Skip to main content

ఆగస్టు 2020 అంతర్జాతీయం

పేద దేశాలకూ టీకా: డబ్ల్యూహెచ్‌ఓ
Current Affairs
ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ వస్తే నిరుపేద దేశాలకు కూడా అందేలా ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఒ) పిలుపునిచ్చింది. వ్యాక్సిన్ అంశంలో జాతీయవాదాన్ని ప్రదర్శించకూడదని సంపన్న దేశాలకు హితవు పలికింది. ఇందుకు సంబంధించి అంతర్జాతీయంగా పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ టెడ్రోస్‌ అధ్నామ్‌ సూచించారు. వివిధ దేశాల్లో జరుగుతున్న వ్యాక్సిన్ పరిశోధనలు ముందడుగు వేస్తున్న తరుణంలో టోడ్రోస్ ఈ వ్యాఖ్యలు చేశారు.
డిసెంబర్‌ నాటికి చైనా వ్యాక్సిన్
వూహాన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోలాజికల్‌ ప్రొడక్ట్స్‌ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ 2020, డిసెంబర్ నాటికి వచ్చే అవకాశాలున్నాయి. అత్యంత కీలకమైన మూడో దశ ప్రయోగాలు ప్రస్తుతం జరుగుతున్నాయని ఈ వ్యాక్సిన్ అభివృద్ధికి సహకరిస్తున్న చైనా ప్రభుత్వ కంపెనీ సినోఫార్మ్‌ చైర్మన్ లియూ జింగ్‌హెన్ తెలిపారు. ఈ వ్యాక్సిన్ ఖరీదు ఇండియన్ కరెన్సీలో 10 వేల రూపాయల వరకు ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: సంబంధించి అంతర్జాతీయంగా పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేయాలి
ఎప్పుడు: ఆగస్టు 19
ఎవరు: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఒ)
ఎందుకు:కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ వస్తే నిరుపేద దేశాలకు కూడా అందేందుకు

దక్షిణ చైనా సముద్రంపై క్షిపణుల ప్రయోగం
చైనా నావికా విన్యాసాల్లో భాగంగా మొదటిసారిగా రెండు విమాన విధ్వంసక మిసైల్స్‌ని, దక్షిణ చైనా సముద్రంపైన ప్రయోగించింది. అమెరికా గూఢచార విమానాలు వివాదాస్పద భూభాగంలో తిరుగుతున్నాయని చైనా ఆరోపించింది. దక్షిణ, తూర్పు చైనా సముద్ర ప్రాంతాల్లో ఉన్న వివాదాన్ని దృష్టిలో ఉంచుకొని, చైనా ఈ ప్రాంతంలో సైనిక స్థావరాలను బలోపేతం చేసుకుంది. దక్షిణ చైనా సముద్రంపై తమకే పూర్తి అధికారాలున్నాయని బీజింగ్‌ పేర్కొంటుండగా, వియత్నాం, మలేషియా, పిలిప్‌పైన్స్, బ్రూనే, తైవాన్‌లు విభేదిస్తున్నాయి. ఈ రెండు మిస్సైళ్లు 4 వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగలవు.
గల్వాన్ ఘటన దురదృష్టకరం: చైనా
తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి గల్వాన్ ప్రాంతంలో భారత్, చైనా మధ్య జూన్ లో జరిగిన ఘర్షణలపై డ్రాగన్ దేశం విచారం వ్యక్తం చేసింది. ఆ ఘటన అత్యంత దురదృష్టకరమైనదని పేర్కొంది. అలా జరిగి ఉండాల్సింది కాదంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. చైనా, భారత్‌ యువత పాల్గొన్న ఒక వెబినార్‌కు ఆగస్టు 26న హాజరైన భారత్‌లో చైనా రాయబారి సన్ వీడాంగ్‌ ఈ విధంగా వ్యాఖ్యానించారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : దక్షిణ చైనా సముద్రంపై క్షిపణుల ప్రయోగం
ఎప్పుడు : ఆగస్టు 27
ఎవరు : చైనా
ఎందుకు : చైనా నావికా విన్యాసాల్లో భాగంగా

పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కొరత
Current Affairs
ప్రపంచవ్యాప్తంగా 43 శాతం పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు అధ్వానంగా ఉన్నాయని.. కనీసం నీరు, సబ్బులు, హ్యాండ్‌ వాష్‌ వంటివి డబ్ల్యూహెచ్‌వో, యూనిసెఫ్‌ అధ్యయనంలో వెల్లడయింది. అన్ని దేశాల్లోని పాఠశాలల్లో ఇదే పరిస్థితి అని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 81.8 కోట్ల మంది విద్యార్థులకు పాఠశాలల్లో కనీసం చేతులు శుభ్రం చేసుకునే పరిస్థితి లేదని, ఇందులో 3వ వంతు మంది ఆఫ్రికాలోనే ఉన్నారని తెలిపింది. ప్రతి మూడింటిలో ఒక పాఠశాలలో నీటి సదుపాయం అంతంతమాత్రమేనని, లేదా పూర్తిగా లేదని పేర్కొంది.
రష్యా టీకా అడ్వాన్స్ స్టేజ్‌లో లేదు
ప్రయోగదశలో ముందున్నాయని తాము భావిస్తున్న తొమ్మిది వ్యాక్సిన్లలో రష్యా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్‌–5’ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. పరీక్షల దశలోనే వ్యాక్సిన్ల కోసం ఒప్పందాలు చేసుకోవడానికి, పెట్టుబడులు పెట్టడానికి వీలుగా డబ్ల్యూహెచ్‌వో ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది టీకాలను అడ్వాన్స్ స్టేజ్‌లో ఉన్నట్లుగా గుర్తించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: 43 శాతం పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కొరత
ఎప్పుడు: ఆగస్టు 14
ఎవరు: డబ్ల్యూహెచ్‌వో, యూనిసెఫ్‌ అధ్యయనం
ఎక్కడ: ప్రపంచవ్యాప్తంగా

ఇజ్రాయెల్, యూఏఈ శాంతి ఒప్పందం
నిత్యం రావణకాష్టంలా రగిలి పోయే మధ్యప్రాచ్యంలో దౌత్యపరంగా భారీ ముందడుగు పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్యవర్తిత్వం ఫలించి ఆగస్టు 13న ఇజ్రాయెల్, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లు శాంతి స్థాపన దిశగా అడుగులు వేశాయి. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల పటిష్టతకు చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఇజ్రాయెల్‌కు స్నేహహస్తం చాచిన మొట్టమొదటి గల్ఫ్‌ దేశంగా, అరబ్‌ ప్రపంచంలో మూడో దేశంగా యూఏఈ నిలిచింది. పాలస్తీనా ఆక్రమణపై ఇరు దేశాల మధ్య పాతికేళ్లుగా కొనసాగుతున్న వైరానికి ట్రంప్‌ చొరవతో తెరపడింది.
తాజా ఒప్పందంపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమిన్ స్పందిస్తూ... అరబ్‌ ప్రపంచంతో కొత్త శకం ఏర్పాటవుతోందని పేర్కొన్నారు. పాలస్తీనా భూభాగాలను ఇజ్రాయెల్‌ ఆక్రమించకూడదన్న షరతు మీదే ఒప్పందం కుదుర్చుకున్నామని యూఏఈ యువరాజు షేక్‌ మహమ్మద్‌ బిన్ జాయేద్‌ ట్వీట్‌ చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఇజ్రాయెల్, యూఏఈ శాంతి ఒప్పందం
ఎప్పుడు: ఆగస్టు 14
ఎవరు: ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు, యూఏఈ యువరాజు షేక్‌ మహమ్మద్‌ బిన్ జాయేద్‌
ఎందుకు:ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల పటిష్టతకు

ఐరాసలో ఇరాన్‌పై వీగిన తీర్మానం
ఇరాన్ పై ఐక్యరాజ్య సమితి విధించిన ఆయుధ ఆంక్షలను నిరవధికంగా కొనసాగించాలని కోరుతూ అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో వీగిపోయింది. తీర్మానాన్ని ఆమోదించడానికి భద్రతా మండలిలోని 15 సభ్య దేశాల్లో కనీసం 9 దేశాలు మద్దతు పలకాల్సి ఉంటుంది. అమెరికా తీర్మానానికి అనుకూలంగా రెండు ఓట్లు, వ్యతిరేకంగా రెండు ఓట్లు రాగా, 11 మంది సభ్యులు ఓటింగ్‌కి దూరంగా ఉన్నారు. అమెరికా తీర్మానానికి అనుకూలంగా కేవలం డొమినికన్ రిపబ్లిక్‌ నుంచి మాత్రమే మద్దతు లభించింది. అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో తీర్మానం ఓడిపోయినట్లు ప్రకటించారు. ఈ తీర్మానాన్ని రష్యా, చైనా తీవ్రంగా వ్యతిరేకించాయి.
2015లో...
2015లో ఇరాన్ కీ, ఆరు పెద్ద దేశాలైన రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీల మధ్య, అణ్వాయుధ నిరాయుధీకరణ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ఇరాన్ అణ్వాయుధాలను నిర్వీర్యం చేస్తూ, నిరాయుదీకరణకు కృషిచేయాలి. ఈ ఒప్పందం నుంచి 2018లో డొనాల్డ్ ట్రంప్‌ ప్రభుత్వం వైదొలిగింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఐరాసలో ఇరాన్‌పై వీగిన తీర్మానం
ఎప్పుడు: ఆగస్టు 15
ఎవరు: అమెరికా
ఎందుకు:ఇరాన్ పై ఐక్యరాజ్య సమితి విధించిన ఆయుధ ఆంక్షలను నిరవధికంగా కొనసాగించాలని

పేద దేశాలకూ టీకా: డబ్ల్యూహెచ్‌ఓ
ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ వస్తే నిరుపేద దేశాలకు కూడా అందేలా ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఒ) పిలుపునిచ్చింది. వ్యాక్సిన్ అంశంలో జాతీయవాదాన్ని ప్రదర్శించకూడదని సంపన్న దేశాలకు హితవు పలికింది. ఇందుకు సంబంధించి అంతర్జాతీయంగా పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ టెడ్రోస్‌ అధ్నామ్‌ సూచించారు. వివిధ దేశాల్లో జరుగుతున్న వ్యాక్సిన్ పరిశోధనలు ముందడుగు వేస్తున్న తరుణంలో టోడ్రోస్ ఈ వ్యాఖ్యలు చేశారు.

డిసెంబర్‌ నాటికి చైనా వ్యాక్సిన్
వూహాన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోలాజికల్‌ ప్రొడక్ట్స్‌ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ 2020, డిసెంబర్ నాటికి వచ్చే అవకాశాలున్నాయి. అత్యంత కీలకమైన మూడో దశ ప్రయోగాలు ప్రస్తుతం జరుగుతున్నాయని ఈ వ్యాక్సిన్ అభివృద్ధికి సహకరిస్తున్న చైనా ప్రభుత్వ కంపెనీ సినోఫార్మ్‌ చైర్మన్ లియూ జింగ్‌హెన్ తెలిపారు. ఈ వ్యాక్సిన్ ఖరీదు ఇండియన్ కరెన్సీలో 10 వేల రూపాయల వరకు ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: సంబంధించి అంతర్జాతీయంగా పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేయాలి
ఎప్పుడు: ఆగస్టు 19
ఎవరు: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఒ)
ఎందుకు:కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ వస్తే నిరుపేద దేశాలకు కూడా అందేందుకు

వ్యాక్సిన్ ను సిద్ధం చేస్తున్నాం: ఇజ్రాయెల్‌
Current Affairs
కరోనా చికిత్సకు తమ వద్ద అద్భుతమైన వ్యాక్సిన్ తయారుగా ఉందని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. అయితే ఈ వాక్సిన్ ని మానవ ప్రయోగం చేయాల్సి ఉందని, దీన్ని త్వరలోనే ప్రారంభిస్తామని ఆగస్టు 6న ప్రకటించింది. ఇజ్రాయెల్‌ రక్షణ శాఖ మంత్రి బెన్నీ గాంట్జ్‌ కోవిడ్‌ వ్యాక్సిన్ తయారీ ప్రయత్నాలను పరిశీలించేందుకు ఇజ్రాయెల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయలాజికల్‌ రీసెర్చ్‌(ఐఐబీఆర్‌)ని సందర్శించారు. ఐఐబీఆర్‌ రక్షణ శాఖతో కలిసి ఈ ప్రయోగాలను నిర్వహిస్తోంది. ఈ ప్రయోగ కార్యక్రమాన్ని ప్రధాని కార్యాలయం పర్యవేక్షిస్తోంది.
జెనరా ఔషధానికి అనుమతి...
ఔషధ తయారీలో ఉన్న హైదరాబాద్‌ కంపెనీ బయోఫోర్‌ ఇండియా ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన జెనరా ఫార్మా.. కోవిడ్‌ చికిత్సలో వాడే ఫావిపిరావిర్‌ ట్యాబ్లెట్స్‌ తయారీకై డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) నుంచి అనుమతి పొందింది. ఫావిజెన్ పేరుతో ఈ ట్యాబ్లెట్లను కంపెనీ తయారు చేయనుంది.

శ్రీలంక ఎన్నికల్లో రాజపక్స పార్టీ విజయం
శ్రీలంక సార్వత్రిక ఎన్నికల్లో మహిందరాజపక్స పార్టీ ఘనవిజయం సాధించింది. రాజపక్స నాయకత్వంలోని శ్రీలంక పీపుల్స్‌ పార్టీ మూడింటరెండొంతుల స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో మహింద 4వసారి ప్రధాన మంత్రిగా ఆగస్టు 9న ప్రమాణస్వీకారం చేయనున్నారు. శ్రీలంక పీపుల్స్‌ పార్టీ పార్లమెంటులోని 225 సీట్లకుగాను 150 సీట్లలో విజయబావుటా ఎగురవేసింది. మాజీ ప్రధాని రణిల్‌ విక్రమ్‌ సింఘే యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ కేవలం ఒకే ఒక్క సీటు గెలుచుకుంది. 1977 నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ, నాలుగుసార్లు ప్రధానిగా చేసిన విక్రమ్‌సింఘే ఘోరపరాజయం పాలయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి:శ్రీలంక సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం
ఎప్పుడు: ఆగస్టు 7
ఎవరు: శ్రీలంక పీపుల్స్‌ పార్టీ(మహిందరాజపక్స పార్టీ)

చైనా సోషల్‌ మీడియా యాప్‌లపై నిషేధం
చైనా సోషల్‌ మీడియా యాప్‌లపై అగ్రరాజ్యం అమెరికా నిషేధం విధించింది. అమెరికా జాతీయ భద్రతకు, ఆర్థిక వ్యవస్థలకు ప్రమాదం పొంచివుందన్న కారణంగా టిక్‌టాక్, వుయ్‌ చాట్‌ యాప్‌లపై నిషేధం విధిస్తూ ఆగస్టు 7న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ నిషేధం 45 రోజుల్లో అమలులోకి రానుంది. ఇదిలా ఉండగా టిక్‌టాక్‌ అమెరికా విభాగాన్ని మైక్రోసాఫ్‌ కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతోంది. భారత్‌ ఇటీవలే టిక్‌టాక్, వీచాట్‌లతో పాటు చైనాకు సంబంధించిన 106 యాప్‌లపై ఇటీవలే భారత్ నిషేధం విధించిన విషయం తెలిసిందే.
భారత్, చైనాలకు వెళ్లకండి..
కోవిడ్‌–19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో భారత్, చైనా తదితర 50 దేశాలకు వెళ్లరాదని అమెరికా ప్రభుత్వం తన పౌరులను కోరింది. కరోనా వైరస్‌ వ్యాప్తితో మార్చిలో జారీ చేసిన ప్రపంచ ఆరోగ్య ప్రయాణ మార్గదర్శకాలను ఎత్తివేసి, దాని స్థానంలో దేశాల వారీ ప్రయాణ హెచ్చరికలను జారీ చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి:టిక్‌టాక్, వుయ్‌ చాట్‌ యాప్‌లపై నిషేధం
ఎప్పుడు: ఆగస్టు 7
ఎవరు: అమెరికా ప్రభుత్వం
ఎందుకు:అమెరికా జాతీయ భద్రతకు, ఆర్థిక వ్యవస్థలకు ప్రమాదం పొంచివుందన్న కారణంగా

శ్రీలంక ప్రధానిగా మహింద ప్రమాణం
శ్రీలంక ప్రధానిగా మహిందరాజపక్స(74) నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. కొలంబోకు సమీపంలోని కేలనియాలో ఉన్న 2,500 ఏళ్లనాటి పురాతన బౌద్ధాలయంరాజమహవిహారయలో ఆగస్టు 9న జరిగిన కార్యక్రమంలో శ్రీలంక 13వ ప్రధానిగా ఆయన ప్రమాణం చేశారు. మహింద సోదరుడు, శ్రీలంక అధ్యక్షుడు అయిన గొతబయరాజపక్స ఆయనతో ప్రమాణం చేయించారు. ఇటీవలి ఎన్నికల్లో ఆయన పార్టీ శ్రీలంక పీపుల్స్‌ పార్టీ(ఎస్‌ఎల్‌పీపీ)ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజా పరిణామంతో శ్రీలంక ఎన్నికల్లో వచ్చే అయిదేళ్లపాటురాజపక్స కుటుంబం హవా సాగనుంది.
225కు గాను.. 150 సీట్లు
ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్‌లోని 225 సీట్లకు గాను ఒక్క ఎస్‌ఎల్‌పీపీనే 145 సీట్లు సాధించింది. మిత్ర పార్టీలతో కలిసి అధికార పక్షం బలం 150 సీట్లకు చేరింది. ఎస్‌ఎల్‌పీపీ వ్యవస్థాపకుడు, పార్టీ జాతీయ నిర్వాహకుడు అయిన బసిల్‌ రాజపక్స(69) కూడా మహింద సోదరుడే. మహింద కుమారుడు నమల్‌ రాజపక్స(34) కూడా తమ కుటుంబం కంచుకోటగా ఉన్న హంబన్తొట స్థానం నుంచి ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలోనే దేశ రాజకీయాలపై రాజపక్స కుటుంబం మరింత పట్టు సాధించేందుకు వీలుగా రాజ్యాంగాన్ని సవరించే అవకాశముంది.
24 ఏళ్లకే పార్లమెంట్‌లోకి..
మహిందరాజపక్స దేశ రాజకీయాల్లోకి ప్రవేశించి 2020 ఏడాది జూలైతో 50 ఏళ్లు ముగిశాయి. 24 ఏళ్ల వయస్సులోనే 1970లో ఆయన మొదటి సారిగా పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. రెండు పర్యాయాలు దేశాధ్యక్ష పదవి చేపట్టారు. 2004–05 సంవత్సరాల్లో, 2018లో 52 రోజులు, తిరిగి 2019–20 సంవత్సరాల్లో ప్రధానిగా పనిచేశారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఆయనకు 5,27,000 ఓట్లు పోలయ్యాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి:శ్రీలంక13వ ప్రధానిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం
ఎప్పుడు: ఆగస్టు 9
ఎవరు: మహిందరాజపక్స
ఎక్కడ: కొలంబోకు సమీపంలోని కేలనియా

జీఎస్‌కే, సనోఫీ పేశ్చర్‌లతో యూఎస్ ఒప్పందం
Current Affairs
కరోనా వైరస్‌ను అంతం చేసే వ్యాక్సిన్ ను సాధ్యమైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అమెరికా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా వ్యాక్సిన్ అభివృద్ధి, క్లినికల్‌ ట్రయల్స్, ఉత్పత్తి, సరఫరా కోసం 2.1 బిలియన్ డాలర్లు(రూ.15,725 కోట్లు) వెచ్చించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రముఖ ఫార్మా సంస్థలు గ్లాక్సోస్మిత్‌క్లైన్(జీఎస్‌కే), సనోఫీ పేశ్చర్‌లతో ఒప్పందం చేసుకుంది. జీఎస్‌కే(బ్రిటన్), సనోఫీ(ఫ్రాన్స్) సంస్థలు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ 2020 ఏడాది చివరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అమెరికాకు 10 కోట్ల వ్యాక్సిన్ డోసులు సరఫరా చేస్తామని జీఎస్‌కే, సనోఫీ ప్రకటించాయి.
తొలి శునకం మృతి..
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్‌ బారినపడ్డ మొదటి శునకం ‘బడ్డీ’ జూలై 31న మృతి చెందింది. జర్మన్ షెఫర్డ్‌ డాగ్‌ అయిన బడ్డీకి 2020, జూన్ లో కరోనా సోకింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఫార్మా సంస్థలు గ్లాక్సోస్మిత్‌క్లైన్(జీఎస్‌కే), సనోఫీ పేశ్చర్‌లతో ఒప్పందం
ఎప్పుడు: జూలై 31
ఎవరు: అమెరికా ప్రభుత్వం
ఎందుకు:కరోనా వైరస్‌ను అంతం చేసే వ్యాక్సిన్ ను సాధ్యమైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని

29 వేల చైనా యాప్‌ల తొలగింపు
చైనీస్‌ యాప్‌ స్టోర్‌ నుంచి ఆగస్టు 1న అకస్మాత్తుగా 29,800 యాప్‌లను స్మార్ట్‌ఫోన్ తయారీ దిగ్గజ సంస్థ యాపిల్‌ తొలగించింది. ఇందులో 26 వేలకు పైగా గేమ్‌ యాప్‌లే కావడం గమనార్హం. లైసెన్స్ గేమ్‌ యాప్‌లపై చైనా అధికారులు చర్యలు తీసుకుంటున్నందునే యాపిల్‌ ఇలా చేసినట్లు క్విమై అనే పరిశోధన సంస్థ తెలిపింది. చైనా ఆండ్రాయిడ్‌ యాప్‌ స్టోర్స్‌ ప్రభుత్వ నిబంధనలకు లోబడే చాలాకాలంలో పనిచేస్తున్నాయి.
టిక్‌టాక్‌ను నిషేధిస్తాం: ట్రంప్
చైనాతో విభేదాలు ముదురుతున్న నేపథ్యంలో ఆ దేశానికి చెందిన కంపెనీలపై అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి కొరడా ఝళిపించారు. చైనాకే చెందిన వీడియో యాప్‌ టిక్‌టాక్‌పై అమెరికాలో నిషేధం విధించనున్నట్లు ట్రంప్‌ జూలై 31న ప్రకటించారు. అమెరికన్ల వ్యక్తిగత గోప్యత, భద్రతకు ప్రమాదకరంగా మారిందంటూ టిక్‌టాక్‌పై విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో విమర్శలు చేస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: 29 వేల చైనా యాప్‌ల తొలగింపు
ఎప్పుడు: ఆగస్టు 1
ఎవరు: స్మార్ట్‌ఫోన్ తయారీ దిగ్గజ సంస్థ యాపిల్‌
ఎక్కడ:చైనీస్‌ యాప్‌ స్టోర్‌
ఎందుకు:లైసెన్స్ గేమ్‌ యాప్‌లపై చైనా అధికారులు చర్యలు తీసుకుంటున్నందున

కోవిడ్‌కు చికిత్స లేకపోవచ్చు: డబ్ల్యూహెచ్‌వో
కరోనా వైరస్‌ టీకా రూపకల్పనకు ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నప్పటికీ సులభమైన పరిష్కారం ఏదీ ఉండకపోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) వ్యాఖ్యానించింది. అందుకే, కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు టెస్టింగ్, ట్రేసింగ్, భౌతికదూరం, మాస్క్‌ ధరించడం వంటి ప్రాథమిక అంశాలపైనే ప్రభుత్వాలు, పౌరులు దృష్టి పెట్టాలని సూచించింది.‘ప్రస్తుతానికైతే ఈ మహమ్మారిని రూపుమాపే సులువైన అద్భుత చికిత్సేదీ లేదు..ఎప్పటికీ రాకపోవచ్చు కూడా..’అని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ఘెబ్రెసియస్‌ ఆగస్టు 3న తెలిపారు.
టీకా సంపన్న దేశాలకే..
లండన్ కి చెందిన ఎయిర్‌ఫీనిటీ సంస్థ అంచనా ప్రకారం... 130 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్, జపాన్ లు ఇప్పటికే కొనుగోలు చేశాయి. ప్రపంచం మొత్తానికి సరిపడిన వ్యాక్సిన్ లను తక్షణం సరఫరా చేయడం కష్టంతో కూడుకున్నపనేనని ఆ సంస్థ తెలిపింది.2009లో స్వైన్ ఫ్లూ ప్రబలినప్పుడు కూడా సంపన్న దేశాలు భారీ స్థాయిలో టీకా సరఫరాను తమ అదీనంలో ఉంచుకోవడం పేదదేశాలను ఆందోళనలోకి నెట్టింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: కోవిడ్‌-19కు చికిత్స లేకపోవచ్చు
ఎప్పుడు: ఆగస్టు 3
ఎవరు: డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ఘెబ్రెసియస్‌

టిక్‌టాక్‌ కొనుగోలుకు మైక్రోసాఫ్ట్ చర్చలు
వివాదాస్పద వీడియో యాప్‌ టిక్‌టాక్‌ అమెరికా విభాగం కొనుగోలు వార్తలను టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ధ్రువీకరించింది. దీనికి సంబంధించి టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది. మరోవైపు టిక్‌టాక్‌ యాప్‌నకు సంబంధించిన భద్రత, సెన్సార్‌షిప్ తదితర అంశాలపై నెలకొన్న ఆందోళన విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో కూడా మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల చర్చించారు. ఈ మేరకు ఆగస్టు 3న ఒక ప్రకటన విడుదల చేసింది.
మూడేళ్లలోనే...
2017లో బైట్‌డ్యాన్స్ సంస్థ ప్రారంభించిన టిక్‌టాక్‌ వీడియో సర్వీసులు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. బైట్‌డ్యాన్స్ ఆ తర్వాత మ్యూజికల్‌డాట్‌ఎల్‌వై అనే వీడియో సర్వీస్ ను కూడా కొనుగోలు చేసి టిక్‌టాక్‌తో కలిపింది. మ్యూజికల్‌డాట్‌ఎల్‌వై అమెరికా, యూరప్‌లో బాగా పేరొందింది. బైట్‌డ్యాన్స్ కు చైనా యూజర్ల కోసం డూయిన్‌ పేరుతో ఇలాంటిదే మరో సర్వీసు ఉంది. చైనాకు చెందిన యాప్‌ కావడంతో యూజర్ల డేటాను ఆ దేశానికి చేరవేస్తోందనే ఆరోపణల నేపథ్యంలో భారత్‌లో ఇప్పటికే దీన్ని నిషేధించారు. తాజాగా టిక్‌టాక్‌ను అమెరికాలో త్వరలోనే నిషేధిస్తానంటూ ట్రంప్‌ వ్యాఖ్యానించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ తో చర్చలు
ఎప్పుడు: ఆగస్టు 3
ఎవరు: టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌
ఎందుకు:టిక్‌టాక్‌ అమెరికా విభాగం కొనుగోలు విషయమై

లెబనాన్ రాజధాని బీరుట్‌ లో భారీ పేలుడు
లెబనాన్ రాజధాని బీరుట్‌ నగరంలో ఆగస్టు 4న భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా 135 మృతి చెందగా, 5,000 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొంది. పేలుడుతో బీరుట్‌ పోర్ట్ పరిసర ప్రాంతాలు బూడిద, వ్యర్థాలతో నిండిపోయాయి. పెద్దసంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయి. భవనాలు నేలమట్టమయ్యాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది.
అమ్మోనియం నైట్రేట్‌..
2,700 టన్నులకు పైగా అమ్మోనియం నైట్రేట్‌కు మంటలు అంటుకోవడం వల్లే ఈ పేలుడు సంభవించినట్లు లెబనాన్ మంత్రి మొహమ్మద్‌ ఫహ్మీ తెలిపారు. బీరుట్‌ పోర్ట్‌లోని ఓ గోదాములో దీన్ని నిల్వ చేశారు. 2014లో ఓ సరుకు రవాణా నౌక నుంచి ఈ అమ్మోనియం నైట్రేట్‌ను స్వాధీనం చేసుకున్నారు. పేలుడుతో విషపూరితమైన నైట్రోజన్డయాక్సైడ్‌ గ్యాస్‌ విడుదలైంది. దీన్ని పీల్చడం వల్ల చాలామంది శ్వాస ఆడక ప్రాణాలొదిలారు.
ఆహార సంక్షోభం..
చాలా చిన్న దేశమైన లెబనాన్ లో ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కుప్పకూలింది. సూమారు 10 లక్షల మందికి పైగా సిరియా శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తోంది. విదేశాల నుంచి నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాల దిగుమతికి బీరూట్‌ పోర్ట్‌ అత్యంత కీలకం. తాజా పేలుడు వల్ల ఈ ఓడరేవు చాలావరకు నామరూపాల్లేకుండా పోయింది. దిగుమతులన్నీ ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో దేశంలో ఇకపై ఆహార సంక్షోభం తప్పదని వాదన వినిపిస్తోంది.
ఆదుకోండి..
ఆర్థిక సంక్షోభంతోపాటు బీరుట్‌లో పేలుడు వల్ల తాము కష్టాల్లో కూరుకుపోయామని, ప్రపంచ దేశాలు, మిత్ర దేశాలు వెంటనే స్పందించి, ఆదుకోవాలని లెబనాన్ ప్రధానమంత్రి హసన్ దియాబ్‌ విజ్ఞప్తి చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: భారీపేలుడు కారణంగా 135 మృతి
ఎప్పుడు: ఆగస్టు 4
ఎక్కడ:బీరుట్‌, లెబనాన్
Published date : 01 Sep 2020 11:58AM

Photo Stories