Wholesale Price Index (WPI): సెప్టెంబర్లో టోకు ద్రవ్యోల్బణం కూల్
గడచిన నాలుగు నెలలుగా టోకు ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తున్నప్పటికీ, 18 నెలల నుంచి రెండంకెల పైన కొనసాగుతోంది. సమీక్షా నెల్లో తయారీ, ఆహారం, ఇంధన ధరలు కొంత దిగివ చ్చాయి. డబ్లు్యపీఐ నెలవారీ తగ్గుదలకు ప్రధానంగా కమోడిటీ ధరలలో నియంత్రణ అని నిపుణులు పేర్కొంటున్నారు. కమోడిటీ ధరలు తగ్గుతాయన్న ధోరణి కూడా వ్యవస్థలో ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. దీనికితోడు రికవరీ ఊపందుకోవడం కూడా సానుకూల అంశమని వారు విశ్లేషిస్తున్నారు. గణాంకాల్లో
Also read: Retail inflation: సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.41%
కీలక విభాగాలు ఇలా...
- ఆహార ఉత్పత్తుల బాస్కెట్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్లో 11.03 శాతంగా ఉంది. ఆగస్టులో ఇది 12.37 శాతం. అయితే కూరగాయల ధరలు మాత్రం 39.66 శాతం పెరిగాయి. ఆగస్టులో ఈ స్పీడ్ 22.29 శాతం. ఆయిల్ సీడ్స్ ద్రవ్యోల్బణం 16.55% తగ్గింది.
- ఇంధనం, విద్యుత్ బాస్కెట్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 32.61 శాతం ఉంటే, ఆగస్టులో ఈ రేటు 33.67 శాతంగా ఉంది.
- ఇక సూచీలో మెజారిటీ వెయిటేజ్ ఉన్న తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 6.34 శాతంగా ఉంది.
టోకు ద్రవ్యోల్బణం ఇలా
నెల శాతం
2022 జనవరి 12.96
ఫిబ్రవరి 13.11
మార్చి 14.55
ఏప్రిల్ 15.08
మే 15.88
జూన్ 15.18
జూలై 13.93
ఆగస్టు 12.41
సెప్టెంబర్ 10.70
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP