మార్చి 2018 ఎకానమీ
Sakshi Education
ఏప్రిల్ 14 నుంచి గ్రామ్ స్వరాజ్ అభియాన్: మోదీ
అంబేడ్కర్ జయంతి నేపథ్యంలో ఏప్రిల్ 14 నుంచి మే 5 వరకు 'గ్రామ్ స్వరాజ్ అభియాన్' నిర్వహించాలన్నారు. దేశవ్యాప్తంగా గ్రామాభివృద్ధి, పేదరిక నిర్మూలన, సామాజిక న్యాయం తదితర అంశాలపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని మార్చి 25న నిర్వహించిన మాసాంతపు మన్‌కీ బాత్ కార్యక్రమంలో పేర్కొన్నారు. వెనకబడిన కుటుంబానికి చెందిన అంబేడ్కర్ ముందుకెళ్లకుండా చాలా మంది అవహేళన చేశారని.. వారందరి ప్రయత్నాలను అంబేడ్కర్ విఫలం చేసి రాజ్యాంగ నిర్మాతగా నిలిచారన్నారు. దేశం పేదలు, వెనకబడిన వర్గాలకే చెందుతుందని మోదీ చెప్పారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏప్రిల్ 14 నుంచి గ్రామ్ స్వరాజ్ అభియాన్ కార్యక్రమం చేపట్టాలని సూచన
ఎప్పుడు : మార్చి 24
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరించాలి: అరవింద్ పనగరియా
నీతిఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా ప్రభుత్వ రంగంలో ఎస్‌బీఐ మినహా మిగిలిన అన్ని బ్యాంకులను ప్రైవేటీకరించాలని సూచించారు. 2019లో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉన్న అన్ని పార్టీలు ఈ అంశాన్ని ముందుగానే తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని కోరారు. కొలంబియా యూనివర్సిటీలో ప్రస్తుతం పనగరియా ఆర్థిక శాస్త్ర అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల (పీఎస్‌బీ) ప్రైవేటీకరణకు కుంభకోణాలు, మొండి బకాయిలు (ఎన్‌పీఏ) పెరిగిపోవడం అన్న ఒక్క కారణం చాలని ఆయన అభిప్రాయపడ్డారు.
కోర్ బ్యాంకింగ్‌తో స్విఫ్ట్ అనుసంధానం
అన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కోర్ బ్యాంకింగ్ వ్యవస్థను స్విఫ్ట్‌తో అనుసంధానించే కార్యక్రమాన్ని ఏప్రిల్ చివరి నాటికి పూర్తి చేయనున్నట్టు ప్రకటన వెలువడింది. ఈ విధమైన అనుసంధానం లేకపోవడంతో పంజాబ్ నేషనల్ బ్యాంకులో కొందరు ఉద్యోగులు నీరవ్‌మోదీ కంపెనీలకు ఎల్‌వోయూల జారీ అంశాన్ని కోర్ బ్యాంకింగ్ (సీబీఎస్) దృష్టికి వెళ్లకుండా స్విఫ్ట్ వ్యవస్థను దుర్వినియోగం చేసిన విషయం తెలిసిందే. ఎల్‌వోయూల జారీ వివరాలను వారు సీబీఎస్‌లో నమోదు చేయలేదు. దీంతో ఈ మోసం చాలా కాలం పాటు బయటపడకుండా కొనసాగింది. ఇక సైబర్ ఇన్సూరెన్‌స కూడా తీసుకోవాలని నిర్ణయం జరిగింది. రిస్క్ నిర్వహణపై జరిగిన ప్రభుత్వరంగ బ్యాంకుల అధికారుల శిక్షణ కార్యక్రమంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
2018-19లో భారత వృద్ధి రేటు 7.3 శాతమే: ఫిచ్
భారత ఆర్థిక వ్యవస్థ రానున్న ఆర్థిక సంవత్సరం (2018-19)లో 7.3 శాతం మేర వృద్ధి చెందుతుందని రేటింగ్ సంస్థ ఫిచ్ పేర్కొంది. తదుపరి ఆర్థిక సంవత్సరం (2019-20)లో ఇది 7.5 శాతానికి పుంజుకుంటుందని అంచనా వెల్లడించింది. మౌలిక రంగంలో పెట్టుబడులు పెరగడం, జీఎస్టీ అమలు వల్ల ఏర్పడిన ఇబ్బందులు తొలగిపోవడం వల్ల ఇది సాధ్యమవుతుందని వివరించింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 6.5% వృద్ధి రేటును నమోదు చేస్తుందని అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణ నివేదికలో ఫిచ్ పేర్కొంది. కేంద్ర గణాంకాల శాఖ అంచనా 6.6% కంటే ఇది తక్కువే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2018-19లో భారత వృద్ధి రేటు 7.3 శాత ంగా అంచనా
ఎప్పుడు : మార్చి 15
ఎవరు : ఫిచ్
మరో ఏడాది ‘ప్రభుత్వ బ్యాంకులు’ నష్టాల్లోనే:ఎస్‌అండ్‌పీ
మొండిబాకీల ప్రక్షాళనలో భాగంగా భారీ కేటాయింపుల కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) మరో ఏడాది పాటు నష్టాలే నమోదు చేసే అవకాశం ఉందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్‌స సంస్థ అంచనా వేసింది. మొత్తం మీద 2019-20 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ రంగం టర్న్ ఎరౌండ్ కాగలదని పేర్కొంది. ప్రధాన వర్ధమాన మార్కెట్ల బ్యాంకులకు అంతర్జాతీయ ఆర్థిక రికవరీ ఎంత మేర తోడ్పడుతుంది అన్న పేరిట రూపొందించిన నివేదికలో ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్‌స ఈ అంశాలు వెల్లడించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)లో ఇటీవలి రూ. 13,000 కోట్ల కుంభకోణం.. భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థలో.. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పారదర్శకత లోపాలు, బలహీన గవర్నెన్‌స ప్రమాణాలను మరోసారి బహిర్గతం చేశాయని పేర్కొంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మరో ఏడాది ‘ప్రభుత్వ బ్యాంకులు’ నష్టాల్లోనే
ఎప్పుడు : మార్చి 21
ఎవరు : ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్
ఎక్కడ : భారత్‌లో
రూ. వెయ్యి కోట్ల మేర బ్యాంకులను ముంచిన కనిష్క్ గోల్డ్
పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ)ను నిండా ముంచేసిన నీరవ్ మోదీ కుంభకోణం ఘటన మరువకముందే... ఇలాంటివే మరిన్ని స్కామ్‌లు పుట్టగొడుగుల్లా వెలుగుచూస్తున్నాయి. తాజాగా చెన్నైకి చెందిన కనిష్క్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బంగారు నగల విక్రయ సంస్థ బ్యాంకులకు వందల కోట్ల రూపాయల మేర కుచ్చుటోపీ పెట్టినట్లు బయటపడింది. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) సహా మొత్తం 14 బ్యాంకులను దాదాపు రూ.825 కోట్ల మేర మోసం చేసినట్లు వెల్లడైంది. కనిష్క్ గోల్డ్‌పై సీబీఐకి ఈ ఏడాది జనవరిలో ఎస్‌బీఐ ఫిర్యాదు చేసింది.
కనిష్క్ గోల్డ్‌కు భూపేష్ కుమార్ జైన్, ఆయన భార్య నీతా జైన్‌లు ప్రమోటర్, డెరైక్టర్లుగా ఉన్నారు. ఈ సంస్థకు ఎస్‌బీఐ నేతృత్వంలోని 14 ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకుల కన్సార్షియం ఇచ్చిన రుణాలన్నీ మొండిబకాయిలుగా మారిపోయాయి. ప్రమోటర్లు నకిలీ డాక్యుమెంట్లతో మోసపూరితంగా రుణాలను పొందారని.. ఆ తర్వాత వాటిని ఎగవేసినట్లు సీబీఐకి ఈ ఏడాది జనవరి 25న ఇచ్చిన ఫిర్యాదులో ఎస్‌బీఐ పేర్కొంది. కనిష్క్ గోల్డ్ రుణం విషయంలో మోసం జరిగినట్లు గతేడాది నవంబర్ 11న తొలిసారిగా రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ)కు ఎస్‌బీఐ తెలియజేసింది.
జాతీయ పౌష్టికాహార మిషన్ ప్రారంభం
మార్చి 8న మహిళాదినోత్సవం సందర్భంగా ‘బేటీ బచావో, బేటీ పఢావో’ పథకాన్ని విస్తరించే ప్రణాళికలో భాగంగా నేషనల్ న్యూట్రిషన్ మిషన్ (ఎన్‌ఎన్‌ఎమ్)ను రాజస్తాన్‌లోని ఝుంఝున్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. బేటీ బచావో, బేటీ పఢావో కార్యక్రమాన్ని 161 జిల్లాల నుంచి దేశవ్యాప్తంగా 640 జిల్లాలకు విస్తరిస్తున్నట్లు మోదీ ప్రకటించారు. లింగవివక్ష లేకుండా అందరూ సమానమనే భావనను సమాజం అలవర్చుకోవాలని పేర్కొన్నారు. బాలికల భ్రూణహత్యలు మనం సిగ్గుపడాల్సిన విషయమన్నారు. ఇంట్లో ఆడపిల్లలను సంరక్షించే బాధ్యతను ఆ బాలిక తల్లి, అత్తగారే తీసుకోవాలని సూచించారు.
అంతకుముందు, కలెక్టర్లతో సంభాషించిన మోదీ.. బేటీ బచావో, బేటీ పఢావో కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న కలెక్టర్లకు సర్టిఫికెట్లు అందజేశారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, సిక్కిం, గుజరాత్, హరియాణా, కశ్మీర్ రాష్ట్రాలకు చెందిన కలెక్టర్లు అవార్డులు అందుకున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతీయ పౌష్టికాహార మిషన్ ప్రారంభం
ఎప్పుడు : మార్చి 8
ఎక్కడ : ఝుంఝున్, రాజస్థాన్
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
421 బిలియన్ డాలర్లకు ఫారెక్స్ నిల్వలు
విదేశీ మారకం నిల్వలు మార్చి 2తో ముగిసిన వారంలో 167.8 మిలియన్ డాలర్ల మేర పెరిగి 420.75 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతకుముందు వారంలో 1.13 బిలియన్ డాలర్ల మేర తగ్గాయి. 2018 ఫిబ్రవరి 9న విదేశీ మారకం నిల్వలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి 421.91 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2017 సెప్టెంబర్‌లో ఫారెక్స్ నిల్వలు తొలిసారిగా 400 బిలియన్ డాలర్ల మార్కును దాటగా, అప్పటి నుంచి హెచ్చు, తగ్గులు చోటు చేసుకుంటున్నాయి.
ఏప్రిల్ 1 నుంచి ఈ-వే బిల్లు అమలు
అంతర్రాష్ట్ర సరకు రవాణా కోసం ఎలక్ట్రానిక్-వే బిల్లును ఏప్రిల్ 1 నుంచి తప్పనిసరి చేయాలని వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి నిర్ణయించింది. పన్ను రిటర్నుల విధానాన్ని మరింత సరళీకరించడంపై సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో జీఎస్టీ మండలి ప్రస్తుత విధానాన్నే మరో 3 నెలలు పొడిగించినట్లు ఆర్థిక మంత్రి జైట్లీ చెప్పారు. వాణిజ్య సంస్థలు ప్రతినెలా జీఎస్టీఆర్-3బీ, జీఎస్టీఆర్-1 అనే 2 రకాల రిటర్నులు ఇస్తున్నాయి. వీటిని సరళీకరించి ఒకే రిటర్ను పత్రాన్ని ఇచ్చే విధానాన్ని తీసుకురావాలని భావించామనీ, సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో ఆ నిర్ణయం వాయిదా పడిందని జైట్లీ చెప్పారు. దీంతో ప్రస్తుతం ఉన్న రిటర్నుల విధానాన్నే జూన్ వరకు పొడిగించినట్లు ఆయన వెల్లడించారు.
కాగా, అంతర్రాష్ట్ర రవాణా కోసం ఈ-వే బిల్లును ప్రభుత్వం ఫిబ్రవరి 1నే అమలు చేయగా ఆ వ్యవస్థలో లోపాలు తలెత్తి సరిగ్గా పనిచేయలేదు. దీంతో తప్పులను సరిదిద్ది అంతర్రాష్ట్ర సరకు రవాణా కోసం ఏప్రిల్ 1 నుంచి ఈ-వే బిల్లులను మళ్లీ తప్పనిసరి చేయాలని జీఎస్టీ మండలి నిర్ణయించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఈ-వే బిల్లు
ఎప్పుడు : ఏప్రిల్ 1 నుంచి అమలు
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎవరు : జీఎస్టీ మండలి
జనవరిలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 7.5 శాతం
ఆర్థిక వ్యవస్థ పురోగతికి సంబంధించి మార్చి 12న కేంద్రం గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి జనవరిలో 7.5 శాతంగా నమోదయి్యంది (డిసెంబర్‌లో 7.1 శాతం). 2017 జనవరిలో 3.5 శాతం. అయితే పారిశ్రామిక ఉత్పత్తి జనవరిలో భారీగా పెరిగినా, ఆర్థిక సంవత్సరం మొదటి నుంచీ ఇప్పటి వరకూ చూస్తే, నిరాశలోనే ఉంది. వృద్ధి రేటు 5 శాతం నుంచి 4.1 శాతానికి పడిపోయింది. ఇక వినియోగ ధరల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్ట స్థాయిలో 4.4 శాతంగా నమోదయి్యంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జనవరిలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 7.5 శాతం
ఎప్పుడు : మార్చి 12
ఎవరు : కేంద్ర గణాంకాల కార్యాలయం
ఎల్‌వోయూల జారీపై నిషేధం విధించిన ఆర్బీఐ
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)లో రూ. 13,000 కోట్ల మేర లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్ (ఎల్‌వోయూ) కుంభకోణం జరిగిన నేపథ్యంలో బ్యాంకులు ఎల్‌వోయూలు జారీ చేయడాన్ని నిషేధిస్తూ ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసింది. వాణిజ్య రుణాలకు సంబంధించి బ్యాంకులు.. ఎల్‌వోయూలు, లెటర్స్ ఆఫ్ కంఫర్ట్ (ఎల్‌వోసీ)ల జారీ చేయడాన్ని తక్షణమే నిలిపివేయాలని నిర్ణయించింది. అయితే, దిగుమతులకు సంబంధించి వివిధ సంస్థల రుణ అవసరాల కోసం లెటర్స్ ఆఫ్ క్రెడిట్, బ్యాంక్ గ్యారంటీల జారీని బ్యాంకులు యథాప్రకారం కొనసాగించవచ్చు.
పీఎన్‌బీ అధికారులతో కుమ్మకై ్క తీసుకున్న ఎల్‌వోయూల ఆధారంగా వజ్రాభరణాల వ్యాపారులు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ.. దాదాపు రూ. 13,000 కోట్ల కుంభకోణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రస్తుతం సీబీఐ, ఈడీ సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. నీరవ్ మోదీ 2011 మార్చి నుంచి దాదాపు 1,212 ఎల్‌వోయూలు తీసుకున్నాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బ్యాంకులు ఎల్‌వోయు లు జారీ చేయడంపై నిషేధం
ఎప్పుడు : మార్చి 13
ఎవరు : ఆర్బీఐ
టీబీ ఫ్రీ ఇండియా ఉద్యమం ప్రారంభం
క్షయ వ్యాధి రహిత భారత్‌ను సాధించే దిశగా టీబీ ఫ్రీ ఇండియా ప్రచార ఉద్యమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మార్చి 13న ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా 2025 నాటికి దేశాన్ని క్షయ రహితంగా మార్చడమే తమ లక్ష్యమని, ఇందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మోదీ స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా 2030 నాటికి టీబీని నియంత్రించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని, కానీ మనదేశంలో ఐదేళ్ల ముందుగానే అంటే 2025 నాటికే దీనిని సాధించాలని నిర్దేశించుకున్నామని చెప్పారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : టీబీ ఫ్రీ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించిన మోదీ
ఎప్పుడు : మార్చి 13
ఎందుకు : 2025 నాటికి క్షయ రహిత భారతే లక్ష్యంగా
భారత్ వృద్ధి రేటు 7.3 శాతం: ప్రపంచ బ్యాంక్
భారత్ వృద్ధి తీరు బాగుందని, వచే ఆర్థిక సంవత్సరం (2018 ఏప్రిల్-2019 మార్చి) భారత్‌వృద్ధి రేటు 7.3 శాతంగా నమోదవుతుందని ప్రపంచబ్యాంక్ అంచనా వేసింది. 2019-20లో ఈ రేటు 7.5 శాతం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 6.7 శాతంగా నమోదయ్యే వీలుందని తెలిపింది. ఈ మేరకు తన ద్వైవార్షిక పబ్లికేషన్‌లో ఈ వివరాలు వెల్లడించింది. డీమోనిటైజేషన్, వస్తు, సేవల పన్ను ప్రభావాల నుంచి భారత్ రికవరీ అవుతుంది కాబట్టి వృద్ధి తీరు కూడా నెమ్మదిగా రికవరీ అవుతుందని పేర్కొంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్ వృద్ధి రేటు 7.3 శాతంగా అంచనా
ఎప్పుడు : 2018-19
ఎవరు : ప్రపంచబ్యాంక్
3వ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 7.2 శాతం
భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు డిసెంబర్ త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్) బాగుంది. 7.2 శాతం వృద్ధి నమోదయి్యంది. మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) వృద్ధి రేటు మూడేళ్ల కనిష్ట స్థాయిలో 5.7 శాతానికి పడిపోగా, రెండవ త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్) కొంచెం కోలుకుని 6.3 శాతంగా నమోదయి్యంది. అయితే ఇప్పుడు ఈ రేటును 6.5 శాతంగా సీఎస్‌ఓ సవరించింది. కీలకమైన వ్యవసాయం, తయారీ, నిర్మాణం, సేవల రంగాల్లో రికవరీ కనిపించడం 3వ త్రైమాసికానికి కలిసి వచ్చింది. భారత్ జీడీపీలో సేవల రంగం వాటా దాదాపు 60 శాతం ఉంటే, తయారీ, వ్యవసాయం రంగాల వాటా దాదాపు చెరి 15 శాతం ఉంది.
మొత్తంగా 6.6 శాతం ఉండొచ్చు...
ఆర్థిక సంవత్సరం మొత్తం మీద (2017 ఏప్రిల్- 2018 మార్చి) భారత్ జీడీపీ వృద్ధి రేటు 6.6 శాతం ఉండే అవకాశం ఉందని ఫిబ్రవరి 28న విడుదల చేసిన గణాంకాల సందర్భంగా కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) పేర్కొంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 3వ త్రైమాసికంలో(అక్టోబర్-డిసెంబర్) జీడీపీ వృద్ధి 7.2 శాతం
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు : కేంద్ర గణాంకాల కార్యాలయం
2018లో భారత వృద్ధి రేటు 7.6 శాతం: మూడీస్
అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ 2018 సంవత్సరానికి భారత్ వృద్ధి రేటును 7.6 శాతంగా అంచనా వేసింది. 2016 నాటి డీమోనిటైజేషన్, 2017లో తీసుకొచ్చిన జీఎస్టీ ప్రతికూల ప్రభావాల నుంచి కోలుకుంటుందని చెప్పటానికి కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయని తన నివేదికలో పేర్కొంది. 2018 సంవత్సరానికి సంబంధించిన వృద్ధి అంచనాలను మార్పు చేయకుండా గతంలో వెల్లడించిన మేరకు 7.6 శాతం నమోదవుతుందని స్పష్టం చేసింది. 2019లో 7.5 శాతంగా ఉంటుందని తెలిపింది. ప్రముఖ వర్ధమాన దేశాల్లో భారత్, ఇండోనేషియా దేశాల వృద్ధి అంచనాలను మాత్రమే మార్పు చేయడం లేదని పేర్కొంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2018లో భారత వృద్ధి రేటు 7.6 శాతంగా అంచనా
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు : మూడీస్
ఆర్థిక నేరగాళ్ల ఆస్తుల వేలానికి ప్రత్యేక చట్టం
వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్‌స అధినేత విజయ్ మాల్యా తరహా ఆర్థిక నేరగాళ్ల ఆటలు కట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ చట్టాన్ని రూపొందించింది. ఇందుకు సంబంధించి ‘ఫ్యుజిటివ్ ఎకనమిక్ అఫెండర్స్ బిల్లు’కు కేంద్ర కేబినెట్ మార్చి 1న ఆమోదముద్ర వేసింది. మోసాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన వారు, రుణం ఎగవేసి అదృశ్యమైన వారికి సంబంధించి అన్ని ఆస్తులను స్వాధీనం చేసుకుని వాటిని వెంటనే విక్రయించే అధికారం ఈ బిల్లు కల్పిస్తుంది. దీంతో నీరవ్ మోదీ తరహా భారీ కుంభకోణాల్లో ఈ చట్టం ప్రకారం ప్రత్యేక కోర్టు అనుమతితో బకాయిలను తక్షణమే రాబట్టుకునేందుకు వీలు పడుతుంది. ఆర్థిక నేరగాళ్లతోపాటు రూ.100 కోట్లకు పైగా రుణ బకాయి పడి విదేశాలకు పారిపోయిన వారికీ ఇదే వరిస్తుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ‘ఫ్యుజిటివ్ ఎకనమిక్ అఫెండర్స్ బిల్లు’కు ఆమోదం
ఎప్పుడు : మార్చి 1
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : ఆర్థిక నేరగాళ్ల ఆస్తులను స్వాధీనం చేసుకొని వేలం వేసేందుకు
అమెరికా నుంచి ఎల్‌ఎన్‌జీ దిగుమతులు
ఇటీవలే అమెరికా నుంచి ముడిచమురు కొనుగోళ్లు ప్రారంభించిన భారత్... తాజాగా ద్రవీకృత సహజ వాయువును (ఎల్‌ఎన్‌జీ) కూడా దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టింది. లూసియానాలోని షెనియర్ ఎనర్జీకి చెందిన సబీన్ పాస్ లిక్విఫాక్షన్ ప్లాంటు నుంచి ఏటా 3.5 మిలియన్ టన్నుల ఎల్‌ఎన్‌జీ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ రంగ దిగ్గజం గెయిల్ ఇండియా కాంట్రాక్టు కుదుర్చుకుంది. 20 ఏళ్ల ఈ డీల్‌లో భాగంగా తొలి కార్గో.. గెయిల్‌కి చెందిన ’మెరీడియన్ స్పిరిట్’ రవాణా నౌక లూసియానా నుంచి భారత్‌కి బయలుదేరింది. ఇది ఈ నెల 28 నాటికి ఇది మహారాష్ట్రలోని దభోల్ టెర్మినల్‌కి చేరుతుందని గెయిల్ తెలిపింది. 2011లో గెయిల్ ఈ ఒప్పందం కుదుర్చుకుంది. భారత్ గతేడాది అక్టోబర్ నుంచే అమెరికా నుంచి చమురు దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమెరికా నుంచి ఎల్‌ఎన్‌జీ దిగుమతులు
ఎప్పుడు : మార్చి 6
ఎవరు : భారత్
రూ. 1,217 కోట్ల చోక్సీ ఆస్తుల అటాచ్
పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ) కుంభకోణం కేసులో గీతాంజలి జెమ్స్, దాని ప్రమోటర్ మెహుల్ చోక్సీలకు చెందిన రూ. 1,217.2 కోట్ల విలువైన 41 ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) అటాచ్ చేసింది. మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద ఈ ఆస్తుల్ని అటాచ్ చేశారు. ఈ ఆస్తుల్లో ముంబైలోని 15 ఫ్లాట్లు, 17 కార్యాలయ ప్రాంగణాలు, కోల్‌కతాలోని ఒక మాల్, అలీబాగ్‌లోని 4 ఎకరాల ఫాంహౌస్, నాసిక్, నాగ్‌పూర్, తమిళనాడులోని విల్లుపురంలోని 231 ఎకరాల భూమి ఉన్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రూ. 1,217 కోట్ల చోక్సీ ఆస్తుల అటాచ్
ఎప్పుడు : మార్చి 1
ఎవరు : ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్
ఎందుకు : పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో
మహిళా సురక్షిత నగరాలకు 2,900 కోట్లు
నగరాలను మహిళలకు సురక్షితంగా మార్చేందుకు కేంద్రం రూ.2,900 కోట్లు కేటాయించింది. ఇందుకోసం ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, లక్నోలను ఎంపిక చేసింది. మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. నిర్భయ నిధుల్లో నుంచి ఖర్చు చేయనున్న మొత్తం రూ.2,919.55 కోట్లలో ఢిల్లీకి రూ.663.67 కోట్లు, ముంబైకి రూ.252 కోట్లు, బెంగళూరుకు రూ.667 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో వీడియో పర్యవేక్షణ,ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు, వీడియో ఫీడ్ షేరింగ్ ఉన్న పెట్రోలింగ్ వ్యాన్‌లను, మహిళా పోలీస్ స్టేషన్లను ఏర్పాటుచేస్తారు.
ఇకపై 45 కేజీల యూరియా బస్తాలు
యూరియా వినియోగం తగ్గించేందుకు, ఎరువుల వినియోగంలో సమతూకం పాటించే లక్ష్యంతో ఇకపై యూరియా బస్తాల్ని 50 కేజీలు కాకుండా 45 కేజీల్లో విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 45 కేజీల బస్తాల అమ్మకం మార్చి 1, 2018 నుంచే అమల్లోకి వచ్చిందని, అయితే ఇప్పటికే అందుబాటులో ఉన్న 50 కేజీల బస్తాల్ని వచ్చే రెండు నెలలు అమ్ముకునేందుకు అనుమతిస్తామని ఎరువుల శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. హెక్టారు పొలానికి బస్తాల లెక్కన యూరియాను రైతులు వాడుతున్నారని, వినియోగం తగ్గించమని చెప్పినా వినడం లేదని.. అందువల్లే 45 కేజీల బస్తాల్ని విక్రయిస్తున్నామని ఆయన చెప్పారు. పన్నులు జతచేయకుండా 45 కేజీల యూరియా బస్తాను రూ. 242కు విక్రయిస్తారని నోటిఫికేషన్‌లో ప్రభుత్వం వెల్లడించింది. టన్ను యూరియాకు ప్రభుత్వం నిర్ణయించి న రూ. 5360 ధరకు అనుగుణంగా బస్తా రేటును నిర్ణయిస్తున్నారు. కాగా 25 కేజీలకు మించకుండా బస్తాల్ని విక్రయించేందుకు డీలర్లకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే ప్యాకింగ్ కోసం 2 కేజీల యూరియాకు రూ. 1.50, 5 కేజీలకు రూ.2.25, 10 కేజీలకు రూ. 3.50, 25 కేజీలకు రూ. 5లు డీలర్లు వసూలు చేసుకోవచ్చు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : యూరియా బస్తాలు ఇకపై 45 కేజీల్లోనే
ఎప్పుడు : మార్చి 5
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : యూరియా వినియోగం తగ్గించేందుకు, ఎరువుల వినియోగంలో సమతూకం పాటించే లక్ష్యంతో
2018-19లో భారత వృద్ధి 7.5 శాతం: క్రిసిల్
2018-19 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 7.5 శాతానికి చేరుకుంటుందని ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ అంచనా వేసింది. దేశీయ వినియోగం, విధానాల పరంగా ప్రోత్సాహం, అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి సానుకూల అంశాలని తన నివేదికలో తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2017-18) మాత్రం జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతంగా ఉంటుందని క్రిసిల్ పేర్కొంది. రానున్న ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 7 - 7.5 శాతం వరకు ఉండొచ్చని 2018 ఆర్థిక సర్వే సైతం పేర్కొంది.
ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో 10.5 శాతానికి చేరిన స్థూల ఎన్‌పీఏల అంశాన్ని పరిష్కరించకుండా స్థిరమైన ఆర్థికవృద్ధి సాధ్యం కాదని క్రిసిల్ అభిప్రాయపడింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2018-19లో భారత వృద్ధి 7.5 శాతంగా అంచనా
ఎప్పుడు : మార్చి 5
ఎవరు : క్రిసిల్
2016-2017లో రూ.81,683 కోట్ల రైటాఫ్: జైట్లీ
2016-17 ఆర్థిక సంవత్సరంలో మొత్తం పీఎస్‌బీలు(ప్రభుత్వ రంగ బ్యాంకులు) రూ.81,683 కోట్ల విలువైన రుణాలను మాఫీ (రైటాఫ్) చేసినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మార్చి 6న రాజ్యసభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, బ్యాంకులు పన్ను ప్రయోజనాల కోసం, అదేవిధంగా మూలధన సద్వినియోగం కోసం బ్యాలెన్‌స షీట్ రైటాఫ్ కింద చూపిస్తాయని... సంబంధిత రుణ గ్రహీతలు ఈ బకాయిలను తిరిగి చెల్లించాల్సిందేనని జైట్లీ స్పష్టం చేశారు.
ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రూ.20,339 కోట్ల విలువైన రుణాలను రైటాఫ్ చేసినట్లు జైట్లీ తెలియజేశారు. కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో (2017-18) సెప్టెంబర్ వరకూ పీఎస్‌బీలు రూ.28,781 కోట్ల రుణాలను రైటాఫ్ చేశాయి. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం నాలుగేళ్లకు పైబడిన మొండి బకాయిలను (పూర్తిస్థాయిలో ప్రొవిజనింగ్ చేసిన వాటితో సహా) బ్యాంకులు వాటి బ్యాలెన్‌స షీట్‌ల నుంచి తొలగిస్తాయి. దీన్నే సాంకేతికంగా రైటాఫ్ కింద పరిగణిస్తారు.
బ్యాంకింగ్ మోసాలుః రూ.52,717 కోట్లు
గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో (2013 ఏప్రిల్ 1 నుంచి) బ్యాంకింగ్ రంగ మోసాలకు సంబంధించి 13,643 కేసులు వెలుగుచూశాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ ప్రతాప్ శుక్లా పార్లమెంటులో చెప్పారు. ఈ మోసాల విలువ రూ.57,717 కోట్లుగా ఆయన తెలిపారు. ఇక బినామీ చట్టం-2018 కింద ఇప్పటివరకూ వెయి్యకిపైగా ఆస్తులను ప్రాథమికంగా జప్తు (అటాచ్) చేసినట్లు మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వీటి విలువ రూ.3,800 కోట్లకు పైగానే ఉంటుందని శుక్లా వివరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2016-2017లో రూ.81,683 కోట్ల రైటాఫ్
ఎప్పుడు : మార్చి 6
ఎవరు : ప్రభుత్వ రంగ బ్యాంకులు

Published date : 15 Mar 2018 12:56PM