Skip to main content

World Book And Copyright Day 2025: ఏప్రిల్ 23వ తేదీ ప్రపంచ పుస్తక దినోత్సవం

ప్రతి సంవత్సరం ఏప్రిల్ 23వ తేదీన ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని జరుపుకుంటారు.
World Book and Copyright Day 2025 Theme and History

ప్రపంచవ్యాప్తంగా ప్ర‌తి ఏటా ఏప్రిల్ 23వ తేదీ ప్రపంచ పుస్తక - కాపీరైట్‌ దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీన్నే ప్రపంచ పుస్తక దినోత్సవం అని కూడా అంటారు. 

ఈ ఏడాది పుస్తక దినోత్సవం థీమ్ ఇదే..
2025 పుస్తక దినోత్సవం థీమ్.. "సస్థిర అభివృద్ధి లక్ష్యాల (SDGs) సాధనలో సాహిత్య పాత్ర". ఈ థీమ్ ద్వారా, సాహిత్యం సమాజ అభివృద్ధిలోని కీలక అంశాలపై అవగాహన పెంచడంలో, ప్రేరణ కలిగించడంలో, చర్చలకు దారితీసే వేదికగా మారడంలో ఎంతటి పాత్ర పోషిస్తుందో గుర్తు చేస్తోంది.

ఈ థీమ్ ముఖ్యంగా.. పేదరికం, ఆకలి, అసమానత, లింగ సమానత్వం, విద్య హక్కు, వాతావరణ మార్పు వంటి ప్రధాన గ్లోబల్ సమస్యలపై దృష్టిని కేంద్రీకరించేందుకు సాహిత్యాన్ని ఒక శక్తివంతమైన సాధనంగా చూపిస్తుంది.

World Earth Day: నేడు ప్రపంచ భూ దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే..

ఈ రోజుకు సంబందించిన‌ చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యతను ఇక్క‌డ తెలుసుకుందాం.. 
సెయింట్ జార్జ్ డే: 17వ శతాబ్దపు యూరప్‌లో ఈ రోజును సెయింట్ జార్జ్ డేగా జరుపుకోవడం ఒక ఆసక్తికరమైన విషయం.
స్పెయిన్‌లోని సంప్రదాయం: స్పెయిన్‌లో పుస్తకం కొన్నవారికి గులాబీ ఇవ్వడం అనేది పుస్తకాల పట్ల వారికున్న ప్రేమను తెలియజేస్తుంది. ఇది చాలా అందమైన ఆచారం.
ప్రఖ్యాత రచయితల మరణం: సెవాంతెస్, షేక్సిపియర్ వంటి గొప్ప రచయితలు ఒకే రోజు మరణించడం యాదృచ్చికమే అయినా, ఈ రోజుకు ఒక ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. అలాగే ఇతర రచయితల జననాలు, మరణాలు కూడా ఈ రోజును స్మరణీయంగా చేశాయి.
యునెస్కో ప్రకటన: 1995లో యునెస్కో ఏప్రిల్ 23వ తేదీని ప్రపంచ పుస్తక దినోత్సవంగా ప్రకటించడం ఈ రోజు యొక్క ప్రాముఖ్యతను మరింత పెంచింది. రచయితలు, ప్రచురణకర్తలు, పాఠకులు, ఉపాధ్యాయులను గౌరవించాలనే వారి ఉద్దేశం చాలా గొప్పది.
ప్రపంచ పుస్తక రాజధాని: ఏటా ఒక నగరాన్ని ప్రపంచ పుస్తక రాజధానిగా ప్రకటించడం ద్వారా యునెస్కో పుస్తక పఠనం యొక్క ప్రాముఖ్యతను ప్రపంచవ్యాప్తంగా చాటుతోంది. కొనాక్రీ (2017), ఏథెన్స్ (2018) వంటి నగరాలను ఎంపిక చేయడం ఆయా ప్రాంతాల సాహిత్య సంస్కృతిని తెలియజేస్తుంది.

Important Days: ఏప్రిల్ 15 నుంచి 30వ తేదీ వరకు ఉన్న ముఖ్య‌మైన రోజులు ఇవే..

Published date : 23 Apr 2025 03:19PM

Photo Stories