అక్టోబర్ 2017 అంతర్జాతీయం
Sakshi Education
సింగపూర్ పాస్‌పోర్ట్ అత్యంత శక్తిమంతం
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టులను జారీచేస్తున్న దేశాల జాబితాలో సింగపూర్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ జాబితాలో ఒక ఆసియా దేశం తొలి స్థానంలో నిలవడం ఇదే తొలిసారి. ఆర్థిక సలహాల సంస్థ ఆర్టన్ క్యాపిటల్ విడుదల చేసిన 'గ్లోబల్ పాస్‌పోర్టు పవర్ ర్యాంక్-2017'జాబితాలో రెండో స్థానంలో జర్మనీ నిలవగా భారత్ 75వ ర్యాంకును పొందింది. గత ఏడాది 78వ స్థానంలో నిలిచిన ఇండియా ఈసారి మూడుస్థానాలు మెరుగుపరుచుకుంది. భారతీయులకు 51 దేశాల్లో వీసా మినహాయింపు, లేదా వీసా ఆన్ అరైవల్ (విదేశీ విమానాశ్రయాల్లో దిగిన వెంటనే వీసా మంజూరు చేస్తారు) సౌకర్యం ఉంది. అఫ్గానిస్తాన్ చివరిదైన 94వ స్థానానికి పరిమితమవగా, పాకిస్తాన్, ఇరాక్‌లు సంయుక్తంగా 93వ స్థానంలో నిలిచాయి.
టాప్-10 శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌లు

ర్యాంకు | దేశం | స్కోరు |
1 | సింగపూర్ | 159 |
2 | జర్మనీ | 158 |
3 | స్వీడన్, దక్షిణ కొరియా | 157 |
4 | డెన్మార్క్, ఫిన్లాండ్, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, నార్వే, జపాన్, యూకే | 156 |
5 | లక్సెంబర్గ్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్‌స, బెల్జియం, ఆస్ట్రియా, పోర్చుగల్ | 155 |
6 | మలేసియా, ఐర్లాండ్, కెనడా, అమెరికా | 154 |
7 | ఆస్ట్రేలియా, గ్రీస్, న్యూజిలాండ్ | 153 |
8 | మాల్టా, చెక్ రిపబ్లిక్, ఐస్‌లాండ్ | 152 |
9 | హంగెరీ | 150 |
10 | స్లోవేనియా, స్లోవేకియా, పోలండ్, లిథువేనియా, లాత్వియా | 149 |
ర్యాంకు ఎలా నిర్ణయిస్తారు..
వివిధ దేశాల మధ్య అమలులో ఉన్న ఒప్పందాల ప్రకారం ఏ దేశ పౌరులకై తే అత్యధిక దేశాల్లో వీసా అవసరం ఉండదో సదరు దేశ పాస్‌పోర్ట్‌ను అత్యంత శక్తిమంతమైనదిగా పరిగణిస్తారు. సింగపూర్ దేశస్తులు వీసా అవసరం లేకుండా ఏకంగా 159 దేశాలకు వెళ్లే ఆస్కారం ఉంది కాబట్టి దానికి ప్రథమ స్థానం దక్కింది. ఇదివరకు జర్మనీతో కలిసి సింగపూర్ తొలి స్థానాన్ని పంచుకునేది. అయితే ఇటీవల సింగపూర్ ప్రజలకు పరాగ్వే వీసా మినహాయింపునిచ్చింది. దాంతో జర్మనీని రెండోస్థానానికి నెట్టిన సింగపూర్ తొలి స్థానానికి ఎగబాకింది. ఆసియా నుంచి దక్షిణకొరియా, జపాన్, మలేసియాలు కూడా మొదటి పది దేశాల్లో చోటు దక్కించుకున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గ్లోబల్ పాస్‌పోర్టు పవర్ ర్యాంక్-2017
ఎప్పుడు : అక్టోబర్ 25
ఎవరు : ఆర్టన్ క్యాపిటల్
ఎక్కడ : తొలి స్థానంలో సింగపూర్, 75వ స్థానంలో భారత్
చైనా అధ్యక్షుడిగా మరో ఐదేళ్లు జిన్‌పింగ్
చైనాలోని అధికార కమ్యూనిస్టు పార్టీ.. దేశాధ్యక్షుడు షి జిన్‌పింగ్ నేతృత్వంలో కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా, దేశాధ్యక్షుడిగా మరో ఐదేళ్ల పాటు (రెండోసారి) జిన్‌పింగ్‌కు అవకాశం కల్పించింది.
జిన్‌పింగ్, కెకియాంగ్ (కమ్యూనిస్ట్ పార్టీ రెండో ర్యాంక్ నాయకుడు, ప్రధాని) కాక రూలింగ్ కౌన్సిల్‌లో జిన్‌పింగ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లీ జాన్షు(67), ఉప ప్రధాని వాంగ్ యాంగ్(62), కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతకర్త వాంగ్ హనింగ్(62), పార్టీ ఆర్గనైజేషన్ డిపార్ట్‌మెంట్ హెడ్ జావో లెజీ(60), షాంఘై పార్టీ చీఫ్ హాన్ జెంగ్ (63) చోటు దక్కించుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చైనా అధ్యక్షుడిగా మరో ఐదేళ్లు జిన్‌పింగ్
ఎప్పుడు : అక్టోబర్ 25
ఎవరు : చైనా జాతీయ కమ్యూనిస్ట్ కాంగ్రెస్
ఎక్కడ : బీజింగ్
హవాయిలో రోడ్లపై ఫోన్లు వినియోగిస్తే జరిమానా
హవాయిలోని హోనొలులు నగరం రోడ్లపై నడిచేప్పుడు ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు చూడటంపై నిషేధం విధిస్తూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. అక్టోబర్ 25 నుంచి ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం రోడ్లపై ఫోన్లు చూస్తూ నడిచిన వారికి 35 డాలర్ల (రూ.2,200) జరిమానా విధిస్తారు.
ఇటీవల అమెరికాలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక్క 2016లోనే 5,987 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది రోడ్డుపై వస్తున్న వాహనాలను చూసుకోకపోవడంతో ప్రమాదానికి గురయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రోడ్లపై ఫోన్లు చూస్తూ నడిస్తే 35 డాలర్ల జరిమానా
ఎప్పుడు : అక్టోబర్ 25 నుంచి
ఎక్కడ : హోనొలులు, హవాయి, అమెరికా
ఎందుకు : రోడ్డు ప్రమాదాల నివారణకు
స్వాతంత్ర తీర్మానాన్ని ఆమోదించిన కాటలోనియా
స్వాతంత్య్రానికే మొగ్గు చూపుతూ జరిగిన రెఫరెండానికి కొనసాగింపుగా స్పెయిన్ నుంచి స్వాతంత్య్రం కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానానికి అక్టోబర్ 27న బార్సిలోనాలోని కాటలోనియా పార్లమెంటు ఆమోదం తెలిపింది. ‘గణతంత్ర స్వతంత్ర దేశంగా కాటలోనియాను ప్రకటిస్తున్నాం’ అనే ఆ తీర్మానానికి అనుకూలంగా 70 మంది, వ్యతిరేకంగా 10 మంది ఓటేశారు.
అయితే ఆ నిర్ణయం చట్టబద్ధం కాదని, అమలుకు వీలుకాదని స్పెయిన్ తేల్చిచెప్పింది. కాటలోనియాపై ప్రత్యక్ష పాలన విధించేలా ప్రధాని రజోయ్‌కి అధికారాలను అప్పగిస్తూ స్పెయిన్ సెనెట్ తీర్మానం చేసింది. ఐక్య స్పెయిన్‌కే యూరోపియన్ యూనియన్, అమెరికాలు మద్ధతు ప్రకటించాయి. కాటలోనియా పార్లమెంట్‌ను రద్దు చేసి, డిసెంబర్ 21న ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని నిర్ణయించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కాటలోనియా స్వాతంత్ర తీర్మానానికి ఆమోదం
ఎప్పుడు : అక్టోబర్ 27
ఎవరు : కాటలోనియా పార్లమెంట్
ఎందుకు : స్పెయిన్ నుంచి విడిపోయేందుకు
సౌదీలో క్రీడా మైదానాల్లోకి మహిళలకు అనుమతి
ఇటీవల మహిళలను డ్రైవింగ్‌కు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్న సౌదీ అరేబియా తాజాగా వారిని క్రీడా మైదానాల్లోకి కూడా అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం 2018 నుంచి అమల్లోకొస్తుందని, దీంతో వారు దేశంలోని మూడు ప్రధాన మైదానాలైన రియాద్, జెడ్డా, దామన్ స్టేడియాల్లో జరిగే మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించవచ్చని రాజు మహ్మద్ బిన్ సల్మాన్ తెలిపారు. అక్కడి గార్డియన్‌షిప్ చట్టం ప్రకారం మహిళలు చదువుకోవాలన్నా, ప్రయాణాలు చేయాలన్నా తండ్రి, భర్త లేదా సోదరుడి నుంచి కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
సౌదీ అరేబియా రాజు మహ్మద్ బిన్ సల్మాన్ మహిళల ప్రగతి కోసం పురుషులతోపాటు సమాన హక్కులు కల్పించేందుకు పలు సంస్కరణలు తీసుకొచ్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : క్రీడా మైదానాల్లోకి మహిళలకు అనుమతి
ఎప్పుడు : 2018 నుంచి
ఎవరు : రాజు మహ్మద్ బిన్ సల్మాన్
ఎక్కడ : సౌదీ అరేబియా
ఎందుకు : పురుషులతోపాటు సమాన హక్కులు కల్పించేందుకు
రోబోకు పౌరసత్వం
ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక రోబోకి పౌరసత్వం లభించింది. ‘సోఫియా’ అనే హ్యూమనాయిడ్ రోబోకి పౌరసత్వం ఇస్తున్నట్లు అక్టోబర్ 27న సౌదీ అరేబియా ప్రకటించింది.
తైవాన్ స్వాతంత్య్రాన్ని అంగీకరించం: జిన్‌పింగ్
స్వతంత్రంగా ఉండేందుకు తైవాన్ చేస్తున్న ప్రయత్నాలను విజయవంతం కానీయబోమని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రకటించారు. చైనా భూభాగం నుంచి ఏ భాగమైనా, ఎవరైనా, ఏ సంస్థ అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా విడిపోయేందుకు ప్రయత్నిస్తే అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కావాలంటే, హాంకాంగ్, మకావ్‌ల్లో జరుగుతున్నట్లు ఒక దేశం రెండు వ్యవస్థల విధానం ద్వారా శాంతియుత పద్ధతిలో పాలన కొనసాగించుకునేందుకు అంగీకరిస్తాం. తైవాన్ అభివృద్ధికి మనస్ఫూర్తిగా సహాయం చేస్తాం. ఈ మేరకు అక్టోబర్ 18న చైనా కమ్యూనిస్ట్ పార్టీ 19వ సమావేశాల్లో ప్రారంభోపన్యాసం చేసిన అధ్యక్షుడు షి జిన్‌పింగ్.. కీలక అంతర్గత, అంతర్జాతీయ అంశాలపై దేశ, పార్టీ విధానాలను సమావేశాలకు హాజరైన దాదాపు 2 వేల మంది ప్రతినిధులకు వివరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తైవాన్ స్వాతంత్య్రాన్ని అంగీకరించేది లేదని స్పష్టీకరణ
ఎప్పుడు : అక్టోబర్ 18
ఎవరు : చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్
ఎక్కడ : చైనా కమ్యూనిస్ట్ట్ పార్టీ 19వ సమావేశాల్లో
కేటలోనియా సర్కారు రద్దుకు స్పెయిన్ నిర్ణయం
కేటలోనియా వేర్పాటువాద ప్రభుత్వాన్ని రద్దుచేసి కొత్తగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు స్పెయిన్ ప్రకటించింది. వేర్పాటువాద నేతలు స్వాతంత్య్రం ప్రకటించకుండా ఆపేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు అక్టోబర్ 21న అత్యవసర కేబినెట్ సమావేశం నిర్వహించిన ప్రధాని మేరియానో రాజోయ్ కేటలోనియా ప్రభుత్వాన్ని రద్దుచేసి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. కేటలోనియన్ పార్లమెంటును రద్దుచేసేందుకు తనకు సంపూర్ణ అధికారాలివ్వాలని స్పెయిన్ సెనెట్‌ను ఆయన కోరారు. సెనెట్‌లో రాజోయ్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పాపులర్ పార్టీకి మెజారిటీ ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేటలోనియా సర్కార్ రద్దుకు నిర్ణయం
ఎప్పుడు : అక్టోబర్ 21
ఎవరు : స్పెయిన్ ప్రధాని మేరియానో రాజోయ్
జపాన్ ఎన్నికల్లో షింజో అబే పార్టీ విజయం
జపాన్ ప్రతినిధుల సభకు జరిగిన ఎన్నికల్లో ప్రధాని షింజో అబే పార్టీ విజయం సాధించింది. 465 మంది సభ్యులున్న దిగువ సభలో అబే నేతృత్వంలోని లిబరల్ డెమొక్రటిక్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించింది. ప్రతినిధుల సభకు అక్టోబర్ 22న ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో లిబరల్ డెమొక్రటిక్‌కు 281, మిత్రపక్షం కొమెటోకు 29 కలిపి మొత్తం 310 స్థానాలు లభించడంతో దాదాపు మూడింట రెండొంతుల ఆధిక్యం దక్కినట్లయింది. అబే నాలుగోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
లండన్‌లో కార్లపై కాలుష్య పన్ను
కాలుష్యానికి కారణమవున్న కార్లకు అడ్డుకట్ట వేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం కొత్త పన్నును అమల్లోకి తెచ్చింది. లండన్ నగరంలో తిరిగే పాత కార్లు, అధిక కాలుష్యాన్ని వెదజల్లుతున్న వాహనాలకు 10 పౌండ్ల (రూ. 858) జరినామా విధించాలని లండన్ మేయర్ సాదిఖ్ ఖాన్ నిర్ణయించారు. 2006కు ముందు రిజిస్టరైన డీజిల్, పెట్రోల్ వాహనాలకు ఈ కాలుష్య పన్ను వర్తిస్తుంది. యూరప్‌లో అత్యంత కాలుష్య నగరాల్లో ఒకటైన లండన్‌లో తక్షణం నివారణ చర్యలు చేపట్టాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో యూరోపియన్ యూనియన్ హెచ్చరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాత కార్లు, అధిక కాలుష్యం వెదజల్లుతున్న వాహనాలపై 10 పౌండ్ల జరిమానా
ఎప్పుడు : అక్టోబర్ 23
ఎవరు : లండన్ మేయర్ సాదిఖ్ ఖాన్
ఎక్కడ : లండన్‌లో
ఎందుకు : కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా
ఏఆర్ రెహ్మాన్ సంస్థతో యాపిల్ మ్యూజిక్ జట్టు
మ్యాక్ ల్యాబ్స్ ఏర్పాటు కోసం మ్యూజిక్ డెరైక్టర్ ఏఆర్ రెహ్మాన్ నెలకొల్పిన కేఎం మ్యూజిక్ కన్జర్వేటరీస్ (కేఎంఎంసీ)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు యాపిల్ మ్యూజిక్ వెల్లడించింది. యాపిల్‌కి చెందిన ప్రొఫెషనల్ మ్యూజిక్ యాప్ లాజిక్ ప్రో ఎక్స్‌తో స్వరాల రూపకల్పన చేయడంలో మ్యాక్ ల్యాబ్స్‌లో శిక్షణనిస్తారు. ప్రస్తుతం చెన్నైలో ఒక సెంటర్ ఉండగా.. ముంబైలో మరోటి ఏర్పాటు చేయనున్నట్లు యాపిల్ తెలిపింది. ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయూతనిచ్చేందుకు 10 మ్యూజికల్ స్కాలర్‌షిప్‌లు కూడా ఇస్తున్నట్లు యాపిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ఇంటర్నెట్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్) ఎడీ క్యూ తెలిపారు.
ఏఆర్ రెహ్మాన్ 2008లో కేఎం మ్యూజిక్ కన్జర్వేటరీని నెలకొల్పారు. ఇందులో హిందుస్తానీ, వెస్టర్న్ క్లాసికల్ సంగీతం, మ్యూజిక్ టెక్నాలజీ వంటి వాటిలో శిక్షణనిస్తున్నారు.
ఒబామా కేర్‌ను రద్దు చేసిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించినట్లుగానే మాజీ అధ్యక్షుడు ఒబామా తెచ్చిన ఆరోగ్య బీమా చట్టాన్ని(ఒబామా కేర్) అక్టోబర్ 12న రద్దు చేశారు. కాంగ్రెస్ సాయంతో ఒబామా కేర్‌ను రద్దు చేయాలని యత్నించినప్పటికీ వీలుకాకపోవడంతో తనకున్న విశేషాధికారాలతో కార్యనిర్వాహక ఉత్తర్వుల్ని జారీచేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఒబామా కేర్ అమెరికన్ల పాలిట పీడకలగా మారిందని విమర్శించారు. తాజాగా తాను తీసుకువచ్చిన ఆరోగ్య బీమా వల్ల తక్కువ ధరలతోనే పాలసీలను బీమా సంస్థలు ప్రజలకు విక్రయించవచ్చని ట్రంప్ తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఒబామా కేర్ రద్దు
ఎప్పుడు : అక్టోబర్ 12
ఎవరు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
ఎక్కడ : అమెరికాలో
విద్య’కు గూగుల్ బిలియన్ డాలర్ల సాయం
టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ‘గూగుల్’ వచ్చే ఐదేళ్లలో స్వచ్ఛంద సంస్థల ద్వారా 1 బిలియన్ డాలర్లమేర నిధులను ఖర్చు చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఈ నిధులు ఉపయోగిస్తామని గూగుల్ తెలిపింది. అలాగే సంస్థలోని ఉద్యోగులు కూడా ఈ అంశానికి సంబంధించి స్వచ్ఛందంగా సేవలందిస్తారని తెలియజేసింది. ‘గ్రో విత్ గూగుల్’ అనే కార్యక్రమాన్ని ఆవిష్కరించిన సందర్భంగా సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ ఈ విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా అమెరికన్లకు ఉద్యోగం సంపాదించడం ఎలా? వ్యాపారాన్ని అభివృద్ది చేసుకోవడం ఎలా? వంటి పలు అంశాలపై శిక్షణనిస్తారు. వివిధ ఆన్‌లైన్ విద్యా సంస్థలు సహా పలు స్వచ్ఛంద సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విద్యా ప్రమాణాల పెంపునకు 1 బిలియన్ డాలర్ల సాయం
ఎప్పుడు : అక్టోబర్ 13
ఎవరు : గూగుల్
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
సోమాలియా బాంబు పేలుడులో 231 మంది మృతి
సోమాలియా రాజధాని మొగదిషులో అక్టోబర్ 14న అత్యంత శక్తిమంతమైన బాంబు పేలడంతో 231 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 275 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఆఫ్రికా కొమ్ముగా పేరుపడ్డ సోమాలియాలో ఈ స్థాయిలో దాడి జరగడం ఇదే మొదటిసారని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఈ దాడిని జాతీయ విపత్తుగా పేర్కొన్న సోమాలియా ప్రభుత్వం ఇది అల్‌కాయిదా అనుబంధ ఉగ్రవాద సంస్థ అల్ షబాబ్ పనేనని ఆరోపించింది. సోమాలియా అధ్యక్షుడు మొహమద్ అబ్దుల్లాహీ మూడు రోజులు జాతీయ సంతాప దినాలుగా ప్రకటించారు.
చెన్నై హైస్పీడ్ రైల్వే కారిడార్‌పై డోక్లామ్ ప్రభావం
492 కి.మీ. పొడవున్న చెన్నై-బెంగళూరు-మైసూరు హైస్పీడ్ రైల్వే కారిడార్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం పూర్తిచేసి ఏడాది అయినప్పటికీ.. చైనా రైల్వే పనుల్లో ఎలాంటి పురోగతి చూపలేదని అధికారులు తెలిపారు. ఇందుకు భారత్-చైనాల మధ్య డోక్లామ్‌లో తలెత్తిన ఉద్రిక్తతే కారణమై ఉండొచ్చని రైల్వే శాఖ మొబిలిటి డెరైక్టరేట్ సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో చైనా రైల్వే ఎరియువన్ ఇంజనీరింగ్ గ్రూప్ కంపెనీ లిమిటెడ్(సీఆర్‌ఈఈసీ) స్పందన కోసం గత 6 నెలలుగా ఈ-మెయిల్స్ పంపిస్తూన్నా వారి నుంచి ఎలాంటి జవాబు రాలేదని అధికారులు వెల్లడించారు.
దేశవ్యాప్తంగా రైళ్ల వేగాన్ని ప్రస్తుతమున్న 80 కి.మీ/గంట నుంచి 160 కి.మీ/గంటకు పెంచేందుకు వీలుగా చెన్నై-బెంగళూరు-మైసూరు వంటి 9 హైస్పీడ్ కారిడార్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది.
అక్టోబర్ 18 నుంచి చైనా కమ్యూనిస్ట్ కాంగ్రెస్
ఐదేళ్లకోసారి జరిగే చైనా కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ సమావేశాలు అక్టోబర్ 18న ప్రారంభమయ్యాయి. వారం రోజులపాటు సాగే ఈ కీలక సమావేశాల్లో ప్రస్తుత అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కే మరోసారి చైనా పగ్గాలు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఆయన ఎన్నిక దాదాపు ఖరారు కాగా జిన్‌పింగ్‌ను అధికారికంగా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోనున్నారు. చైనాలో సీపీసీ ప్రధాన కార్యదర్శే అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.
స్టాండింగ్ కమిటీ చేతిలో అధికారాలు
చైనాలో కీలక అధికారాలు ఏడుగురు సభ్యుల స్టాండింగ్ కమిటీ చేతుల్లోనే ఉంటాయి. ఆ కమిటీకి ప్రస్తుతం నాయకత్వం వహిస్తున్న జిన్‌పింగ్ (64) దేశాధ్యక్షుడిగానే కాకుండా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా, సైనికాధ్యక్షుడిగాను కొనసాగుతున్నారు. మిగతా ఆరుగురిలో ప్రధాని లీ కెకియాంగ్ తదితరులు ఉన్నారు. 2002 పార్టీ సమావేశాల్లో చేసిన ఒప్పందం మేరకు అగ్రనేతలైన అధ్యక్షుడు, ప్రధాని రెండోసారి కమిటీలో కొనసాగనున్నారు. వారిద్దరినీ మినహాయిస్తే కమిటీలోని మిగిలిన ఐదుగురు సభ్యుల మార్పు దాదాపు ఖాయమైంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చైనా కమ్యూనిస్ట్ కాంగ్రెస్ 19వ సమావేశాలు
ఎప్పుడు : అక్టోబర్ 18 నుంచి (వారం రోజులు)
ఎక్కడ : చైనాలో
ఆసియా టాప్-50 యూనివర్సిటీల జాబితా
ఆసియాలోని అత్యుత్తమ 50 యూనివర్సిటీల జాబితాలో మూడు భారత విద్యాసంస్థలకు స్థానం దక్కింది. క్వాక్‌క్వాడ్రిల్లీ సైమండ్‌స (క్యూఎస్) సంస్థ విడుదల చేసిన ఈ జాబితాలో సింగపూర్‌కు చెందిన నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ మొదటి స్థానంలో (నిరుడు 3వ స్థానం) నిలవగా.. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ రెండో స్థానం (గతేడాది మొదటి స్థానం) దక్కించుకుంది. టాప్-10 జాబితాలో భారత యూనివర్సిటీలకు చోటు దక్కలేదు. ఐఐటీ-బాంబే 34వ స్థానంలో నిలవగా.. ఐఐటీ-ఢిల్లీ 41వ, ఐఐటీ-మద్రాస్ 48వ స్థానాలను దక్కించుకున్నాయి. తర్వాతి స్థానాల్లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్‌స బెంగళూరు (51), ఐఐటీ కాన్పూర్ (59), ఢిల్లీ యూనివర్సిటీ (72), ఐఐటీ రూర్కీ (93), ఐఐటీ గువాహటి (98)లు ఉన్నాయి.
ఆసియాలోని 400కు పైగా వర్సిటీలను పరిశీలించిన ఈ సంస్థ.. యూనివర్సిటీల్లో అధ్యాపకుల అర్హత (పీహెచ్‌డీ), దేశ, విదేశీ విద్యార్థుల సంఖ్య, అకడమిక్ ఫలితాలు, విద్యార్థులు-అధ్యాపకుల నిష్పత్తి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకింగ్ నిర్ణయించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆసియా టాప్ - 50 యూనివర్సిటీల జాబితా
ఎప్పుడు : అక్టోబర్ 17
ఎవరు : క్వాక్‌క్వాడ్రిల్లీ సైమండ్స్
ఉత్తరకొరియాపై మరిన్ని ఆంక్షలు విధించిన ఈయూ
వరుస క్షిపణి ప్రయోగాలతో అమెరికా, దాని మిత్ర దేశాలకు హెచ్చరికలు పంపుతున్న ఉత్తర కొరియాపై యూరోపియన్ యూనియన్ మరిన్ని ఆంక్షలు విధించింది. ఈ మేరకు లక్సెంబర్గ్‌లో జరిగిన ఈయూ విదేశాంగ మంత్రుల సమావేశంలో నిర్ణయించారు. దీని ప్రకారం ఉత్తర కొరియాలో ఈయూ దేశాల పెట్టుబడులను నిషేధించారు. చమురు ఉత్పత్తుల సరఫరాను నిలిపివేశారు. ఈయూలో ఉన్న ఉత్తర కొరియాకు చెందిన వ్యక్తులు స్వదేశానికి నగదు పంపకుండా నిషేధించారు.
ఉత్తర కొరియా అణు, క్షిపణి కార్యక్రమాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఐక్యరాజ్య సమితి.. ఇప్పటికే ఆ దేశంపై అనేక ఆంక్షలు విధించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉత్తర కొరియపై మరిన్ని ఆంక్షలు
ఎప్పుడు : అక్టోబర్ 17
ఎవరు : యూరోపియన్ యూనియన్
అమెరికాతో సౌదీ భారీ ఆయుధ డీల్
సౌదీ అరేబియాకు అత్యాధునిక టెర్మినల్ హై అల్టిట్యూడ్ ఏరియా డిఫెన్‌స(థాడ్) క్షిపణి రక్షణ వ్యవస్థ అమ్మకానికి అమెరికా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. థాడ్ ఒప్పందం విలువ 15 బిలియన్ డాలర్లు(రూ. 97 వేల కోట్లు) అని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. శక్తివంతమైన రాడార్లు అమర్చిన ఈ థాడ్ క్షిపణులు శత్రు దేశాల క్షిపణుల్ని మధ్యలోనే అడ్డుకుని పేల్చివేస్తాయి. గంటకు 10 వేల కి.మీ వేగంతో ప్రయాణించే థాడ్ క్షిపణులు 150 కిలోమీటర్ల ఎత్తువరకూ ఎగరగలవు.
ఇప్పటికే థాడ్‌ను సౌదీ పొరుగు దేశాలైన ఖతర్, యూఏఈలకు అమెరికా సరఫరా చేసింది. అమెరికా ఆయుధ సంపత్తిలో థాడ్ అత్యంత సమర్థవంతమైన క్షిపణి రక్షణ వ్యవస్థ. శత్రు క్షిపణుల్ని కచ్చితంగా గుర్తించి పేల్చేందుకు ఇందులో రాడార్ వ్యవస్థలున్నాయి. 20 అడుగుల పొడవుండే థాడ్ క్షిపణులు టన్ను బరువుంటాయి. ఇన్‌ఫ్రారెడ్ సెన్సర్ల సాయంతో మిస్సైల్‌ను అంచనావేసి పేల్చేస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సౌదీ అరేబియాతో 15 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధ ఒప్పందానికి ఆమోదం
ఎప్పుడు : అక్టోబర్ 6
ఎవరు : అమెరికా
ఎందుకు : టెర్మినల్ హై అల్టిట్యూడ్ ఏరియా డిఫెన్‌స(థాడ్) క్షిపణుల సరఫరా కోసం
చైనాలో 13 లక్షల అవినీతి అధికారులకు శిక్ష
చైనాలోని 13.4 లక్షల మంది అవినీతి అధికారులను ఆ దేశ ప్రభుత్వం శిక్షించింది. అవినీతిని నిర్మూలించేందుకుగాను ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రారంభించిన స్వీపింగ్ యాంటీ కరప్షన్’ కార్యక్రమంలో భాగంగా అవినీతి అధికారులను గుర్తించి శిక్షించారు. అక్టోబర్ 18న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) 19వ జాతీయ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో సెంట్రల్ కమిషన్ ఫర్ డిసిప్లిన్ ఇన్‌స్పెక్షన్ (సీసీడీఐ)కు నేతృత్వం వహిస్తున్న వాంగ్ క్విషాన్ ఈ వివరాలను అక్టోబర్ 8న వెల్లడించారు. 2012లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటి నుంచి 13.4 లక్షల మంది అవినీతి అధికారులను శిక్షించినట్లు పేర్కొన్నారు. వీరిలో 13 వేల మంది మిలిటరీ అధికారులు ఉన్నట్లు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) అధికార పత్రిక వెల్లడించింది. మిలిటరీలో ఉద్యోగాలను అమ్ముకున్నారని సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సీఎంసీ) వైస్ చైర్మన్‌గా పనిచేసిన జనరల్ జు కై హూతోపాటు జనరల్ జూ బోక్సంగ్‌ను కూడా శిక్షించారు.
చెల్లెలికి ప్రమోషన్ ఇచ్చిన కిమ్
ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్.. పార్టీ కీలక పదవిలో తన సోదరిని నియమించారు. ఈ మేరకు కిమ్ యో జోంగ్‌ను పార్టీ శక్తిమంతమైన పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా నియమించినట్లు ప్రభుత్వ అధికార వార్తా సంస్థ కేసీఎన్‌ఏ స్పష్టం చేసింది. అక్టోబర్ 8న కిమ్ జోంగ్ ఉన్ నేతృత్వంలో జరిగిన పార్టీ కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
సౌదీలో మహిళల డ్రైవింగ్‌కు అనుమతి
సౌదీ అరేబియాలో మహిళలు డ్రైవింగ్ చేయడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని ఆ దేశం నిర్ణయించింది. ఈ మేరకు సౌదీ రాచకుటుంబం సెప్టెంబర్ 26న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు 2018 జూన్ నుంచి అమల్లోకి వస్తాయి.
ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా మహిళలు డ్రైవింగ్ చేయడాన్ని సౌదీ గతంలో నిషేధించింది. ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని దాదాపు మూడు దశాబ్దాల నుంచి మహిళలు, హక్కుల కార్యకర్తలు ఉద్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో దిగొచ్చిన ప్రభుత్వం.. నిషేధాన్ని ఎత్తివేయాలని నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మహిళలకు డ్రైవింగ్‌కు అనుమతి
ఎప్పుడు : సెప్టెంబర్ 26
ఎవరు : సౌదీ రాచకుటుంబం
ఎక్కడ : సౌదీ అరేబియాలో
జపాన్ పార్లమెంట్ రద్దు
జపాన్ పార్లమెంట్‌ను రద్దు చేస్తూ ఆ దేశ ప్రధాని షింజో అబే సెప్టెంబర్ 28న ఆకస్మిక నిర్ణయం తీసుకున్నారు. ఉత్తర కొరియాతో యుద్ధ వాతావరణం, కొత్త పన్ను విధానం అమలు నేపథ్యంలో పార్లమెంట్‌పై పూర్తి పట్టుకోసం తాజా ఎన్నికలకు అబే పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పేరొందిన జపాన్‌లో అక్టోబర్ 22న ఎన్నికలు జరిగే అవకాశముంది. అబే అధికారిక నిర్ణయాన్ని స్పీకర్ చదివి వినిపించగానే పార్లమెంట్ దిగువ సభ సభ్యులు ఆమోదం తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జపాన్ పార్లమెంటు రద్దు
ఎప్పుడు : సెప్టెంబర్ 28
ఎవరు : జపాన్ ప్రధాని షింజో అబే
కాటలోనియాలో ప్రజాభిప్రాయ సేకరణ
స్పెయిన్ నుంచి స్వాతంత్య్రం పొందేందుకు ఆ దేశ ఈశాన్య ప్రాంతం కాటలోనియాలో అక్టోబర్ 1న ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. కాటలోనియా జనాభా సుమారు 75 లక్షలు. ఆర్థికంగా బలమైన ఈ ప్రాంతానికి ప్రత్యేక సంస్కృతి, భాష ఉన్నాయి.
థాయ్‌లాండ్ మాజీ ప్రధానికి ఐదేళ్ల జైలు
థాయ్‌లాండ్ మాజీ ప్రధాని ఇంగ్లక్ షినవత్రకు ఆ దేశ సుప్రీంకోర్టు సెప్టెంబర్ 27న ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. బియ్యం రాయితీ పథకంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ప్రభుత్వానికి భారీ ఆర్థిక నష్టం కలిగించారని కోర్టు తేల్చింది.

Published date : 13 Oct 2017 05:21PM