IIBXని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ (గిఫ్ట్) సిటీలో జూలై 29న జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ... ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ (ఐఎఫ్‌ఎస్‌సీఏ)కి శంకుస్థాపన చేశారు. ఇంటర్నేషనల్ బులియన్ ఎక్చేంచ్ (IIBX)ను ఎన్‌ఎస్‌సీ ( National Stock Exchange), ఐఎఫ్‌ఎస్సీ (International Financial Service Centre), ఎస్‌జీఎక్స్ (Singapore Exchange Ltd) కనెక్ట్ ప్లాట్‌ఫాంను ఆవిష్కరించారు.
also read: Weekly Current Affairs (Awards) Bitbank: అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ 2022 గెలుచుకున్న మొదటి హిందీ నవల ఏది?
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ... అంతర్జాతీయ ఆర్థిక రంగం రూపురేఖలను ప్రభావితం చేసే అతి కొద్ది దేశాల జాబితాలో ఒకటిగా భారత్ ఎదిగిందని చెప్పారు. ఈ విషయంలో అమెరికా, బ్రిటన్, సింగపూర్ వంటి దేశాల సరసన నిలిచిందని పేర్కొన్నారు. ‘అమెరికా, బ్రిటన్, సింగపూర్ వంటి దేశాల్లో అంతర్జాతీయ ఆర్థిక రంగాన్ని తీర్చిదిద్దే కొత్త ట్రెండ్లు కనిపిస్తుంటాయి. ఇప్పుడు భారత్ కూడా వాటి సరసన నిల్చింది. ఈ ఘనత సాధించినందుకు ప్రజలను అభినందిస్తున్నాను. స్వాతంత్య్రానంతరం మనకు మనమే గిరిగీసుకుని కూర్చున్నాం. వందల ఏళ్ల బానిసత్వం వల్ల ఆత్మవిశ్వాసం లోపించడమే ఇందుకు కారణం. కానీ ప్రస్తుతం పాత ఆలోచనా ధోరణులను నవభారతం సమూలంగా మార్చేస్తోంది‘ అని మోదీ అన్నారు. ప్రపంచ ఎకానమీలో భారత్ కీలకంగా ఎదుగుతోందని, దీనికి ఊతమిచ్చే స్థాయి సంస్థలు దేశీయంగా అవసరమని పేర్కొన్నారు. టెక్నాలజీకి హబ్‌గా గిఫ్ట్ సిటీ ఎంతో ప్రత్యేకత సాధించిందని తెలిపారు.
Also read: IMF: ఆర్థిక సంక్షోభం అంచున దేశాలు