Skip to main content

Water Filter: మైక్రోప్లాస్టిక్‌ను తొలగించే వాటర్‌ ఫిల్టర్‌

water filter that removes microplastics

నీటిలోని ప్లాస్టిక్‌ సూక్ష్మ వ్యర్థాలతోపాటుగా ఇతర కలుషితాలను సమర్థంగా, తక్కువ సమయంలో తొలగించే కొత్త వాటర్‌ ఫిల్టర్‌ను కొరియా శాస్త్రవేత్తలు రూపొందించారు. సౌర ఆధారిత నీటి వడపోత వ్యవస్థ తయారీకి ముడి పదార్థాల ఖర్చూ తక్కువే ఉంటుందన్నారు. నీటి శుద్ధిలో ఈ సాంకేతికత ప్రపంచంలోనే అత్యున్నతమైనదని అడ్వాన్స్‌డ్‌ మెటీరియల్స్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఓ వ్యాసంలో పేర్కొన్నారు. కొత్త ఫిల్టర్‌ నీటిలోని ఫినోలిక్‌ మైక్రోప్లాస్టిక్స్‌ను, సేంద్రియ కాలుష్యాలను 99.9శాతం అత్యంత వేగంగా తొలగిస్తుందని కొరియాలోని దైగూ గ్యోంబుక్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. ఇందులో ఉపయోగించే వడపోత పదార్థం కీలకమైందని, త్వరలో అందరికీ అందుబాటులోకి వస్తుందన్నారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 14 Jan 2023 12:38PM

Photo Stories