Skip to main content

China Taiwan Latest News : చైనా దిగ్బంధంలో తైవాన్‌..

అమెరికా ప్రతినిధుల సభ మహిళా స్పీకర్‌ నాన్సీ పెలోసీ పర్యటనకు వేదికగా నిలిచిన తైవాన్‌పై చైనా కన్నెర్రజేసింది. సైనిక క్రీడల మాటున తైవాన్ అధీన‌ ప్రాంతాల్లో 500 కి.మీ.ల సుదూర లక్ష్యాలను ఛేదించే బాలిస్టిక్‌ క్షిపణులతో విరుచుకుపడింది.
China Taiwan
China Taiwan

ఈశాన్య, నైరుతి తైవాన్‌ జలసంధి వెంట చైనా సైన్యం బాంబులు వేసి అంతర్జాతీయ సమాజంలో కలకలం సృష్టించింది. తమ సేనలు దాడులు జరిపి ‘అనుకున్న’ ఫలితాలు సాధించాయని చైనా సైన్యం ఆగ‌స్టు 4వ తేదీన (గురువారం) ప్రకటించింది. సైనిక క్రీడలు ఆగ‌స్టు 7వ తేదీ (ఆదివారం) దాకా కొనసాగుతాయని తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం సమయంలో సైనిక క్రీడల పేరిట తైవాన్‌ సమీప ప్రాంతాల్లో చైనా సైన్యం డాంగ్‌ఫెండ్‌ క్షిపణులను కురిపించింది. సైనిక క్రీడల్లో భాగంగా చైనా తన అధునాతన యుద్ధవిమాన వాహక నౌక, అణ్వస్త్ర సామర్థ్య జలాంతర్గామిలను తైవాన్‌ జలసంధిలోకి ప్రవేశపెట్టింది. తైవాన్‌లోని జపాన్‌కు చెందిన ఎక్స్‌క్లూజివ్‌ ఎకనమిక్‌ జోన్‌ సమీపంలోనూ క్షిపణులు పడ్డాయి. ‘మేం ఏం చెప్తామో అదే చేస్తాం’ అని చైనా రక్షణశాఖ అధికార ప్రతినిధి టాన్‌ కెఫీ వ్యాఖ్యానించారు. క్షిపణి పరీక్షలంటూ చైనా రాకెట్లను ప్రయోగించడం వారంలో ఇది రెండోసారి కావడం గమనార్హం. 

చైనా సైన్యం క్షిపణి ప్రయోగాల నేపథ్యంలో అప్రమత్తమై తైవాన్‌ తన పౌర విమానాల రాకపోకలను వెనువెంటనే ఆపేసింది. రాజధాని తైపేలోని ఎయిర్‌పోర్ట్‌ నుంచి దాదాపు 50 విమాన సర్వీసులు రద్దయ్యాయి. ప్రపంచ విపణిలో అత్యంత కీలకమైన ప్రాసెస్‌ చిప్స్‌ల సముద్రమార్గ రవాణా కొనసాగుతోందా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. చైనా సైనిక డ్రిల్స్‌ చేస్తున్న అదే ప్రాంతానికి సమీపంలోకి అమెరికా పీ–8ఏ పోసిడాన్‌ గస్తీ విమానం, ఎంహెచ్‌–60ఆర్‌ జలాంతర్గామి విధ్వంసక హెలికాప్టర్‌లు వచ్చి ఉద్రిక్తతలను మరింత పెంచాయని సౌత్‌ చైనా మారి్నంగ్‌ పోస్ట్‌ ఒక కథనంలో పేర్కొంది. తైవాన్‌ సైతం మిరాజ్, ఎఫ్‌–5 యుద్ధ విమానాలతో చైనా దళాలున్న చోటుపై పర్యవేక్షణకు వెళ్లి వచ్చాయని స్థానిక మీడియా వెల్లడించింది. చైనా చర్యను చట్టవిరుద్ధ, బాధ్యతారాహిత్య చర్యగా తైవాన్‌ అభివర్ణించింది. 

తైవాన్‌పై నోరు మెదపని పెలోసీ.. 
తైవాన్‌ పర్యటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేలా చేసిన పెలోసీ.. దక్షిణ కొరియా పర్యటనలో ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. ద.కొరియా పార్లమెంట్‌ స్పీకర్‌ కిమ్‌ జిన్‌ ప్యోను పెలోసీ కలిసినా తైవాన్‌ అంశాన్ని బహిరంగంగా ప్రస్తావించలేదు. ఉ.కొరియా ‘అణు’ ప్రమాదంపై చర్చించామని జిన్‌ చెప్పారు.

 Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP

 

Sakshi Education Mobile App

Published date : 05 Aug 2022 04:38PM

Photo Stories