మార్చి 2017 అంతర్జాతీయం
హాంగ్‌కాంగ్‌కు తొలి మహిళా చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా చైనా మద్దతు ఉన్న క్యారీల్యామ్ (59) మార్చి 26న ఎన్నికయ్యారు. ఒక దేశం, రెండు వ్యవస్థలు సూత్రం కింద 1997లో హాంగ్‌కాంగ్‌ను చైనాలో విలీనం చేసేందుకు బ్రిటన్ అంగీకరించింది. దీని ప్రకారం హాంగ్‌కాంగ్‌కు కొంత స్వయం ప్రతిపత్తి ఉంటుంది.
ఇన్నోవేషన్ ఆఫీస్ అధిపతిగా ట్రంప్ అల్లుడు
వాగ్దానాల అమలు, పాలనా వ్యవస్థ ప్రక్షాళన కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన సృజనాత్మక కార్యాలయం (ఇన్నోవేషన్ ఆఫీస్) అధిపతిగా జేర్డ్ కుష్నర్ నియమితులయ్యారు. ఈ మేరకు మార్చి 27న ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ‘ది వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్ అమెరికన్ ఇన్నోషన్’గా పిలిచే ఈ కార్యాలయం అధ్యక్షుడికే మాత్రమే జవాబుదారీగా ఉంటుంది. జేర్డ్ కుష్నర్ ట్రంప్ అల్లుడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా ఇన్నోవేషన్ ఆఫీస్ ఛైర్మన్
ఎప్పుడు : మార్చి 27
ఎవరు : జేర్డ్ కుష్నర్
ఎందుకు : వాగ్దానాల అమలు, పాలనా వ్యవస్థ ప్రక్షాళన కోసం
2040 నాటికి 60 కోట్ల మంది పిల్లలకు నీటి కొరత
ప్రపంచవ్యాప్తంగా 2040 నాటికి సుమారు 60 కోట్ల మంది పిల్లలు తీవ్ర నీటి కొరత ఎదుర్కోనున్నట్లు యూనిసెఫ్ వెల్లడించింది. ప్రతి నలుగురిలో ఒకరు ఈ సమస్యతో ఇబ్బంది పడతారని, ప్రజలు తక్కువ నీటితోనే జీవించాల్సి వస్తుందని మార్చి 21న విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. వాతావరణం వేడెక్కడం, సముద్రాల విస్తీర్ణం పెరగడం, మంచు కరగడం, కరువులతోపాటు పెరుగుతున్న జనాభా కారణంగా నీటి వాడకం ఎక్కువవుతుందని, ఇది నీటి లభ్యతపై ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. ఇప్పటికే దాదాపు 36 దేశాల్లో నీటి కొరత అధికంగా ఉందని పేర్కొంది. రోజూ సరైన పరిమాణంలో నీటిని తీసుకోకపోవడం వల్ల ఎక్కువ మంది పిల్లలు డయేరియా బారిన పడుతున్నారని, ప్రపంచవ్యాప్తంగా రోజూ దాదాపు 800 మంది చిన్నారులు ఈ వ్యాధితో మరణిస్తున్నారని వెల్లడించింది.
2018లో టైటానిక్ సందర్శన
వందేళ్ల క్రితం మునిగిపోయిన టైటానిక్ ఓడను చూడాలని అనుకునే వారికి బ్లూ మార్బుల్ ప్రైవేట్ అనే సంస్థ ఆ అవకాశం కల్పించనుంది. ఈ మేరకు 2018 మేలో చేపట్టనున్న సాహస యాత్ర ద్వారా పర్యాటకులను అట్లాంటిక్ మహాసముద్రంలో 4 వేల మీటర్ల లోతున ఉన్న టైటానిక్ ఓడ వద్దకు తీసుకెళ్లనుంది. ఇందుకోసం ఒక్కో వ్యక్తికి టికెట్ ధర 1,05,129 డాలర్లు (రూ.68 లక్షలు)గా నిర్ణయించగా ఇప్పటికే తొలిదశకు సంబంధించిన టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. 8 రోజులు సాగే ప్రయాణం కెనడా నుంచి మొదలవుతుంది.
1912 ఏప్రిల్ 14న ఆర్‌ఎంఎస్-టైటానిక్ ఓడ ఇంగ్లండ్ నుంచి అమెరికా వెళ్తూ తన తొలి ప్రయాణంలోనే మునిగిపోయింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టైటానిక్ ఓడ సందర్శన
ఎప్పుడు : 2018 మే
ఎవరు : బ్లూ మార్బుల్ ప్రైవేట్ సంస్థ
ఎక్కడ : అట్లాంటిక్ మహాసముద్రంలో
రిఫరెండంకు స్కాట్లాండ్ అంగీకారం
బ్రిటన్ నుంచి విడిపోయేందుకు ప్రజాభిప్రాయాన్ని కోరాలని స్కాట్లాండ్ చట్ట సభ్యులు నిర్ణయించారు. ఈ మేరకు ఎడిన్‌బర్‌లో మార్చి 28న జరిగిన సమావేశంలో రిఫరెండమ్‌కు అనుకూలంగా 69, వ్యతిరేకంగా 59 మంది ఓట్లు వేశారు. దీంతో స్వతంత్ర దేశంగా ఉండేదుకు ప్రజాభిప్రాయం నిర్వహించాలని బ్రిటన్ ప్రభుత్వాన్ని స్కాట్లాండ్ అధికారికంగా కోరింది.
2014లో నిర్వహించిన రిఫరెండమ్‌లో బ్రిటన్‌తో ఉండేందుకే స్కాట్లాండ్ వాసులు మొగ్గుచూపారు. అయితే ఇటీవల ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న స్కాట్లాండ్ విడిపోయేందుకు సిద్ధమైంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రిఫరెండంకు స్కాట్లాండ్ అంగీకారం
ఎప్పుడు : మార్చి 28
ఎవరు : స్కాట్లాండ్ చట్ట సభలు
ఎందుకు : బ్రిటన్ నుంచి విడిపోయేందుకు
అంతర్జాతీయ మేఘాల అట్లాస్ విడుదల
అంతర్జాతీయ మేఘాల అట్లాస్ డిజిటల్ ప్రతిని ప్రపంచ వాతావరణ సంస్థ మార్చి 23న వాషింగ్టన్‌లో విడుదల చేసింది. ఇందులో 12 కొత్త రకాల మేఘాలను గుర్తించింది. మేఘాలనేవి వాతావరణం, రుతువులు, జలచక్రంలో కీలకం. వీటి పరిశీలన,గుర్తింపులో ఈ అట్లాస్ ఒక అంతర్జాతీయ ప్రమాణంగా పనిచేస్తుంది.
ఫార్చ్యూన్ ప్రపంచ గొప్ప నాయకులు-2017
ప్రముఖ మ్యాగజైన్ ఫార్చ్యూన్ వరల్డ్స్ గ్రేటెస్ట్ లీడర్స్-2017 జాబితాను మార్చి 23న విడుదల చేసింది. మొత్తం 50 నాయకులతో కూడిన ఈ జాబితాలో భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ ఛైర్మన్ అరుంధతి భట్టాచార్య 26వ స్థానంలో నిలిచారు. భారతీయ సంతతికి చెందిన లాస్ట్‌మైల్‌హెల్త్ వ్యవస్థాపకుడు, సీఈవో రాజ్ పంజాబి 28వ స్థానంలో నిలిచారు. ఎస్‌బీఐకు సంబంధించి డీమోనిటైజేషన్, మొండిబకాయిలు వంటి పలు సమస్యలను ఎదుర్కోవడంలో భట్టాచార్య కీలకపాత్ర పోషించారని ఫార్చ్యూన్ పేర్కొంది.
ఫార్చ్యూన్ టాప్ లీడర్స్
స్థానం | పేరు | సంస్థ |
1 | థియో ఎప్‌స్టీన్ | షికాగో కబ్స్ బేస్ బాల్ ఆపరేషన్స్ |
2 | జాక్ మా | అలీబాబా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ |
3 | పోప్ ఫ్రాన్సిస్ | - |
4 | మిలిందా గేట్స్ | బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ |
5 | జెఫ్ బెజోస్ | అమెజాన్ ఫౌండర్, సీఈవో |
26 | అరుంధతి భట్టాచార్య | భారతీయ స్టేట్ బ్యాంక్ చైర్మన్ |
28 | రాజ్ పంజాబి | లాస్ట్ మైల్ హెల్త్ సీఈవో |
ఏమిటి : ఫార్చ్యూన్ టాప్-50 నాయకుల జాబితా
ఎప్పుడు : మార్చి 23
ఎవరు : 26వ స్థానంలో ఎస్‌బీఐ ఛైర్మన్ అరుంధతి భట్టాచార్య
ట్రిప్ అడ్వైజర్ టాప్-25 ఆసియా పర్యాటక ప్రాంతాలు
ట్రిప్ అడ్వైజర్ ఆసియా నగరాల జాబితాలో భారత్‌కు చెందిన నాలుగు ప్రాంతాలు స్థానం దక్కించున్నాయి. ఈ మేరకు ఆ సంస్థ ట్రావెలర్స్ చాయిస్ అవార్డ్స్ టాప్-25 నగరాలను మార్చి 23న వెల్లడించింది. వీటిల్లో గోవా (11వ స్థానం), న్యూఢిల్లీ (13వ స్థానం), జైపూర్ (18వ స్థానం), ఆగ్రా (19వ స్థానం) ఉన్నాయి. ఈ జాబితాలో ఇండోనేసియాలోని బాలి అగ్రస్థానంలో నిలిచింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టాప్-25 ఆసియా పర్యాటక ప్రాంతాలు
ఎప్పుడు : మార్చి 23
ఎవరు : ట్రిప్ అడ్వైజర్
ఎక్కడ : ఆసియాలో
హ్యూరాన్ వలస బిలియనీర్స్ - 2017
ఇమ్మిగ్రేంట్ బిలియనీర్స్ (వలస కుబేరులు) 2017 నివేదికను హ్యూరాన్ సంస్థ మార్చి 25న విడుదల చేసింది. దీని ప్రకారం ప్రపంచంలో మొత్తం 2,257 మంది అపర కుబేరులు ఉండగా వీరిలో 300 మంది పుట్టిన దేశంలో కాకుండా విదేశాల్లో బిలియనీర్లుగా ఎదిగారు. జర్మనీ నుంచి అత్యధికంగా 31 మంది, భారత్ నుంచి 30, చైనా నుంచి 24 మంది ఈ జాబితాలో ఉన్నారు. ప్రవాస భారత బిలియనీర్లలో తొలి 10 మందిలో ఉక్కు వ్యాపారి లక్ష్మీనివాస్ మిట్టల్ అగ్రస్థానంలో ఉన్నారు. గూగుల్ సహస్థాపకుడు సెర్జీ బ్రిన్ ప్రపంచంలోనే వలస కుబేరుల్లో అగ్రస్థానంలో ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వలస బిలియనీర్స్ రిపోర్ట్ - 2017
ఎప్పుడు : మార్చి 25
ఎవరు : హ్యూరాన్
ఎక్కడ : ప్రపంచ వ్యాప్తంగా
వుమెన్ ఇన్ పాలిటిక్స్ 2017లో వెనకబడిన భారత్
ఐక్యరాజ్య సమితి వుమెన్ ఇన్ పాలిటిక్స్ 2017 మ్యాప్‌లో ఆసియాలోని పొరుగు దేశాల కన్నా భారత్ వెనకబడింది. ఈ మేరకు ఐరాస మహిళా విభాగం, ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ (ఐపీయూ) మార్చి 14న ఈ నివేదికను విడుదల చేశాయి. దీని ప్రకారం 2017, జనవరి 1 నాటికి 18.5 శాతం మహిళా మంత్రులతో భారత్ 186 దేశాల్లో 88వ స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో రువాండా, కెన్యా, మొజాంబిక్, దక్షిణ సూడాన్‌లు భారత్ కన్నా ముందంజలో ఉన్నాయి. పార్లమెంట్‌కు ఎన్నికైన మహిళల సంఖ్య పరంగా ఇచ్చిన ర్యాంకింగ్‌లో భారత్ 193 దేశాల్లో 148వ స్థానానికి దిగజారింది. లోక్‌సభలో మహిళా సభ్యులు 11.48 శాతం కాగా, ఎగువ సభలో వీరి శాతం 11 శాతంగా ఉంది. ఈ విషయంలో అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా, ఇరాక్ భారత్ కన్నా మెరుగైన స్థానాల్లో ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వుమెన్ ఇన్ పాలిటిక్స్ 2017 మ్యాప్
ఎప్పుడు : మార్చి 14
ఎవరు : ఐరాస మహిళా విభాగం, ఐపీయూ
ఫోర్బ్స్ శ్రీమంతుల జాబితా - 2017
ప్రముఖ మ్యాగజైన ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితా - 2017ను మార్చి 20న వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం జాబితాలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 86 బిలియన్ డాలర్ల సంపదతో వరుసగా నాలుగోసారి అగ్రస్థానం దక్కించుకున్నారు. బెర్క్‌షైర్ హాథ్‌వే చీఫ్ వారెన్ బఫెట్ 75.6 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉండగా అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ మూడో స్థానంలో నిలిచారు. భారత్‌కు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 23.2 బిలియన్ డాలర్లతో 33వ స్థానంలో ఉన్నారు.
మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా బిలియనీర్ల జనాభా 2016తో పోలిస్తే ఈ సారి 13 శాతం పెరిగి 2,043కి చేరింది.
శ్రీమంతుల జాబితా
స్థానం | పేరు | సంస్థ |
1 | బిల్‌గేట్స్ | మైక్రోసాఫ్ట్ |
2 | వారెన్ బఫెట్ | బెర్క్‌షైర్ హాథ్‌వే |
3 | బెజోస్ | అమెజాన్ |
4 | ఎ. ఒర్టేగా | చైన్ జరా |
5 | మార్క్ జుకెర్‌బర్గ్ | ఫేస్‌బుక్ |
ఏ దేశంలో ఎంత మంది శ్రీమంతులు
స్థానం | దేశం | శ్రీమంతులు |
1 | అమెరికా | 565 |
2 | చైనా | 319 |
3 | జర్మనీ | 114 |
4 | భారత్ | 101 |
ఏమిటి : ఫోర్బ్స్ శ్రీమంతుల జాబితా - 2017
ఎప్పుడు : మార్చి 20
ఎవరు : తొలిస్థానంలో బిల్‌గేట్స్
వరల్డ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ - 2017 నివేదిక
ప్రపంచంలో నివాస యోగ్యమైన అత్యంత చవకై న నగరాల జాబితాలో భారత్ నుంచి నాలుగింటికి చోటు దక్కింది. ఎకనమిస్ట్ ఇంటెలిజెన్‌స యూనిట్ (ఈఐయూ) మార్చి 21న విడుదల చేసిన వరల్డ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ - 2017 నివేదిక ఈ వివరాలు వెల్లడించింది. ఈ జాబితా ప్రకారం కజకిస్తాన్‌లోని అల్మటీ నగరం ప్రపంచంలోనే అత్యంత చవకైన నగరంగా నిలిచింది. భారత్ నుంచి బెంగళూరుకు 3వ స్థానం, చెన్నైకి 6, ముంబైకి 7, ఢిల్లీకి 10వ స్థానాలు దక్కాయి.
చవకైన నగరాలు | ఖరీదైన నగరం | ||
స్థానం | నగరం | స్థానం | నగరం |
1 | ఆల్మటీ(కజకిస్తాన్) | 1 | సింగపూర్ |
2 | లాగోస్(నైజీరియా) | 2 | హాంకాంగ్(చైనా) |
3 | బెంగళూరు(భారత్) | 3 | జ్యూరిక్(స్విట్జర్లాండ్) |
4 | కరాచీ(పాకిస్తాన్) | 4 | టోక్యో(జపాన్) |
5 | అల్జీర్స్(అల్జీరియా) | 5 | ఒసాక (జపాన్) |
6 | చెన్నై(భారత్) | 6 | సియోల్(ద.కొరియా) |
7 | ముంబై(భారత్) | 7 | జెనీవా(స్విట్జర్లాండ్) |
8 | కీవ్(ఉక్రెయిన్) | 8 | పారిస్(ఫ్రాన్స్) |
9 | బుకారెస్ట్(రుమేనియా) | 9 | న్యూయార్క్(అమెరికా) |
10 | న్యూఢిల్లీ(భారత్) | 10 | కోపెన్‌హాగెన్(డెన్మార్క్) |
ఏమిటి : వరల్డ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ - 2017 నివేదిక
ఎప్పుడు : మార్చి 21
ఎవరు : ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్
దక్షిణ కొరియా అధ్యక్షురాలు తొలగింపు
అవినీతి ఆరోపణల నేపథ్యంలో అభిశంసనను ఎదుర్కొంటున్న దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గెన్‌హేను అధికారికంగా పదవి నుంచి తొలగిస్తూ ఆ దేశ రాజ్యాంగ న్యాయస్థానం మార్చి 10న చారిత్రక తీర్పు వెలువరించింది. ప్రాసిక్యూటర్లు ఇప్పటికే పార్క్ పేరును నిందితుల జాబితాలో చేర్చడంతో ధర్మాసనం ఆమెపై క్రిమినల్ ప్రొసీడింగ్‌సకు అనుమతిచ్చింది. పార్క్ చర్యలు రాజ్యాంగాన్ని, చట్టాలను ఉల్లంఘించడమేనని, ప్రజల నమ్మకానికి ద్రోహం చేయడమే అని చీఫ్ జస్టిస్ జంగ్-మీ పేర్కొన్నారు. తన స్నేహితురాలైన చోయ్ సూన్ సిల్‌తో కుమ్మకై ్క పార్క్ అవినీతికి పాల్పడ్డారని, కంపెనీల నుంచి లక్షల డాలర్లను వసూలు చేశారని, చోయ్‌ను ప్రభుత్వ కార్యకలాపాల్లో పాలుపంచుకునేలా అవకాశం కల్పించారని కోర్టు పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దక్షిణ కొరియా అధ్యక్షురాలు పదవి నుంచి తొలగింపు
ఎప్పుడు : మార్చి 10
ఎవరు : దక్షిణ కొరియా రాజ్యాంగ న్యాయస్థానం
కాలుష్యంతో 17 లక్షల మంది పిల్లలు మృతి
ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ కాలుష్యం వల్ల ఏటా 17 లక్షల మంది ఐదేళ్ల లోపు చిన్నారులు చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) పేర్కొంది. కలుషిత నీరు, ఇంట్లో పొగతాగడం, పారిశుద్ధ్యం లేకపోవడం తదితర కారణాల వల్ల చిన్నారుల్లో మరణాలు ఎక్కువగా ఉన్నాయని డబ్ల్యూహెచ్‌ఓ మార్చి 6న తన నివేదికలో తెలిపింది. పిల్లల్లో ఎక్కువ మంది డయేరియా, మలేరియా, న్యూమోనియాతో చనిపోతున్నారు.
ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం కోరిన జీ4 దేశాలు
ఐక్యరాజ్య సమితిలో సంస్కరణల దిశగా క్రియాశీలక ఆలోచనలకు సిద్ధంగా ఉన్నామని జీ4 (భారత్, జపాన్, బ్రెజిల్, జర్మనీ) దేశాలు మార్చి 8న ప్రకటించాయి. అయితే భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం ఇస్తే సంస్కరణల్లో మాత్రమే పాలుపంచుకుంటామని ..వీటోపై సమీక్ష జరిగి నిర్ణయం తీసుకునేంత వరకు ఆ అధికారాన్ని (వీటో) వాడబోమని ప్రతిపాదించాయి. భద్రతామండలిలో శాశ్వత, తాత్కాలిక సభ్యదేశాల సంఖ్యను పెంచేలా సంస్కరణలు తేవాలనే ప్రతిపాదనకు ఐరాసలో భారీ మద్దతు లభించిందని జీ 4 దేశాల తరఫున ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు.
అమెరికా క్షిపణి రక్షణ వ్యవస్థను వ్యతిరేకించిన చైనా
దక్షిణ కొరియాలో అమెరికా ఏర్పాటు చేస్తున్న క్షిపణి రక్షణ వ్యవస్థపై చైనా మార్చి 7న తీవ్రంగా స్పందించింది. ఈ క్షిపణి వ్యవస్థకు వ్యతిరేకంగా తాము చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, దీని పరిణామాలను అమెరికా, దక్షిణ కొరియా ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది. ఈ వ్యవస్థ ఏర్పాటు కోసం ఇప్పటికే అమెరికా మిస్సైల్ లాంఛర్లు, ఇతర సామాగ్రి దక్షిణ కొరియా చేరుకున్నాయి. తమ దేశ భద్రత ప్రయోజనాలను కాపాడుకునేందుకు చైనా కచ్చితంగా అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఆ దేశ విదేశాంగ అధికార ప్రతినిధి జెంగ్ చెప్పారు. ఉత్తర కొరియా నాలుగు బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన నేపథ్యంలో తన మిత్రపక్షమైన దక్షిణ కొరియాలో అమెరికా క్షిపణి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది.
2030 నాటికి శక్తిమంతమైన దేశాల్లో చైనా టాప్
2030 నాటికి శక్తిమంతమైన దేశాల జాబితాలో చైనా మొదటి స్థానంలో నిలుస్తుందని ప్రైస్ వాటర్‌హౌస్ కూపర్స్ (పీడబ్ల్యూసీ) వెల్లడించింది. ఈ మేరకు ఆ సంస్థ మార్చి 10న ఓ నివేదిక విడుదల చేసింది. ఇందులో 32 దేశాలు చోటు దక్కించుకున్నాయి. వినిమయశక్తి సూచికతో కొలిచే ప్రపంచ స్థూల జాతియోత్పత్తి ఆధారంగా ఈ దేశాల ఆర్థిక శక్తిని సంస్థ అంచనా వేసింది. ఈ అంచనాల్లో చైనా తర్వాత అమెరికా ఆర్థిక శక్తివంతమైన దేశంగా నిలువగా భారత్ మూడో స్థానాన్ని దక్కించుకుంది. తదుపరి స్థానాల్లో జపాన్, ఇండోనేసియా, రష్యా నిలిచాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ శక్తిమంతమైన దేశాల జాబితా
ఎప్పుడు : 2030 నాటికి
ఎవరు : మొదటి స్థానంలో చైనా, 3వ స్థానంలో భారత్
19 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో జనగణన
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత పాకిస్తాన్‌లో జనగణన జరుగుతోంది. ఈ మేరకు మార్చి 15 నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో సుమారు 2 లక్షల బృందాలు, స్థానిక అధికారులు ప్రజల నుంచి వివరాలు సేకరించనున్నారు. దీని ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన సహా కీలక విధానపరమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. చివరిసారిగా 1998లో జరిగిన జనాభా లెక్కల ప్రకారం ఆ దేశ జనాభా సుమారు 18 కోట్లుగా తేలింది. పాక్‌లో 1951, 1961, 1972, 1981 సంవత్సరాల్లో మొదటి నాలుగు జనాభా లెక్కలు జరిగాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాకిస్తాన్‌లో 6వ జనగణన
ఎప్పుడు : మార్చి 15 నుంచి
ఎవరు : పాకిస్తాన్ ప్రభుత్వం
సిరియాలో 652 మంది చిన్నారులు మృతి : యునిసెఫ్
2016లో సిరియాలో జరిగిన దాడుల్లో 652 మంది చిన్నారులు చనిపోయారని యునెటైడ్ నేషన్‌స చిల్డ్రన్‌స ఎమర్జెన్సీ ఫండ్ (యూనిసెఫ్) ప్రకటించింది. ఆ దేశంలో సంక్షోభం మొదలై ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా మార్చి 13న ఈ వివరాలు వెల్లడించింది. అంతర్యుద్ధంలో ప్రభుత్వం, తిరుగుబాటుదారులు స్కూళ్లు, ఆసుపత్రులు, ఆట స్థలాలు, పార్కులపై విచక్షణారహితంగా దాడులు చేస్తున్నారని దీని వల్ల దాదాపు 17 లక్షల మంది చిన్నారులు చదువుకు దూరమవగా, మరో 23 లక్షల మంది పిల్లలు పశ్చిమాసియాలో శరణార్థులుగా బతుకు వెళ్లదీస్తున్నారని తెలిపింది. ‘దరా’ రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్కూళ్ల గోడలపై నినాదాలు రాసిన పిల్లల్ని అధికారులు అరెస్టు చేసి హింసిస్తున్నారని యూనిసెఫ్ తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సిరియా అంతర్యుద్ధంలో 652 మంది చిన్నారులు మృతి
ఎప్పుడు : 2016లో
ఎవరు : యునిసెఫ్
ఎక్కడ : సిరియా
అత్యున్నత జీవన ప్రమాణాలు కలిగిన నగరం వియన్నా
అత్యున్నత జీవన ప్రమాణాలు కలిగిన నగరాల జాబితా - 2017లో ఆస్ట్రియా రాజధాని వియన్నా మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు ప్రముఖ కన్సల్టెంట్ సంస్థ మెర్సర్ మార్చి 14న ఓ నివేదిక విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 231 నగరాల్లో రాజకీయ స్థిరత్వం, ఆరోగ్య సంరక్షణ, విద్య, నేరాల నియంత్రణ, వినోదం, రవాణా ప్రమాణాలు వంటి అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఈ నివేదిక రూపొందించారు. ఇందులో వియన్నా వరుసగా ఎనిమిదోసారి అగ్రస్థానంలో నిలవగా అత్యంత చెత్త నగరంగా బాగ్దాద్ చివరి స్థానంలో నిలిచింది.
భారత్ నగరాల్లో హైదరాబాద్ వరుసగా మూడోసారి తొలి స్థానంలో నిలిచింది. ఆసియా నుంచి అగ్రస్థానంలో సింగపూర్ (25వ ర్యాంకు), అమెరికా నుంచి తొలిస్థానంలో శాన్‌ఫ్రాన్సిస్కో (29వ ర్యాంకు) నిలిచాయి.
మెర్స్‌ర్ అత్యున్నత నగరాల జాబితా-2017
స్థానం | నగరం |
1 | వియన్నా (ఆస్ట్రియా) |
2 | జ్యూరిచ్ (స్విట్జర్లాండ్) |
3 | ఆక్లాండ్ (న్యూజిలాండ్) |
4 | మ్యూనిక్ (జర్మనీ) |
5 | వాంకోవర్ (కెనడా) |
ఏమిటి : అత్యున్నత నగరాల జాబితా-2017
ఎప్పుడు : మార్చి 14
ఎవరు : మెర్స్‌ర్ కన్సల్టెంట్ సంస్థ
అమెరికా మెడికేర్ చైర్మన్‌గా సీమా వర్మ
అమెరికాలోని కీలకమైన మెడికేర్ అండ్ మెడికెయిడ్ సేవా కేంద్రాల అధిపతిగా భారత సంతతి మహిళ సీమా వర్మ నియమితులయ్యారు. ఈ మేరకు మార్చి 15న వాషింగ్టన్‌లో జరిగిన కార్యక్రమంలో భగవద్గీత మీద ప్రమాణం చేసి ఆమె బాధ్యతలు చేపట్టారు. ఈమెతో కలిపి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగంలో పనిచేస్తున్న ఇండో-అమెరికన్‌ల సంఖ్య ఆరుకు చేరింది.
ట్రంప్ ప్రభుత్వం ఉన్న ఇండో-అమెరికన్‌లు
1. నిక్కీ హేలీ | ఐరాసలో అమెరికా ప్రతినిధి |
2. సీమా వర్మ | మెడికెయిడ్ అండ్ మెడికేర్ చైర్మన్ |
3. అజిత్ పాయ్ | ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్స్ హెడ్ |
4. ప్రీత్ భారారా | యూఎస్ అటార్నీ ఫర్ సథరన్ డిస్ట్రిక్ ఆఫ్ న్యూయార్క్ |
5. రాజ్ షా | వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ టీమ్ |
ఏమిటి : అమెరికా మెడికేర్ చైర్మన్ బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : మార్చి 15
ఎవరు : భారత సంతతి మహిళ సీమా వర్మ
ఫెడరల్ రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లు పావు శాతం పెంపు
అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ రేట్లు పావు శాతం పెరిగాయి. ఈ మేరకు ప్రస్తుతం 0.75 శాతంగా ఉన్న వడ్డీ రేట్లను 1 శాతానికి పెంచుతున్నట్లు మార్చి 15న ఫెడ్ ప్రకటించింది. ఈ ఏడాది మరో రెండు విడతలు, 2018లో మూడు విడతల మేర వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని ఫెడ్ కమిటీ అంచనా వేసింది. 2007-09 మధ్య ఆర్థిక మాంద్యం పరిణామాల తర్వాత ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడం ఇది మూడోసారి. 2015 డిసెంబర్‌లో తొలిసారి, ఆ తర్వాత 2016 డిసెంబర్‌లో రెండోసారి వడ్డీ రేట్లు పెంచింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫెడరల్ రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లు పావు శాతం పెంపు
ఎప్పుడు : మార్చి 15
ఎవరు : అమెరికా ఫెడ్ కమిటీ
ఎక్కడ : అమెరికా
అమెరికా కాంగ్రెస్‌లో కాల్ సెంటర్ బిల్లు
కాల్ సెంటర్లను విదేశాలకు తరలించే అమెరికా కంపెనీలకు ప్రభుత్వ గ్రాంట్లు, పూచీకత్తు రుణాలు దక్కకుండా చేసే బిల్లును అమెరికా కాంగ్రెస్‌లో మార్చి 2న తిరిగి ప్రవేశపెట్టారు. ‘ది యూఎస్ కాల్ సెంటర్ అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్’ అనే ఈ బిల్లును డెమోక్రటిక్ పార్టీకి చెందిన జీన్ గ్రీన్, రిపబ్లిక్ పార్టీకి చెందిన డేవిడ్ మెక్ కిన్లేలు ప్రవేశపెట్టారు.
వలస నిషేధపు ఉత్తర్వులను సవరించిన అమెరికా
అమెరికాలోకి వలసల నిరోధం కోసం సవరించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మార్చి 6న సంతకం చేశారు. ఈ నిబంధనల ప్రకారం ఆరు ముస్లిం ఆధిక్య దేశాల (సూడాన్, సిరియా, ఇరాన్, లిబియా, సోమాలియా, యెమెన్) పౌరుల్ని 90 రోజుల పాటు అమెరికాలోకి అనుమతించరు. కొత్తగా వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారికి మాత్రమే ఈ ఉత్తర్వు వర్తిస్తుందని, ఇప్పటికే చెల్లుబాటయ్యే వీసాలు కలిగి ఉంటే వారికి అమెరికాలో ప్రవేశం కల్పిస్తామని స్పష్టం చేశారు. మార్చి 16 నుంచి కొత్త ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి.
గతంలో జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుల్లో ఇరాక్ కూడా ఉంది. అయితే అమెరికా వెళ్లేందుకు వీసా కోసం దరఖాస్తు చేసేవారిని క్షుణ్నంగా తనిఖీ చేసేందుకు ఇరాక్ అంగీకరించడంతో ఆ దేశం పేరును జాబితా నుంచి తొలగించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వలస నిషేధపు ఉత్తర్వులను సవరించిన అమెరికా
ఎప్పుడు : మార్చి 6
ఎవరు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
ఆసియా-పసిఫిక్ అవినీతి దేశాల్లో భారత్ టాప్
అవినీతి విషయంలో ఆసియా పసిఫిక్ దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది. ఈ మేరకు ట్రాన్‌సపరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2016 నివేదికలో వెల్లడించింది. దీని ప్రకారం అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే భారత్‌లో అవినీతి 41 శాతం పెరిగింది. సర్వేలో భారత్‌లో వివిధ ప్రభుత్వ పనుల కోసం లంచం ఇవ్వాల్సి వస్తోందని 69 శాతం మంది చెప్పారు. 65 శాతంతో వియత్నాం ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. చైనాలో 26 శాతం, పాక్‌లో 40 శాతం మంది లంచం చెల్లిస్తున్నామన్నారు. జపాన్ 0.2 శాతంతో అవినీతిలో చిట్టచివరన నిలవగా, దక్షిణ కొరియా 3 శాతంతో మెరుగైన స్థానంలో ఉంది.
ఈ సర్వేలో 16 దేశాల్లోని 22 వేల మందిని ప్రశ్నించారు. దీని ప్రకారం 2016లో ఒక్కసారైనా లంచం చెల్లించినవారు దాదాపు 90 కోట్ల మంది ఉండొచ్చని సంస్థ పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆసియా-పసిఫిక్ అవినీతి దేశాల్లో భారత్ టాప్
ఎప్పుడు : 2016
ఎవరు : టాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్
ఉత్తమ దేశం స్విట్జర్లాండ్
ప్రపంచంలోని ఉత్తమ దేశాల జాబితాలో స్విట్జర్లాండ్ తొలి స్థానాన్ని దక్కించుకుంది. రెండోస్థానంలో కెనడా, మూడో స్థానంలో బ్రిటన్ నిలవగా భారత్ 25వ స్థానంలో నిలిచింది. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా వార్టన్ స్కూల్, బీఏఈ కన్సల్టింగ్ సంయుక్తంగా నిర్వహించిన ‘బెస్ట్ కంట్రీస్-2017 సర్వే వివరాలను మార్చి 7న విడుదల చేశాయి.
ఈ జాబితాలో అమెరికా 7వ స్థానంలో ఉంది. 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల తర్వాత అమెరికా నాయకత్వంపై కొంత గౌరవం కోల్పోయామని సర్వేలో పాల్గొన్నవారిలో 75 శాతం మంది తెలిపారు. వివిధ దేశాలకు చెందిన 21 వేల మంది వాణిజ్యవేత్తలు, సాధారణ ప్రజానీకం, పలురంగాల ప్రముఖులు ఈ సర్వేలో పాల్గొన్నారు.
ఉత్తమ దేశాల జాబితా-2017
స్థానం | దేశం | స్థానం | దేశం |
1 | స్విట్జర్లాండ్ | 6 | స్వీడన్ |
2 | కెనడా | 7 | అమెరికా |
3 | బ్రిటన్ | 8 | ఆస్ట్రేలియా |
4 | జర్మనీ | 9 | ఫ్రాన్స్ |
5 | జపాన్ | 10 | నార్వే |
ఏమిటి : ఉత్తమ దేశాల జాబితా - 2017
ఎప్పుడు : మార్చి 7
ఎవరు :యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా వార్టన్ స్కూల్, బీఏఈ కన్సల్టింగ్