World Bank: భారత్‌లో పెరుగుతున్న ఉపాధి అవకాశాలు.. తగ్గుతున్న నిరుద్యోగం

భారతదేశంలోని ఉద్యోగాలు, ఉపాధి, నిరుద్యోగం, పేదరికం గురించిన ఈ నివేదిక అనేక కీలక విషయాలను వెల్లడించింది.
ఉపాధి వృద్ధి.. ప్రధానాంశాలు ఇవే..
పెరిగిన ఉద్యోగ వృద్ధి రేటు: 2021-22 ఆర్థిక సంవత్సరం నుండి దేశంలో పనిచేసే వయస్సులో ఉన్న జనాభా కంటే ఉద్యోగ వృద్ధి రేటు ఎక్కువగా ఉంది.
శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం: భారతదేశ శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగంలో మహిళలు అధికంగా ఉపాధి పొందుతున్నారు.
తగ్గిన పట్టణ నిరుద్యోగం: పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం గణనీయంగా తగ్గింది. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో పట్టణ నిరుద్యోగం 6.6 శాతానికి చేరుకుంది. ఇది 2017-18 తర్వాత నమోదైన అత్యల్ప నిరుద్యోగిత రేటు.
నగరాలకు వలస: 2018-19 తర్వాత మొదటిసారిగా ఎక్కువ మంది పురుషులు ఉపాధి కోసం గ్రామీణ ప్రాంతాల నుండి నగరాలకు వలస వెళ్తున్నారు.
Daifuku Intralogistics: హైదరాబాద్‌లో జపాన్ కంపెనీ తయారీ కేంద్రం
స్వయం ఉపాధిపై ఆసక్తి: గ్రామీణ కార్మికులు, మహిళలు ఉద్యోగాలు చేయడం కంటే సొంతంగా వ్యాపారం చేయడం లేదా స్వయం ఉపాధి పొందడం పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.
యువత నిరుద్యోగం: దేశంలో యువత నిరుద్యోగం 13.3 శాతంగా ఉంది. ఉన్నత విద్య పూర్తి చేసిన వారిలో నిరుద్యోగ రేటు ఇంకా ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దాదాపు 29 శాతం మంది యువ నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు.
అసంఘటిత రంగం: వ్యవసాయేతర వేతన ఉద్యోగాల్లో కేవలం 23 శాతం మాత్రమే అధికారికమైనవి.
తగ్గని అసమానతలు: ఉపాధి విషయంలో మహిళల పరిస్థితి మెరుగుపడినప్పటికీ, వేతనాల విషయంలో అసమానతలు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. మహిళా ఉద్యోగ రేటు 31 శాతానికి చేరినా, వేతన ఉద్యోగాల్లో పురుషుల సంఖ్య మహిళల కంటే 234 మిలియన్లు ఎక్కువగా ఉంది.
తగ్గిన పేదరికం: 2011-12లో భారతదేశంలోని ఐదు అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలైన ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, బంగాల్, మధ్యప్రదేశ్‌లలో 60 శాతం మంది పేదరికంలో ఉండగా, 2022-23 నాటికి ఆ సంఖ్య 54 శాతానికి తగ్గింది.
Steel Products: స్టీల్ దిగుమతులకు చెక్.. స్టీల్‌పై సేఫ్‌గార్డ్ డ్యూటీ