జనవరి 2019 ఎకానమీ
Sakshi Education
క్యూ3లో రిలయన్స్ 10 వేల కోట్ల లాభాలు ప్రకటన
2018-19 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(క్యూ3)లో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.10,251 కోట్ల లాభాలను ప్రకటించింది. క్యూ3లో నికర లాభం 8.8 శాతం వృద్ధితో రూ.10,251 కోట్ల లాభాలను పొందినట్టు ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ ముకేశ్ అంబానీ జనవరి 17న వెల్లడించారు. దీంతో ఒక త్రైమాసికంలో రూ. 10,000 కోట్ల పైగా లాభం నమోదు చేసిన తొలి భారతీయ ప్రైవేట్ కంపెనీగా రిలయన్స్ నిలిచింది.
ఇప్పటిదాక ప్రభుత్వ రంగంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) మాత్రమే ఒక క్వార్టర్‌లో రూ.10 వేల కోట్లకు మించి లాభాలు ప్రకటించింది. 2013 జనవరి-మార్చి త్రైమాసికంలో ఐవోసీ రూ.14,513 కోట్ల నికర లాభం నమోదు చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2018-19 క్యూ3లో 10 వేల కోట్ల లాభాలు ప్రకటన
ఎప్పుడు : జనవరి 17
ఎవరు : రిలయన్స్ ఇండస్ట్రీస్
భారత కుబేరుల సంపద రోజుకు 2200 కోట్లు
భారత కుబేరుల సంపద 2018లో రోజుకు రూ.2,200 కోట్లు చొప్పున పెరిగిందని అంతర్జాతీయ హక్కుల సంఘం ఆక్స్‌ఫామ్ వెల్లడించింది. ఈ మేరకు జనవరి 21న ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం భారత్‌లో అత్యంత ఐశ్వర్యవంతుల సంపద 39 శాతం వృద్ధి చెందగా, జనాభాలో సగ భాగం సంపద 3 శాతమే పెరిగింది. అలాగే ప్రపంచ కుబేరుల సంపద 12 శాతం లేదా రోజుకు 250 కోట్ల డాలర్ల మేర ఎగసింది. ప్రపంచంలోని పేదల సంపద మాత్రం 11 శాతం క్షీణించింది.
ఆక్స్‌ఫామ్ సంస్థ నివేదికలోని అంశాలు...
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత కుబేరుల సంపద రోజుకు 2200 కోట్లు
ఎప్పుడు : జనవ 21
ఎవరు : ఆక్స్‌ఫామ్ సంస్థ
భారత వృద్ధి రేటు 7.5 శాతం : ఐఎంఎఫ్
2019లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7.5 శాతం, 2020లో 7.7 శాతంగా నమోదవుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వెల్లడించింది. తద్వారా భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే వేగవంతమైన అభివృద్ధిని సాధిస్తున్న దేశంగా నిలుస్తుందని పేర్కొంది. ఈ మేరకు ఐఎంఎఫ్ మొట్టమొదటి మహిళా చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్ జనవరి 21న నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2019, 2020ల్లో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 3.5, 3.6 శాతాలుగా ఉంటాయి. ఈ రెండు సంవత్సరాల్లో చైనా ఆర్థిక వృద్ధి రేటు 6.2 శాతంగా ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7.5 శాతం
ఎప్పుడు : 2019
ఎవరు : అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)
తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న పియూష్ గోయల్
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అనారోగ్యం కారణంగా ప్రస్తుతం విదేశాల్లో ఉన్నందున, ఆర్థిక శాఖ బాధ్యతలను తాత్కాలికంగా పియూష్ గోయల్‌కు ప్రభుత్వం కేటాయించింది. దాంతో కేంద్ర తాత్కాలిక బడ్జెట్‌ను ఫిబ్రవరి 1వ తేదీన గోయల్ ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం పియూష్ గోయల్ రైల్వే, బొగ్గు శాఖల మంత్రిగా ఉండగా, ఇప్పుడు ఆయనకు ఆర్థిక శాఖ బాధ్యతలను అదనంగా ఇచ్చారు. గతేడాది జైట్లీ మూత్రపిండ మార్పిడి చికిత్స చేయించుకున్నప్పడు కూడా ఆర్థిక శాఖ తాత్కాలిక మంత్రిగా వంద రోజులపాటు గోయల్ ఉన్నారు. ఈసారి తాత్కాలిక బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి సరిగ్గా 9 రోజుల ముందు ఆర్థిక శాఖ బాధ్యతలు గోయల్‌కు దక్కడం గమనార్హం. జైట్లీ తిరిగి బాధ్యతలు చేపట్టే వరకు గోయల్ ఆర్థిక మంత్రిగా కొనసాగుతారనీ, జైట్లీ మంత్రిగా కొనసాగనున్నప్పటికీ ఆయనకు ఏ శాఖలూ ఉండవని రాష్ట్రపతి భవన్ నుంచి విడుదలైన ఒక ప్రకటనను జనవరి 23న ప్రభుత్వం వెల్లడించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: కేంద్ర తాత్కాలిక బడ్జెట్
ఎప్పుడు: ఫిబ్రవరి 1
ఎవరు: పియూష్ గోయల్
ఎక్కడ: లోక్‌సభ
చిన్న వ్యాపారులకు జీఎస్‌టీ మినహాయింపు
చిన్న వ్యాపారులకు వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ)లో మినహాయింపు కల్పించాలని జనవరి 10న జీఎస్‌టీ కౌన్సిల్ నిర్ణయించింది. ఇప్పటి వరకు రూ.20 లక్షల వరకు వార్షిక వ్యాపారంపై జీఎస్‌టీ మినహాయింపు ఉండగా దీన్ని రూ.40 లక్షలకు పెంచింది. పర్వత ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ పరిమితి రూ.10 లక్షలుగా ఉండగా, ఇకపై రూ.20లక్షలు చేసింది.
మరోవైపు వరదలతో దెబ్బతిన్న కేరళకు అంతర్రాష్ట్ర రవాణాపై రెండేళ్ల పాటు ఒక శాతం విపత్తు సెస్సును విధించుకునే అవకాశాన్ని జీఎస్‌టీ కౌన్సిల్ కల్పించింది. అలాగే ఒక శాతం పన్ను చెల్లించే కాంపోజిషన్ స్కీమ్ టర్నోవర్ పరిమితిని రూ.1.5 కోట్లు చేయాలని గతంలోనే నిర్ణయించగా... ఇది 2019, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చిన్న వ్యాపారులకు జీఎస్‌టీ మినహాయింపు
ఎప్పుడు : జనవరి 10
ఎవరు : జీఎస్‌టీ కౌన్సిల్
భారత్‌కు నిధుల సాయం పెంపు : ఏడీబీ
భారత్‌కు ఇచ్చే నిధుల సాయాన్ని 2019లో 4.5 బిలియన్ డాలర్ల(రూ.31,500 కోట్లు)కు పెంచనున్నట్టు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) జనవరి 11న ప్రకటించింది. ఇందులో 3.5 బిలియన్ డాలర్లు భారత ప్రభుత్వానికి, మరో బిలియన్ డాలర్లు ప్రైవేటు రంగానికి ఇవ్వనున్నట్లు పేర్కొంది. మరోవైపు భారత ఆర్థిక వ్యవస్థ 2018-19 ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం వృద్ధిని, 2019-20లో 7.6 శాతం వృద్ధిని నమోదుచేస్తుందని ఏడీబీ అంచనా వేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2019లో భారత్‌కు ఇచ్చే నిధుల సాయం పెంపు
ఎప్పుడు : జనవరి 11
ఎవరు : ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ)
ఐటీ ఫైలింగ్ ప్రాజెక్ట్‌కు కేబినెట్ ఆమోదం
ఆదాయపు పన్ను (ఐటీ) ఫైలింగ్ ప్రాజెక్ట్(ఈ ఫైలింగ్ అండ్ సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ 2.0 ప్రాజెక్టు)కు జనవరి 16న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.4,242 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు డెవలపర్‌గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ (ఐటీ) ఇన్ఫోసిస్‌ను ప్రభుత్వం ఎంపికచేసింది. ఐటి ఫైలింగ్ ప్రాజెక్టు ద్వారా ఆదాయపు పన్ను రిటర్న్‌లను ప్రాసెస్ చేసే సమయం 63 రోజుల నుంచి 24 గంటలకు తగ్గిపోతుంది.
నుమాలిగఢ్ రిఫైనరీ విస్తరణకు రూ.22,594 కోట్లు
అస్సోంలోని నుమాలిగఢ్ రిఫైనరీ విస్తరణకు కేంద్ర క్యాబినెట్ రూ.22,594 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టు ద్వారా పారాదీప్(ఒడిస్సా) నుంచి నుమాలిగఢ్‌కు క్రూడ్ ఆయిల్ పైప్‌లైన్‌ను నిర్మిస్తారు. నుమాలిగఢ్ నుంచి సిలిగురి (పశ్చిమ బెంగాల్) వరకూ ప్రొడక్ట్ పైప్‌లైన్ ఏర్పాటవుతుంది. 1999లో నెలకొల్పిన ఈ రిఫైనరీలో భారత్ పెట్రోలియం(బీపీసీఎల్)కు 61.65 శాతం వాటా ఉంది.
మరోవైపు ప్రభుత్వరంగంలోని ఎగ్జిమ్ బ్యాంక్ (ఎక్స్‌పోర్ట్- ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) తాజా మూలధనంగా రూ.6,000 కోట్లు కేటాయించడానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. బ్యాంక్ అధీకృత మూలధనాన్ని రూ.10,000 కోట్ల నుంచి రూ.20,000 కోట్లకు పెంచడానికి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐటీ ఫైలింగ్ ప్రాజెక్ట్‌కు ఆమోదం
ఎప్పుడు : జనవరి 16
ఎవరు : కేంద్ర కేబినెట్
అతి పెద్ద మ్యూచువల్ ఫండ్ కంపెనీగా హెచ్‌డీఎఫ్‌సీ
దేశంలో అతి పెద్ద మ్యూచువల్ ఫండ్ కంపెనీగా హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ నిలిచిందని ఆంఫి (అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్‌స ఇన్ ఇండియా) వెల్లడించింది. దీనికి సంబంధించిన నివేదికను జనవరి 3న విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం హెచ్‌డీఎఫ్‌సీ ఎమ్‌ఎఫ్ రూ.3.35 లక్షల కోట్ల నిర్వహణ ఆస్తులతో మొదటిస్థానంలో ఉండగా రూ.3.08 లక్షలతో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ రెండో స్థానంలో నిలిచింది. అలాగే రూ.2.64 లక్షల కోట్ల నిర్వహణ ఆస్తులతో ఎస్‌బీఐ ఎమ్‌ఎఫ్ మూడో స్థానం పొందగా ఆ తర్వాతి స్థానాల్లో ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఎమ్‌ఎఫ్(రూ.2.42 లక్షల కోట్లు), రిలయన్స్ ఎమ్‌ఎఫ్(రూ.2.36 లక్షల కోట్లు)లు ఉన్నాయి. మొత్తం మీద అన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థల నిర్వహణ ఆస్తులు రూ.23.61 లక్షల కోట్లుగా ఉన్నాయని నివేదిక పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అతి పెద్ద మ్యూచువల్ ఫండ్ కంపెనీగా హెచ్‌డీఎఫ్‌సీ
ఎప్పుడు : జనవరి 3
ఎవరు : ఆంఫి (అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్‌స ఇన్ ఇండియా)
ఎక్కడ : దేశంలో
భారత్ జీడీపీ వృద్ధి 7.3 శాతం : ప్రపంచబ్యాంక్
భారత్ 2018-19 ఆర్థిక సంవత్సరంలో (జీడీపీ) 7.3 శాతం, 2019-20లో 7.5 శాతం వృద్ధి సాధిస్తుందని ప్రపంచబ్యాంక్ వెల్లడించింది. ఈ మేరకు జనవరి 9న ‘‘2019 గ్లోబల్ ఎకనమిక్ ప్రాస్పెక్ట్స్’’ నివేదికను విడుదల చేసింది. మరోవైపు చైనా 2018-19లో 6.5 శాతం, 2019-20లో 6.2 శాతం వృద్ధిని నమోదుచేస్తుందని ప్రపంచబ్యాంకు తన నివేదికలో పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ జీడీపీ వృద్ధి 7.3 శాతం
ఎప్పుడు : 2018-19 ఆర్థిక సంవత్సరంలో
ఎవరు : ప్రపంచబ్యాంకు
మూడవ అతిపెద్ద వినిమయ దేశంగా భారత్
2030నాటికి అమెరికా, చైనాల తర్వాత భారత్ మూడవ అతిపెద్ద వినిమయ దేశంగా అవతరించనుందని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) జనవరి 9న వెల్లడించింది. ప్రస్తుతం భారత్ వినియోగం 1.5 ట్రిలియన్ డాలర్లు ఉండగా 2030 నాటికి ఈ విలువ 6 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని డబ్ల్యూఈఎఫ్ అంచనా వేసింది. ప్రస్తుతం భారత్ వ్యయాలకు సంబంధించి ప్రపంచంలో ఆరవ దేశంగా కొనసాగుతోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2030నాటికి మూడవ అతిపెద్ద వినిమయ దేశంగా భారత్
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్
ఆర్‌బీఐ నిల్వల నిర్వహణపై బిమల్ కమిటీ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వద్ద ఉన్న నగదు నిల్వల నిర్వహణపై (ఎకనమిక్ కమిటీ ఫ్రేమ్‌వర్క్) బిమల్ జలాన్ కమిటీని నియమిస్తూ డిసెంబర్ 26న కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఆరుగురు సభ్యులు ఉన్న ఈ కమిటీకి ఆర్‌బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వం వహించనున్నారు. అలాగే కమిటీ వైస్ చైర్మన్‌గా ఆర్థిక వ్యవహారాల మాజీ కార్యదర్శి రాకేష్ మోహన్, సభ్యులుగా ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్, ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ఎన్‌ఎస్ విశ్వనాథన్, భరత్ దోషి, సుధీర్ మన్కడ్ సభ్యులుగా ఉండనున్నారు.
ఆర్‌బీఐ వద్ద నగదు నిల్వలు ఎంత స్థాయిలో ఉండాలన్న అంశంపై బిమల్ కమిటీ ప్రధానంగా దృష్టి సారిస్తుంది. సమావేశమయిన నాటి నుంచీ 90 రోజుల్లో ఈ కమిటీ నివేదికను సమర్పిస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలను పరిశీలించి సెంట్రల్ బ్యాంక్ వద్ద నిధులు ఏ మేరకు ఉండాలి? మిగిలిన నిధుల బదలాయింపు ఎలా వంటి అంశాలపై కమిటీ నివేదికను రూపొందిస్తుంది.
గతంలో కమిటీలు ఇలా...
గతంలోనూ ఆర్‌బీఐ నిల్వలపై మూడు కమిటీలు ఏర్పాటయ్యాయి. వి.సుబ్రమణ్యం (1997), ఉషా థోరట్ (2004), వెహైచ్ మాలేగామ్ (2013) ఈ కమిటీలకు నేతృత్వం వహించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆర్‌బీఐ నిల్వల నిర్వహణపై బిమల్ జలాన్ కమిటీ
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : కేంద్రప్రభుత్వం
ఆరు ప్రభుత్వ సంస్థల ఐపీఓకు ఆమోదం
ఆరు ప్రభుత్వ రంగ సంస్థలు త్వరలో ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు రావడానికి ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపిందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ డిసెంబర్ 28న వెల్లడించారు. అలాగే కుద్రేముఖ్ ఐరన్ ఓర్ కంపెనీ (కేఐఓసీఎల్) ఫాలో ఆన్ ఆఫర్‌కు (ఎఫ్‌పీఓ) కూడా సీసీఈఏ ఆమోదం తెలిపినట్లు వివరించారు. ఈ ఆరు పీఎస్‌యూలను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయడం వల్ల వాటి విలువ పెరుగుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు.
ఐపీఓకు రానున్న ఆరు పీఎస్‌యూలు....
- రైల్ టెల్ కార్పొరేషన్ ఇండియా
- టెలికమ్యూనికేషన్ కన్సల్టెంట్స్(ఇండియా) (టీసీఐఎల్)
- నేషనల్ సీడ్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎస్‌సీ)
- తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీహెచ్‌డీసీఐఎల్,)
- వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (ఇండియా)
- ఎఫ్‌సీఐ ఆరావళి జిప్సమ్ అండ్ మినరల్స్ (ఇండియా)(ఎఫ్‌ఏజీఎమ్‌ఐఎల్)
మరోవైపు కేంద్ర ప్రభుత్వ సంస్థల లిస్టింగ్ అర్హత నిబంధనలను కేంద్రం ప్రభుత్వం మరింతగా విస్తరించింది. వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాల్లో నికర లాభం సాధించిన సీపీఎస్‌యూలు స్టాక్ ఎక్స్చేంజ్‌ల్లో లిస్టింగ్‌కు అర్హత పొందుతాయని స్పష్టంచేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆరు ప్రభుత్వ సంస్థల ఐపీఓకు ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు : ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ
మొండి బకాయిలు పది లక్షల కోట్లు : ఆర్ బీఐ
2017-18 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ రంగంలోని స్థూల మొండి బకాయిలు (ఎన్‌పీఏ) 11.2 శాతం అంటే రూ.10.39 లక్షల కోట్లకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వెల్లడించింది. ఈ మేరకు ‘2017-18లో బ్యాంకింగ్ రంగ ధోరణులు, ప్రగతి’ పేరుతో డిసెంబర్ 28న ఒక నివేదికను విడుదల చేసింది.
ఆర్‌బీఐ నివేదిక ప్రకారం ప్రస్తుతం ఉన్న రూ.10.39 లక్షల కోట్ల ఎన్ పీఏల్లో ప్రభుత్వరంగ బ్యాంకుల (పీఎస్‌బీలు) వాటా రూ.8.95 లక్షల కోట్ల వరకు ఉంది. జెమ్స్, జ్యుయలరీ రంగం నుంచి ఎన్‌పీఏలు ఎక్కువగా ఉన్నాయి. 2016-17 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి స్థూల ఎన్‌పీఏల శాతం 9.3గా ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మొండి బకాయిలు పది లక్షల కోట్లు
ఎప్పుడు : 2017-18 ఆర్థిక సంవత్సరంలో
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
మూడు బ్యాంకుల విలీనానికి కేబినెట్ ఆమోదం
బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ)లో విజయ బ్యాంక్, దేనా బ్యాంక్‌ల విలీన ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ జనవరి 2న ఆమోదం తెలిపింది. 2019, ఏప్రిల్ 1 నుంచి ఈ మూడు బ్యాంకుల విలీనం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది. దీంతో ప్రభుత్వ రంగంలోని బ్యాంకుల సంఖ్య 19కి తగ్గనుంది. విలీనానంతరం ఏర్పడే కొత్త బ్యాంక్ రూ.14.82 లక్షల కోట్ల వ్యాపార పరిమాణంతో ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ తర్వాత దేశంలోనే మూడో అతి పెద్ద బ్యాంక్‌గా అవతరించనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బీవోబీలో విజయ బ్యాంక్, దేనా బ్యాంక్‌ల విలీనానికి ఆమోదం
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : కేంద్ర కేబినెట్
చిన్న పరిశ్రమల వృద్ధిపై సిన్హా కమిటీ
లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) అభివృద్ధిపై సలహాలు ఇచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) జనవరి 2న యూకే సిన్హా కమిటీని ఏర్పాటుచేసింది. ఎనిమిది మంది సభ్యులతో ఏర్పాటు చేసిన ఈ కమిటీకి మార్కెట్ రెగ్యులేటర్ సెబీ మాజీ చైర్మన్ యూకే సిన్హా నేతృత్వం వహించనున్నారు. ఈ కమిటీ 2019 జూన్ నాటికి తన నివేదికను సమర్పిస్తుంది. ఎంఎస్‌ఎంఈ రంగానికి సంబంధించి ఆర్థిక, ద్రవ్య స్థిరత్వానికి దీర్ఘకాలిక సూచనలను కమిటీ చేయనుంది. మొత్తం ఎగుమతుల్లో ఎంఎస్‌ఎంఈ వాటా 40 శాతం కాగా తయారీ రంగంలో ఈ విభాగం వాటా 45 శాతంగా ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : చిన్న పరిశ్రమల వృద్ధిపై యూకే సిన్హా కమిటీ ఏర్పాటు

- భారత జాతీయ సంపదలో 77.4 శాతం 10 శాతం అత్యంత ధనికుల చేతుల్లోనే ఉంది. 1 శాతం కుబేరుల చేతుల్లోనే 52 శాతం జాతీయ సంపద ఉంది.
- జనాభాలోని 60 శాతం మంది చేతిలో కేవలం 4.8 శాతం సంపద మాత్రమే ఉంది.
- 9 మంది అత్యంత సంపన్నుల సంపద దేశ జనాభాలోని సగం మంది సంపదతో సమానం.
- 2022 నాటికి భారత్‌లో రోజుకు 70 మంది కొత్త కుబేరులు పుట్టుకొస్తారని అంచనా.
- గత ఏడాది కొత్తగా 18 మంది బిలియనీర్లు అవతరించారు. దీంతో భారత్‌లోని బిలియనీర్ల సంఖ్య 119కు పెరిగింది. వీరందరి సంపద తొలిసారిగా గత ఏడాది 40,000 కోట్ల డాలర్లు(రూ.28 లక్షల కోట్లు)కు పెరిగింది.
- 2017లో 32,550 కోట్లుగా ఉన్న బిలియనీర్ల సంపద గత ఏడాది 44,010 కోట్ల డాలర్లకు పెరిగింది. 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తర్వాత బిలియనీర్ల సంపద ఒక్క ఏడాది ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి.
- డబ్ల్యూఈఎఫ్ గ్లోబల్ జండర్ గ్యాప్‌ఇండెక్స్‌లో భారత ర్యాంక్ 108గాఉంది. 2006తో పోల్చితే ఇది పది స్థానాలు పడిపోయింది.
- సంపన్న భారతీయుల విషయంలో కూడా స్త్రీలు బాగానే వెనకబడి ఉన్నారు. భారత్‌లో మొత్తం 119 మంది కుబేరులుండగా, వీరిలో కేవలం 9 మంది మాత్రమే సంపన్న మహిళలు ఉన్నారు.

Published date : 28 Jan 2019 12:09PM