Skip to main content

World's Oldest Fish: అత్యంత వయసైన అక్వేరియం చేప పేరు?

Methuselah -  Oldest Fish

భూమ్మీది అక్వేరియంలన్నింటిలోకెల్లా అత్యంత వయసున్న చేప ‘‘మెథుసెలా’’. శాన్‌ఫ్రాన్సిస్కోని మ్యూజియంలో ఉన్న అక్వేరియంలో ఇది జీవిస్తోంది. దీని వయసు దాదాపు 90 ఏళ్లని కాలిఫోర్నియా అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ బయాలజిస్టులు తెలిపారు. నాలుగడుగుల పొడవు, 40 పౌండ్ల బరవుండే ఈ చేపను శాన్‌ఫ్రాన్సిస్కో మ్యూజియంకు 1938లో ఆస్ట్రేలియా నుంచి తెచ్చారు. అప్పటికి దీని వయసు ఆరేళ్లని ఓ అంచనా. ఆస్ట్లేలియన్‌ లంగ్‌ ఫిష్‌ జాతికి చెందిన ఈ చేప ఉభయచరాలకు, చేపలకు మధ్య వారధిలాంటిది. దీని గురించి 1947లోనే మీడియాలో కథనాలు వచ్చాయి. దీనికన్నా వృద్ధురాలు గ్రాండ్‌ డాడ్‌ అనే చేప 95ఏళ్ల వయసులో 2017లో మరణించింది. దీంతో ప్రస్తుతం అత్యంత వయసైన అక్వేరియం చేప హోదా దీనికి దక్కింది.

చ‌ద‌వండి: మధ్యాసియాలోని ఏ దేశాల్లో విద్యుత్‌ సంక్షోభం తలెత్తింది?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
భూమ్మీది అక్వేరియంలన్నింటిలోకెల్లా అత్యంత వయసున్న చేప?
ఎప్పుడు : జనవరి 26
ఎవరు : మెథుసెలా
ఎక్కడ : శాన్‌ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా, అమెరికా

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 27 Jan 2022 03:17PM

Photo Stories