Flight MH17 : ఎంహెచ్17 విమాన ఘటనలో ముగ్గురికి యావజ్జీవం
Sakshi Education
298 మంది మృతికి కారణమైన ఎంహెచ్17 మలేసియా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ఘటనలో నెదర్లాండ్స్ కోర్టు ఇద్దరు రష్యన్లు, ఒక ఉక్రెయిన్ వేర్పాటువాదికి నవంబర్ 17న యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
2014 జూలై 17న నెదర్లాండ్స్‌లోని అమ్‌స్టర్‌డ్యామ్ నుంచి మలేసియాలోని కౌలాలంపూర్‌కు బయలుదేరిన బోయింగ్ 777 విమానాన్ని రష్యా అనుకూల ఉక్రెయిన్ వేర్పాటువాదులు బక్ మిస్సైల్ ప్రయోగించి, కూల్చేశారు. విమానం ఉక్రెయిన్ భూభాగంలో కూలిపోయింది. ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది సహా మొత్తం 298 మంది మరణించారు.
Published date : 18 Nov 2022 01:33PM