Skip to main content

Russian Spy Whale : రష్యా నిఘా తిమింగలం హ్వాల్దిమిర్‌ మృతి

‘హ్వాల్దిమిర్‌’ పేరుతో 2019లో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బెలుగా రకపు తిమింగలం నార్వేలోని ఓస్లోఫ్జోర్డ్‌లో ఆగస్టు 31న మరణించింది.
Russian spy whale Hvaldimir has died

‘హ్వాల్దిమిర్‌’ పేరుతో 2019లో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బెలుగా రకపు తిమింగలం నార్వేలోని ఓస్లోఫ్జోర్డ్‌లో ఆగస్టు 31న మరణించింది. 14 అడుగుల పొడవు, 2700 పౌండ్ల బరువు గల ఈ తిమింగలం మెడకు సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌ అనే లేబుల్‌ ఉండటంతో దాన్ని రష్యా నిఘా తిమింగలంగా అనుమానించారు. అయితే ఆ తిమింగలం తమదేనని రష్యా ఎలాంటి అధికార ప్రకటన చేయకపోవడంతో అది నిఘా తిమింగలమా లేదా వింత పరిస్థితుల్లో అలా చిక్కుకుపోయిందా అని ఎవరూ తేల్చుకోలేకపోయారు. 

Nuclear Clock : ప్రపంచంలోనే తొలి న్యూక్లియర్‌ క్లాక్‌

‘హ్వాల్‌’ అనే నార్వేజియన్‌ పేరు, ‘వ్లాదిమిర్‌’ అనే రష్యన్‌ పేరు కలిపి ఈ తిమింగలానికి హ్వాల్దిమిర్‌ అని పేరు పెట్టారు. సాధారణంగా అతి చల్లని ఆర్కిటిక్‌ జలాల్లో నివసించే బెలుగాలకు భిన్నంగా హ్వాల్దిమిర్‌ మనుషుల మధ్య సౌకర్యవంతంగా ఉండేది. ‘ఇది హృదయ విదారకం. హ్వాల్దిమిర్‌ నార్వేలోని వేలాది మంది గుండెలను తాకింది’ అని దాన్ని సంరక్షించిన మెరైన్‌ మైండ్‌ వ్యవస్థాపకుడు సెబాస్టియన్‌ స్ట్రాండ్‌ అన్నారు. హ్వాల్దిమిర్‌తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని గతేడాది నార్వే తన పౌరుల్ని కోరింది.

Published date : 15 Sep 2024 09:01AM

Photo Stories