GST Collections: ఆగస్టులో GST వసూళ్లు 28% అప్
వ్యవస్థలో డిమాండ్ పెరుగుదల, రేట్ల పెంపు, సరళతర పన్ను విధానాలు, ఎగవేతల నిరోధానికి చర్యలు దీనికి కారణం. జీఎస్‌టీ వసూళ్లు రూ.1.4 లక్షల కోట్ల స్థాయిని దాటడం ఇది వరుసగా ఆరవనెల. పండుగల సీజన్ నేపథ్యంలో ఈ ధోరణి కొనసాగుతుందని భావిస్తున్నారు. మొత్తం వసూళ్లలో సెంట్రల్ జీఎస్‌టీ వాటా రూ.24,710 కోట్లు. స్టేట్ జీఎస్‌టీ రూ.30,951 కోట్లు. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.77,782 కోట్లు. సెస్ రూ.10,168 కోట్లు. కాగా, ఆగస్టు వసూళ్లు జూలై విలువ (రూ.1.49 లక్షల కోట్లు) కన్నా తక్కువ. ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో రూ.1.67 లక్షల కోట్ల వసూళ్లు జరిగాయి.
Also read: Quiz of The Day (August 27, 2022): జి.ఎస్.టి. కౌన్సిల్‌కు చైర్మన్‌గా వ్యవహరించేది ఎవరు?
2022 జనవరి నుంచి ఇలా...
నెల జీఎస్‌టీ ఆదాయం (రూ.కోట్లలో)
జనవరి 1,40,986
ఫిబ్రవరి 1,33,026
మార్చి 1,42,095
ఏప్రిల్ 1,67,650
మే 1,40,885
జూన్ 1,44,616
జూలై 1,48,995
ఆగస్టు 1,43,612
Also read: RBI Statistics : పటిష్ట బాటన భారత్ ఎకానమీ..!
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP