Skip to main content

మే 2018 ఎకానమీ

భారత్ వృద్ధి రే టు 7.5 శాతం
Current Affairs 2018-19 ఆర్థిక సంత్సరంలో భారత్ వృద్ధి రేటు 7.5 శాతంగా నమోదవుతుందని కేర్ రేటింగ్స్ మే 24న వెల్లడించింది. అదే విధంగా డాలర్ మారకంలో రూపాయి బలహీన పడుతుందని, కరెంట్ అకౌంట్ లోటు 2.5 శాతానికి చేరవచ్చని అంచానా వేసింది.
మరోవైపు 2017-18లో 3.6 శాతంగా ఉన్న వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 2018-19లో 5.5 శాతాంగా ఉండవచ్చని పేర్కొంది. అలాగే విదేశీ మారకద్రవ్య నిల్వలు 425 నుంచి 435 బిలియన్ డాలర్లు ఉండవచ్చని తెలిపింది. వ్యవసాయ రంగ వృద్ధి 4 శాతానికి, పారిశ్రామిక ఉత్పత్తి 6 శాతాంగా నమోదవుతుందని, ముడి చమురు సగటు ధర బ్యారెల్ 75 డాలర్లుగా ఉంటుందని లెక్కగట్టింది.
2016-17లో భారత్ జీడీపీ వృద్ధి రేటు 6.6 శాతం, వ్యవసాయ రంగ వృద్ధి 3 శాతం, పారిశ్రామిక ఉత్పత్తి రేటు 4.3 శాతంగా నమోదయ్యాయి. 2017-18 వృద్ధి గణాంకాలు మే 31న విడుదలవుతాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ వృద్ధి రే టు 7.5 శాతం
ఎప్పుడు : 2018-19
ఎవరు : కేర్ రేటింగ్స్

ఉద్యోగుల పీఎఫ్‌పై 8.55 శాతం వడ్డీ
2017-18 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో 8.55 శాతం వడ్డీరేటు జమకానుంది. ఈ మేరకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) మే 25న ప్రకటించింది. 2016-17లో ఈ వడ్డీ రేటు 8.65 శాతంగా ఉంది. దాదాపు 5 కోట్ల మందికి ఈపీఎఫ్‌వోలో ఖాతాలున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉద్యోగుల పీఎఫ్‌పై 8.55 శాతం వడ్డీ
ఎప్పుడు : 2017-18
ఎవరు : ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌వో)

భారత్ వృద్ధి 7.4 శాతం
Current Affairs 2017-18 నాల్గవ త్రైమాసికంలో (జనవరి-మార్చి) భారత్ వృద్ధి రేటు 7.4 శాతంగా ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా మే 21న అంచనావేసింది. మూడవ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతంగా నమోదయ్యింది. నాల్గవ త్రైమాసికం జీడీపీ గణాంకాలతో పాటు 2017-18 ఆర్థిక సంవత్సరం జీడీపీ తొలి అంచనాలను కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) మే 31న విడుదల చేయనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ వృద్ధి 7.4 శాతం
ఎప్పుడు : 2017-18 నాల్గవ త్రైమాసికం (జనవరి-మార్చి)
ఎవరు : రేటింగ్ ఏజెన్సీ ఇక్రా

భారత్ వృద్ధిరేటు 7.3 శాతం
Current Affairs భారత్ వృద్ధిరేటు 2018-19 ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం, 2019-20లో 7.5 శాతంగా ఉంటుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అంచనా వేసింది. ఈ మేరకు ఆసియా-పసిఫిక్ దేశాలకు సంబంధించిన సావరీన్ పరపతి సమీక్షలో ఫిచ్ మే 11న వెల్లడించింది. ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ, కంపెనీల పనితీరు వంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఫిచ్ రేటింగ్‌ను ఇచ్చింది. 2017-18లో భారత్ వృద్ధి రేటు 6.5 శాతంగా నమోదైంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ వృద్ధి రేటు 7.3 శాతం
ఎప్పుడు : మే 11
ఎవరు : అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్

కృషి ఉన్నతి యోజన గడువు పొడిగింపు
2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో ‘హరిత విప్లవం- కృషి ఉన్నతి యోజన’ కార్యక్రమాన్ని మార్చి 2020 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం మే 2న ప్రకటించింది. దీంతో పాటు ఆరోగ్య రంగానికి సంబంధించిన ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజనని 2019-20 వరకు కొనసాగించనున్నారు. అలాగే వృద్ధుల పింఛను కోసం ఉద్దేశించిన ప్రధాన మంత్రి వయ వందన్ యోజన (పీఎంవీవీవై) పథకంలో పెట్టుబడి పరిమితిని రూ. 7.5 లక్షల నుంచి రూ. 15 లక్షలకు పెంచారు. ఎంఎస్‌డీపీ (మల్టీ సెక్టోరల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం) పేరును ప్రధాన మంత్రి జన వికాస్ కార్యక్రమ్’ (పీఎంజేవీకే) గా మార్చారు.
వ్యవసాయ రంగానికి సంబంధించిన 11 పథకాలను ఒకే గొడుగు కిందకు తెచ్చి 2017లో హరిత విప్లవం-కృషి ఉన్నతి యోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
కృషి ఉన్నతి యోజన గడువు పొడిగింపు
ఎప్పుడు : మే 2
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో

భారత్ వృద్ధి రేటు 7.3 శాతం
2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 7.3 శాతంగా ఉంటుందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్ గ్రూప్ కంపెనీ అరుున బీఎంఐ రీసెర్చ్ మే 2న అంచనా వేసింది. నిర్మాణం, తయారీ, సేవల రంగాలు భారత్ వృద్ధికి తోడ్పడుతాయని, అమెరికా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఆర్థిక క్రియాశీలత మెరుగుపడుతుండడం భారత్ ఆర్థిక వ్యవస్థకు డిమాండ్ పరంగా కలిసివచ్చే అంశం అని తన నివేదికలో పేర్కొంది. 2017-18లో భారత్ వృద్ధి రేటు 6.6 శాతంగా ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ వృద్ధి రేటు 7.3 శాతం
ఎప్పుడు : మే 2
ఎవరు : ఫిచ్ గ్రూప్ కంపెనీ అరుున బీఎంఐ రీసెర్చ్

బ్యాంకుల్లో లక్ష కోట్ల మోసాలు
గత ఐదేళ్లలో బ్యాంకుల్లో 23,000 కు పైగా కేసులు నమోదవగా వాటి మొత్తం విలువ లక్ష కోట్లుందని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. సమాచార హక్కు చట్టం కింద దాఖలైన దరఖాస్తుకు సమాధానంగా ఆర్‌బీఐ మే 2న ఈ వివరాలను తెలిపింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఫ్రాడ్ కేసుల సంఖ్య 5,076 ఉండగా ఈ పరిమాణం మొత్తం రూ. 23,933 కోట్లు. 2017-18లో కేసులు 5,152 కాగా వాటి మొత్తం రూ. 28,459 కోట్లు.

జాతీయ డిజిటల్ కమ్యూనికేషన్‌‌స విధానం 2018
ఉద్యోగాల కల్పనతో పాటు పెట్టుబడులను రప్పించటమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ డిజిటల్ కమ్యూనికేషన్‌‌స విధానం 2018 ని మే 2న రూపొందించింది. 2022 నాటికల్లా టెలికం రంగంలో 40 లక్షల ఉద్యోగాలు కల్పించడం, డిజిటల్ కమ్యూనికేషన్‌‌స రంగంలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడం ఈ విధానం ప్రధాన ఉద్దేశం. దీని ప్రకారం స్థూల దేశీయోత్పత్తిలో ప్రస్తుతం 6 శాతంగా ఉన్న టెలికం రంగం వాటాను 8 శాతానికి పెంచేందుకు చర్యలు తీసుకోనున్నారు. 2020 నాటికి అన్ని గ్రామ పంచాయతీలకు 1 జీబీపీఎస్, 2022 నాటికి 10 జీబీపీఎస్ స్పీడ్‌తో బ్రాడ్‌బ్యాండ్ సేవలు విస్తరించాలని పాలసీలో పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
జాతీయ డిజిటల్ కమ్యూనికేషన్‌‌స విధానం 2018
ఎప్పుడు : మే 2
ఎవరు : కేంద్ర ప్రభుత్వం

డిజిటల్ ప్రకటనల వ్యయం 12 వేల కోట్లు
డిజిటల్ ప్రకటనలపై కంపెనీలు చేస్తున్న వ్యయం 2018 చివరి నాటికి రూ.12,046 కోట్లకు చేరనుందని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ (ఐఏఎంఏఐ), కాంటార్ ఐఎంఆర్‌బీ లు సంయుక్తంగా వెల్లడించాయి. ఈ తరహా వ్యయం ఏటా 30% పెరుగుతుందని, 2017లో మొత్తం రూ. 9,266 కోట్లుగా ఉందని నివేదిక తెలిపింది.
2017లో వివిధ మాధ్యమాల్లో మొత్తం ప్రకటనల వ్యయం రూ. 59,000 కోట్లు కాగా అందులో డిజిటల్ అడ్వర్టైజింగ్ వాటా 16 శాతంగా ఉంది. వీటిలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్‌‌స (బీఎఫ్‌ఎస్‌ఐ) కంపెనీలు డిజిటల్ ప్రకటనలపై రూ. 2,022 కోట్లు వెచ్చించి మొదటి స్థానంలో ఉండగా ఈ-కామర్స్ కంపెనీలు రెండో స్థానంలో ఉన్నారుు. డిజిటల్ అడ్వర్టైజింగ్‌లో సోషల్ మీడియా వాటా 18 శాతంగా (సుమారు రూ. 1,668 కోట్లు) ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి
: 2018లో డిజిటల్ ప్రకటనలపై వ్యయం 12 వేల కోట్లు
ఎప్పుడు : మే 3
ఎవరు : ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్, కాంటార్ ఐఎంఆర్‌బీ
ఎక్కడ : భారత్‌లో

ఆర్థిక వృద్ధిలో అగ్రస్థానానికి భారత్
రానున్న పదేళ్లలో ఆర్థిక వృద్ధిలో భారత్ అగ్రస్థానానికి చేరుకుంటుందని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (సీఐడీ) సంస్థ మే 3న వెల్లడించింది. ఏటా 7.9 శాతం వృద్ధిని సాధిస్తుందని తన నివేదికలో పేర్కొంది. భారత్ తర్వాత 7.5 శాతం వృద్ధితో ఉగాండా రెండో స్థానం, బంగ్లాదేశ్, వెనిజులా, అంగోలా దేశాలు చివరి స్థానంలో ఉంటాయని తెలిపింది. 2026 నాటికి ఏటా చైనా 4.9 శాతం, ఫ్రాన్‌‌స 3.5 శాతం, అమెరికా 3 శాతం వృద్ధిని సాధించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆర్థిక వృద్ధిలో భారత్‌కు అగ్రస్థానం
ఎప్పుడు : వచ్చే పదేళ్లలో
ఎవరు : సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్, హార్వర్డ్ యూనివర్శిటీ
ఎక్కడ : ప్రపంచ వ్యాప్తంగా

ట్రేడింగ్ వేళలు మార్చిన సెబీ
ఈక్విటీ డెరివేటివ్‌‌స మార్కెట్ ట్రేడింగ్ వేళలను పెంచుతూ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నిర్ణయం తీసుకుంది. దీంతో ‘ఈక్విటీ డెరివేటివ్‌‌స విభాగంలో ట్రేడింగ్ వేళలను ఉదయం 9 నుంచి రాత్రి 11.55 దాకా పెంచుకునేందుకు స్టాక్ ఎక్స్చేంజీలను అనుమతి లభించింది. ఇది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుతం ఈక్విటీ డెరివేటివ్‌‌స ట్రేడింగ్ వేళలు ఉదయం 9.15 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు మాత్రమే ఉండగా కమోడిటీ డెరివేటివ్‌‌స వేళలు 11.55 దాకా ఉన్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఈక్విటీ డెరివేటివ్‌‌స మార్కెట్ ట్రేడింగ్ వేళల పెంపు
ఎప్పుడు : మే 3
ఎవరు : సెక్యూరిటీస్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా
ఎక్కడ : దేశవ్యాప్తంగా

పీఎఫ్‌పై వడ్డీ 8.55 శాతం
2017-18 ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్‌పై 8.55 శాతం వడ్డీ చెల్లించాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) కు చెందిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్(సీబీటీ) చందాదారులకు చెల్లించాల్సిన వడ్డీని నిర్ణయించి ఫిబ్రవరిలోనే ఆర్థిక శాఖ ఆమోదానికి పంపించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పీఎఫ్ చందాదారులకు 8.55 శాతం వడ్డీ
ఎప్పుడు : 2017-18 ఆర్థిక సంవత్సరం
ఎవరు : కేంద్ర ఆర్థిక శాఖ

భారత్ వృద్ధి రేటు 7.2 శాతం: ఐరాస
2018లో భారత్ వృద్ధి రేటు 7.2 శాతంగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. 2019లో దీనిని 7.4 శాతంగా పేర్కొంది. భారత్‌లో ఇన్‌ఫ్రాపై వ్యయాలు పెరగడంతోపాటు కార్పొరేట్, బ్యాంకు బ్యాలన్‌‌స షీట్లు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. పన్ను సంస్కరణ, పన్నుల వసూలు బలోపేతం అయితే భారత్, చైనా, ఇండోనేషియా వంటి దేశాల్లో జీడీపీ 3- 4 శాతం పెరిగే అవకాశం ఉంటుందని చెప్పింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి :
భారత్ వృద్ధి రేటు 7.2 శాతం
ఎప్పుడు : 2018-19
ఎవరు : ఐక్యరాజ్య సమితి

ఫ్లిప్‌కార్ట్‌ని కొనుగోలు చేసిన వాల్‌మార్ట్
దేశీయ ఈ-కామర్స్ సంస్థ ఫ్టిప్‌కార్ట్‌లో అమెరికా రిటైల్ సంస్థ వాల్‌మార్ట్ 77 శాతం వాటాను కొనుగొలు చేసింది. ఈ మేరకు 16 బిలియన్ డాలర్లను (దాదాపు రూ.1,05,000 కోట్లు) చెల్లించడానికి వాటాదారులతో మే 9న ఒప్పందం కుదుర్చుకుంది. అదేవిధంగా ఫ్లిప్‌కార్ట్‌లో కొత్తగా 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వాల్‌మార్ట్ పేర్కొంది. దీంతో ప్రంపంచ ఈ-కామర్స్ రంగంలో జరిగిన అతిపెద్ద లావాదేవిగా ఇది రికార్డులకెక్కింది. ఈ డీల్ తర్వాత బిన్నీ బన్సల్ కంపెనీ చైర్మన్‌గా, వాల్‌మార్ట్‌కు చెందిన క్రిష్ అయ్యర్ కంపెనీ సీఈఓగా వ్యవహరించనుండగా వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్ రెండు వేర్వేరు బ్రాండ్‌లుగానే ఉంటాయి.
ఢిల్లీ ఐఐటీలో కలిసి చదువుకున్న సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్‌లు 2007లో బెంగళూరులో ఫ్లిప్‌కార్ట్‌ను నెలకొల్పారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఫ్లిప్‌కార్ట్‌ని కొనుగోలు చేసిన వాల్‌మార్ట్
ఎప్పుడు : మే 9
ఎవరు : వాల్‌మార్ట్

భారత్ వృద్ధి రేటు 7.4 శాతం: ఐఎంఎఫ్
2017-18 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు 7.4 శాతంగా ఉంటుందని, 2018-19 లో ఇది 7.8 శాతానికి పెరుగుతుందని ఐఎంఎఫ్ మే 9న అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక వృద్ధిలో 60 శాతానికి పైగా వాటా కలిగిన ఆసియా 5.6 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని తెలియజేసింది. ఇదే సమయంలో చైనా వృద్ధి 6.6 శాతం, 6.4 శాతంగా ఉంటుందని పేర్కొంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి
: భారత్ వృద్ధి రేటు 7.4 శాతం
ఎప్పుడు : 2017-18
ఎవరు : ఐఎంఎఫ్

జాతీయ వెదురు మిషన్ ఏర్పాటుకు ఆమోదం
Current Affairs పునర్వ్యవస్థీకృత జాతీయ వెదురు మిషన్ (ఎన్‌బీఎం) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 25న ఆమోదం తెలిపింది. రెండేళ్ల పాటు అమలు చేయనున్న ఈ పథకానికి రూ.1,290 కోట్లు కే టాయించగా ఇందులో కేంద్రం రూ.950 కోట్లు భరిస్తుంది. ఈ మిషన్‌లో భాగంగా ఈశాన్య రాష్ట్రాలు, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, గుజరాత్, బిహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో వెదురు చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తారు.
ముడి జనపనార కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.200 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో క్వింటాల్ ముడి జనపనార ధర రూ.3,700కు చేరింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతీయ వెదురు మిషన్ ఏర్పాటుకు ఆమోదం
ఎప్పుడు : ఏప్రిల్ 25
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : కొన్ని రాష్ట్రాల్లో
ఎందుకు : రాష్ట్రాల్లో వెదురు చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించడానికి

భారత్‌కు బీబీబీ మైనస్’ గ్రేడ్: ఫిచ్
భారత్‌కు వరుసగా 12వ ఏడాదీ పెట్టుబడులకు తక్కువ గ్రేడ్ అయిన ‘బీబీబీ మైనస్’ ను అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్ కొనసాగించింది. భారత దీర్ఘకాలిక కరెన్సీ జారీ డిఫాల్టింగ్ రేటును ‘బీబీబీ- స్థిరం’గా కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. భారత ఆర్థిక రంగం పలు పోటీ దేశాలతో పోల్చినప్పుడు తక్కువ అభివృద్ధి, ప్రపంచ బ్యాంకు గవర్నెన్స్ సూచీలో తక్కువ స్కోరు సాధించిందని, ఐక్యరాజ్య సమితి మానవాభివృద్ధి సూచీలోనూ వెనుకబడిందని ఫిచ్ పేర్కొంది. మధ్యకాలిక బలమైన వృద్ధి అంచనాలు, సానుకూల ఎక్స్‌టర్నల్ బ్యాలన్స్లు, బలహీన ద్రవ్య పరిస్థితులు, సంస్థాగత అంశాల వెనుకబాటు ఆధారంగా ఫిచ్ ఈ రేటింగ్‌ను ఇచ్చింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్‌కు ‘బీబీబీ మైనస్’ గ్రేడ్
ఎప్పుడు : ఏప్రిల్ 27
ఎవరు : అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్
Published date : 23 May 2018 03:30PM

Photo Stories