Skip to main content

International Dance Day: ఏప్రిల్ 29వ తేదీ అంతర్జాతీయ నృత్య దినోత్సవం

ప్రతి సంవత్సరం ఏప్రిల్ 29వ తేదీ అంతర్జాతీయ నృత్య దినోత్సవం జరుపుకుంటారు.
International Dance Day 2025: Date, History and Significance

నృత్య కళాకారులను గౌరవించడంతో పాటు, ఈ కళ అన్ని హద్దులు లేనిదని చాటి చెప్పడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం చాలా అర్థవంతమైనది. నృత్యం కేవలం ఒక కళారూపం మాత్రమే కాదు, అది మన ఆరోగ్యానికి, మానసిక స్థితికి, శారీరక దృఢత్వానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. 30 నిమిషాల నృత్యంతో దాదాపు 130 నుండి 250 కేలరీలు ఖర్చు అవుతాయని, ఇది అరగంట జాగింగ్‌తో సమానమని నిపుణులు చెప్పడం నృత్యం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.

భారతదేశం నాట్యకళకు ఎప్పుడూ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. మన పూర్వీకులు, రుషులు, పండితులు నాట్యశాస్త్రాన్ని అభివృద్ధి చేయడంలో ఎంతో కృషి చేశారు. అంతేకాకుండా, అనేక మంది రాజులు ఈ కళను పోషించారు. భరతముని రచించిన నాట్యశాస్త్ర లిఖిత ప్రతులకు యునెస్కో మెమొరీ ఆఫ్‌ వరల్డ్‌ రిజిస్టర్‌లో స్థానం లభించడం మన నాట్య కళకు దక్కిన గొప్ప గౌరవం. మన దేశంలో శాస్త్రీయ, జానపద నృత్యాల యొక్క గొప్ప వైవిధ్యం ఉంది. ప్రతి రాష్ట్రం, ప్రాంతం దాని ప్రత్యేకమైన నాట్య సంప్రదాయాన్ని కలిగి ఉంది.

Important Days: ఏప్రిల్ 15 నుంచి 30వ తేదీ వరకు ఉన్న ముఖ్య‌మైన రోజులు ఇవే..

ఇక అంతర్జాతీయ నృత్య దినోత్సవం యొక్క చారిత్రక నేపథ్యాన్ని పరిశీలిస్తే, యునెస్కోకి చెందిన ‘ఇంటర్నేషనల్‌ థియేటర్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐటీఐ)’ 1982లో ఏప్రిల్ 29ని అంతర్జాతీయ నృత్య దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. 1727లో ఇదే రోజున జన్మించిన ప్రఖ్యాత ఫ్రెంచ్ నృత్యకారుడు జీన్‌ జార్జెస్‌ నొవెర్రే జ్ఞాపకార్థం ఐటీఐ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

రాష్ట్రాలు, వాటి నృత్య రూపాలను ఇక్క‌డ తెలుసుకుందాం.

రాష్ట్రం నృత్య రూపం
ఆంధ్రప్రదేశ్  కూచిపూడి
తెలంగాణ  పేరిణి   శివతాండవం
తమిళనాడు  భరతనాట్యం
ఉత్తర్ ప్రదేశ్  కథక్
కేరళ  కథాకళి
కర్ణాటక  యక్షగాన
ఒడిశా  ఒడిస్సీ
అస్సాం  సత్రియా
మణిపూర్  మణిపురి
గుజరాత్  గార్బా

World Book And Copyright Day 2025: ఏప్రిల్ 23వ తేదీ ప్రపంచ పుస్తక దినోత్సవం

Published date : 29 Apr 2025 01:09PM

Photo Stories