Skip to main content

New Strain: బి.1.1.529 అనే కోవిడ్ వేరియెంట్‌ ఏ దేశంలో వెలుగుచూసింది?

New Variant

దక్షిణాఫ్రికాలో ‘బి.1.1.529’ అనే ప్రమాదకరమైన కోవిడ్-19  వేరియెంట్‌ వెలుగుచూసింది. దక్షిణాఫ్రికా, బోట్స్వానా దేశాల్లో ఈ రకానికి చెందిన 100 కేసులను గుర్తించారు. ఇది పలు మ్యూటెంట్ల సమ్మేళనంగా (అసాధారణ ఉత్పరివర్తనాల సమూహంగా) కనపడుతోందని లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజీ వైరాలజిస్టు డాక్టర్‌ టామ్‌ పీకాక్‌ వెల్లడించారు. మానవ శరీరంలోని రోగనిరోధక శక్తిని ఏమార్చగలదని, మరింత వేగంగా వ్యాప్తిచెందగలదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న, హెచ్‌ఐవీ/ ఎయిడ్స్‌ సోకి చికిత్స పొందని వ్యక్తి శరీరంలో ఈ మ్యూటెంట్‌ అభివృద్ధి చెంది ఉంటుందని భావిస్తున్నారు. ఇది ఏమేరకు వేగంగా వ్యాప్తి చెందగలదు, ఎంతటి హానికరమనేది ప్రస్తుత దశలో ఏమీ చెప్పలేమని దక్షిణాఫ్రికా జాతీయ అంటువ్యాధుల కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. హాంగ్‌కాంగ్‌లోనూ ఈ వేరియెంట్‌ కేసులు బయటపడ్డాయి.

కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ వాణిజ్య ఎగుమతులు

కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ టీకాలను విదేశాలకు వాణిజ్యపరంగా ఎగుమతి చేసుకోవడానికి భారత ప్రభుత్వం అనుమతించింది. దేశవ్యాప్తంగా రాష్ట్రాల వద్ద సరిపడా టీకాలు ఉండడంతో పాటు తయారీ సంస్థల వద్ద కూడా నిల్వలు భారీగా ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భారత్‌లో ప్రస్తుతం 22.72 కోట్లకు పైగా టీకా డోసులు అందుబాటులో ఉన్నాయి.

 

వ్యాక్సిన్ల కొనుగోలుకు రూ.11 వేల కోట్ల రుణం

కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ కొనుగోలు కోసం భారత్‌కు ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు(ఏడీబీ) 150 కోట్ల అమెరికా డాలర్ల (దాదాపు రూ.11,185 కోట్లు) రుణాన్ని మంజూరు చేసింది. ఈ విషయాన్ని నవంబర్ 25న ఏడీబీ ఒక ప్రకటనలో వెల్లడించింది. కోవిడ్‌పై పోరాటం కోసం సురక్షితమైన, సమర్థవంతమైన వ్యాక్సిన్ల కొనుగోలు కోసం ఈ నిధులను వినియోగించనున్నారు.

చ‌ద‌వండి: లిబియా దేశ రాజధాని నగరం పేరు?

డౌన్‌లోడ్‌చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌చేసుకోండి.

యాప్‌డౌన్‌లోడ్‌ఇలా...
డౌన్‌లోడ్‌వయా గూగుల్‌ప్లేస్టోర్‌

Published date : 26 Nov 2021 08:59PM

Photo Stories