సెప్టెంబర్ 2019 ఎకానమీ
Sakshi Education
ప్రపంచ వాణిజ్య వృద్ధి అంచనాలు కుదింపు
2019 సంవత్సరానికి సంబంధించి ప్రపంచ వాణిజ్య వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) భారీగా కుదించింది. 2019 ఏడాది వృద్ధి రేటును 2.6 శాతం నుంచి 1.2 శాతానికి కుదించింది. అలాగే 2020 ఏడాది వృద్ధి రేటును 3 శాతం నుంచి 2.7 శాతానికి తగ్గించింది. ఈ మేరకు అక్టోబర్ 1న ఒక నివేదికను విడుదల చేసింది. పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, నిదానిస్తున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు వాణిజ్య వృద్ధి అంచనాలను కుదించడానికి కారణమని డబ్ల్యూటీవో తన నివేదికలో పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2019 ఏడాది ప్రపంచ వాణిజ్య వృద్ధి అంచనాలు కుదింపు
ఎప్పుడు : అక్టోబర్ 1
ఎవరు : ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)
పణజిలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
గోవా రాజధాని పణజిలో సెప్టెంబర్ 20న వస్తుసేవల పన్ను(జీఎస్టీ) కౌన్సిల్ 37వ సమావేశం జరిగింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్ దేశంలోని వాహన, ఆతిథ్య పరిశ్రమలకు ఊతమిచ్చేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో వాహనాల అమ్మకాలు తగ్గినవేళ.. 1200 సీసీ ఇంజన్ సామర్థ్యమున్న పెట్రోల్ వాహనాలపై విధిస్తున్న 28 శాతం జీఎస్టీని 1 శాతానికి తగ్గించాలని కౌన్సిల్ నిర్ణయించింది. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలు 2019, అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని నిర్మలా పేర్కొన్నారు. మొత్తం 20 వస్తువులు, 12 రకాల సేవలపై జీఎస్టీని సవరించామన్నారు.
జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు
దశాబ్దంలోనే కనిష్టానికి ప్రపంచ వృద్ధి: ఓఈసీడీ
ప్రపంచ ఆర్థిక సంక్షోభం (2008-09) తర్వాత అత్యంత కనిష్టస్థాయిలో ఆర్థిక వృద్ధి 2019 ఏడాదిలోనే నమోదవుతుందని ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ(ఓఈసీడీ) సెప్టెంబర్ 19న తెలిపింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి 2018 ఏడాది 3.6 శాతం నుంచి 2019 ఏడాది 2.9 శాతానికి పడిపోతుందని, 2020లో 3 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. భారత్‌లో 2019లో వృద్ధి రేటు 5.9 శాతంగా, 2020లో 6.3 శాతంగా ఉంటుందని పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దశాబ్దంలోనే కనిష్టానికి ప్రపంచ వృద్ధి
ఎప్పుడు : సెప్టెంబర్ 20
ఎవరు : ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ(ఓఈసీడీ)
కార్పొరేట్ ట్యాక్స్ 22 శాతానికి తగ్గింపు
కార్పొరేట్ ట్యాక్స్(కంపెనీలపై ఆదాయపన్ను)ను తగ్గించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం 30 శాతంగా కార్పొరేట్ పన్నును 22 శాతానికి తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెప్టెంబర్ 20న ప్రకటించారు. దీంతో సెస్సులతో కలుపుకుని 35 శాతంగా చెల్లిస్తున్న పన్ను... ఇకపై 25.17 శాతానికి తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) నుంచే తాజా నిర్ణయం అమల్లోకి వస్తుందని మంత్రి వెల్లడించారు. ఈ నిర్ణయాల రూపంలో ఖజానాకు రూ.1.45 లక్షల కోట్ల వరకు పన్ను ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తగ్గిపోనుందని తెలిపారు.
కేంద్రప్రభుత్వ ప్రధాన నిర్ణయాలు
పర్యాటక సంస్థ థామస్ కుక్ దివాలా
ప్రముఖ బ్రిటిష్ పర్యాటక సంస్థ థామస్ కుక్ దివాలా తీసింది. 178 ఏళ్ల చరిత్ర గల ఈ కంపెనీ భారీ రుణ భారంలోకి కూరుకుపోయింది. ప్రైవేట్ ఇన్వెస్టర్ల నుంచి నిధుల సమీకరణ యత్నాలు విఫలమవడంతో దివాలా తీసినట్లుగా సెప్టెంబర్ 23న ప్రకటించింది. దీంతో దాదాపు 6 లక్షల మంది పర్యాటకులకు ఇబ్బందులు తలెత్తనున్నాయి. మరోవైపు ఇంగ్లాండ్‌లో 9,000 మందితో సహా ప్రపంచవ్యాప్తంగా 22 వేల మంది తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు. థామస్ కుక్ దివాలా తీయడంతో ఇంగ్లాండ్ నుంచి గోవాకు వచ్చే పర్యాటకులు సగం మేర తగ్గే అవకాశముంది. 1841లో థామస్ కుక్ తన పేరు మీదనే ఈ పర్యాటక సంస్థను స్థాపించాడు.
భారత వృద్ధి రేటుకు ఏడీబీ కోత
2019-2020 ఆర్థిక సంవత్సరానికి గాను భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాలను ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) తగ్గించింది. ఇంతక్రితం ఈ అంచనా 7.2 శాతం అయితే దీనిని 6.5 శాతానికి కుదించింది. ఈ మేరకు సెప్టెంబర్ 25న ఒక నివేదికను విడుదల చేసింది. తయారీ రంగం బలహీనత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలహీనత, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో క్రియాశీలత లేకపోవడం వంటి అంశాలు వృద్ధి రేటుకు కారణమని ఏడీబీ తన నివేదికలో పేర్కొంది. అయితే వృద్ధి వేగంలో చైనా కన్నా భారత్ ముందు ఉందని వివరించింది. 2019, ఏడాది తొలి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) భారత్ వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్టం 5 శాతానికి పడివడం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2019-2020లో భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6.5 శాత మే
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ)
విదేశీ మారక నిల్వలు 42,960 కోట్ల డాలర్లు
భారత్ విదేశీ మారక నిల్వలు సెప్టెంబరు 6తో ముగిసిన వారంలో 100 కోట్ల డాలర్లు పెరిగి 42,960.8 కోట్ల డాలర్లకు చేరాయని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) సెప్టెంబర్ 13న వెల్లడించింది. బంగారం నిల్వలు 19.9 కోట్ల డాలర్లు తగ్గి 2,735 కోట్ల డాలర్లకు చేరుకున్నాయని తెలిపింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వద్ద భారత్ నిల్వలు 143.4 కోట్ల డాలర్ల వద్ధ యథాతథంగా ఉన్నాయంది. అదే విధంగా ఐఎంఎఫ్ వద్ద భారత్ నిల్వలు 20 లక్షల డాలర్లు పెరిగి 361.9 కోట్ల డాలర్లకు చేరాయని పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విదేశీ మారక నిల్వలు 42,960 కోట్ల డాలర్లు
ఎప్పుడు : సెప్టెంబర్ 13
ఎవరు : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)
ఎగుమతుల్ని ప్రోత్సహించేందుకు చర్యలు
ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోయిన ఆర్థిక వృద్ధిని గాడిలోకి తెచ్చేందుకు కేంద్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెప్టెంబర్ 14న రూ.70,000 కోట్ల విలువైన చర్యలను ప్రకటించారు. ఎగుమతి దారులకు, రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చే ఈ చర్యల్లో రూ.30,000 కోట్లతో దెబ్బతిన్న ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టే ఫండ్ ఉంది. ఎగుమతుల్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన చర్యల్లో సుంకాల్ని రద్దు చేయటం, బీమా కవరేజీని పెంచటం, పోర్టుల్లో దిగుమతి సమయాన్ని తగ్గించేందుకు టెక్నాలజీని వాడకం వంటివి ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి రూ.20వేల కోట్ల నిధిని ఏర్పాటు చేశారు. దీనిలో సగ భాగాన్ని ప్రభుత్వం సమకూరుస్తుంది.
మంత్రి చెప్పిన మరికొన్ని వివరాలు..
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు
అంచనాలకు అనుగుణంగానే అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీరేట్లను పావు శాతం(25 బేసిస్ పాయింట్లు) తగ్గించింది. దీంతో రిజర్వ్ వడ్డీ రేట్లు 2-2.25 శాతం నుంచి 1.75-2 శాతానికి తగ్గాయి. సెప్టెంబర్ 18న జరిగిన ఫెడ్ పాలసీ కమిటీ సమావేశంలో వడ్డీ రేట్ల కోత నిర్ణయానికి ఏడుగురు అనుకూలంగా, ముగ్గురు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఫెడ్ రేట్లను తగ్గించడం ఈ ఏడాది రెండోసారి.
భారత జీడీపీ వృద్ధి రేటుకు ఫిచ్ కోత
భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20) గతంలో వేసిన 6.8 శాతం నుంచి 6.6 శాతానికి రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ తగ్గించింది. ఈ మేరకు సెప్టెంబర్ 10న ఒక నివేదికను విడుదల చేసింది. అధిక రుణ భారం కారణంగా ద్రవ్య విధానాన్ని సడలించే అవకాశాలు ప్రభుత్వానికి పరిమితంగానే ఉన్నాయని ఫిచ్ తన నివేదికలో అభిప్రాయపడింది.
ఫిచ్ నివేదికలోని అంశాలు..
ఏమిటి : 2019-20లో భారత జీడీపీ వృద్ధి రేటు 6.6 శాతామే
ఎప్పుడు : సెప్టెంబర్ 10
ఎవరు : రేటింగ్ ఏజెన్సీ ఫిచ్
భారత్‌కు 21 బిలియన్ల పెట్టుబడులు
భారత్‌లోని హైటెక్ రంగాలకు రానున్న ఐదేళ్ల కాలంలో 21 బిలియన్ డాలర్ల (రూ.1.47 లక్షల కోట్లు) మేర పెట్టుబడులను ఆకర్షించే సామర్థ్యాలు ఉన్నాయని అమెరికా-భారత్ వ్యూహాత్మక, భాగస్వామ్య ఫోరం (యూఎస్‌ఐఎస్‌పీఎఫ్) పేర్కొంది. తద్వారా లక్షలాది ఉద్యోగాల కల్పన సాధ్యపడుతుందని వివరించింది. ఈ మేరకు సెప్టెంబర్ 11న ఒక నివేదికను విడుదల చేసింది. ‘భారత్‌లో హైటెక్ తయారీ’ పేరుతో రూపొందించిన ఈ నివేదికను ఈ సంస్థ భారత ప్రభుత్వానికి సమర్పించింది.
నివేదికలోని అంశాలు-వివరాలు
ఏమిటి : భారత్‌కు 21 బిలియన్ల పెట్టుబడులు
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఎవరు : అమెరికా-భారత్ వ్యూహాత్మక, భాగస్వామ్య ఫోరం (యూఎస్‌ఐఎస్‌పీఎఫ్)
అసోంలో 13 వేల కోట్ల పెట్టుబడి : ఓఎన్‌జీసీ
అసోంలో చమురు అన్వేషణ, ఉత్పత్తి నిమిత్తం ఐదేళ్లలో రూ.13,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని ఓఎన్‌జీసీ(ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్) తెలిపింది. ఈ విషయమై అసోం రాష్ట్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నామని సెప్టెంబర్ 11న వెల్లడించింది. 2022 కల్లా దిగుమతులను 10% మేర తగ్గించుకోవాలన్న ప్రధాని మోదీపిలుపు మేరకు ఈ పెట్టుబడులు పెడుతున్నామని పేర్కొంది. నార్త్‌ఈస్ట్ హైడ్రోకార్బన్ విజన్ 2030లో భాగంగా ఈ పెట్టుబడుల ప్రణాళికను రూపొందించామని ఓఎన్‌జీసీ వివరించింది. అసోంలోని జోర్హాట్, గోల్హాట్ జిల్లాల్లో ఆరు బావులు, ఐదు మైనింగ్ బ్లాక్‌ల్లో డ్రిల్లింగ్ కోసం ఆమోదాలు పొందామని తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చమురు అన్వేషణ, ఉత్పత్తి నిమిత్తం ఐదేళ్లలో రూ.13,000 కోట్లు పెట్టుబడులు
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఎవరు : ఓఎన్‌జీసీ(ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్)
ఎక్కడ : అసోం
ఆర్‌బీఐ 2018-19 వార్షిక నివేదిక విడుదల
2018-19 (జూలై-జూన్) వార్షిక నివేదికను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆగస్టు 29న విడుదల చేసింది. ఈ నివేదికలో భారత్ ప్రస్తుత మందగమన పరిస్థితులను ఆర్‌బీఐ తక్కువ చేసి చూపించింది. భారీ వృద్ధికి ముందు చిన్న మందగమన పరిస్థితులను భారత్ ఎదుర్కొంటోందని తెలిపింది. దీనిని సైక్లికల్ ఎఫెక్ట్ (ఎగువ దిగువ)గా పేర్కొంది. వినియోగం, ప్రైవేటు పెట్టుబడుల పునరుద్ధరణ కేంద్రం, విధాన నిర్ణేతల అధిక ప్రాధాన్యత కావాల్సిన అవసరం ఉందని వివరించింది.
నివేదికలోని ముఖ్యాంశాలు..
దేశంలోని పది ప్రభుత్వ రంగ బ్యాంకుల(పీఎస్‌బీ)ను విలీనం చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆగస్టు 30న ప్రకటించారు. మొత్తం 10 బ్యాంకులను 4 బ్యాంకులుగా కుదించనున్నట్లు వెల్లడించారు. దీని ప్రకారం నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆరు విలీనం కానున్నాయి. వీటి వ్యాపార పరిమాణం ఏకంగా రూ. 55.81 లక్షల కోట్లుగా ఉండనుంది. ఈ పది బ్యాంకుల లీనంతో పీఎస్‌బీల సంఖ్య 12కి తగ్గనుంది. 2017లో పీఎస్‌బీల సంఖ్య 27గా ఉండేది.
మరోవైపు పీఎస్‌బీల్లో గవర్నెన్స్ పరమైన పలు సంస్కరణలను కూడా మంత్రి నిర్మలా ఆవిష్కరించారు. బోర్డులకు స్వయంప్రతిపత్తి ఇవ్వనున్నట్లు తెలిపారు. 10 బ్యాంకుల ఖాతాలను పటిష్టంగా మార్చేందుకు రూ. 52,250 కోట్ల మేర నిధులు అందించనున్నట్లు వివరించారు. విలీన ప్రక్రియలో ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షిస్తామని ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు.
బ్యాంకుల విలీనం-వివరాలు
స్విస్ ఖాతాల వివరాలు అందుబాటులోకి...
స్విట్జర్లాండ్‌లోని బ్యాంకుల్లో భారతీయులకు సంబంధించిన ఖాతాల వివరాలు సెప్టెంబర్ 1వతేదీ నుంచి భారతీయ పన్ను అధికారులకు అందుబాటులోకి రానున్నాయి. ఇరుదేశాల ఆటోమేటిక్ సమాచార మార్పిడి ఒప్పందం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానుండటంతో స్విస్ ఖాతాల వివరాలు భారత్‌కు తెలియనున్నాయి. నల్లధనంపై ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి ఇది దోహదపడుతుందని, దీంతో స్విస్ బ్యాంకుల లోగుట్టు శకం ఎట్టకేలకు ముగిసినట్లు అవుతుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) తెలిపింది. దీనిపై సీబీడీటీ ఆదాయపు పన్ను విభాగానికి ఓ విధానాన్ని రూపొందించింది. స్విట్జర్లాండ్ అంతర్జాతీయ ఫైనాన్స్ విభాగానికి చెందిన ఉన్నతాధికారి నికోలస్ మారియో ఆగస్టు 29, 30 తేదీల్లో భారత రెవెన్యూ కార్యదర్శి ఏబీ పాండే, సీబీడీటీ చైర్మన్ పీసీ మోదీలతో భేటీ అయి దీనిపై చర్చించారు. ఆర్థిక ఖాతాల సమాచార మార్పిడి కార్యక్రమం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పారు. పన్నుకు సంబంధించిన భారత్ కోరిన కొన్ని ప్రత్యేక కేసుల సమాచార మార్పిడి ప్రక్రియను వేగవంతం చేయడంపైనా ఇరుదేశాల అధికారులు చర్చించారు. స్విట్జర్లాండ్‌లో 2018 సంవత్సరంలో భారతీయులు నిర్వహించిన అన్ని ఆర్థిక లావాదేవీల వివరాలను భారత్ అందుకుంటుందని సీబీడీటీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇందులో 2018లో క్లోజ్ అయిన ఖాతాల వివరాలు కూడా ఉంటాయని తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: స్విట్జర్లాండ్‌లోని బ్యాంకుల్లో భారతీయులకు సంబంధించిన ఖాతాల వివరాలు సెప్టెంబర్ 1వతేదీ నుంచి భారతీయ పన్ను అధికారులకు అందుబాటులోకి..
ఎప్పుడు: సెప్టెంబర్ 1వతేదీ నుంచి
ఎందుకు: నల్లధనం
ఎక్కడ: స్విట్జర్లాండ్
తత్కాల్ టికెట్లతో రూ.25,392 కోట్లు ఆధాయం
న్యూఢిల్లీ: రైల్వేశాఖ ప్రవేశపెట్టిన తత్కాల్ టికెట్ల పద్ధతి రైల్వేల పంట పండిస్తోంది. తత్కాల్ బుకింగ్‌ల ద్వారా గత నాలుగేళ్లలో తమకు రూ. 25,392 కోట్ల ఆదాయం వచ్చిందని ఒక సమాచార హక్కు కార్యకర్త అడిగిన ప్రశ్నకు సమాధానంగా రైల్వేశాఖ సమాధానమిచ్చింది. ఇందులో రూ. 21,530 కోట్ల ఆదాయం తత్కాల్ కోటా నుంచి రాగా, తత్కాల్ ప్రీమియం ద్వారా మరో 3,862 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించామని వెల్లడించింది. తత్కాల్ సేవల ద్వారా 2016-19 కాలానికి రైల్వేల ఆదాయం 62 శాతం పెరిగిందని తెలిపింది. రైల్వేశాఖ తత్కాల్ పద్ధతిని 1997లోనే ప్రవేశపెట్టినప్పటికీ, 2004లోనే దేశమంతా అమలు చేసింది. ఈ పద్ధతిలో రెండో తరగతి టికెటై్లతే టికెట్ ధరపై 10 శాతం, మిగతా తరగతులకు 30 శాతం అధిక ధర వసూలు చేస్తారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా 2,677 రైళ్లలో తత్కాల్ పద్ధతిలో టికెట్ బుకింగ్‌స జరుగుతున్నాయి. ఈ రైళ్లలో అందుబాటులో ఉన్న మొత్తం 11.57 లక్షల సీట్ల నుంచి 1.71 లక్షల సీట్లను తత్కాల్ టికెటింగ్ కోసం కేటాయించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: తత్కాల్ టికెట్లతో ఇండియన్ రైల్వేకి రూ.25,392 కోట్లు ఆధాయం
ఎప్పుడు: గత నాలుగేళ్లలో
ఐడీబీఐ బ్యాంకుకు రూ. 9,300 కోట్ల నిధులు
ఐడీబీఐ బ్యాంకు మూలధన స్థాయిని పెంచేందుకు, లాభాల్లోకి మళ్లించేందుకు రూ. 9,300 కోట్ల మేర నిధులు సమకూర్చనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ సెప్టెంబర్ 3న వెల్లడించారు. ఇందులో సుమారు 51 శాతం నిధులను (రూ. 4,743 కోట్లు) ఎల్‌ఐసీ సమకూర్చనుండగా, మిగతా 49 శాతం (రూ. 4,557 కోట్లు) కేంద్రం వన్-టైమ్ ప్రాతిపదికన అందించనుంది. మొండిబాకీలతో కుదేలైన ఐడీబీఐ బ్యాంకులో ఎల్‌ఐసీ గత ఆగస్టులో తన వాటాలను 51 శాతానికి పెంచుకున్న సంగతి తెలిసిందే. కేంద్రం నుంచి మూలధనం అందిన రోజునే అదే మొత్తంలో ఐడీబీఐ బ్యాంకు రీక్యాపిటజైషన్ బాండ్లు కొనుగోలు చేయనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐడీబీఐ బ్యాంకుకు రూ. 9,300 కోట్ల నిధులు
ఎప్పుడు : సెప్టెంబర్ 3
ఎవరు : కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్
ఎందుకు : ఐడీబీఐ బ్యాంకు మూలధన స్థాయిని పెంచేందుకు, లాభాల్లోకి మళ్లించేందుకు

- 1500 సీసీ ఇంజిన్ సామర్థ్యమున్న డీజిల్ వాహనాలపై విధిస్తున్న 28 శాతం జీఎస్టీని 3 శాతానికి తగ్గింపు
- వజ్రాల పరిశ్రమకు సంబంధించిన పనులపై జీఎస్టీ 5 నుంచి 1.5 శాతానికి తగ్గింపు
- విలువైన రాళ్ల కటింగ్, పాలిషింగ్‌పై జీఎస్టీని 3 నుంచి 0.25 శాతానికి తగ్గింపు
- వెట్ గ్రైండర్లపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గింపు
- ఎండబెట్టిన చింతపండుతో పాటు చెట్ల బెరడు, ఆకులు, పూలతో చేసిన ప్లేట్లు, కప్పులపై జీఎస్టీని 5 శాతం నుంచి సున్నాకు తగ్గింపు
- ప్యాకింగ్ కోసం వాడే పాలీప్రొపైలిన్, ఊలుతో కూడిన పాలీప్రొపైలిన్, ఊలులేని బ్యాగులపై జీఎస్టీ రేట్లను ఏకీకృతం చేసి 12 శాతంగా నిర్ధారణ
- జీఎస్టీ రిజస్ట్రేషన్ సందర్భంగా ఆధార్‌ను అనుసంధానం చేయాలన్న నిర్ణయానికి సూత్రప్రాయంగా అంగీకారం
- కెఫిన్ ఆధారిత పానీయాలపై 18 జీఎస్టీ విధిస్తుండగా, దాన్ని 28 శాతానికి పెంపు. దీనిపై అదనంగా 12 శాతం సెస్ విధింపు.
- మెరైన్ ఫ్యూయెల్‌పై జీఎస్టీని 5 శాతానికి తగ్గింపు.
- రైల్వే వ్యాగన్లు, బోగీలు, కదిలే ఇతర రైల్వే వాహనాలపై జీఎస్టీని 5 నుంచి 12 శాతానికి పెంపు.
- అతిథ్య పరిశ్రమకు ఊరట కల్పించేలా ఒక రాత్రికి రూ.1,000లోపు వసూలు చేస్తున్న హోటళ్లను జీఎస్టీని నుంచి మినహాయించడం.
- ఒక రాత్రికి రూ.1,001 నుంచి రూ.7,500 వరకూ వసూలు చేస్తున్న హోటళ్లపై జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గింపు.
- రూ.7,500 కంటే అధికంగా వసూలుచేసే హోటళ్లపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గింపు.
- ఔట్‌డోర్ కేటరింగ్‌పై విధిస్తున్న పన్నును 18 శాతం(ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌తో కలిపి) నుంచి 5 శాతానికి తగ్గింపు.
జీఎస్టీ నుంచి పూర్తి మినహాయింపు వీటికే..
పలు ఉత్పత్తులపై జీఎస్టీని పూర్తిగా మినహాయిస్తున్నట్లు మంత్రి నిర్మలా ప్రకటించారు.
జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయించినవి....

- భారత్‌లో తయారుకాని ప్రత్యేకమైన రక్షణ ఉత్పత్తులు.
- అండర్-17 మహిళల ప్రపంచకప్‌కు కోసం వినియోగించే వస్తుసేవలు
- ఆహారం, వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏవో) చేపట్టే కొన్ని ప్రాజెక్టులు
- ఆభరణాల తయారీకి విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ప్లాటినం
- చేపల ఆహారంతో పాటు గిలకలు, ఇతర వ్యవసాయ పరికరాలను కొంత కాలం వరకూ జీఎస్టీ నుంచి మినహాయిస్తున్నామని మంత్రి తెలిపారు.
దశాబ్దంలోనే కనిష్టానికి ప్రపంచ వృద్ధి: ఓఈసీడీ
ప్రపంచ ఆర్థిక సంక్షోభం (2008-09) తర్వాత అత్యంత కనిష్టస్థాయిలో ఆర్థిక వృద్ధి 2019 ఏడాదిలోనే నమోదవుతుందని ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ(ఓఈసీడీ) సెప్టెంబర్ 19న తెలిపింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి 2018 ఏడాది 3.6 శాతం నుంచి 2019 ఏడాది 2.9 శాతానికి పడిపోతుందని, 2020లో 3 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. భారత్‌లో 2019లో వృద్ధి రేటు 5.9 శాతంగా, 2020లో 6.3 శాతంగా ఉంటుందని పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దశాబ్దంలోనే కనిష్టానికి ప్రపంచ వృద్ధి
ఎప్పుడు : సెప్టెంబర్ 20
ఎవరు : ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ(ఓఈసీడీ)
కార్పొరేట్ ట్యాక్స్ 22 శాతానికి తగ్గింపు
కార్పొరేట్ ట్యాక్స్(కంపెనీలపై ఆదాయపన్ను)ను తగ్గించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం 30 శాతంగా కార్పొరేట్ పన్నును 22 శాతానికి తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెప్టెంబర్ 20న ప్రకటించారు. దీంతో సెస్సులతో కలుపుకుని 35 శాతంగా చెల్లిస్తున్న పన్ను... ఇకపై 25.17 శాతానికి తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) నుంచే తాజా నిర్ణయం అమల్లోకి వస్తుందని మంత్రి వెల్లడించారు. ఈ నిర్ణయాల రూపంలో ఖజానాకు రూ.1.45 లక్షల కోట్ల వరకు పన్ను ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తగ్గిపోనుందని తెలిపారు.
కేంద్రప్రభుత్వ ప్రధాన నిర్ణయాలు
- కార్పొరేట్ ట్యాక్స్ బేస్ రేటు ప్రస్తుతం ఎటువంటి ప్రోత్సాహకాలు, పన్ను మినహాయింపులు పొందని రూ.400 కోట్ల టర్నోవర్ వరకు ఉన్న దేశీయ కంపెనీలపై 25 శాతంగా, అంతకుమించిన టర్నోవర్‌తో కూడిన కంపెనీలపై 30 శాతంగా ఉంది. ఇది ఇకపై 22 శాతమే అవుతుంది.
- 2019 అక్టోబర్ 1 తర్వాత ఏర్పాటు చేసి... 2023 మార్చి 31లోపు ఉత్పత్తి ప్రారంభించే తయారీరంగ కంపెనీలపై కార్పొరేట్ ట్యాక్స్ రేటు 15 శాతమే అమలవుతుంది. ప్రస్తుతం కొత్తగా ఏర్పాటు చేస్తున్న వాటిపై ఈ పన్ను 25 శాతంగా అమల్లో ఉంది.
- కొత్తగా ఏర్పాటయ్యే తయారీ యూనిట్లపై అన్ని సెస్సులు, సర్‌చార్జీలు కలిపి అమలవుతున్న 29.12 శాతం పన్ను కాస్తా 17.01 శాతానికి దిగొస్తుంది.
- కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్)ను 18.5 శాతం నుంచి 15 శాతానికి తగ్గించారు.
- కార్పొరేట్ కంపెనీలు సామాజిక బాధ్యత కింద (సీఎస్‌ఆర్) తమ లాభాల్లో 2శాతం ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీన్ని ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలకు కూడా వర్తింపజేశారు.
- 2019 జూలై 5లోపు షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించిన కంపెనీలు దానిపై ఇక ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు.
పర్యాటక సంస్థ థామస్ కుక్ దివాలా
ప్రముఖ బ్రిటిష్ పర్యాటక సంస్థ థామస్ కుక్ దివాలా తీసింది. 178 ఏళ్ల చరిత్ర గల ఈ కంపెనీ భారీ రుణ భారంలోకి కూరుకుపోయింది. ప్రైవేట్ ఇన్వెస్టర్ల నుంచి నిధుల సమీకరణ యత్నాలు విఫలమవడంతో దివాలా తీసినట్లుగా సెప్టెంబర్ 23న ప్రకటించింది. దీంతో దాదాపు 6 లక్షల మంది పర్యాటకులకు ఇబ్బందులు తలెత్తనున్నాయి. మరోవైపు ఇంగ్లాండ్‌లో 9,000 మందితో సహా ప్రపంచవ్యాప్తంగా 22 వేల మంది తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు. థామస్ కుక్ దివాలా తీయడంతో ఇంగ్లాండ్ నుంచి గోవాకు వచ్చే పర్యాటకులు సగం మేర తగ్గే అవకాశముంది. 1841లో థామస్ కుక్ తన పేరు మీదనే ఈ పర్యాటక సంస్థను స్థాపించాడు.
భారత వృద్ధి రేటుకు ఏడీబీ కోత
2019-2020 ఆర్థిక సంవత్సరానికి గాను భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాలను ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) తగ్గించింది. ఇంతక్రితం ఈ అంచనా 7.2 శాతం అయితే దీనిని 6.5 శాతానికి కుదించింది. ఈ మేరకు సెప్టెంబర్ 25న ఒక నివేదికను విడుదల చేసింది. తయారీ రంగం బలహీనత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలహీనత, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో క్రియాశీలత లేకపోవడం వంటి అంశాలు వృద్ధి రేటుకు కారణమని ఏడీబీ తన నివేదికలో పేర్కొంది. అయితే వృద్ధి వేగంలో చైనా కన్నా భారత్ ముందు ఉందని వివరించింది. 2019, ఏడాది తొలి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) భారత్ వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్టం 5 శాతానికి పడివడం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2019-2020లో భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6.5 శాత మే
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ)
విదేశీ మారక నిల్వలు 42,960 కోట్ల డాలర్లు
భారత్ విదేశీ మారక నిల్వలు సెప్టెంబరు 6తో ముగిసిన వారంలో 100 కోట్ల డాలర్లు పెరిగి 42,960.8 కోట్ల డాలర్లకు చేరాయని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) సెప్టెంబర్ 13న వెల్లడించింది. బంగారం నిల్వలు 19.9 కోట్ల డాలర్లు తగ్గి 2,735 కోట్ల డాలర్లకు చేరుకున్నాయని తెలిపింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వద్ద భారత్ నిల్వలు 143.4 కోట్ల డాలర్ల వద్ధ యథాతథంగా ఉన్నాయంది. అదే విధంగా ఐఎంఎఫ్ వద్ద భారత్ నిల్వలు 20 లక్షల డాలర్లు పెరిగి 361.9 కోట్ల డాలర్లకు చేరాయని పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విదేశీ మారక నిల్వలు 42,960 కోట్ల డాలర్లు
ఎప్పుడు : సెప్టెంబర్ 13
ఎవరు : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)
ఎగుమతుల్ని ప్రోత్సహించేందుకు చర్యలు
ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోయిన ఆర్థిక వృద్ధిని గాడిలోకి తెచ్చేందుకు కేంద్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెప్టెంబర్ 14న రూ.70,000 కోట్ల విలువైన చర్యలను ప్రకటించారు. ఎగుమతి దారులకు, రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చే ఈ చర్యల్లో రూ.30,000 కోట్లతో దెబ్బతిన్న ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టే ఫండ్ ఉంది. ఎగుమతుల్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన చర్యల్లో సుంకాల్ని రద్దు చేయటం, బీమా కవరేజీని పెంచటం, పోర్టుల్లో దిగుమతి సమయాన్ని తగ్గించేందుకు టెక్నాలజీని వాడకం వంటివి ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి రూ.20వేల కోట్ల నిధిని ఏర్పాటు చేశారు. దీనిలో సగ భాగాన్ని ప్రభుత్వం సమకూరుస్తుంది.
మంత్రి చెప్పిన మరికొన్ని వివరాలు..
- ఎగుమతి ఉత్పత్తులపై సుంకం లేదా పన్నుల ఉపశమనం (ఆర్‌ఓడీటీఈపీ) పేరిట కొత్త పథకాన్ని ప్రారంభిస్తారు. ఇది వచ్చే జనవరి 1 నుంచి ప్రస్తుత మర్చండీస్ ఎక్స్‌పోర్‌ట్స ఇండియా స్కీమ్ స్థానంలో అమల్లోకి వస్తుంది. ఈ కొత్త పథకం ద్వారా ప్రభుత్వం రూ.50,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోతుంది.
- ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (ఈసీజీసీ) రూ.1,700 కోట్ల మేర అదనంగా ఖర్చు చేసి ఎగుమతుల కోసం వర్కింగ్ క్యాపిటల్ రుణాలిచ్చే బ్యాంకులకు అధిక బీమా సౌకర్యాన్ని కల్పించనుంది. దీనివల్ల చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు వడ్డీ రేటుతో సహా ఎగుమతులకు సంబంధించిన రుణాలపై భారం తగ్గుతుందన్నారు.
- నెలాఖరుకల్లా జీఎస్‌టీ రిఫండ్లను రియల్‌టైమ్‌లో ప్రాసెస్ చేయటంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచి ‘ఎగుమతి చేసే సమయం’ తగ్గించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విమానాశ్రయాలు, ఓడరేవులలో ఎగుమతులకు పట్టే సమయాన్ని తగ్గించడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి ఇది అమలులోకి వస్తుంది.
- ఎగుమతులకు ఇచ్చే రుణాన్ని ప్రాధాన్యత రంగాలకిచ్చే రుణాలుగా బ్యాంకులు పరిగణిస్తాయి. అంతేకాకుండా ఎగుమతులకు రుణ లభ్యత ఉండేలా అదనంగా రూ.36,000- 68,000 కోట్లను విడుదల చేస్తారు.
- అందుబాటు గృహాల ప్రాజెక్టులకు విదేశీ వాణిజ్య రుణాలు (ఈసీబీలు) లభించేలా మార్గదర్శకాలను సరళీకరిస్తారు.
- వడ్డీరేట్ల బదలాయింపుపై చర్చించేందుకు ఈ నెల 19న ప్రభుత్వ బ్యాంకుల అధిపతులతో నిర్మలా సీతారామన్ ప్రత్యేక సమావేశంకానున్నారు.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు
అంచనాలకు అనుగుణంగానే అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీరేట్లను పావు శాతం(25 బేసిస్ పాయింట్లు) తగ్గించింది. దీంతో రిజర్వ్ వడ్డీ రేట్లు 2-2.25 శాతం నుంచి 1.75-2 శాతానికి తగ్గాయి. సెప్టెంబర్ 18న జరిగిన ఫెడ్ పాలసీ కమిటీ సమావేశంలో వడ్డీ రేట్ల కోత నిర్ణయానికి ఏడుగురు అనుకూలంగా, ముగ్గురు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఫెడ్ రేట్లను తగ్గించడం ఈ ఏడాది రెండోసారి.
భారత జీడీపీ వృద్ధి రేటుకు ఫిచ్ కోత
భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20) గతంలో వేసిన 6.8 శాతం నుంచి 6.6 శాతానికి రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ తగ్గించింది. ఈ మేరకు సెప్టెంబర్ 10న ఒక నివేదికను విడుదల చేసింది. అధిక రుణ భారం కారణంగా ద్రవ్య విధానాన్ని సడలించే అవకాశాలు ప్రభుత్వానికి పరిమితంగానే ఉన్నాయని ఫిచ్ తన నివేదికలో అభిప్రాయపడింది.
ఫిచ్ నివేదికలోని అంశాలు..
- రానున్న సంవత్సరంలో భారత జీడీపీ 7.1 శాతానికి పుంజుకునే అవకాశం ఉంది.
- భారత రేటింగ్‌ను మార్పు చేయకుండా బీబీబీ మైనస్, స్థిరమైన దృక్పథాన్నే కొనసాగించాం.
- భారత జీడీపీ వృద్ధి వరుసగా ఐదో త్రైమాసిక కాలంలోనూ (ఏప్రిల్-జూన్) 5 శాతానికి తగ్గింది.
- ప్రైవేటు వినియోగం, ఇన్వెస్ట్‌మెంట్ బలహీనంగా ఉన్నాయి. అంతర్జాతీయ వాణిజ్య వాతావరణం కూడా బలహీనంగానే ఉంది.
ఏమిటి : 2019-20లో భారత జీడీపీ వృద్ధి రేటు 6.6 శాతామే
ఎప్పుడు : సెప్టెంబర్ 10
ఎవరు : రేటింగ్ ఏజెన్సీ ఫిచ్
భారత్‌కు 21 బిలియన్ల పెట్టుబడులు
భారత్‌లోని హైటెక్ రంగాలకు రానున్న ఐదేళ్ల కాలంలో 21 బిలియన్ డాలర్ల (రూ.1.47 లక్షల కోట్లు) మేర పెట్టుబడులను ఆకర్షించే సామర్థ్యాలు ఉన్నాయని అమెరికా-భారత్ వ్యూహాత్మక, భాగస్వామ్య ఫోరం (యూఎస్‌ఐఎస్‌పీఎఫ్) పేర్కొంది. తద్వారా లక్షలాది ఉద్యోగాల కల్పన సాధ్యపడుతుందని వివరించింది. ఈ మేరకు సెప్టెంబర్ 11న ఒక నివేదికను విడుదల చేసింది. ‘భారత్‌లో హైటెక్ తయారీ’ పేరుతో రూపొందించిన ఈ నివేదికను ఈ సంస్థ భారత ప్రభుత్వానికి సమర్పించింది.
నివేదికలోని అంశాలు-వివరాలు
- భారత్‌లోని హైటెక్ రంగాలు (ఎలక్ట్రానిక్స్, ఏవియేషన్, వైద్య పరికరాలు) 5,50,000 ప్రత్యక్ష ఉద్యోగాలతోపాటు పరోక్షంగా 14,00,000 ఉద్యోగాలను తీసుకురాగలవు.
- ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, వైద్య పరికరాల రంగాల్లో ప్రస్తుతానికి భారత్ వాటా 3 శాతానికి మించి లేదు.
- భారత్‌లోని హైటెక్ రంగాల్లో పెట్టుబడులు పెట్టే విషయమై అమెరికన్ కంపెనీల అభిప్రాయాలను క్రోడీకరించి ఈ నివేదిక రూపొందించడం జరిగింది.
ఏమిటి : భారత్‌కు 21 బిలియన్ల పెట్టుబడులు
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఎవరు : అమెరికా-భారత్ వ్యూహాత్మక, భాగస్వామ్య ఫోరం (యూఎస్‌ఐఎస్‌పీఎఫ్)
అసోంలో 13 వేల కోట్ల పెట్టుబడి : ఓఎన్‌జీసీ
అసోంలో చమురు అన్వేషణ, ఉత్పత్తి నిమిత్తం ఐదేళ్లలో రూ.13,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని ఓఎన్‌జీసీ(ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్) తెలిపింది. ఈ విషయమై అసోం రాష్ట్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నామని సెప్టెంబర్ 11న వెల్లడించింది. 2022 కల్లా దిగుమతులను 10% మేర తగ్గించుకోవాలన్న ప్రధాని మోదీపిలుపు మేరకు ఈ పెట్టుబడులు పెడుతున్నామని పేర్కొంది. నార్త్‌ఈస్ట్ హైడ్రోకార్బన్ విజన్ 2030లో భాగంగా ఈ పెట్టుబడుల ప్రణాళికను రూపొందించామని ఓఎన్‌జీసీ వివరించింది. అసోంలోని జోర్హాట్, గోల్హాట్ జిల్లాల్లో ఆరు బావులు, ఐదు మైనింగ్ బ్లాక్‌ల్లో డ్రిల్లింగ్ కోసం ఆమోదాలు పొందామని తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చమురు అన్వేషణ, ఉత్పత్తి నిమిత్తం ఐదేళ్లలో రూ.13,000 కోట్లు పెట్టుబడులు
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఎవరు : ఓఎన్‌జీసీ(ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్)
ఎక్కడ : అసోం
ఆర్‌బీఐ 2018-19 వార్షిక నివేదిక విడుదల
2018-19 (జూలై-జూన్) వార్షిక నివేదికను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆగస్టు 29న విడుదల చేసింది. ఈ నివేదికలో భారత్ ప్రస్తుత మందగమన పరిస్థితులను ఆర్‌బీఐ తక్కువ చేసి చూపించింది. భారీ వృద్ధికి ముందు చిన్న మందగమన పరిస్థితులను భారత్ ఎదుర్కొంటోందని తెలిపింది. దీనిని సైక్లికల్ ఎఫెక్ట్ (ఎగువ దిగువ)గా పేర్కొంది. వినియోగం, ప్రైవేటు పెట్టుబడుల పునరుద్ధరణ కేంద్రం, విధాన నిర్ణేతల అధిక ప్రాధాన్యత కావాల్సిన అవసరం ఉందని వివరించింది.
నివేదికలోని ముఖ్యాంశాలు..
- మౌలిక రంగ వ్యయాలకు భారీ మద్దతు నివ్వాల్సిన అవసరం ఉంది.
- దేశీయ డిమాండ్ పరిస్థితులు ఊహించినదానికన్నా బలహీనంగా ఉన్నాయి. దీని పునరుద్ధరణకు వ్యవస్థలో తగిన చర్యలు తీసుకోవాలి.
- వ్యాపార పరిస్థితులు మెరుగుపరచాలి.
- ఆర్థిక వ్యవస్థలో సానుకూలతలూ ఉన్నాయి. తగిన వర్షపాతంతో అదుపులో ఉండే ధరలు, ద్రవ్యలోటు కట్టుతప్పకుండా చూసే పరిస్థితులు, కరెంట్ అకౌంట్ లోటు కట్టడి వంటివి ప్రధానం.
- బ్యాంకింగ్‌లో వేగంగా విలీనాల ప్రక్రియ.
- వరుసగా నాలుగు ద్వైమాసికాలాల్లో ఆర్‌బీఐ 1.10 శాతం రెపో రేటు కోత (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 5.40 శాతం) లక్ష్యం వృద్ధి మందగమన నిరోధమే. 2019-20లో వృద్ధి 6.9 శాతంగా భావించడం జరుగుతోంది.
- ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ వైఫల్యం నేపథ్యంలో- వాణిజ్య రంగానికి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీ) రుణం 20 శాతం పడిపోయింది. 2017-18లో రుణ పరిమాణం రూ.11.60 లక్షల కోట్లు ఉంటే, 2018-19లో ఈ మొత్తం రూ.9.34 లక్షల కోట్లు.
- అమెరికా-చైనాల మధ్య వాణిజ్య సంబంధ అంశాలు అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్న అంశం.
- బ్యాంకింగ్ మొండిబకాయిలు తగ్గాయి. 2017-18లో మొత్తం రుణాల్లో మొండిబాకాయిలు 11.2 శాతం ఉంటే, ఇది 2018-19లో 9.1 శాతానికి తగ్గాయి.
- బ్యాంక్ మోసాల విలువ 2018-19లో రూ.71,543 కోట్లకు చేరాయి. 2017-18 నుంచి చూస్తే ఈ విలువ 73.8 శాతం (రూ.41,167.04 కోట్లు) పెరిగింది. ఇక కేసులు, 15% పెరుగుదలతో 5,916 నుంచి 6,801కి చేరాయి.
- ప్రైవైటు బ్యాంకులు, విదేశీ బ్యాంకుల చీఫ్‌ల వేతనాల విషయంలో సవరించిన నిబంధనలు త్వరలోనే విడుదల.
- యువతకు ఆర్‌బీఐ పట్ల అవగాహన పెంచేందుకు ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వేదికలను విసృ్తతంగా ఉపయోగించుకోవడం.
- కేంద్రానికి మిగులు నిధులు రూ.52,000 కోట్ల బదలాయింపుల నేపథ్యంలో ఆర్‌బీఐ వద్ద అత్యవసర నిధి రూ.1.96 లక్షల కోట్లకు తగ్గుతోంది.
దేశంలోని పది ప్రభుత్వ రంగ బ్యాంకుల(పీఎస్‌బీ)ను విలీనం చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆగస్టు 30న ప్రకటించారు. మొత్తం 10 బ్యాంకులను 4 బ్యాంకులుగా కుదించనున్నట్లు వెల్లడించారు. దీని ప్రకారం నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆరు విలీనం కానున్నాయి. వీటి వ్యాపార పరిమాణం ఏకంగా రూ. 55.81 లక్షల కోట్లుగా ఉండనుంది. ఈ పది బ్యాంకుల లీనంతో పీఎస్‌బీల సంఖ్య 12కి తగ్గనుంది. 2017లో పీఎస్‌బీల సంఖ్య 27గా ఉండేది.
మరోవైపు పీఎస్‌బీల్లో గవర్నెన్స్ పరమైన పలు సంస్కరణలను కూడా మంత్రి నిర్మలా ఆవిష్కరించారు. బోర్డులకు స్వయంప్రతిపత్తి ఇవ్వనున్నట్లు తెలిపారు. 10 బ్యాంకుల ఖాతాలను పటిష్టంగా మార్చేందుకు రూ. 52,250 కోట్ల మేర నిధులు అందించనున్నట్లు వివరించారు. విలీన ప్రక్రియలో ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షిస్తామని ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు.
బ్యాంకుల విలీనం-వివరాలు
మంత్రి ప్రకటనలోని మరిన్ని ముఖ్యాంశాలు..
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 14 బ్యాంకులు లాభాలు నమోదు చేశాయి.
- 2018 డిసెంబర్ ఆఖరు నాటికి రూ. 8.65 లక్షల కోట్లుగా ఉన్న మొత్తం స్థూల మొండిబాకీలు 2019 మార్చి ఆఖరు నాటికి రూ. 7.9 లక్షల కోట్లకు తగ్గాయి.
- నీరవ్ మోదీ తరహా మోసాలను నివారించేందుకు స్విఫ్ట్ మెసేజింగ్ వ్యవస్థను కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌కు (సీబీఎస్)కు అనుసంధానించడం జరిగింది.
- విలీనానంతరం వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఆయా బ్యాంకుల బోర్డులు చీఫ్ జనరల్ మేనేజర్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు. చీఫ్ రిస్క్ ఆఫీసర్‌లను కూడా నియ మించుకోవాల్సి ఉంటుంది.
- దేశవ్యాప్తంగా పటిష్టమైన నెట్‌వర్క్, అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలుండే బ్యాంకులు ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.
స్విస్ ఖాతాల వివరాలు అందుబాటులోకి...
స్విట్జర్లాండ్‌లోని బ్యాంకుల్లో భారతీయులకు సంబంధించిన ఖాతాల వివరాలు సెప్టెంబర్ 1వతేదీ నుంచి భారతీయ పన్ను అధికారులకు అందుబాటులోకి రానున్నాయి. ఇరుదేశాల ఆటోమేటిక్ సమాచార మార్పిడి ఒప్పందం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానుండటంతో స్విస్ ఖాతాల వివరాలు భారత్‌కు తెలియనున్నాయి. నల్లధనంపై ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి ఇది దోహదపడుతుందని, దీంతో స్విస్ బ్యాంకుల లోగుట్టు శకం ఎట్టకేలకు ముగిసినట్లు అవుతుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) తెలిపింది. దీనిపై సీబీడీటీ ఆదాయపు పన్ను విభాగానికి ఓ విధానాన్ని రూపొందించింది. స్విట్జర్లాండ్ అంతర్జాతీయ ఫైనాన్స్ విభాగానికి చెందిన ఉన్నతాధికారి నికోలస్ మారియో ఆగస్టు 29, 30 తేదీల్లో భారత రెవెన్యూ కార్యదర్శి ఏబీ పాండే, సీబీడీటీ చైర్మన్ పీసీ మోదీలతో భేటీ అయి దీనిపై చర్చించారు. ఆర్థిక ఖాతాల సమాచార మార్పిడి కార్యక్రమం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పారు. పన్నుకు సంబంధించిన భారత్ కోరిన కొన్ని ప్రత్యేక కేసుల సమాచార మార్పిడి ప్రక్రియను వేగవంతం చేయడంపైనా ఇరుదేశాల అధికారులు చర్చించారు. స్విట్జర్లాండ్‌లో 2018 సంవత్సరంలో భారతీయులు నిర్వహించిన అన్ని ఆర్థిక లావాదేవీల వివరాలను భారత్ అందుకుంటుందని సీబీడీటీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇందులో 2018లో క్లోజ్ అయిన ఖాతాల వివరాలు కూడా ఉంటాయని తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: స్విట్జర్లాండ్‌లోని బ్యాంకుల్లో భారతీయులకు సంబంధించిన ఖాతాల వివరాలు సెప్టెంబర్ 1వతేదీ నుంచి భారతీయ పన్ను అధికారులకు అందుబాటులోకి..
ఎప్పుడు: సెప్టెంబర్ 1వతేదీ నుంచి
ఎందుకు: నల్లధనం
ఎక్కడ: స్విట్జర్లాండ్
తత్కాల్ టికెట్లతో రూ.25,392 కోట్లు ఆధాయం
న్యూఢిల్లీ: రైల్వేశాఖ ప్రవేశపెట్టిన తత్కాల్ టికెట్ల పద్ధతి రైల్వేల పంట పండిస్తోంది. తత్కాల్ బుకింగ్‌ల ద్వారా గత నాలుగేళ్లలో తమకు రూ. 25,392 కోట్ల ఆదాయం వచ్చిందని ఒక సమాచార హక్కు కార్యకర్త అడిగిన ప్రశ్నకు సమాధానంగా రైల్వేశాఖ సమాధానమిచ్చింది. ఇందులో రూ. 21,530 కోట్ల ఆదాయం తత్కాల్ కోటా నుంచి రాగా, తత్కాల్ ప్రీమియం ద్వారా మరో 3,862 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించామని వెల్లడించింది. తత్కాల్ సేవల ద్వారా 2016-19 కాలానికి రైల్వేల ఆదాయం 62 శాతం పెరిగిందని తెలిపింది. రైల్వేశాఖ తత్కాల్ పద్ధతిని 1997లోనే ప్రవేశపెట్టినప్పటికీ, 2004లోనే దేశమంతా అమలు చేసింది. ఈ పద్ధతిలో రెండో తరగతి టికెటై్లతే టికెట్ ధరపై 10 శాతం, మిగతా తరగతులకు 30 శాతం అధిక ధర వసూలు చేస్తారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా 2,677 రైళ్లలో తత్కాల్ పద్ధతిలో టికెట్ బుకింగ్‌స జరుగుతున్నాయి. ఈ రైళ్లలో అందుబాటులో ఉన్న మొత్తం 11.57 లక్షల సీట్ల నుంచి 1.71 లక్షల సీట్లను తత్కాల్ టికెటింగ్ కోసం కేటాయించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: తత్కాల్ టికెట్లతో ఇండియన్ రైల్వేకి రూ.25,392 కోట్లు ఆధాయం
ఎప్పుడు: గత నాలుగేళ్లలో
ఐడీబీఐ బ్యాంకుకు రూ. 9,300 కోట్ల నిధులు
ఐడీబీఐ బ్యాంకు మూలధన స్థాయిని పెంచేందుకు, లాభాల్లోకి మళ్లించేందుకు రూ. 9,300 కోట్ల మేర నిధులు సమకూర్చనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ సెప్టెంబర్ 3న వెల్లడించారు. ఇందులో సుమారు 51 శాతం నిధులను (రూ. 4,743 కోట్లు) ఎల్‌ఐసీ సమకూర్చనుండగా, మిగతా 49 శాతం (రూ. 4,557 కోట్లు) కేంద్రం వన్-టైమ్ ప్రాతిపదికన అందించనుంది. మొండిబాకీలతో కుదేలైన ఐడీబీఐ బ్యాంకులో ఎల్‌ఐసీ గత ఆగస్టులో తన వాటాలను 51 శాతానికి పెంచుకున్న సంగతి తెలిసిందే. కేంద్రం నుంచి మూలధనం అందిన రోజునే అదే మొత్తంలో ఐడీబీఐ బ్యాంకు రీక్యాపిటజైషన్ బాండ్లు కొనుగోలు చేయనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐడీబీఐ బ్యాంకుకు రూ. 9,300 కోట్ల నిధులు
ఎప్పుడు : సెప్టెంబర్ 3
ఎవరు : కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్
ఎందుకు : ఐడీబీఐ బ్యాంకు మూలధన స్థాయిని పెంచేందుకు, లాభాల్లోకి మళ్లించేందుకు
Published date : 25 Sep 2019 04:03PM