాలయం ఉండేదని, ఆ తరువాత దాన్ని పడగొట్టి బాబ్రీ మసీదు నిర్మాణం జరిగినట్టు కొందరి విశ్వాసం. అయితే మొఘల్ చక్రవర్తి బాబర్ ఆదేశాల మేరకు 1528వ సంవత్సరంలో మీర్ బఖీ ఇక్కడ మసీదు నిర్మించారని, అందువల్ల ఆ స్థలం తమదేననిముస్లింలు వాదిస్తూ వచ్చారు.
యాజమాన్య హక్కుల కోసం
ఈ దేవాలయం కూల్చి వేత, దాని స్థానంలో మసీదు నిర్మాణం ఈ రెండు వర్గాల మధ్య వివాదానికి తెరతీసింది. 1949లో హిందువులు రాముడి విగ్రహాన్ని తీసుకొచ్చి మసీదులో పెట్టడాన్ని కొందరు ముస్లింలుచూసినట్లు కొందరి వాదన. అప్పటి నుంచి ఈ స్థలంపై యాజమాన్యపు హక్కులు మావంటే మావని ఇరు వర్గాలు వాదిస్తూవచ్చాయి. ఫలితంగా ప్రభుత్వం ఈ స్థలాన్ని పూర్తిగా మూసివేసింది. ఈ స్థలాన్ని అప్పగించాలని కోరుతూ 1959, డిసెంబర్ 17న నిర్మోహిఅఖారాకోర్టుకెళ్ళింది. ఇదే స్థలంపై యాజమాన్య హక్కుల కోసం డిసెంబర్ 18, 1961న సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్‌కూడా కోర్టుని ఆశ్రయించింది. ఈ వివాదం ఇరువర్గాల మధ్య కొన్ని దశాబ్దాల పాటు ఘర్షణాత్మక పరిస్థితులకు దారితీసింది.
బాబ్రీ మసీదు కూల్చివేత
తరువాత డిసెంబర్ 6, 1992న హిందూ కరసేవకులు బాబ్రీ మసీదుని కూల్చి వేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా మతకలహాలకు దారితీసింది. 2,000 మందికి పైగా చనిపోయారు. ఆ తరువాతి కాలంలో ఈ అంశం పై ఇరువర్గాలు దేశంలోని పలుకోర్టులను ఆశ్రయించాయి. ఇదిలా ఉండగా, అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమి హిందు వులు, ముస్లింలు, నిర్మోహిఅఖారాల మధ్య విభజన చేయాలని అలహాబాద్ హైకోర్టు సెప్టెంబర్ 30, 2010న ఆదేశాలిచ్చింది. ఈ తీర్పుపై పిటిషనర్లు సుప్రీంకోర్టుని ఆశ్రయించగా, అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. సుప్రీంకోర్టు ఈ కేసుపై 2016లో తిరిగి విచారణ ప్రారంభించింది. ఈ వివాదం అత్యంత సున్నితమైందని, దీన్ని కోర్టు వెలుపల తేల్చు కోవాలని సుప్రీంకోర్టు 2017లో చెప్పింది. అయితే, అది కార్యరూపం దాల్చలేదు.
సుప్రీంకోర్టు తీర్పు..
సుప్రీంకోర్టు 2018లో ఈ కేసు విచారణకు ఐదు గురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఈ ధర్మాసనం ఆగస్టు 6, 2019 నుంచి అక్టోబర్ 16 వరకు రోజువారీ వాదనలు చేపట్టింది. తుది తీర్పుని నవంబర్ 9న వెలువరించింది. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలంపై యాజమాన్య హక్కులు రామజన్మభూమి ట్రస్ట్‌కి చెందుతాయని ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది. అలాగే అయోధ్యలోనే ప్రత్యామ్నాయంగా ముస్లింలకు మసీదు నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని ఆదేశించింది. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి మూడు నెలల్లోపు ట్రస్ట్ ఏర్పాటు చేసి, నిర్మాణానికి చర్యలు చేపట్టాలని తేల్చిచెప్పింది.

- ప్రపంచమంతా కరోనాతో పోరాడుతున్న సమయంలో మన పొరుగుదేశం విస్తరణవాద దుస్సాహసానికి పాల్పడింది. భారతీయ సైనికులు అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించి, ప్రాణాలు పణంగా పెట్టి దేశ భూభాగాన్ని కాపాడుకున్నారు.
- ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చెప్పిన స్వావలంబన విధానం ప్రపంచాన్ని కలుపుకుని పోయేదే.
- లగించే ప్రయత్నం చేశారు.
- కరోనా వైరస్‌పై ముందుండి అలుపెరగని పోరాటం చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకి దేశమంతా రుణపడి ఉంది.
- రామ మందిర వివాదాన్ని శాంతియుతంగా న్యాయవ్యవస్థ పరిష్కరించింది. సుప్రీంకోర్టు తీర్పును అన్ని వర్గాలు ఆమోదించి.. భారతీయ శాంతి, అహింస, ప్రేమ, సౌభ్రాతృత్వ భావనలను ప్రపంచానికి చూపాయి.
- 2020 ఏడాదిలో కరోనా అనే కంటికి కనిపించని సూక్ష్మజీవి మానవాళికి గొప్ప పాఠాలు నేర్పించింది.
ప్రతిష్టాత్మక జంప్ స్టార్ట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) https://indiadataportal.com/jri పోర్టల్‌ను ఆగస్టు 13న ప్రారంభించింది. నూతనంగా కంపెనీల నమోదు, ఎరువుల అమ్మకాలు, వ్యవసాయ ఉత్పత్తుల క్రయ విక్రయాలు, వాహనాల నమోదు, డిజిటల్ లావాదేవీలు, చెల్లింపులు, ఎంజీఎన్ఆర్‌ఈజీఏ కింద కార్మికుల డిమాండ్, జీఎస్టీ వసూళ్లు, ఎఫ్‌డీఐ, ఎఫ్‌పీఐ, రైల్వే ఫ్రైట్ వంటి అంశాల సమాచారం పొందుపరుస్తారు. ఈ వివరాల ఆధారంగా జర్నలిస్టులు, పౌరులు, విధానకర్తలు భారత ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ తీరుతెన్నులను రియల్ టైంలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో తెలుసుకోవడానికి పోర్టల్ తోడ్పడుతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: రికవరీ వివరాలకు ప్రత్యేక పోర్టల్ ప్రారంభం
ఎప్పుడు: ఆగస్టు 13
ఎవరు: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)
ఎందుకు:ప్రతిష్టాత్మక జంప్ స్టార్ట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా
నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ప్రారంభం
దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోట వేదికగా జాతినుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఢిల్లీలో ఎర్రకోటలో ఆగస్టు 15న జరిగిన దేశ 74వ స్వాతంత్ర దిన వేడుకలకు సంప్రదాయబద్ధంగా కాషాయం, తెలుపు రంగుల్లో ఉన్న కుర్తా, పైజామా తలపాగా ధరించి వచ్చిన ప్రధాని గంటా 26 నిమిషాల సేపు ప్రసంగించారు. కేంద్ర పథకాలైన ఆత్మ నిర్భర్ భారత్, వోకల్ ఫర్ లోకల్, మేకిన్ ఇండియా టు మేక్ ఫర్ వరల్డ్, నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ లు, దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆర్థిక రంగ పురోగతికి చేపట్టిన సంస్కరణల గురించి ప్రధాని వివరించారు. కరోనా వ్యాక్సిన్ నుంచి మహిళా సాధికారత వరకు ప్రతీ అంశాన్ని స్పృశిస్తూ ఆయన ప్రసంగం సాగింది.
నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్
ఎర్రకోట సాక్షిగా ఆగస్టు 15న ప్రధాని మోదీ ఆరోగ్య రంగాన్ని డిజిటలైజ్ చేసే పథకానికి శ్రీకారం చుట్టారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు కింద ప్రతీ పౌరుడికి హెల్త్ ఐడీ నంబర్ ఇస్తారు. ఈ హెల్త్ ఐడీ డిజిటల్ రూపంలోనే ఉంటుంది. అందులో వారి ఆరోగ్య సమాచారం, వాడే మందులు, మెడికల్ రిపోర్ట్స్ నిక్షిప్తం చేస్తారు. ఈ ఐడీలన్నింటినీ దేశ వ్యాప్తంగానున్న ఆరోగ్య కేంద్రాలు, రిజిస్టర్డ్ వైద్యులతో అనుసంధానం చేస్తారు. దీనివల్ల దేశంలో ఎవరైనా అనారోగ్యంతో వైద్యుల్ని సంప్రదిస్తే ఒక్క క్లిక్‌తో వారి సమస్యలన్నీ తెలుసుకోవచ్చు.
మేక్ ఫర్ వరల్డ్
మోదీ తన ప్రసంగంలో ఆత్మనిర్భర్ భారత్‌పై అత్యధికంగా దృష్టి పెట్టారు. ఆత్మ నిర్భర్ భారత్ అంటే దిగుమతులు తగ్గించుకోవడమే కాదు, మన సామర్థ్యం, సృజనాత్మకత, నైపుణ్యం ప్రపంచం గుర్తించేలా చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ఇక మేకిన్ ఇండియా కాదు, మేక్ ఫర్ వరల్డ్ దిశగా భారత్ ప్రయాణం సాగాలని అన్నారు. ప్రపంచం ఆదరించేలా భారత్‌లో నాణ్యమైన వస్తువుల్ని ఉత్పత్తి చేయాలని మోదీ అన్నారు.
అన్ని గ్రామాలకు ఫైబర్ నెట్
రాబోయే మూడేళ్ల కాలంలో దేశంలో ఆరు లక్షలకు పైగా గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించే ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ ప్రాజెక్టుని ప్రధాని ప్రకటించారు. గత అయిదేళ్లలో 1.5 లక్షల గ్రామ పంచాయితీలకు ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించామని మరో మూడేళ్లలో ప్రతీ గ్రామానికి నెట్ సదుపాయం ఉంటుందని అన్నారు. ఆన్లైన్ కార్యకలాపాలు అధికమైన నేపథ్యంలో సైబర్ భద్రతపై త్వరలోనే కొత్త విధానాన్ని తీసుకొస్తామన్నారు.
ప్రధాని ప్రసంగం-ముఖ్యాంశాలు
- రక్షణ రంగంలో స్వావలంబన దిశగా గట్టి చర్యలు చేపడుతున్నాం. వందకు పైగా ఆయుధాలు, రక్షణ పరికరాల దిగుమతిని నిషేధించాం.
- భారత్‌లో మూడు వ్యాక్సిన్ల ప్రయోగాలు వివిధ దశల్లో ఉన్నాయి. భారత్ బయోటెక్, జైడస్ క్యాడిలా రూపొందించిన వ్యాక్సిన్లు ఒకటి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రస్తుతం నడుస్తున్నాయి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు అనుమతులు లభించాయి.
- నిరుపేద మహిళలకు 6 వేల జన ఔషధి కేంద్రాల ద్వారా రూపాయికే శానిటరీ ప్యాడ్‌లు అందిస్తున్నాం. దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది మహిళలకు ఈ ప్యాడ్‌లు అందుతున్నాయి.
- ఎల్‌ఓసీ (నియంత్రణ రేఖ) నుంచి ఎల్‌ఏసీ (వాస్తవాధీన రేఖ) వరకు దేశ సార్వభౌమత్వాన్ని సవాల్ చేసిన వారికి సాయుధ బలగాలు గట్టిగా బుద్ధి చెప్పాయి. లద్దాఖ్‌లో మన సైనికుల శౌర్య పరాక్రమాలు యావత్ ప్రపంచం చూసింది.
- కరోనా సంక్షోభ పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్న ఫ్రంట్‌లైన్ వారియర్లను ప్రధాని మోదీ అభినందించారు.
గణనీయంగా పట్టణ జనాభా పెరుగుదల
దేశంలో పట్టణ జనాభా 2021–36 మధ్య కాలంలో రికార్డు స్థాయిలో పెరగనుందని ‘నేషనల్ కమిషన్ ఆన్ పాప్యులేషన్’ తన తాజా నివేదికలో వెల్లడించింది. కేంద్ర ఆరోగ్య –కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఈ సంస్థ దేశ జనాభాపై నిర్వహించిన అధ్యయనంలో.. 2011–21తో పోలిస్తే 2021–36లో దేశ జనాభా పెరుగుదల రేటు బాగా తగ్గనుందని పేర్కొంది. అయితే, మొత్తం జనాభాలో మాత్రం భారత్ చైనాను అధిగమించి మొదటి స్థానానికి చేరుకోనుందని వివరించింది.
నివేదికలోని ప్రధాన అంశాలు
- 2011తో పోలిస్తే 2036 నాటికి దేశంలో పట్టణ జనాభా 57 శాతం పెరగనుంది.
- 2011లో 37.70 కోట్లుగా ఉన్న పట్టణ జనాభా 2036 నాటికి 59.40 కోట్లకు చేరుకోనుంది. అంటే, 31 నుంచి 39 శాతానికి చేరుకుంటుంది.
- 2011లో 69 శాతంగా ఉన్న గ్రామీణ జనాభా 2036 నాటికి 61 శాతానికి తగ్గుతుంది.
- ఢిల్లీ జనాభాలో 98 శాతం పట్టణ జనాభా ఉండగా 2036 నాటికి 100 శాతానికి చేరుకుంటుంది. - తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్‌లలో 50 శాతానికి పైగా జనాభా పట్టణాల్లోనే ఉంటుంది. ఏపీలో పట్టణ జనాభా 42 శాతానికి చేరుకుంటుంది.
- ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు జనాభా పెరుగుదలలో మొదటి రెండు స్థానాల్లో ఉండనున్నాయి. పెరిగే జనాభాలో 36 శాతం ఆ రాష్ట్రాల్లోనే ఉండనుంది.
- 2011లో ప్రతి 1,000 మంది పురుషులకు 943 మందిగా ఉన్న స్త్రీలు , 2036 నాటికి 952 మందికి చేరుకోనున్నారు. కాగా ఏపీ, తమిళనాడు, కేరళలో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ మంది ఉంటారు.
- దేశ జనాభా 2021 నాటికి 136 కోట్లకు, 2031 నాటికి 147 కోట్లకు, 2036 నాటికి 152 కోట్లకు చేరుతుంది.
- 2011–21లో దేశ జనాభా పెరుగుదల రేటు 12.5 శాతం ఉంటుంది. దేశానికి స్వాతంత్య్రం
- వచ్చిన తరువాత ఇదే అతి తక్కువ జనాభా పెరుగుదల రేటు.
- 2021–31లో దేశ జనాభా పెరుగుదల రేటు 8.4 శాతానికి తగ్గుతుంది.
ఏమిటి: 2021–36 మధ్య కాలంలో గణనీయంగా పట్టణ జనాభా పెరుగుదల
ఎప్పుడు: ఆగస్టు 16
ఎవరు: నేషనల్ కమిషన్ ఆన్ పాప్యులేషన్
ఎక్కడ:దేశంలో
డేటా అండ్ ఏఐ నివేదిక ఆవిష్కరణ
నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కాం) రూపొందించిన ‘అన్లాక్ వాల్యూ ఫ్రం డేటా అండ్ ఏఐ : ద ఇండియన్ ఆపర్చునిటీ’ నివేదిక విడుదలైంది. ఆగస్టు 18న జరిగిన వర్చువల్ కాన్ఫరెన్స్ లో కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఈ నివేదికను ఆవిష్కరించారు. కోవిడ్ సంక్షోభం నుంచి భారత్ పటిష్టంగా ఎదిగేందుకు ఈ నివేదిక దోహదం చేస్తుందని నాస్కాం ప్రెసిడెంట్ దేబ్జానీ ఘోష్ తెలిపారు.
ఎక్స్‌పీరియన్స్ ఏఐ సమ్మిట్..
తెలంగాణ ఏఐ మిషన్ భాగస్వామ్యంతో 2020, సెప్టెంబర్ 1–4 తేదీల్లో ఎక్స్‌పీరియన్స్ ఏఐ సమ్మిట్‌ను నిర్వహించనున్నట్లు నాస్కాం వెల్లడించింది. సమ్మిట్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగ నిపుణులు, కంపెనీలు, సంస్థలు ఒకే వేదికపైకి రానున్నాయి. అలాగే భారత్ పునరుద్ధరణకు, వృద్ధికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా దోహదం చేస్తుందో ఓ కార్యాచరణకు రూపకల్పన చేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: అన్లాక్ వాల్యూ ఫ్రం డేటా అండ్ ఏఐ : ద ఇండియన్ ఆపర్చునిటీనివేదిక ఆవిష్కరణ
ఎప్పుడు: ఆగస్టు 18
ఎవరు: కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్
పీఎం కేర్స్ నిధుల మళ్లింపు అనవసరం
కోవిడ్–19 విపత్తును ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్ నిధులను జాతీయ విపత్తు నిధి (ఎన్డీఆర్‌ఎఫ్)కి బదిలీ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ఒక పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని బెంచ్ ఆగస్టు 18న ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. పీఎం కేర్స్ ఫండ్, ఎన్డీఆర్‌ఎఫ్‌లు పూర్తిగా భిన్నమైనవని, వేర్వేరు ఉద్దేశాలతో ఏర్పాటైనవని పేర్కొంది. కోవిడ్ విపత్తును ఎదుర్కొనడానికి ఎన్డీఆర్‌ఎఫ్ నిధులను కేంద్రం వాడుకోవడంపై ఎలాంటి ఆంక్షలు లేవని తెలిపింది. ఎన్డీఆర్‌ఎఫ్‌కు స్వచ్ఛందంగా ఎప్పుడైనా విరాళాలు ఇవ్వవచ్చని పేర్కొంది.
జూమ్‌కార్‌తో ఎంజీ మోటార్స్ ఒప్పందం
ప్రముఖ స్పోర్ట్స్ కార్ల బ్రాండ్ ఎంజీ మోటార్స్ దేశంలోని అతిపెద్ద మొబిలిటీ ఫ్లాట్‌ఫామ్ జూమ్‌కార్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ద్వారా 12, 24, 36 నెలల సబ్ర్‌స్కిప్షన్లకు ఎంజీ మోటార్స్ కార్లను అద్దెకు తీసుకోవచ్చని ఎంజీ మోటార్స్ కంపెనీ తెలిపింది. ఈ విధానంతో కొనుగోలుదారులు ఎంజీ కార్లను కొనుగోలు చేయడానికి ముందే కారులోని టెక్నాలజీ, ఫీచర్లు, డ్రైవింగ్ అనుభవం వంటివి తెలుస్తాయని ఎంజీ మోటార్స్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ గౌరవ్ గుప్తా తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: పీఎం కేర్స్ ఫండ్ నిధులను జాతీయ విపత్తు నిధి (ఎన్డీఆర్‌ఎఫ్)కి బదిలీ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చేందుకు తిరస్కరణ
ఎప్పుడు: ఆగస్టు 17
ఎవరు: సుప్రీంకోర్టు
ఎందుకు:పీఎం కేర్స్ ఫండ్, ఎన్డీఆర్‌ఎఫ్‌లు పూర్తిగా భిన్నమైనవని, వేర్వేరు ఉద్దేశాలతో ఏర్పాటైనవని
భారత్‌లో ఉపాధిపై ఐఎల్‌ఓ–ఏడీబీ సర్వే
భారత్‌లో ఉపాధిపై కరోనా ప్రభావం అనే అంశంపై ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్(ఐఎల్‌ఓ), ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఏడీబీ) సంయుక్త సర్వే నిర్వహించింది. దేశంలో కరోనా ప్రభావంతో 41లక్షల మంది యువత ఉద్యోగాలను కోల్పోయినట్లు ఈ సర్వే తెలిపింది. మహమ్మారి వ్యాప్తితో 2020 ఏడాది చివరికల్లా ఆసియా, పసిఫిక్ దేశాల్లోని కోటి నుంచి కోటిన్నర మంది యువత ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉందని సర్వే హెచ్చరించింది. 25ఏళ్ల పైబడిన వారి కంటే 15–24ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారిపై దీర్ఘకాలంలో ఆర్థిక, సామాజిక భద్రతపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపవచ్చని సర్వే అంచనా వేసింది.
మెడ్‌లైఫ్‌లో ఫార్మ్‌ఈజీ విలీనం
ఆన్లైన్ ఫార్మసీ సంస్థ ఫార్మ్‌ఈజీ మెడ్‌లైఫ్‌లో విలీనం కానుంది. ఇందుకు సంబంధించి ఇరు సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. మెడ్‌లైఫ్‌లో విలీనానికి ఆమోదం కోరుతూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)కి ఫార్మ్‌ఈజీ దరఖాస్తు చేసుకుంది. ఒప్పందం ప్రకారం... ఫార్మ్‌ఈజీ మాతృసంస్థ ఏపీఐ హోల్డింగ్స్‌లో మెడ్‌లైఫ్, దాని ప్రమోటర్లకు 19.59 శాతం వాటా లభిస్తుంది. ఈ వాటా విలువ దాదాపు 230 మిలియన్ డాలర్లు. మిగతా వాటా ఫార్మ్‌ఈజీకి ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: కరోనా ప్రభావంతో 41లక్షల మంది యువత ఉద్యోగాలు కోల్పోయారు
ఎప్పుడు: ఆగస్టు 18
ఎవరు: ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్(ఐఎల్‌ఓ), ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఏడీబీ) సంయుక్త సర్వే
విమానాశ్రయాల లీజుకు కేబినెట్ ఆమోదం
మరో మూడు విమానాశ్రయాలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో(పీపీపీ) లీజుకు ఇచ్చేందుకు ఆగస్టు 19న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. ఈ మూడు.. జైపూర్, తిరువనంతపురం, గువాహటి విమానాశ్రయాలు కాగా, వీటి నిర్వహణ హక్కులను అదానీ ఎంటర్‌ప్రైజెస్ బిడ్ రూపంలో 2019 ఏడాది గెలుచుకుంది. ఈ మూడింటితోపాటు లక్నో, అహ్మదాబాద్, మంగళూరు విమానాశ్రయాలను కూడా 2019 ఫిబ్రవరిలో అదానీ దక్కించుకుంది. ఈ ఆరింటిలో అహ్మదాబాద్, మంగళూరు, లక్నో విమానాశ్రయాలను అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు లీజుకు ఇచ్చేందుకు అనుకూలంగా 2019 జూలైలోనే కేంద్రం ఆమోదం తెలిపింది. మిగిలిన మూడు విమానాశ్రయాలనూ పీపీపీ విధానంలో లీజునకు తాజాగా ఆమోదముద్ర వేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: జైపూర్, తిరువనంతపురం, గువాహటి విమానాశ్రయాల లీజుకు ఆమోదం
ఎప్పుడు: ఆగస్టు 19
ఎవరు: కేంద్ర కేబినెట్
ఉద్యోగార్థుల కోసం గూగుల్ కొర్మో జాబ్స్
ఉద్యోగార్థుల కోసం తమ ‘కొర్మో జాబ్స్’ యాప్‌ను భారత్‌లో ప్రవేశపెడుతున్నట్లు టెక్ దిగ్గజం గూగుల్ ఆగస్టు 19న వెల్లడించింది. రిటైల్, హాస్పిటాలిటీ తదితర రంగాల వ్యాపార సంస్థల్లో ఉద్యోగాల కోసం తెలుసుకునేందుకు, దరఖాస్తు చేసుకునేందుకు గూగుల్ 2019 ఏడాది ‘జాబ్స్’ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీన్ని ఇకపై ‘కొర్మో జాబ్స్’ కింద రీబ్రాండ్ చేయనున్నట్లు గూగుల్ తెలిపింది. వాస్తవానికి జాబ్స్ ఫీచర్‌ను 2018లో బంగ్లాదేశ్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షించామని, ఆ తర్వాత కొర్మొ జాబ్స్ పేరిట ఇండొనేసియాలో ప్రవేశపెట్టామని పేర్కొంది.
బిగాస్‌తో మనీట్యాప్ ఒప్పందం
గ్లోబల్ ఎలక్ట్రికల్ తయారీ కంపెనీ ఆర్‌ఆర్ గ్లోబల్‌కు చెందిన ఆటోమోబైల్ బ్రాండ్ బిగాస్ దేశంలోని తొలి యాప్ ఆధారిత క్రెడిట్ లైన్ స్టార్టప్ మనీటాప్‌తో ఒప్పందం చేసుకుంది. దీంతో బిగాస్ అన్ని రకాల ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోళ్లకు రుణాలను అందిస్తామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. నెలవారీ వాయిదా (ఈఎంఐ) మీద సున్నా శాతం వడ్టీ రేట్లకు ఈ లోన్లను అందిస్తున్నామని పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: అందుబాటులోకి కొర్మో జాబ్స్ యాప్
ఎప్పుడు: ఆగస్టు 19
ఎవరు: గూగుల్
ఎక్కడ: భారత్
ఎందుకు :ఉద్యోగార్థుల కోసం
చెరకు సేకరణ ధర రూ.10 పెంపు
చక్కెర మిల్లులు రైతులకు చెల్లించే చెరకు సేకరణ ధరను క్వింటాలుకు పది రూపాయలు పెంచాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. 2020–21 (అక్టోబర్– సెప్టెంబర్) మార్కెటింగ్ సంవత్సరానికి చెరకు సేకరణ ధరను పది రూపాయలు పెంచి క్వింటాలుకు రూ.285గా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయించిందనికేంద్ర సమాచార శాఖ మంత్రి జవదేకర్ ఆగస్టు 19న తెలిపారు.
డిస్కంలకు వెసులుబాటు
గత ఏడాది ఆదాయంలో 25 శాతానికి మించి డిస్కంలకు అప్పులు ఇవ్వకూడదనే నిబంధనను కేంద్రం సవరించింది. ఉదయ్ కింద 90 వేల కోట్ల రూపాయలను డిస్కంలకు రుణాలుగా అందించాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. కరోనా లాక్‌డౌన్ మూలంగా వినియోగం తగ్గి, మరోవైపు బిల్లులు వసూలు కాక డిస్కంలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. అందువల్ల వర్కింగ్ క్యాపిటల్ కింద ఆదాయంలో 25 శాతానికి మించి రుణాలు ఇవ్వకూడదనే నిబంధనను ఈ ఒక్కసారికి సడలిస్తున్నాం అని జవదేకర్ తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: చక్కెర మిల్లులు రైతులకు చెల్లించే చెరకు సేకరణ ధరను క్వింటాలుకు పది రూపాయలు పెంపు
ఎప్పుడు: ఆగస్టు 19
ఎవరు: కేంద్ర ప్రభుత్వం
జాతీయ నియామక సంస్థ ఏర్పాటుకు ఆమోదం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలో సంస్కరణలకు మార్గం సుగమం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆగస్టు 19న సమావేశమైన కేంద్ర కేబినెట్ జాతీయ నియామక సంస్థ (ఎన్ఆర్‌ఏ) ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ (ఎన్ఆర్‌ఏ) గ్రూప్ బి, గ్రూప్ సి (నాన్–టెక్నికల్) పోస్టులకు అభ్యర్థులను పరీక్షించడానికి, షార్ట్‌లిస్ట్ చేయడానికి కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీఈటీ) నిర్వహిస్తుంది. ఎన్ఆర్‌ఏలో రైల్వే మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, ఐబీపీఎస్‌కు చెందిన ప్రతినిధులు ఉంటారు.
రూ.1,517 కోట్ల వ్యయం...
ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, ఐబీపీఎస్ సంస్థలు ఇక వేర్వేరుగా నియామక పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేకుండా.. ఎన్ఆర్‌ఏ ప్రిలిమినరీ స్థాయి పరీక్షగా సీఈటీ నిర్వహించి స్కోరు కేటాయిస్తుంది. కేంద్రం ఎన్ఆర్‌ఏ కోసం రూ.1,517.57 కోట్లు ఖర్చు చేయనుంది. 117 ఆకాంక్ష జిల్లాల్లో పరీక్షాకేంద్రాలు, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు నిధులను వెచ్చిస్తారు.
ఇవీ ప్రయోజనాలు
ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలనుకునే అభ్యర్థులు వివిధ పోస్టుల కోసం బహుళ నియామక సంస్థలు నిర్వహించే విభిన్న పరీక్షలకు హాజరు కావాల్సి వస్తోంది. బహుళ నియామక సంస్థలకు ఫీజులు చెల్లించాల్సి రావడం, వివిధ పరీక్షల్లో హాజరు కావడానికి చాలా దూరం ప్రయాణించాల్సి రావడం, ఆయా పరీక్షలు అభ్యర్థులపై, అలాగే సంబంధిత నియామక ఏజెన్సీలపై ఆర్థిక భారం మోపుతుండడం, సెక్యూరిటీ సంబంధిత సమస్యలు, వేదిక లభ్యత వంటి అనేక సమస్యలు ప్రస్తుత విధానంలో ఉత్పన్నమవుతున్నాయి. సగటున 2.5 కోట్ల నుంచి 3 కోట్ల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతారు. వీటన్నింటికీ పరిష్కారంగా ప్రిలిమినరీ పరీక్షగా ఒక సాధారణ అర్హత పరీక్ష నిర్వహించడం ద్వారా అభ్యర్థులు ఒకే సారి హాజరు కావడానికి, అలాగే తదుపరి దశలో ఉన్నత స్థాయి పరీక్ష కోసం ఈ నియామక ఏజెన్సీలలో ఏదైనా లేదా అన్నింటికీ దరఖాస్తు చేసుకోవడానికి ఎన్ఆర్ఏ వీలు కల్పిస్తుంది. దేశంలోని ప్రతి జిల్లాలో పరీక్షా కేంద్రాల ఏర్పాటు ద్వారా సుదూర ప్రాంతాల్లో ఉన్న అభ్యర్థులకు పరీక్ష కేంద్రాలను చేరువ చేస్తుంది. 117 ఆకాంక్ష జిల్లాల్లో పరీక్షా మౌలిక సదుపాయాలను సృష్టించడంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం సాధ్యం అవుతుంది. దూర ప్రాంతాలలో నివసించే గ్రామీణ అభ్యర్థులను పరీక్ష రాయడానికి ప్రేరేపిస్తుంది.సీఈటీని ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: జాతీయ నియామక సంస్థ (ఎన్ఆర్‌ఏ) ఏర్పాటుకు ఆమోదం
ఎప్పుడు: ఆగస్టు 19
ఎవరు: కేంద్ర కేబినెట్
ఎందుకు :ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలనుకునే అభ్యర్థుల సమస్యల పరిష్కారం కోసం
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు నంబర్ 2 బ్రాండ్ హోదా
యాపిల్ తరువాత బిలియనీర్ ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) అంతర్జాతీయంగా నంబర్ 2 బ్రాండ్ హోదాను సంపాదించుకుంది.ఫ్యూచర్‌బ్రాండ్ ఆగస్టు 5న విడుదల చేసిన ఫ్యూచర్‌బ్రాండ్ ఇండెక్స్ 2020 ఈ విషయాన్ని తెలిపింది.ఈ ఇండెక్స్‌లో శాంసంగ్ మూడవ స్థానంలో నిలవగా, ఎన్విడియా, మౌటాయ్, నైకీ, మైక్రోసాఫ్ట్, ఏఎస్‌ఎంఎల్, పేపాల్, నెట్‌ఫ్లిక్స్ తరువాత స్థానాల్లో నిలిచాయి. ఇండెక్స్‌లో కొత్తగా 15 సంస్థలకు చోటు లభించగా ఇందులో ఏఎస్‌ఎంఎల్ హోల్డింగ్స్, పేపాల్, దనాహెర్, సౌదీ ఆరాంకో, అమెరికన్ టవర్ కార్పొరేషన్ లు ఉన్నాయి.
పీడబ్ల్యూసీ ఆధారంగా...
ప్రైస్ వాటర్ కూపర్స్ (పీడబ్ల్యూసీ) గ్లోబల్ టాప్ 100 కంపెనీల మార్కెట్ క్యాప్, ఆర్థిక పటిష్టత, దేశీయ, అంతర్జాతీయ క్రియాశీలత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఫ్యూచర్‌బ్రాండ్‌ఇండెక్స్ రూపొందించింది. పీడబ్ల్యూసీ 2020 జాబితాలో రిలయన్స్ ర్యాంక్ 91. ప్రస్తుత కంపెనీల క్రియాశీలతతోపాటు వచ్చే కొద్ది సంవత్సరాల్లో ఆయా కంపెనీల పరిస్థితులపైనా మదింపుచేయడం ఇండెక్స్ ప్రత్యేకత. తదుపరి ఇండెక్స్‌లో రిలయన్స్ నంబర్ 1 స్థానానికి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయని ఫ్యూచర్ బ్రాండ్ పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి:రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు నంబర్ 2 బ్రాండ్ హోదా
ఎప్పుడు: ఆగస్టు 5
ఎవరు: ఫ్యూచర్‌బ్రాండ్ ఇండెక్స్ 2020
ఎక్కడ: ప్రపంచంలో
కేరళలోని కోళీకోడ్‌లో ఘోర విమానం ప్రమాదం
కేరళలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. వందేభారత్ మిషన్ లో భాగంగా దుబాయ్ నుంచి వస్తున్న దుబాయ్–కాళికట్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఆగస్టు 7న కోళీకోడ్ ఎయిర్‌పోర్ట్‌లోని టేబుల్ టాప్ రన్ వేపై దిగుతున్న సమయంలో ప్రమాదానికి లోనైంది. భారీగా వర్షం పడుతుండటంతో రన్ వే నుంచి పక్కకు జారీ పక్కనే ఉన్న దాదాపు 50 అడుగుల లోతైన లోయవంటి ప్రదేశంలో పడిపోయింది. దాంతో ఆ బీ737 విమానం రెండు ముక్కలైంది. ఆ ఘోర ప్రమాదంలో పైలట్ కెప్టెన్ దీపక్ సాథే సహా 17 మంది(ఆగస్టు 7నాటి వివరాల ప్రకారం) ప్రాణాలు కోల్పోయారు. 125 మంది వరకు గాయాలపాలయ్యారు. వారిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఆ విమానంలో 10 మంది చిన్నారులు సహా 184 మంది ప్రయాణీకులు, ఇద్దరు పైలట్లు, ఐదుగురు సిబ్బంది కలిపి మొత్తం 191 మంది ఉన్నారని ఎయిర్ ఇండియా తెలిపింది. రన్ వేపై చివరి వరకు విమానం వేగంగా వెళ్లి లోయలో పడి, రెండు ముక్కలుగా విరిగిపోయిందని డీజీసీఏ ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి:విమానం ప్రమాదంలో 17 మంది మృతి
ఎప్పుడు: ఆగస్టు 7
ఎక్కడ: కోళీకోడ్ ఎయిర్‌పోర్ట్, కేరళ
ఎందుకు:భారీ వర్షం కారణంగా
దేశంలో తొలి కిసాన్ రైలు ప్రారంభం
దేశంలో తొలి కిసాన్ రైలు ఆగస్టు 7న ప్రారంభమైంది. మహారాష్ట్రలోని దేవ్‌లాలి నుంచి బీహార్‌లోని దానాపూర్‌కి వరకు బయలుదేరిన ఈ రైలును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సర్వీసు ప్రస్తుతానికి వారానికి ఒకసారి దేవ్‌లాలి నుంచి ప్రతి శుక్రవారం, తిరుగుప్రయాణంలో ప్రతి ఆదివారం దానాపూర్ నుంచి బయలుదేరుతుంది. రైతుల కోసం తెచ్చిన కిసాన్ రైల్‌లోరిఫ్రిజిరేటర్ కోచ్‌లు ఉంటాయి. త్వరగా పాడైపోయే పండ్లు, కూరగాయలు వంటి వాటిని తరలించడానికి రైలు ఉపయుక్తంగా ఉంటుంది. తక్కువ ధరలకే రైతుల పంటలను రవాణా చేసేందుకు కిసాన్ రైలు ఉపకరిస్తుందని మంత్రి తోమర్ వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి:దేశంలో తొలి కిసాన్ రైలు ప్రారంభం
ఎప్పుడు: ఆగస్టు 7
ఎవరు: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్
ఎక్కడ: మహారాష్ట్రలోని దేవ్‌లాలి నుంచి బీహార్‌లోని దానాపూర్‌కి వరకు
ఎందుకు:త్వరగా పాడైపోయే పండ్లు, కూరగాయలు వంటి వాటిని తరలించడానికి
బ్రిటిష్ కాలంనాటి కళాసీ వ్యవస్థ రద్దు
బ్రిటిష్ జమానా నుంచి కొనసాగుతున్న కళాసీ వ్యవస్థకు రైల్వే శాఖ స్వస్తి పలకనుంది. రైల్వే శాఖ సీనియర్ అధికారుల ఇళ్లలో పని చేసేందుకు ‘కళాసీలు’లేదా ‘బంగ్లా ప్యూన్ల’నియామకాలనునిలిపివేయనున్నట్లు ఆగస్టు 6వ తేదీన జారీ చేసిన ఆదేశాల్లో రైల్వే బోర్డు పేర్కొంది. టెలిఫోన్ అటెండెంట్–కం– డాక్ కళాసీ(టీఏడీకే) పోస్టుల కొనసాగింపుపై సమీక్ష జరుపుతున్నామని ఉత్తర్వుల్లో పేర్కొంది. తాత్కాలిక ఉద్యోగులుగా జాయినయినటీఏడీకేలుమూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నాకస్క్రీనింగ్ ప్రక్రియ అనంతరం గ్రూపు ‘డి’ఉద్యోగులుగా గుర్తింపు పొందుతున్నారు. సుదూర ప్రాంతాల్లో, క్షేత్ర స్థాయిలో పనిచేసే అధికారులకు రక్షణగా, సహాయకులుగా ఉండేందుకు బ్రిటిష్ పాలనా కాలంలో టీఏడీకే వ్యవస్థ ఏర్పాటైంది. క్రమంగా ఆఫీసుల్లో ప్యూన్లు, ఇళ్లలో పనివారిగా మారిపోయారు. వీరిని వేధిస్తున్నారంటూ అధికారులపై ఫిర్యాదులు రావడంతో 2014లో రైల్వే శాఖ సమీక్షకు ఆదేశించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి:బ్రిటిష్ జమానా నుంచి కొనసాగుతున్న కళాసీ వ్యవస్థకు స్వస్తి
ఎప్పుడు: ఆగస్టు 7
ఎవరు: రైల్వే శాఖ
రాష్ట్రీయ సచ్ఛతా కేంద్రం ప్రారంభం
2020, ఆగస్టు 8 నుంచి 15 వరకు కొనసాగే స్వచ్ఛభారత్ వారోత్సవాలను ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 8న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద రాష్ట్రీయ సచ్ఛతా కేంద్రాన్ని ప్రారంభించి కార్యక్రమానికి హాజరైన విద్యార్థులనుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. మహాత్మాగాంధీ చేపట్టిన చంపారన్ సత్యాగ్రహం కార్యక్రమం వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సచ్ఛతా ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోదీ2017లో ప్రకటించారు.
ప్రధాని ప్రసంగం-ముఖ్యాంశాలు
- కరోనా వైరస్‌పై పోరులో స్వచ్ఛభారత్ కార్యక్రమం చాలా ముఖ్యమైంది.
- స్వచ్ఛభారత్ వారోత్సవాల్లో భాగంగా ఆగస్టు 15వ తేదీ వరకు కొనసాగే ‘వ్యర్థ విముక్త భారత్’ కార్యక్రమం ద్వారా వ్యర్థాలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
- పరిశుభ్రత ప్రాధాన్యాన్ని చాటిచెప్పిన మహాత్మాగాంధీకి నివాళిగా రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రంను ప్రారంభిస్తున్నాం.
- స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన ఆగస్టు 8వ తేదీని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టాం.ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో టాయిలెట్లు నిర్మించాలని, అవసరమైన చోట్ల మరమ్మతులు చేపట్టాలి.
ఏమిటి:రాష్ట్రీయ సచ్ఛతా కేంద్రం ప్రారంభం
ఎప్పుడు: ఆగస్టు 8
ఎవరు: ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ: రాజ్‌ఘాట్, ఢిల్లీ
ఎందుకు:మహాత్మాగాంధీ చేపట్టిన చంపారన్ సత్యాగ్రహం కార్యక్రమం వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా
అండమాన్ ఆప్టికల్ ఫైబర్ వ్యవస్థ ప్రారంభం
తమిళనాడు రాజధాని చెన్నై నుంచి అండమాన్ నికోబార్ దీవుల పోర్ట్‌బ్లెయిర్ వరకు సముద్ర గర్భంలో ఏర్పాటు చేసిన ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌ను ఆగస్టు 10న ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. రూ.1,224 కోట్లతో చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్ , అక్కడ్నుంచి ఇతర ద్వీపసమూహాలకు2,312కి.మీ. పొడవున వేసిన ఈ కేబుల్‌తో అండమాన్ నికోబర్ దీవుల్లో ప్రజలకు 4జీ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ట్రాన్స్షిప్‌మెంట్ పోర్ట్ నిర్మాణం...
ఆప్టికల్ ఫైబర్ ప్రారంభం సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ... భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీలో అండమాన్ నికోబార్ దీవులు మరింత కీలకంగా మారాయన్నారు. సెకండ్‌కి 2200జీబీపీఎస్ సామర్థ్యం గల ఈ కేబుల్ వ్యవస్థ ద్వారా అండమాన్ ద్వీప సమూహానికి స్వాతంత్య్ర దినోత్సవ కానుక ముందే లభించినట్టయిందని వ్యాఖ్యానించారు. సరకు రవాణా ద్వారా వాణిజ్య కార్యకలాపాలను పెంచడానికి 10 వేల కోట్లతో గ్రేట్ నికోబార్ ద్వీపసమూహంలో ట్రాన్స్ షిప్‌మెంట్ ఏర్పాటు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి:అండమాన్ ఆప్టికల్ ఫైబర్ వ్యవస్థ ప్రారంభం
ఎప్పుడు: ఆగస్టు 10
ఎవరు: ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు:అండమాన్ నికోబర్ దీవుల్లో ప్రజలకు 4జీ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు
ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ డాష్‌బోర్డ్ ప్రారంభం
దేశవ్యాప్తంగా అమలవుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సమాచారం అంతా ఒకే చోట లభించేలా జాతీయ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (ఎన్ఐపీ) ఆన్లైన్ డ్యాష్‌బోర్డు అందుబాటులోకి వచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆగస్టు 10న ఈ డ్యాష్‌బోర్డును ప్రారంభించారు. స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్య సాధనకు ఇది తోడ్పడగలదని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ఇండియా ఇన్వెస్ట్‌మెంట్ గ్రిడ్ (ఐఐజీ)లోని ఎన్ఐపీ ద్వారా ప్రాజెక్టుల అప్‌డేటెడ్ సమాచారం ఎప్పటికప్పుడు లభిస్తుందని వివరించారు.
అమల్లో 40 శాతం...
రూ. 111 లక్షల కోట్ల ఇన్ఫ్రా పెట్టుబడులకు సంబంధించి ప్రస్తుతం రూ. 44 లక్షల కోట్ల (సుమారు 40 శాతం) ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయి. రూ. 33 లక్షల కోట్ల ప్రాజెక్టులు ప్రతిపాదన స్థాయిలో ఉన్నాయి. మిగతావి వివిధ స్థాయిల్లో ఉన్నాయి.
బీఎస్‌ఈ స్టార్ ఎంఎఫ్ పోర్టల్
కార్పొరేట్లు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు వీలుగా బీఎస్‌ఈ స్టార్ ఎంఎఫ్ కార్ప్ డైరెక్ట్ పేరుతో ప్రత్యేక పోర్టల్ ను అభివృద్ధి చేసింది. అస్సెట్ మేనేజ్ మెంట్ కంపెనీలకు, డిస్ట్రిబ్యూటర్లకు, ఇన్వెస్టర్లకు, మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ భాగస్వాములకు ఎండ్ టు ఎండ్ సేవలను అందించడంతోపాటు, పెట్టుబడుల ప్రక్రియను ఇది సులభతరం చేస్తుందని బీఎస్‌ఈ ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి:జాతీయ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (ఎన్ఐపీ) ఆన్ లైన్ డ్యాష్‌బోర్డు ప్రారంభం
ఎప్పుడు: ఆగస్టు 10
ఎవరు:కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఎందుకు:మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సమాచారం అంతా ప్రజలకు ఒకే చోట లభించేలా
ఆస్తిలో కూతుళ్లకు సమాన వాటా
ఉమ్మడి హిందూ కుటుంబ ఆస్తిలో కొడుకులతో పాటు, కూతుళ్లకు సమాన హక్కులుంటాయని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. హిందూ వారసత్వ సవరణ చట్టం 2005కి ముందు తండ్రి మరణించినప్పటికీ కూతురుకి ఆ హక్కులు దక్కుతాయని స్పష్టం చేసింది. సమానత్వ హక్కుని కూతుళ్ళకి నిరాకరించతగదని కూడా స్పష్టం చేసింది. హిందూ వారసత్వ చట్టం–1956లోని సెక్షన్ 6ప్రకారం, చట్టంలో సవరణలకి ముందు లేదా తరువాత పుట్టిన కూతుళ్ళకు కూడా కొడుకులకు మాదిరిగానే హక్కులు, బాధ్యతలు సమానంగా ఉంటాయని జస్టిస్ ఆరుణ్ మిశ్రా, జస్టిస్ ఎస్.నజీర్, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం ఆగస్టు 11న తీర్పునిచ్చింది.
సవరణ చట్టం ద్వారా...
హిందూ వారసత్వ చట్టం 1956కి చేసిన సవరణ ద్వారా కూతుళ్ళకు కూడా పూర్వీకుల ఆస్తిలో సమాన వాటా ఉంటుందని కోర్టు తీర్పు స్పష్టం చేసింది. సెప్టెంబర్ 9, 2005 నాటికి జీవించి ఉన్నవారి కూతుళ్ళకు మాత్రమే ఈ చట్టం వర్తిస్తుందంటూ 2015లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని తోసిరాజని ‘‘కూతురు ఎప్పటికీ ప్రియమైన కూతురే’’అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి:ఉమ్మడి హిందూ కుటుంబ ఆస్తిలో కొడుకులతో పాటు, కూతుళ్లకు సమాన హక్కులు
ఎప్పుడు: ఆగస్టు 11
ఎవరు: సుప్రీంకోర్టు
ఉపరాష్ట్రపతి సచిత్ర పుస్తకం ఆవిష్కరణ
భారత ఉపరాష్ట్రపతిగా ఎం. వెంకయ్య నాయుడు మూడేళ్ళ పదవీకాలాన్ని పూర్తి చేస్తుకున్న సందర్భంగా ఉపరాష్ట్రపతి సచివాలయం ‘‘కనెక్టింగ్, కమ్యూనికేటింగ్, చేంజింగ్’’పేరుతో రూపొందించిన సచిత్ర పుస్తకాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆవిష్కరించారు. ఈ పుస్తకానికి సంబంధించిన డిజిటల్ వెర్షన్ ను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ ఆవిష్కరించారు. ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సమావేశ మందిరంలో ఆగస్టు 11న ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. బలమైన సంకల్పం, సమష్టి కృషితోనే ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమౌతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్య ఈ సందర్భంగా తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి:కనెక్టింగ్, కమ్యూనికేటింగ్, చేంజింగ్ పుస్తకం ఆవిష్కరణ
ఎప్పుడు: ఆగస్టు 11
ఎవరు: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్
ఎక్కడ: ఉపరాష్ట్రపతి భవన్, ఢిల్లీ
ప్రపంచంలోని అగ్రశ్రేణి 100 కంపెనీల్లో రిలయన్స్
భారత పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) తాజాగా మరోసారి ప్రపంచంలోనే అగ్రశ్రేణి 100 కంపెనీల జాబితాలో చోటు దక్కించుకుంది. 2020 సంవత్సరానికి గాను ఫార్చూన్ గ్లోబల్ 500 జాబితాలో గతేడాదితో పోలిస్తే 10 స్థానాలు ఎగబాకి 96వ స్థానానికి చేరింది. ఫార్చూన్ గ్లోబల్ 500లో ఇప్పటివరకు ఒక భారతీయ సంస్థ దక్కించుకున్న అత్యధిక ర్యాంకు ఇదే. 2012లో రిలయన్స్ తొలిసారిగా 99వ ర్యాంకు దక్కించుకుంది. అయితే, 2016లో 215 ర్యాంకుకు తగ్గింది. ఆ తర్వాత నుంచి మళ్లీ క్రమంగా మెరుగుపడి, టాప్ 100లో చోటు దక్కించుకుంది.
151వ స్థానంలో ఐవోసీ...
ఫార్చూన్ గ్లోబల్ 500 జాబితాలో... ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) 34 ర్యాంకులు తగ్గి 151వ స్థానంలో, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్ జీసీ) 30 ర్యాంకులు తగ్గి 190వ స్థానంలో నిల్చాయి. ఎస్‌బీఐ 15 ర్యాంకులు మెరుగుపడి 221వ స్థానంలో ఉంది. భారత్ పెట్రోలియం (309), టాటా మోటార్స్ (337), రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ (462) కూడా లిస్టులో ఉన్నాయి.
అగ్రస్థానంలో వాల్‌మార్ట్..
ఫార్చూన్ 2020 లిస్టులో అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. వాల్‌మార్ట్ ఆదాయం 524 బిలియన్ డాలర్లు. ఇక చైనాకు చెందిన సైనోపెక్ గ్రూప్, స్టేట్ గ్రిడ్, చైనా నేషనల్ పెట్రోలియం తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
ఆదాయాల ప్రాతిపదిక...
2020 మార్చి ఆఖరు లేదా అంతకు ముందు ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయాల ప్రాతిపదికన కంపెనీల ర్యాంకింగ్‌లను నిర్ణయించినట్లు ఫార్చూన్ తెలిపింది. రిలయన్స్ ఆదాయం 86.2 బిలియన్ డాలర్లు కాగా, ఐవోసీ 69.2 బిలియన్ డాలర్లు, ఓఎన్జీసీ 57 బిలియన్ డాలర్లు, ఎస్‌బీఐ 51 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి:ప్రపంచంలోని అగ్రశ్రేణి 100 కంపెనీల్లో రిలయన్స్
ఎప్పుడు: ఆగస్టు 11
ఎవరు: ఫార్చూన్ గ్లోబల్ 500 జాబితా
10 లక్షల మంది భారతీయులు వెనక్కి
వివిధ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఉద్దేశించిన వందేభారత్ మిషన్ లో భాగంగా దాదాపు 10 లక్షల మందిని భారత్‌కు తిరిగితెచ్చినట్లు విదేశీ వ్యవహారాల శాఖ ఆగస్టు 11న ప్రకటించింది. కరోనా సంక్షోభ నేపథ్యంలో ప్రవాస భారతీయుల కోసం ఈ మిషన్ ను మే 7న ఆరంభించారు. ఇదే సమయంలో భారత్ నుంచి దాదాపు 1.3 లక్షల మంది వివిధ దేశాలకు విమానాల ద్వారా వెనక్కు వెళ్లారని పౌరవిమానయాన శాఖ తెలిపింది. ప్రస్తుతం వందేభారత్ మిషన్ లో 5వ దశ నడుస్తోంది. ఇందులో దాదాపు 1.3 లక్షల భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు.
రూ.400 కోట్లతో సచివాలయం నిర్మాణం
కొత్త సచివాలయం భవన సముదాయం నిర్మాణానికి రూ.400 కోట్ల అంచనా వ్యయంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులు జారీచేసింది. చెన్నైకు చెందిన ఆస్కార్ పొన్ని ఆర్కిటెక్స్ సంస్థ రూపకల్పన చేసిన కొత్త సచివాలయం భవన డిజైన్‌ను ఆమోదించడంతో పాటు కొత్త సచివాలయం నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త సచివాలయం నిర్మాణానికి పరిపాలనా అనుమతులను సాధారణ పరిపాలన శాఖ జారీచేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి:విదేశాల నుంచి 10 లక్షల మంది భారతీయులు వెనక్కి
ఎప్పుడు: ఆగస్టు 11
ఎవరు: భారత విదేశీ వ్యవహారాల శాఖ
ఎందుకు:వందేభారత్ మిషన్ లో భాగంగా
యూఎస్‌ఎయిడ్‌తో రిలయన్స్ ఫౌండేషన్ జట్టు
డిజిటల్ అవగాహనకు సంబంధించి మహిళలు, పురుషుల్లో అసమానతలను తగ్గించే దిశగా యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యూఎస్‌ఎయిడ్), డబ్ల్యూ–జీడీపీతో కొత్తగా భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు రిలయన్స్ ఫౌండేషన్ వెల్లడించింది. అమెరికా అధ్యక్ష సలహాదారు ఇవాంకాట్రంప్ నిర్వహించిన ఉమెన్స్ గ్లోబల్ వలప్‌మెంట్ అండ్ ప్రాస్పరిటీ (డబ్ల్యూ–జీడీపీ) కార్యక్రమంలో ఈ భాగస్వామ్యం కుదిరినట్లు వివరించింది.
ఆర్థిక సాధికారత కోసం...
మహిళల ఆర్థిక సాధికారత సాధనకు తోడ్పడేందుకు డబ్ల్యూ–జీడీపీ ఫండ్ ఏర్పాటైనట్లుఇవాంకా తెలిపారు. దేశవ్యాప్తంగా డబ్ల్యూ–జీడీపీ ఉమెన్స్ కనెక్ట్ చాలెంజ్‌ను త్వరలో నిర్వహించనున్నట్లు రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యూఎస్‌ఎయిడ్), డబ్ల్యూ–జీడీపీతో కొత్తగా భాగస్వామ్యం
ఎప్పుడు: ఆగస్టు 12
ఎవరు: రిలయన్స్ ఫౌండేషన్
ఎందుకు:డిజిటల్ అవగాహనకు సంబంధించి మహిళలు, పురుషుల్లో అసమానతలను తగ్గించే దిశగా
పంజాబ్ స్మార్ట్ కనెక్ట్ స్కీం ప్రారంభం
పంజాబ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 12వ తరగతి విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్లను అందజేసే పథకం ‘పంజాబ్ స్మార్ట్ కనెక్ట్ స్కీం’ పంజాబ్ ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఆగస్టు 12న ఈ పథకాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం కింద మొదటి దశలో నవంబర్‌కల్లా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించిన 26 ప్రాంతాల్లో 1,74,015 మంది విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్లను పంపిణీ చేయనున్నారు.
భారత్ కు రూ.7,000 కోట్ల సాయం
భారత రహదారులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల్లో (ఎంఎస్‌ఎంఈ) మరిన్ని పెట్టుబడులు పెట్టాలని అంతర్జాతీయ సంస్థలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కోరారు. ఇండో ఆ్రస్టేలియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మంత్రి ఈ మేరకు పేర్కొన్నారు. రహదారి భద్రత విషయంలో భారత్–ఆ్రస్టేలియా సహకారం అందించుకుంటున్నాయని చెప్పారు. రోడ్డు ప్రమాదాల తగ్గింపునకు ఎన్నో చర్యలు తీసుకున్నామని, ఇందుకు సంబంధించి రూ.7,000 కోట్ల నిధుల సాయానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీలు అంగీకరించినట్టు మంత్రి వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: పంజాబ్ స్మార్ట్ కనెక్ట్ స్కీం ప్రారంభం
ఎప్పుడు: ఆగస్టు 12
ఎవరు: పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్
ఎందుకు:ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 12వ తరగతి విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్లను అందజేసేందుకు
ఏపీలో తొలిసారిగా కరోనాపై అధ్యయనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్‌పై కర్నూలు మెడికల్ కాలేజీ (కేఎంసీ) మైక్రో బయాలజీ విభాగంలో బయోఇన్ఫర్మాటిక్ అధ్యయనం చేశారు. కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్) పరిధిలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజీఐబీ)తో కర్నూలు ప్రాంతం నుంచి 90 మంది కరోనా బాధితుల శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్(ఎన్‌జీఎస్) చేశారు. ఈ వివరాలను ఆగస్టు 12న కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.చంద్రశేఖర్‌తో కలిసి మైక్రోబయాలజీ స్పెషలిస్టు డాక్టర్ పి.రోజారాణి విలేకరులకు వివరించారు. చైనాలోని వూహాన్‌లో మొదలైన కోవిడ్–19 వైరస్‌తో పోలిస్తే కర్నూలులో ఉన్న వైరస్ కొద్దిగా మార్పులు చేసుకుందని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ఆరు ప్రతిష్టాత్మక సంస్థలు ఈ అధ్యయనంలో పాల్గొన్నాయి. ఏపీ నుంచి మొదటి అధ్యయనం ఇదే.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఏపీలో తొలిసారిగా కరోనాపై అధ్యయనం
ఎప్పుడు: ఆగస్టు 12
ఎవరు: కర్నూలు మెడికల్ కాలేజీ (కేఎంసీ)
ఎక్కడ:కర్నూలు
వార్‌మెమొరియల్‌పై గల్వాన్ అమరులు
తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్లోయలో చైనా సైన్యంతో పోరాడి, వీరమరణం పొందిన 20 మంది అమరజవాన్ల పేర్లను ఢిల్లీలోని నేషనల్ వార్‌మెమొరియల్‌పై లిఖించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ పేర్లు చేర్చడానికి కొద్ది నెలల సమయం పట్టనున్నట్టు తెలిపారు. ఐదు దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా జూన్ 15వ తేదీన గల్వాన్లోయలో చైనా సైనికులతో భీకర పోరాటం జరిగింది. ఈ పోరాటంలో బిహార్ రెజిమెంట్ 16కి చెందిన కల్నల్ బి.సంతోష్ బాబుతో సహా 20 మంది సైనికులు అసువులు బాశారు. చైనా వైపు ఈ ఘర్షణలో ఎంత మంది చనిపోయారనేది ప్రకటించలేదు. అమెరికా నిఘా వర్గాల ప్రకారం 35 మంది చైనా సైనికులు చనిపోయినట్టు తెలుస్తోంది.
అదనపు బలగాలు...
చైనాతో ఉన్న సరిహద్దుల వెంబడి అదనంగా మరో 35 వేల మందిని నియమించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. భారత్ చైనా సరిహద్దులు 3,488 కిలోమీటర్ల పొడవు ఉండగా వాస్తవా«దీన రేఖ వెంబడి సరిహద్దులను కాపాడుకునేందుకు భారత్ ఇప్పటికే భారీగా ఖర్చు పెడుతోంది.
భారత్‌లో హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యం కాదు
భారత్‌లో కరోనా వైరస్‌ను హెర్డ్ ఇమ్యూనిటీ ద్వారా నియంత్రించలేమని వెల్లడైంది. భారత్‌లాంటి అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యం కాదని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. కొన్ని ప్రాంతాల్లో నివసించే జనాభాలో కరోనా వైరస్‌ను తట్టుకునే యాంటీబాడీలు బాగా అభివృద్ధి చెందినప్పటికీ అవి స్వల్పకాలం మాత్రమే ఉంటాయని వెల్లడించింది. టీకా కార్యక్రమం ద్వారా మాత్రమే ఇమ్యూనిటీని సాధించగలమని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారి రాజేష్ భూషణ్ జూలై 30న వెల్లడించారు.
ఆగస్ట్ 15లోగా రష్యా టీకా..
2020, ఆగస్ట్ 10 లేదా ఆగస్ట్ 12వ తేదీలోగా విడుదల చేసేందుకు రష్యా సిద్ధమవుతోంది. గామాలెయ ఇన్స్టిట్యూట్ రూపొందించిన ఈ టీకాకు సాధ్యమైనంత త్వరగా అనుమతి ఇవ్వాలని రష్యా భావిస్తోందని ఈ మొత్తం ప్రక్రియతో సంబంధమున్న అధికారిని ఉటంకిస్తూ ‘బ్లూమ్‌బర్గ్’ఒక కథనం ప్రచురించింది. ఆగస్ట్ 15లోగా ప్రజల వినియోగానికి అనుమతి లభించవచ్చని అధికార మీడియా ప్రకటించింది. మరోవైపు, ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ రూపొందిస్తున్న టీకాను ఉత్పత్తి చేసేందుకు ఆ్రస్టాజెనెకాతో రష్యాకు చెందిన ఆర్ ఫార్మా ఒప్పందం కుదుర్చుకుంది. ఆక్స్‌ఫర్డ్ టీకా పరిశోధనలను దొంగిలించేందుకు రష్యా హ్యాకర్లు ప్రయతి్నస్తున్నారని బ్రిటన్, కెనడా, అమెరికా ఆరోపిస్తుండగా ఈ ఒప్పందం కుదిరింది.
భారత్ లో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్
బ్రిటన్ లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ పై మూడో దశ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు పుణేలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ)కు అనుమతి ఇవ్వాలని కోవిడ్‌పై ఏర్పాటైన నిపుణుల కమిటీ జూలై 31న డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కు సిఫార్సు చేసింది. హ్యూమన్ ట్రయల్స్ అనుమతి కోరుతూ సీరమ్ సంస్థ నిపుణుల కమిటీకి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 17 ప్రాంతాల్లో 1,600 మందిపై ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ను పరీక్షిస్తామని సీరమ్ కంపెనీ తెలిపింది. ఇందులో విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కాలేజీ కూడా ఉంది.
పొగాకు నుంచి వ్యాక్సిన్
పొగాకు ఆకుల నుంచి సంగ్రహించిన ప్రొటీన్తో వ్యాక్సిన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు బ్రిటిష్ అమెరికన్ పొగాకు సంస్థ లూసీ స్ట్రైక్స్ సిగరెట్స్ తెలిపింది. ఆ కంపెనీకి చెందిన కెంటకీ బయో ప్రాసెసింగ్ తయారు చేస్తున్న వాక్సిన్ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: భారత్ లో ఆక్స్‌ఫర్డ్ కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్
ఎప్పుడు: జూలై 31
ఎవరు: కోవిడ్‌పై ఏర్పాటైన నిపుణుల కమిటీ
క్రెడాయ్ ఆవాస్ యాప్ ఆవిష్కరణ
రియల్టీ సంస్థలు–క్రెడాయ్, నరెడ్కో నివాసిత గృహ ప్రాజెక్టుల మార్కెటింగ్ కోసం రూపొందించిన డిజిటల్ వేదికలను కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పురి జూలై 31న ఆవిష్కరించారు. క్రెడాయ్ ఆవాస్ యాప్‌తోపాటు.. నరెడ్కో అభివృద్ధి చేసిన ‘హౌసింగ్ ఫర్ ఆల్ డాట్ కామ్’ పోర్టల్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి ప్రారంభించారు.
డిజిటలీకరణకు మోడల్‌గా బెంగళూరు
భారత్‌లో డిజిటలీకరణ ప్రక్రియకు బెంగళూరు సరైన నమూనాగా నిలవగలదని సీమెన్స్ ఏజీ సంస్థ జూలై 31న వెల్లడించింది. మొబిలిటీ, అవకాశాలు తదితర అంశాల ప్రాతిపదికన ఈ నగరాన్ని ఎంచుకున్నట్లు ’అట్లాస్ ఆఫ్ డిజిటలైజేషన్’ నివేదికలో వివరించింది. ప్రపంచవ్యాప్తంగా 9 నగరాలు రూపాంతరం చెందిన తీరును నివేదికలో విశ్లేషించింది. బెంగళూరు సహా బెర్లిన్, బ్యూనస్ ఎయిర్స్, లండన్, సింగపూర్, దుబాయ్, జొహానెస్‌బర్గ్, లాస్‌ఏంజెలిస్, తైపీ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి: క్రెడాయ్ ఆవాస్ యాప్‌తోపాటు, నరెడ్కో ‘హౌసింగ్ ఫర్ ఆల్ డాట్ కామ్’ పోర్టల్ ఆవిష్కరణ
ఎప్పుడు: జూలై 31
ఎవరు: కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పురి
ఎందుకు:నివాసిత గృహ ప్రాజెక్టుల మార్కెటింగ్ కోసం
2జీ రహిత భారత్: ముకేశ్ అంబానీ
ఎప్పుడో పాతికేళ్ల క్రితం ప్రారంభించిన 2జీ టెలిఫోనీ సర్వీసులను ఇక నిలిపివేయాల్సిన సమయం వచ్చిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) చైర్మన్ ముకేశ్ అంబానీ వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధానపరంగా తగు నిర్ణయం తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా తొలి మొబైల్ ఫోన్ కాల్ చేసి పాతికేళ్లయిన (సిల్వర్ జూబ్లీ) సందర్భంగా జూలై 31 నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అంబానీ ఈ వ్యాఖ్యలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో డేటా వినియోగానికి భారీ అవకాశాలు ఉన్నందున.. కనెక్టివిటీని మెరుగుపర్చడంపై టెలికం పరిశ్రమ దృష్టి పెట్టాలని టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాష్ సూచించారు.
ఫారెక్స్ నిల్వల రికార్డు...
ముంబై: భారత్ విదేశీ మారకపు నిల్వలు తాజాగా జూలై 24వ తేదీతో ముగిసిన వారంలో అంతకుముందు వారం (జూలై 17వ తేదీతో ముగిసిన)తో పోల్చి 5 బిలియన్ డాలర్లు పెరిగి మొత్తంగా 522.63 బిలియన్ డాలర్లకు ఎగశాయి. పసిడి నిల్వల విలువలు పెరగడం, దిగుమతులు అంతగా లేకపోవడంతో తగ్గిన విదేశీ మారక వినియోగం వంటి అంశాలు ఫారెక్స్ రికార్డులకు కారణం.
లిపులేఖ్ పాస్ లో చైనా మోహరింపులు
తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చల్లారక ముందే మరోవైపు నుంచి డ్రాగన్ దేశం చైనా దురాక్రమణకు సిద్ధమైంది. ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో లిపులేఖ్ పాస్‌లో సైనికుల్ని మోహరించింది. వెయ్యి మందికి పైగా చైనా సైనికులు లిపులేఖ్‌లో మోహరించినట్టుగా భారత్ మిలటరీ తెలిపింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నివారణకు లద్దాఖ్‌లో సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని జాతీయ భద్రతా సలహాదారు దోవల్, చైనా విదేశాంగ మంత్రి చాంగ్ యీ మధ్య జరిగిన చర్చల్లో ఒక అంగీకారానికి వచ్చినా చైనా మాట నిలబడలేదు. లిపులేఖ్ పాస్, ఉత్తర సిక్కింలో కొన్ని ప్రాంతాలు, అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా లిబరేషన్ ఆర్మీ సైన్యం తిష్ట వేసిందని భారత ఆర్మీ తెలిపింది.. చైనా ఆగడాలను దీటుగా ఎదుర్కోవడానికి భారత్ కూడా సన్నాహాలు చేస్తోంది. హిమాలయాల్లో గడ్డకట్టే చలిని తట్టుకోవడానికి భారతీయ సైన్యానికి దుస్తులు, టెంట్లను అమెరికా, రష్యా, యూరప్ నుంచి కొనుగోలు చేయనుంది.
ఏమిటీ లిపులేఖ్ పాస్?
హిందువులకి అత్యంత సాహసోపేతమైన యాత్ర మానస సరోవరానికి వెళ్లే మార్గంలో లిపులేఖ్ పాస్ ఉంది. 1992లో చైనాతో వాణిజ్య సంబంధాల కోసం ఈ లిపులేఖ్ మార్గంలో తొలిసారిగా ఒక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్నుంచి ప్రతీ ఏడాది జూన్ నుంచి అక్టోబర్ వరకు వాణిజ్య కార్యకలాపాల కోసం ఈ మార్గాన్ని తెరిచి ఉంచుతారు. ఆ సమయంలో సరిహద్దులకి రెండు వైపులా ఉండే ఆదివాసీలు వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తారు. ఈ ప్రాంతంలో హిమాలయాల వరకు భారత్ 80కి.మీ. రోడ్డుని నిర్మించడంపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో లిపులేఖ్ పాస్ తరచూ వార్తల్లోకెక్కుతోంది. ఇప్పుడు చైనా ఈ మార్గంపైనే కన్నేసింది.
ఎన్ఈపీలో చైనీస్ కు దక్కని చోటు
కేంద్ర కేబినెట్ జూలై 29న ఆమోదించిన నూతన జాతీయ విద్యావిధానం-2020 (ఎన్‌ఈపీ-2020)లో చైనా భాష చైనీస్ కు చోటు దక్కలేదు. ఎన్‌ఈపీ-2020 ప్రకారం... సెకండరీ స్కూలులో సాధారణంగా ప్రతీ విద్యార్థికి వారికి ఆసక్తి ఉన్న విదేశీ భాషను నేర్చుకునే అవకాశం ఉంటుంది. వేర్వేరు దేశాల్లో సంస్కృతులు, ఆయా దేశాల్లో సామాజిక స్థితిగతులపై జ్ఞానాన్ని పెంచుకోవడం కోసం ఈ విదేశీ భాషల కేటగిరీని ప్రవేశపెట్టారు. 2019 ఏడాది విడుదల చేసిన ఎన్ఈపీ ముసాయిదా ప్రతిలో ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, జపనీస్‌తో పాటుగా చైనీస్ భాష ఉంది. కానీ కేంద్రం తాజాగా ఆమోదించిన తుది ప్రతిలో చైనీస్‌ను తొలగించినట్టు జాతీయ మీడియాలో కథనాలొచ్చాయి. కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, రమేష్ పోఖ్రియాల్ విడుదల చేసిన ఎన్ఈపీలో రష్యన్, పోర్చుగీస్, థాయ్ భాషలకు చోటు దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: చైనా భాష చైనీస్ కు చోటు దక్కలేదు
ఎప్పుడు: ఆగస్టు 2
ఎక్కడ:నూతన జాతీయ విద్యావిధానం-2020 (ఎన్‌ఈపీ-2020)లో
నాలుగో ఎడిషన్ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆగస్టు 1న స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ నాలుగో ఎడిషన్ ను నిర్వహించింది. ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలకు విద్యార్థులు పరిష్కార మార్గాలు చూపడమే దీని ఉద్దేశం. 2020 ఏడాది 243 సమస్యల పరిష్కారానికి 10 వేల మందికిపైగా పోటీపడ్డారు. విజేతలకు నగదు బహుమతి అందజేశారు. హ్యాకథాన్ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.... ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్లు కాదు.. ఉద్యోగాలు ఇచ్చేవాళ్లను తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం నూతన విద్యా విధానం–2020ని ప్రకటించిందన్నారు. దేశంలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం సంకంల్పించిందన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ నాలుగో ఎడిషన్ నిర్వహణ
ఎప్పుడు: ఆగస్టు 1
ఎవరు: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ
ఎందుకు:ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలకు విద్యార్థులు పరిష్కార మార్గాలు చూపడమేలక్ష్యంగా
కరోనాపై నేషనల్ క్లినికల్ రిజిస్ట్రీ ఏర్పాటు
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ బారినపడి, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల సమగ్ర సమాచారంతో ఒక రిజిస్ట్రీని ఏర్పాటు చేయాలని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) నిర్ణయించింది. దీనిద్వారా వారికి అందిస్తున్న చికిత్సను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, మరింత చికిత్స అందించేందుకు వీలవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ, ఢిల్లీ ఎయిమ్స్ భాగస్వామ్యంతో నేషనల్ క్లినికల్ రిజిస్ట్రీని ఐసీఎంఆర్ ఏర్పాటు చేయనుంది. ఆసుపత్రుల్లోని బాధితుల సమాచారాన్ని 15 జాతీయ స్థాయి సంస్థలు సేకరించి, రిజిస్ట్రీకి అందజేస్తాయి.
కరోనా అందరికీ సోకదు: ఐఐపీహెచ్
కరోనా సోకిన వ్యక్తి ఉన్న కుటుంబంలో అందరికీ ఆ వైరస్ సోకుతుందని చెప్పలేమని తాజా అధ్యయనంలో తేలింది. కోవిడ్–19 నిర్ధారణ అయిన వ్యక్తి ఉన్న కుటుంబంలోని దాదాపు 80 శాతం నుంచి 90 శాతం సభ్యులకు ఆ వైరస్ సోకకపోవచ్చని గుజరాత్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సంస్థ నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. అందుకు కారణం వారిలో ఆ వైరస్ నిరోధక శక్తి పెరగడమే కావచ్చని స్పష్టమైంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: నేషనల్ క్లినికల్ రిజిస్ట్రీ ఏర్పాటు
ఎప్పుడు: ఆగస్టు 2
ఎవరు: భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్)
ఎందుకు: కరోనా బాధితుల చికిత్సను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, మరింత చికిత్స అందించేందుకు వీలవుతుందని
ప్రపంచంలోనే అతిఎత్తైన రైల్వే వంతెన
జమ్మూకశ్మీర్‌లో చీనాబ్ నదిపై నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిఎత్తైన రైల్వే వంతెన పనులు 2021 ఏడాదికి పూర్తికానున్నాయి. కశ్మీర్‌ను మిగతాదేశంతో కలిపే ఈ వారధిపై 2022 డిసెంబర్‌లో మొట్టమొదటి రైలు ప్రయాణం చేసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. ప్రత్యక్ష పర్యవేక్షణతో ఏడాదిగా పనులు వేగవంతం అయ్యాయన్నారు.
వంతెన విశేషాలు...
- 359 మీటర్ల ఎత్తులో 467 మీటర్ల పొడవైన ఈ వారధి ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే వంతెన.
- - గంటకు 266 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను సైతం తట్టుకునేలా వంతెన డిజైన్ చేశారు.
- ఈ రైల్వే మార్గంలో ఉధంపూర్–కాట్రా(25 కిలోమీటర్లు) సెక్షన్, బనిహాల్–క్వాజిగుండ్ (18 కి.మీ.)సెక్షన్, క్వాజిగుండ్–బారాముల్లా (118 కి.మీ.) సెక్షన్ ల పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.
- ప్రస్తుతం 111 కిలోమీటర్ల పొడవైన కాట్రా–బనిహాల్ సెక్షన్ లో పనులు కొనసాగుతున్నాయి.
- 2018 వరకు ప్రాజెక్టు అంచనా వ్యయంలో 27 శాతమే ఖర్చు కాగా ఆ తర్వాత 54 శాతం మేర వెచ్చించారు.
ఏమిటి: ప్రపంచంలోనే అతిఎత్తైన రైల్వే వంతెన
ఎప్పుడు: ఆగస్టు 2
ఎవరు: భారత ప్రభుత్వం
ఎక్కడ:చీనాబ్ నది, జమ్మూకశ్మీర్
వృద్ధిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భాగస్వామ్యం
దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం శరవేగంగా వృద్ధి చెందుతోందని, దీనివల్ల దేశీయ ఆర్థిక వృద్ధిరేటు 2035 నాటికి ఏటా 1.3 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని నీతి ఆయోగ్ అంచనా వేసింది. ఈ మేరకు ‘టూవర్డ్స్ రెస్పాన్సిబుల్ – ఏఐ ఫర్ ఆల్’ పేరిట నీతి ఆయోగ్ ఒక చర్చా పత్రాన్ని విడుదల చేసింది. కొన్ని కీలకమైన పరిశోధనలు చేయడానికి కేంద్రం ఫండింగ్ చేస్తుండటమే కాకుండా, విశ్వవిద్యాలయాల కరికులమ్‌లో కూడా ఏఐని ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ఏఐ వినియోగం వల్ల ఆటోమేషన్ పెరిగి చాలా రంగాల ఉద్యోగాలపై వ్యతిరేక ప్రభావం పడే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఎన్ఎండీసీ సారథిగా సుమిత్ దేవ్
మైనింగ్ రంగ దిగ్గజం ఎన్ఎండీసీ నూతన సీఎండీగా సుమిత్ దేవ్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న ఎన్.బైజేంద్ర కుమార్ పదవీ విరమణ చేశారు. నూతన బాధ్యతలు చేపట్టే ముందు వరకు సుమిత్ దేవ్ ఎన్ఎండీసీలో డైరెక్టర్‌గా (పర్సనల్) ఉ న్నారు. కంపెనీలో 2015లో కమర్షియల్ విభాగం జీఎంగా చేరారు. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీగా చేరి 25 ఏళ్లు వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: వృద్ధిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భాగస్వామ్యం
ఎప్పుడు: ఆగస్టు 2
ఎవరు: నీతి ఆయోగ్
ద్విభాషా విధానాన్నే కొనసాగిస్తాం: సీఎం పళనిస్వామి
జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ)–2020లో కేంద్రం ప్రతిపాదించిన త్రిభాషా సూత్రాన్ని తమిళనాడులోని ఏఐఏడీఎంకే ప్రభుత్వం తిరస్కరించింది. రాష్ట్రంలో ఎప్పటి నుంచో అమలవుతున్న ద్విభాషా విధానానికే కట్టుబడి ఉంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి ఆగస్టు 3న ప్రకటించారు. రాష్ట్రంలో 8 దశాబ్దాలుగా అమల్లో ఉన్న ద్విభాషా విధానం నుంచి వైదొలిగేది లేదని స్పష్టం చేశారు. 5వ తరగతి వరకు మాతృభాష లేదా ప్రాంతీయ భాషలో విద్యాబోధన జరపాలని ఎన్ఈపీ ప్రతిపాదించింది. అయితే, హిందీ, సంస్కృతాలను తమపై రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్షం డీఎంకే నేత ఎంకే స్టాలిన్ ఆరోపిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ద్విభాషా విధానానికే కట్టుబడి ఉంటాం
ఎప్పుడు: ఆగస్టు 3
ఎవరు: తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి
డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్స్ ముసాయిదా రూపకల్పన
2025 నాటికి రక్షణ ఉత్పత్తుల టర్నోవర్ రూ. 1.75 లక్షల కోట్లకు చేరాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థకే చోదక శక్తిగా మారే సామర్ధ్యం ఈ రంగానికి ఉందని భావిస్తోంది. దీనికి సంబంధించిన ‘డిఫెన్స్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ పాలసీ–2020’ ముసాయిదాను రక్షణ శాఖ రూపొందించింది. అందులో, రానున్న ఐదేళ్లలో అంతరిక్ష రక్షణ రంగ ఉత్పత్తులు, సేవల ఎగుమతుల లక్ష్యమే రూ. 35 వేల కోట్లని అందులో పేర్కొంది.
కుల్‌భూషణ్‌కు భారత్ లాయర్
మరణ శిక్ష ఎదుర్కొంటూ పాకిస్తాన్ జైల్లో మగ్గుతున్న భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్ తరఫున లాయర్‌ను నియమించేందుకు ఇస్లామాబాద్ హైకోర్టు భారత్‌కు వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు భారత్ అధికారులకు అవకాశమివ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. తదుపరి విచారణను 2020, సెప్టెంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది. జాధవ్ కేసులో పాక్ ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ పై విచారణ జరిపేందుకు ఇస్లామాబాద్ హైకోర్టు ఇద్దరు సభ్యులతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి: డిఫెన్స్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ పాలసీ–2020ముసాయిదా రూపకల్పన
ఎప్పుడు: ఆగస్టు 3
ఎవరు: కేంద్రరక్షణ శాఖ
దేశంలో ఉత్తమ వర్శిటీగా ఢిల్లీ విశ్వవిద్యాలయం
ఇండియా టుడే–మార్కెటింగ్ అండ్ డెవలప్‌మెంట్ రీసెర్చ్ అసోసియేట్స్(ఎండీఆర్‌ఏ) ప్రకటించిన ర్యాంకింగ్స్ ప్రకారం... దేశంలో అత్యుత్తమ యూనివర్సిటీల్లో ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్ యూ) మొదటిస్థానంలో నిలిచింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) ద్వితీయ స్థానం సంపాదించింది. కీర్తి, పాలన, అకడమిక్, రీసెర్చ్ ఎక్స్‌లెన్స్, ఇ్రన్ఫాస్ట్రక్చర్ అండ్ లివింగ్ ఎక్స్‌పీరియన్స్, పర్సనాలిటీ, నాయకత్వ అభివృద్ధి, కెరియర్ పురోగతి, ప్లేస్‌మెంట్ వంటి అంశాలలో సాధించిన ప్రగతి ఆధారంగా తాజా ర్యాంకింగ్స్‌ను ప్రకటించారు.
130 విశ్వవిద్యాలయాలకు...
ఇండియా టుడే ఉత్తమ విశ్వవిద్యాలయాల సర్వే కోసం దేశంలోని 995 విశ్వవిద్యాలయాల జాబితాను రూపొందించింది. దేశంలోని 30 నగరాల్లో సర్వేను నిర్వహించారు. చివరకు 130 విశ్వవిద్యాలయాలకు ర్యాంక్‌లను కేటాయించారు. పరిశోధకులు, గణాంక వేత్తలు, విశ్లేషకులు, సర్వే బృందాలతో కూడిన పెద్ద బృందం ఈ ప్రాజెక్టుపై 2019 డిసెంబర్ నుంచి 2020 జూలై వరకు పనిచేసి ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఉత్తమ వర్శిటీగా ఢిల్లీ విశ్వవిద్యాలయం
ఎప్పుడు: ఆగస్టు 2
ఎవరు: ఇండియా టుడే–మార్కెటింగ్ అండ్ డెవలప్‌మెంట్ రీసెర్చ్ అసోసియేట్స్(ఎండీఆర్‌ఏ)
ఎక్కడ:దేశంలో
దేశంలోనే తొలి కార్గో ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం
సాధారణ ప్రయాణికుల రైలు తరహాలో నిర్ధారిత వేళల ప్రకారం నడిచే (టైంటేబుల్డ్) సరుకు రవాణా ఎక్స్‌ప్రెస్‌ను భారతీయ రైల్వే తొలిసారి పట్టాలెక్కించింది. హైదరాబాద్ కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వే నిర్వహించే ఈ రైలు ఆగస్టు 5న సనత్‌నగర్(హైదరాబాద్) స్టేషన్ నుంచి బయలుదేరింది. ప్రతి బుధవారం సనత్‌నగర్ స్టేషన్ లో బయలుదేరే ఈ సరుకు రవాణా రైలు శుక్రవారం ఉదయం ఢిల్లీలోని ఆదర్శ్‌నగర్ స్టేషన్ కు చేరుకుంటుంది. గంటకు 50 కి.మీ. వేగంతో ప్రయాణించే ఈ సరుకు రవాణా రైలును ఆరు నెలల పాటు ప్రయోగాత్మకంగా నడిపించనున్నారు.
నిర్ధారిత వేళల్లో...
సాధారణంగా ఒక రేక్ (రైలు బోగీలన్నీ కలిపి)కు సరిపడా సరుకు ఉంటేనే సరుకు రవాణా రైలును నడుపుతారు. ముందస్తు బుకింగ్స్ ఆధారంగా ఈ రైళ్లు నడుస్తుంటాయి. దానికి భిన్నంగా సరుకు ఉన్నా లేకున్నా, ప్రయాణికుల రైళ్ల తరహాలో నిర్ధారిత వేళల్లో ఈ రైలు బయలుదేరుతుంది. కనిష్టంగా 60 టన్నుల సరుకైనా బుక్ చేసుకునే సదుపాయం రైల్వే కల్పిచింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: దేశంలోనే తొలి కార్గో ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం
ఎప్పుడు: ఆగస్టు 5
ఎవరు: దక్షిణ మధ్య రైల్వే
ఎక్కడ: సనత్ నగర్, హైదరాబాద్
రామ మందిర నిర్మాణానికి భూమిపూజ
అయోధ్యలో శ్రీరామచంద్రుడు జన్మించాడని భక్తులు విశ్వసించే ప్రదేశంలో భవ్యమైన రామ మందిరం ‘శ్రీ రామ జన్మభూమి మందిర్’ నిర్మాణానికి ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. సుముహూర్త సమయమైన మధ్యాహ్నం 12.44 గంటలకు శంకుస్థాపన జరిపారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్, శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చీఫ్ సంత్ నృత్య గోపాల్ దాస్ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అయోధ్యలో ఉత్సవ వాతావరణం నెలకొంది.
తొలి ప్రధాని మోదీనే...
భూమి పూజ సందర్భంగా ‘సియా(సీతా)వర్ రామచంద్రజీ కీ జై’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ... రామ్‌లల్లా ఆలయం భారతదేశ ఘన సంస్కృతికి ప్రతీకగా, మానవాళికిస్ఫూర్తిప్రదాయినిగానిలుస్తుందన్నారు. రాళ్లపై శ్రీ రామ అని రాసి ‘రామసేతు’ నిర్మించిన తీరుగానే.. దేశంలోని మూల మూలల నుంచి రామ మందిర నిర్మాణం కోసం ఇటుకలు వచ్చాయని వ్యాఖ్యానించారు. భూమి పూజ కంటే ముందుగా హనుమాన్ గఢీలోని ఆంజనేయుడి దేవాలయాన్ని సందర్శించారు. అయోధ్యలో రామ జన్మభూమిని, హనుమాన్ గఢీ ఆలయాన్ని సందర్శించిన తొలి ప్రధాని నరేంద్ర మోదీయేనని యూపీ ప్రభుత్వం తెలిపింది. భూమి పూజను పురస్కరించుకుని ప్రత్యేక స్మారక పోస్టల్ స్టాంప్‌ను మోదీ ఆవిష్కరించారు.
నాగర శైలిలో..
ఐదు గుమ్మటాలు.. 161 అడుగుల ఎత్తయిన గోపురంతో అలరారనున్న రామ మందిరం ‘నాగర’శైలిలో నిర్మాణం కానుంది. మూడు అంతస్తుల ఈ మందిర నిర్మాణానికి మూడున్నరేళ్ల సమయం పడుతుందని అంచనా. 1990లో సిద్ధమైన మందిర డిజైన్ లో తాజాగా పలు మార్పులు చేశారు. మందిర నిర్మాణానికి ఆర్కిటెక్ట్ అశీష్ సోంపుర డిజైన్ ఇచ్చారు. దేవాలయ నిర్మాణ శైలుల్లో ‘నాగర‘అనేది ఒకటి కాగా, ద్రావిడ, బాసర్ అనేవి మిగతావి. రూ.300 కోట్ల అంచనా వ్యయంతో మందిరాన్ని నిర్మిస్తున్నారు
1528 నుంచి 2019 తీర్పు వరకు...
కొన్ని దశాబ్దాలుగా అయోధ్య భూ వివాదం దేశంలో రాజకీయ, చారిత్రక, సామాజిక మతపరమైన చర్చగా కొనసాగుతూ వచ్చింది. హిందూ, ముస్లింల మధ్య దశాబ్దాల వివాదానికి కారణం హిందువుల ఆరాధ్య దైవం రాముడి జన్మభూమిగా భావించే ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని భూమికి సంబంధించింది. అయోధ్యలో బాబ్రీ మసీదు ఉన్న స్థలంలో ఒకప్పుడు హిందూ దేవాలయం ఉండేదని, ఆ తరువాత దాన్ని పడగొట్టి బాబ్రీ మసీదు నిర్మాణం జరిగినట్టు కొందరి విశ్వాసం. అయితే మొఘల్ చక్రవర్తి బాబర్ ఆదేశాల మేరకు 1528వ సంవత్సరంలో మీర్ బఖీ ఇక్కడ మసీదు నిర్మించారని, అందువల్ల ఆ స్థలం తమదేననిముస్లింలు వాదిస్తూ వచ్చారు.
యాజమాన్య హక్కుల కోసం
ఈ దేవాలయం కూల్చి వేత, దాని స్థానంలో మసీదు నిర్మాణం ఈ రెండు వర్గాల మధ్య వివాదానికి తెరతీసింది. 1949లో హిందువులు రాముడి విగ్రహాన్ని తీసుకొచ్చి మసీదులో పెట్టడాన్ని కొందరు ముస్లింలుచూసినట్లు కొందరి వాదన. అప్పటి నుంచి ఈ స్థలంపై యాజమాన్యపు హక్కులు మావంటే మావని ఇరు వర్గాలు వాదిస్తూవచ్చాయి. ఫలితంగా ప్రభుత్వం ఈ స్థలాన్ని పూర్తిగా మూసివేసింది. ఈ స్థలాన్ని అప్పగించాలని కోరుతూ 1959, డిసెంబర్ 17న నిర్మోహిఅఖారాకోర్టుకెళ్ళింది. ఇదే స్థలంపై యాజమాన్య హక్కుల కోసం డిసెంబర్ 18, 1961న సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్‌కూడా కోర్టుని ఆశ్రయించింది. ఈ వివాదం ఇరువర్గాల మధ్య కొన్ని దశాబ్దాల పాటు ఘర్షణాత్మక పరిస్థితులకు దారితీసింది.
బాబ్రీ మసీదు కూల్చివేత
తరువాత డిసెంబర్ 6, 1992న హిందూ కరసేవకులు బాబ్రీ మసీదుని కూల్చి వేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా మతకలహాలకు దారితీసింది. 2,000 మందికి పైగా చనిపోయారు. ఆ తరువాతి కాలంలో ఈ అంశం పై ఇరువర్గాలు దేశంలోని పలుకోర్టులను ఆశ్రయించాయి. ఇదిలా ఉండగా, అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమి హిందు వులు, ముస్లింలు, నిర్మోహిఅఖారాల మధ్య విభజన చేయాలని అలహాబాద్ హైకోర్టు సెప్టెంబర్ 30, 2010న ఆదేశాలిచ్చింది. ఈ తీర్పుపై పిటిషనర్లు సుప్రీంకోర్టుని ఆశ్రయించగా, అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. సుప్రీంకోర్టు ఈ కేసుపై 2016లో తిరిగి విచారణ ప్రారంభించింది. ఈ వివాదం అత్యంత సున్నితమైందని, దీన్ని కోర్టు వెలుపల తేల్చు కోవాలని సుప్రీంకోర్టు 2017లో చెప్పింది. అయితే, అది కార్యరూపం దాల్చలేదు.
సుప్రీంకోర్టు తీర్పు..
సుప్రీంకోర్టు 2018లో ఈ కేసు విచారణకు ఐదు గురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఈ ధర్మాసనం ఆగస్టు 6, 2019 నుంచి అక్టోబర్ 16 వరకు రోజువారీ వాదనలు చేపట్టింది. తుది తీర్పుని నవంబర్ 9న వెలువరించింది. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలంపై యాజమాన్య హక్కులు రామజన్మభూమి ట్రస్ట్‌కి చెందుతాయని ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది. అలాగే అయోధ్యలోనే ప్రత్యామ్నాయంగా ముస్లింలకు మసీదు నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని ఆదేశించింది. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి మూడు నెలల్లోపు ట్రస్ట్ ఏర్పాటు చేసి, నిర్మాణానికి చర్యలు చేపట్టాలని తేల్చిచెప్పింది.
Published date : 01 Sep 2020 12:00PM