Skip to main content

Chinese Ship: Sri Lankaను వీడిన చైనా నిఘా నౌక

శ్రీలంకలోని వ్యూహాత్మకంగా కీలకమైన హంబన్‌టోట పోర్టులో మకాం వేసిన చైనా నిఘా నౌక ఆరు రోజుల అనంతరం ఆగష్టు 22న అక్కడి నుంచి వెళ్లిపోయింది.
Chinese 'spy' ship leaves Sri Lanka's Hambantota port
Chinese 'spy' ship leaves Sri Lanka's Hambantota port

బాలిస్టిక్‌ క్షిపణి వ్యవస్థలు, శాటిలైట్‌ ట్రాకింగ్‌ సామర్థ్యం కలిగిన యువాన్‌ వాంగ్‌ 5 రాకపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వాస్తవానికి ఈ నౌక హంబన్‌టోటకు ఆగష్టు  11వ తేదీనే రావాల్సి ఉంది. భారత్‌ భద్రతాపరమైన ఆందోళనల నడుమ శ్రీలంక అధికారులు అనుమతులను వెంటనే ఇవ్వలేదు. చైనా నిర్వహణలో ఉన్న హంబన్‌టోటకు ఆగష్టు  16వ తేదీన చేరుకుని ఇంధనం నింపుకునే కారణంతో ఆగష్టు 22 వరకు అక్కడే లంగరేసింది. యువాన్‌ వాంగ్‌ 5 ఆగష్టు 22న సాయంత్రం 4 గంటలకు చైనాలోని జియాంగ్‌ యిన్‌ పోర్టు దిశగా తిరిగి బయలుదేరి వెళ్లిపోయిందని హార్బర్‌ అధికారులు వెల్లడించారు. ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం పోర్టులో ఉన్న సమయంలో నౌకలోని సిబ్బందిని మార్చలేదని వివరించారు. తమ ప్రాదేశిక జలాల్లో ఉన్న సమయంలో ఈ నౌకలోని ఆటోమేటిక్‌ ఐడెంటిఫికేషన్‌ వ్యవస్థ స్విఛాన్‌ చేసి ఉంటుందని, ఎటువంటి పరిశోధనలు జరపరాదనే షరతులతోనే అనుమతులు ఇచ్చినట్లు శ్రీలంక ముందుగానే ప్రకటించింది.

Also read: Weekly Current Affairs (Awards) Bitbank: UAE ప్రభుత్వంచే "గోల్డెన్ వీసా" పొందిన నటులు ఎవరు?
 

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 23 Aug 2022 06:30PM

Photo Stories