ఫిబ్రవరి 2020 అంతర్జాతీయం
Sakshi Education
గ్రే లిస్టులోనే పాకిస్తాన్: ఎఫ్‌ఏటీఎఫ్
ఉగ్రసంస్థలకు నిధులు అందకుండా చేయడంలో విఫలమైన పాకిస్తాన్‌ను ‘గ్రే లిస్ట్’లోనే కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ సంస్థ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) ఫిబ్రవరి 21న ప్రకటించింది. 2020, జూన్‌లోపు ఎఫ్‌ఏటీఎఫ్ ఆదేశాలను అమలు చేయకపోతే వాణిజ్యపరమైన పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పాక్‌ను హెచ్చరించింది. భారత్‌లో పలు ఉగ్రదాడులకు కారణమైన సంస్థలకు నిధులు అందకుండా చేసేందుకు 27 చర్యలు చేపట్టాలని ఆదేశించినా పాకిస్తాన్ వాటిల్లో కొన్నింటిని మాత్రమే అమలు చేసిందని గుర్తు చేసింది.
పాకిస్థాన్ గ్రే లిస్టులో కొనసాగితే ఈయూ, ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి ఆర్థిక సాయం అందడం కష్టమవుతుంది. ఎఫ్‌ఏటీఎఫ్‌లో 39 సభ్య దేశాలు ఉన్నాయి. గ్రే లిస్ట్ నుంచి తప్పించుకొని, వైట్ లిస్ట్‌కు చేరుకోవడానికి పాక్‌కు 12 దేశాల మద్దతు అవసరం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గ్రే లిస్టులోనే పాకిస్తాన్‌ను కొనసాగిస్తాం
ఎప్పుడు : ఫిబ్రవరి 21
ఎవరు : ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్)
ఎందుకు : ఉగ్రసంస్థలకు నిధులు అందకుండా చేయడంలో విఫలమైనందున
శ్రీలంక ఆర్మీచీఫ్ షవేంద్ర సిల్వపై అమెరికా నిషేధం
శ్రీలంక ఆర్మీ చీఫ్ షవేంద్ర సిల్వతో పాటు అతడి కుటుంబ సభ్యులపై అమెరికా ప్రభుత్వం నిషేధం విధించింది. సిల్వను అమెరికాలోకి అనుమతించబోమని ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో చెప్పారు. 2009 అంతర్యుద్ధంలో భారీగా మానవహక్కుల ఉల్లంఘనలకు అతడు పాల్పడినట్లు తమ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయన్నారు. ఆయా ఆధారాలను ఐక్యరాజ్యసమితి సహా పలు సంస్థలు కూడా గుర్తించాయని పాంపియో పేర్కొన్నారు. శాంతిని, మానవ హక్కులను పెంపొందించాలంటూ శ్రీలంక ప్రభుత్వానికి అమెరికా సూచించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : శ్రీలంక ఆర్మీ చీఫ్ షవేంద్ర సిల్వపై నిషేధం
ఎప్పుడు : ఫిబ్రవరి 14
ఎవరు : అమెరికా
ఎందుకు : మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారని...
సీఓపీ-13ని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
వన్య వలస జాతుల పరిరక్షణపై గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరుగుతున్న 13వ ‘‘కాన్ఫెరెన్స్ ఆఫ్ పార్టీస్(సీఓపీ-13) ఆఫ్ ద కన్వెన్షన్ ఆన్ ది కన్సర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీషీస్ ఆఫ్ వైల్డ్ ఎనిమల్స్(సీఎంఎస్)’’ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 17న వీడియో మాధ్యమం ద్వారా ప్రసంగించారు. పర్యావరణానికి హాని కలగని రీతిలో సుస్థిర, సంతులిత అభివృద్ధి సాధించడం భారత్ అవలంబిస్తున్న విధానమని ఈ సందర్భంగా మోదీ స్పష్టం చేశారు. ఉష్ణోగ్రతలో పెరుగుదల 2 డిగ్రీల సెల్సియల్ లోపే ఉండాలన్న పారిస్ పర్యావరణ ఒప్పందాన్ని అమలు చేస్తున్న అతికొద్ది దేశాల్లో భారత్ ఒకటని గుర్తు చేశారు.
సీఓపీ-13కి స్లోగన్ థీమ్ : ‘వలస జాతులు ఈ భూగ్రహాన్ని అనుసంధానిస్తాయి. మనం ఉమ్మడిగా వాటికి ఆహ్వానం పలుకుదాం’
భారత్‌కు అధ్యక్ష బాధ్యతలు: సీఎంఎస్ సీఓపీ సదస్సు అధ్యక్ష బాధ్యతలను ఫిలిప్పీన్స్ నుంచి భారత్ అధికారికంగా స్వీకరించింది. 2023 వరకు ఈ బాధ్యతల్లో భారత్ కొనసాగనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సీఎంఎస్ సీఓపీ సదస్సును ఉద్దేశించి ప్రసంగం
ఎప్పుడు : ఫిబ్రవరి 17
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : గాంధీనగర్, గుజరాత్
పాక్‌ను గ్రే లిస్ట్‌లోనే కొనసాగించాలి: ఎఫ్‌ఏటీఎఫ్
ఉగ్రసంస్థలకు నిధులు అందకుండా చేయడంలో విఫలమైన పాకిస్తాన్‌ను ‘గ్రే లిస్ట్’లోనే కొనసాగించాలని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(ఎఫ్‌ఏటీఎఫ్) ఉపకమిటీ సిఫారసు చేసింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరుగుతున్న సమావేశంలో ఫిబ్రవరి 18న ఎఫ్‌ఏటీఎఫ్‌కు చెందిన ఐసీఆర్‌జీ(ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ రివ్యూ గ్రూప్)ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీనిపై ఫిబ్రవరి, 21వ తేదీన జరిగే ఎఫ్‌ఏటీఎఫ్ అత్యున్నత స్థాయి సమావేశం అంతిమ నిర్ణయం తీసుకోనుంది. ఎఫ్‌ఏటీఎఫ్‌లో 39 సభ్య దేశాలు ఉన్నాయి. గ్రే లిస్ట్ నుంచి తప్పించుకొని, వైట్ లిస్ట్‌కు చేరుకోవడానికి పాక్‌కు 12 దేశాల మద్దతు అవసరం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాకిస్తాన్‌ను గ్రే లిస్ట్‌లోనే కొనసాగించాలి
ఎప్పుడు : ఫిబ్రవరి 18
ఎవరు : ఎఫ్‌ఏటీఎఫ్‌కు చెందిన ఐసీఆర్‌జీ

యూకేలో పాయింట్స్ ఆధారిత వీసా ఆవిష్కరణ
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ, అత్యంత తెలివైన నిపుణులను తమ దేశంలోకి ఆహ్వానించే నూతన ‘పాయింట్స్ ఆధారిత వీసా’ విధానాన్ని బ్రిటన్ ఫిబ్రవరి 19న ఆవిష్కరించింది. నిపుణులు కాని, చవక కార్మికుల వలసలను నిరోధించే దిశగా ఈ విధానాన్ని రూపొందించామని భారత సంతతికి చెందిన యూకే హోం మంత్రి ప్రీతి పటేల్ తెలిపారు. ఈ తాజా వీసా విధానం 2021, జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందన్నారు. విద్యార్హతలు, ప్రత్యేక నైపుణ్యాలు, వృత్తులు, వేతనాలు.. మొదలైన వాటికి పాయింట్లను కేటాయించి, అవసరమైన అర్హత పాయింట్లు సాధించిన వారికే వీసా ఇచ్చేలా ఈ విధానాన్ని రూపొందించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాయింట్స్ ఆధారిత వీసా విధానం ఆవిష్కరణ
ఎప్పుడు : ఫిబ్రవరి 19
ఎవరు : యూకే ప్రభుత్వం
ఎందుకు : ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ, అత్యంత తెలివైన నిపుణులను తమ దేశంలోకి ఆహ్వానించేందుకు
రేపిస్టుల బహిరంగ ఉరికి పాక్ పార్లమెంట్ ఆమోదం
పిల్లలపై అత్యాచారాలకు, హత్యాచారాలకు పాల్పడే వారికి బహిరంగ ఉరిశిక్ష అమలు చేసే తీర్మానాన్ని పాకిస్తాన్ పార్లమెంట్ ఫిబ్రవరి 7న ఆమోదించింది. దేశంలో చిన్నారులపై పెరుగుతున్న హత్యాచారాలను నియంత్రించేందుకే ఈ తీర్మానాన్ని తీసుకొస్తున్నట్లు ఆ దేశ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి మొహమ్మద్ ఖాన్ చెప్పారు. హత్యాచారం చేసే వారికి కేవలం ఉరి సరిపోదని, వారికి బహిరంగ ఉరి వేయాల్సిందేనని తీర్మానం ప్రవేశపెడుతూ ఆయన చెప్పారు. ఈ తీర్మానం మెజారిటీ ఓట్లతో పాసయింది.
2018లో నౌషెరా అనే ప్రాంతంలో 8 ఏళ్ళ బాలికపై అత్యాచారం, ఆపై హత్య జరిగిన దారుణ ఘటన పాకిస్తాన్‌లో సంచలన సృష్ట్టించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా 2018 ఏడాదిలో చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించి 3,800 కేసులు నమోదైనట్లు అంచనా.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రేపిస్టుల బహిరంగ ఉరికి ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు : పాకిస్తాన్ పార్లమెంట్
కరోనాపై పీపుల్స్‌వార్‌ను ప్రారంభించాం: జిన్‌పింగ్
కరోనా విజృంభణ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఫిబ్రవరి 7న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారు. కరోనా రోగుల చికిత్సకు, వైరస్ కట్టడికి ‘పీపుల్స్‌వార్’ను ప్రారంభించామని ట్రంప్‌నకు వివరించారు. ఏదైనా ఒక సమస్యపై ప్రజల సహకారంతో విసృ్తత, దీర్ఘకాలం పోరు అనే ఉద్దేశంతో ‘పీపుల్స్ వార్’ అనే సైద్ధాంతిక భావనను మావో తొలిసారి ఉపయోగించారు.
637 మంది మృతి
చైనాలో కరోనా వైరస్ బారిన పడి ఫిబ్రవరి 7న నాటికి మొత్తం 637 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 73 మంది ఫిబ్రవరి 7 తేదీనే చనిపోయారు. వారిలో వైరస్‌కు కేంద్ర బిందువుగా మారిన వుహాన్ పట్టణం ఉన్న హ్యుబయి ప్రావిన్స్ లోనే 69 మంది మృతి చెందారు. చైనా వ్యాప్తంగా వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయిన వారి సంఖ్య 31 వేలకు చేరుకుంది. ప్రస్తుతం భారత్ సహా 27 దేశాలకు ఈ వైరస్ వ్యాపించింది. భారత్‌లో మూడు సహా చైనాయేతర దేశాల్లో మొత్తం 220 కేసులు నమోదయ్యాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కరోనాపై పీపుల్స్‌వార్‌ను ప్రారంభించాం
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు : చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్
ఎందుకు : కరోనా విజృంభణ నేపథ్యంలో...
సార్స్‌ను దాటేసిన కరోనా మరణాలు
ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. 26 దేశాలకు విస్తరించిన ఈ వైరస్.. ఒక్క చైనాలోనే ఫిబ్రవరి 8వ తేదీ నాటికి 813 మందిని బలికొన్నది. ఈ వైరస్ సోకి, చికిత్స పొందుతున్నవారి సంఖ్య ఫిబ్రవరి 8వ తేదీ నాటికి 37వేలు దాటింది. ఈ గణాంకాలు కరోనా కల్లోలాన్ని కళ్లకు కడుతున్నాయి. 2002-03లో ప్రపంచాన్ని వణికించిన ‘సార్స్’ వైరస్‌ను మించిన ప్రమాదకారిగా ఈ కరోనా పరిణమించింది. నాడు ‘సార్స్’ కారణంగా ప్రపంచవ్యాప్తంగా చనిపోయినవారి సంఖ్య 774 కాగా, ఇప్పటికే కరోనా మృతుల సంఖ్య 800 దాటింది. కరోనా తరహాలోనే సార్స్ వైరస్‌ను కూడా మొదట చైనాలోనే గుర్తించారు. ఈ రెండు కూడా ఒకే వైరల్ కుటుంబానికి చెందినవే.
భారత్ స్నేహ హస్తం
కరోనా వైరస్ కారణంగా అతలాకుతలమవుతున్న చైనాకు భారత్ స్నేహ హస్తం అందించింది. కరోనా కట్టడికి అవసరమైన ఏ సాయమైనా చేసేందుకు సిద్ధమని తెలిపింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు ఫిబ్రవరి 9న లేఖ రాశారు. చైనాలోని భారతీయుల ఆరోగ్యం, భద్రత విషయంలో భారత్‌తో సమన్వయం చేసుకునేందుకు, కరోనాను ఎదుర్కొనే విషయంలో భారత్ సాయం తీసుకునేందుకు చైనా సిద్ధంగా ఉందని భారత్‌లో చైనా రాయబారి సున్ వీడాంగ్ పేర్కొన్నారు.
చైనాతో రష్యా సరిహద్దు మూసివేత
చైనాతో ఉన్న రష్యా సరిహద్దును తాత్కాలికంగామూసివేస్తున్నట్లు రష్యా జనవరి 30న ప్రకటించింది. చైనాలో విస్తరిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రష్యా ప్రధాని మైఖేల్ మిషుస్తిన్ వెల్లడించారు. అలాగే చైనీయులకు ఎలక్టాన్రిక్ వీసాల జారీని కూడా నిలిపివేస్తామని పేర్కొన్నారు. తమ దేశ ప్రజలను రక్షించుకునేందుకు తాము అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామన్నారు. తమ దేశ పౌరులు చైనా పర్యటనలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని, చైనాలో వున్న రష్యా పౌరులు అక్కడి తమ దౌత్య కార్యాలయాన్ని సంప్రదించాలని రష్యా విదేశాంగ శాఖ సూచించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చైనాతో రష్యా సరిహద్దు మూసివేత
ఎప్పుడు : జనవరి 30
ఎవరు : రష్యా ప్రధాని మైఖేల్ మిషుస్తిన్
ఎందుకు : కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు
గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటన
ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో... జెనీవాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితి(గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ)ని ప్రకటించింది. దీంతో కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు కలిసి పనిచేయాలని సందేశాన్ని పంపింది. ఆరోగ్యపరంగా బలహీనంగా ఉన్న వ్యవస్థల్లో ఈ వైరస్ తీవ్రత భారీగా ఉండే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌వో డెరైక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాల్సి వచ్చిందని వెల్లడించారు.
హెల్త్ ఎమర్జెన్సీ...
ఒక దేశ సరిహద్దును దాటి ప్రపంచ దేశాలకు వేగంగా వ్యాధులు విస్తరిస్తూ ప్రజా ఆరోగ్యానికి ఆందోళనకరంగా మారిన ఆసాధారణ పరిస్థితిలో గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటిస్తారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ 2005లో తీసుకొచ్చిన ఆంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల ప్రకారం అన్ని దేశాలు హెల్త్ ఎమర్జెన్సీపై ఖచ్చితంగా తక్షణమే స్పందించడం చట్టపరమైన విధి. ఇప్పటి వరకు ఆరు సార్లు గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటన
ఎప్పుడు : జనవరి 31
ఎవరు : ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)
ఎందుకు : కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో
జనవరి 31 నుంచి అమల్లోకి వచ్చిన బ్రెగ్జిట్
యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ విడిపోయే బ్రెగ్జిట్ ఒప్పందం 2020, జనవరి 31 అర్ధరాత్రి 11 గంటల నుంచి(బ్రిటన్ కాలమానం ప్రకారం) అమల్లోకి వచ్చింది. దీంతో ఈయూ కూటమిలోని సభ్య దేశాల సంఖ్య 28 నుంచి 27కి తగ్గింది. బ్రెగ్జిట్ సందర్భంగా బ్రిటన్ ‘అన్ని దేశాలకు శాంతి, శ్రేయస్సు, స్నేహం’నినాదంతో కూడిన 50 పెన్స్(అరపౌండ్) నాణేన్ని విడుదల చేసింది. యూరోపియన్ యూనియన్‌కు చెందిన అన్ని సంస్థలపైనా బ్రిటన్ యూనియన్ జాక్ జెండాను తొలగించారు. కాగా, బ్రెగ్జిట్‌తో బ్రిటన్, ఈయూ మధ్య ఒక్కసారిగా ఎలాంటి మార్పులు రావు. ఒప్పందం ప్రకారం.. ఫిబ్రవరి 1 నుంచి 2020, డిసెంబర్ కల్లా పూర్తి స్థాయిలో బ్రెగ్జిట్ అమలుకానుంది.
బ్రెగ్జిట్ సందర్భంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఒక ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో.. ‘చీకట్లు తొలగిపోతున్న వేళ ఘనమైన మన జాతి కొత్త పాత్ర ఆవిష్కృతం కానుంది. ప్రతి ప్రాంత వాసుల కలలు సాకారం కానున్నాయి. బ్రెగ్జిట్ కేవలం న్యాయపరమైన చర్య కాదు. జాతి పరివర్తన, పునరుత్తేజం పొందే క్షణం’అని పేర్కొన్నారు. ఈయూ నుంచి విడిపోవడంతో మన విధానాలను స్వేచ్ఛగా అమలు చేసే అవకాశం వచ్చిందన్నారు.
అమెరికా అధ్యక్షుడిపై వీగిన అభిశంసన తీర్మానం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై డెమొక్రాట్లు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం రిపబ్లికన్ల ఆధిక్యంలోని సెనేట్‌లో వీగిపోయింది. అధికార దుర్వినియోగం, కాంగ్రెస్ అధికారాన్ని అడ్డుకున్నారన్న ఆరోపణలతో ట్రంప్‌పై 2019, డిసెంబర్‌లో డెమొక్రటిక్ పార్టీ అమెరికన్ కాంగ్రెస్‌లో అభిశంసనను ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ ఆమోదం పొందిన అభిశంసన తీర్మానాన్ని తాజాగా సెనేట్‌లో ప్రవేశపెట్టారు. ఇందులో ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న అభియోగం 52-48 ఓట్ల తేడాతో, కాంగ్రెస్ విధులకు ఆటంకం కలిగించారనే అభియోగం 53-47 ఓట్ల తేడాతో వీగిపోయాయి. అభిశంసనను తిప్పికొట్టేందుకు 100 మంది సభ్యుల సభలో మూడింట రెండొంతుల ఓట్లు అవసరం. సెనేట్‌లో అధికార రిపబ్లికన్ పార్టీకి 53 సీట్లు, డెమొక్రటిక్ పార్టీకి 47 సీట్లు ఉన్నాయి.
అంతర్జాతీయ మత స్వాతంత్య్ర కూటమి ఏర్పాటు
ప్రపంచవ్యాప్తంగా వ్యక్తుల మత స్వేచ్ఛను పరిరక్షించేందుకు 27 దేశాలు కలిసి అంతర్జాతీయ మత స్వాతంత్య్ర కూటమి (ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడం అలయెన్స్)గా ఏర్పాటయ్యాయి. అమెరికాలోని వాషింగ్టన్‌లో ఫిబ్రవరి 5న ఈ కూటమి ప్రారంభమైంది. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, బ్రిటన్, ఇజ్రాయెల్, ఉక్రెయిన్, నెదర్లాండ్‌స, గ్రీస్ తదితర దేశాలు ఈ కూటమిలో సభ్య దేశాలుగా చేరాయి. మత స్వాతంత్యాన్న్రి గౌరవించి, పరిరక్షించేందుకు కట్టుబడి ఉంటామని కూటమిలోని సభ్య దేశాలు ప్రతినబూనాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంతర్జాతీయ మత స్వాతంత్య్ర కూటమి ఏర్పాటు
ఎప్పుడు : ఫిబ్రవరి 5
ఎవరు : 27 దేశాలు
ఎక్కడ : వాషింగ్టన్, అమెరికా
ఎందుకు : ప్రపంచవ్యాప్తంగా వ్యక్తుల మత స్వేచ్ఛను పరిరక్షించేందుకు

Published date : 01 Mar 2020 02:56PM