Skip to main content

World Competitiveness Index 2022: పోటీతత్వ సూచీలో భారత్‌కు 37వ ర్యాంకు

World Competitiveness Index 2022: పోటీతత్వ సూచీలో భారత్‌కు ఎన్నో ర్యాంకు ల‌భించింది?
India ranked 37th in IMD's World Competitiveness Index 2022
India ranked 37th in IMD's World Competitiveness Index 2022

పోటీతత్వ సూచీలో ఆరు స్థానాలు మెరుగుపర్చుకున్న భారత్‌.. ప్రపంచ పోటీతత్వ సూచీలో తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మేనేజ్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌(ఐఎండీ) అధ్యయనంలో భారత్‌ ఆరు స్థానాలు ఎగబాకి.. 43వ ర్యాంకు నుంచి 37వ ర్యాంకుకు చేరింది. దీంతో ఆసియా ఆర్థిక వ్యవస్థల్లో మన దేశం వేగవంతమైన పెరుగుదలను కనబరిచింది. ఈ పోటీతత్వ సూచీలో 63 దేశాల జాబితాలో డెన్మార్క్‌ మొదటి స్థానాన్ని ఆక్రమించింది. అంతకుముందు ఏడాది అది మూడో స్థానంలో ఉంది. స్విట్జర్లాండ్‌ మొదటి స్థానాన్ని కోల్పోయి.. రెండో స్థానానికి పరిమితమైంది. సింగపూర్‌ ఐదో స్థానం నుంచి మూడో స్థానానికి చేరుకుంది. ఆసియాలో ఆర్థిక వ్యవస్థల్లో సింగపూర్‌(3), హాంకాంగ్‌(5), తైవాన్‌ (7), చైనా(17) మెరుగైన స్థానాలు పొందాయి.

GK International Quiz: ఏకకాలంలో 78,220 జాతీయ జెండాలను రెపరెపలాడించి కొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించిన దేశం?

Published date : 21 Jun 2022 06:10PM

Photo Stories