Skip to main content

Greenpeace India report: 99 శాతం మందికి కలుషిత గాలే గతి

 దేశ జనాభాలో అక్షరాలా 99 శాతం మంది కలుషిత గాలి పీలుస్తున్నారు. పీఎం 2.5 విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) నిర్దేశించిన ప్రమాణాలను మీరిన గాలే దిక్కవుతోంది.
99 percent of people are exposed to polluted air
99 percent of people are exposed to polluted air

గ్రీన్‌పీస్‌ ఇండియా సంస్థ ‘డిఫరెంట్‌ ఎయిర్‌ అండర్‌ వన్‌ స్కై’ పేరిట సెప్టెంబర్ 2 న విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. నివేదికలోని ముఖ్యాంశాలు..  

  • భారత్‌లో ప్రజలు పీలుస్తున్న గాలి డబ్ల్యూహెచ్‌ఓ వార్షిక సగటు గైడ్‌లైన్‌ కంటే ఐదు రెట్లు అధిక పీఎం 2.5 కణాలు కలిగి ఉంటున్నదే.  
  • దేశంలో 62 శాతం మంది గర్భిణులు అత్యంత కాలుష్య ప్రాంతాల్లో నివసిస్తున్నారు. మొత్తం జనాభాలో 56 శాతం మంది ఇలాంటి ప్రాంతాల్లోనే ఉంటున్నారు.  
  • ఇండియాలో అత్యధిక కాలుష్య ప్రాంతం దేశ రాజధాని ప్రాంతం–ఢిల్లీ.   
  • కలుషిత గాలి వల్ల  వయోవృద్ధులు, శిశువులు, గర్భిణులు అధికంగా ప్రభావితమవుతున్నారు.  
  • గాలి కాలుష్యానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంచాలి. ఎయిర్‌ క్వాలిటీ మానిటరింగ్‌ సిస్టమ్‌ను ప్రభుత్వాలు తప్పనిసరిగా ప్రారంభించాలి.  
  • గాలి కాలుష్యం ఎక్కువగా ఉండేందుకు ఆస్కారం ఉన్న రోజుల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించాలి. ప్రజలకు ఆరోగ్య సూచనలు జారీ చేయాలి. దీనివల్ల వారు అప్రమత్తంగా వ్యవహరించేందుకు వీలుంటుంది.  
  • ఇప్పుడున్న జాతీయ గాలి నాణ్యత ప్రమాణాల్లో వెంటనే మార్పులు చేయాల్సిన అవసరం ఉంది.   
  • నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రామ్‌(ఎన్‌సీఏపీ)ను మరింత పారదర్శకంగా, శక్తివంతంగా, సమగ్రంగా రూపొందించాలి.  

Also read: Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 2nd కరెంట్‌ అఫైర్స్‌

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 03 Sep 2022 06:01PM

Photo Stories