Skip to main content

Exercise Aakraman: 'ఆపరేషన్ ఆక్రమణ్' పేరుతో ఐఏఎఫ్ విన్యాసాలు

భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగుతున్న నేపథ్యంలో భారత వైమానిక దళం (IAF) తక్షణ స్పందన చర్యల్లో భాగంగా 'ఆపరేషన్ ఆక్రమణ్' పేరిట భారీ స్థాయిలో విన్యాసాలను చేపట్టింది.
Indian Air Force Conducts Large-Scale Exercise Aakraman Amid Indo-Pak Tensions

ఈ విన్యాసాలు సెంట్రల్ సెక్టార్‌లో నిర్వహించబడినవిగా తెలుస్తోంది. భారత వైమానిక దళం ఆధునిక సాంకేతికతతో కూడిన రఫేల్ యుద్ధ విమానాలు, ఇతర అగ్రశ్రేణి ఫైటర్ జెట్స్ ఈ మిలిటరీ విన్యాసాల్లో పాల్గొన్నాయి.

ఈ విన్యాసాల్లో భూఉపరితలంతో పాటు, కొండ ప్రాంతాల్లో లక్ష్యాలను ధ్వంసం చేసేలా ప్రత్యేక ఎయిర్ స్ట్రైక్ డ్రిల్లులు నిర్వహించారు. దీర్ఘ శ్రేణి, స్వల్ప శ్రేణి శత్రు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పైలట్లు సుడిగాలి శైలిలో ఆపరేషన్లు జరిపారు. ఈ విన్యాసాలు IAF సిద్ధతను, శక్తిని బహిరంగంగా చూపిస్తూ, భారత గగనతలపై తన ఆధిపత్యాన్ని స్థిరపరచాయి.
 
ఇదే సమయంలో.. భద్రతా సంస్థలు మరో కీలక ఆపరేషన్‌ను ప్రారంభించాయి. 'ఆపరేషన్ టిక్కా' పేరిట భారత ఆర్మీ, CRPF, జమ్మూ & కశ్మీర్ పోలీసులు, NIA సంయుక్తంగా ఉగ్రవాద సంస్థ లష్కర్-ఏ-తోయిబాకి చెందిన కీలక ఉగ్రవాది సయీఫుల్లా కసూరిని పట్టుకోవడానికి గాలింపు చర్యలు ప్రారంభించాయి. అతను పహల్గాం ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడికి కీలక సూత్రధారిగా భావిస్తున్నారు.

Indian Navy: పాక్ సరిహద్దుల్లో భారత నేవీ మిసైల్ ప్రయోగాలు విజయవంతం

Published date : 28 Apr 2025 04:07PM

Photo Stories