Skip to main content

World of Statistics: భారతీయుల సగటు జీతం రూ.46,861

World of Statistics

ఉద్యోగులు, కార్మికుల సగటు నెలవారీ జీతం విషయంలో భారత్‌ చాలా దేశాల కంటే వెనుకబడిందని 'ది వరల్డ్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌' సంస్థ పేర్కొంది. భారత్‌లో సగటు నెల జీతం రూ.46,861గా ఉన్నదని తెలిపింది. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాల్లో ఉన్న సగటు నెలవారీ జీతాలకు సంబంధించిన గణాంకాలను వరల్డ్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ విడుదల చేసింది. ఈ డాటా ప్రకారం-మన కరెన్సీలో లక్ష రూపాయాల కంటే అధిక సగటు నెల వేతనం 23 దేశాల్లో ఉంది. ఈ జాబితాలో రూ.50 వేల కంటే తక్కు వ సగటు వేతనంతో భారత్‌ 65వ స్థానంలో ఉంది. రూ.4,98,567 సగటు వేతనంలో స్విట్జర్లాండ్‌ మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో లక్సెంబర్గ్, సింగపూర్, అమెరికా ఉన్నాయి. చైనాలో సగటు నెల వేతనం రూ.87,426గా ఉన్నది. భారత్‌ కంటే వెనుకబడిన దేశాల జాబితాలో బ్రెజిల్, అర్జెంటీనా, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌ వంటివి ఉన్నాయి. సగటు నెల జీతంలో టాప్‌5 దేశాలు(రూ.ల్లో): స్విట్జర్లాండ్‌ - రూ.4,98,567; లక్సెంబర్గ్‌ - రూ.4,10,156; సింగపూర్‌-రూ.4,08,030;అమెరికా- రూ.3,47,181, ఐస్‌లాండ్‌ - రూ.3,27,716.
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 12 May 2023 06:30PM

Photo Stories