Ministry of Finance: ఏ కంపెనీలను పీఎస్‌ఈలు కొనుగోలు నిషిద్ధం?
ప్రైవేటీకరణకు వచ్చే ప్రభుత్వరంగ కంపెనీలను మరే ఇతర ప్రభుత్వరంగ సంస్థ కొనుగోలు చేయకుండా కేంద్ర ఆర్థిక శాఖ నిషేధాన్ని విధించింది. యాజమాన్య నియంత్రణ ఒక ప్రభుత్వరంగ సంస్థ నుంచి మరో ప్రభుత్వరంగ సంస్థలకు బదిలీ అయితే, సహజసిద్ధంగా ఉన్న అసమమర్థతలన్నవి కొనసాగొచ్చని.. ఇది నూతన ప్రభుత్వరంగ సంస్థల (పీఎస్‌ఈ) విధానానికి విరుద్ధమని పేర్కొంది. గతంలో ఆర్‌ఈసీలో తన వాటాలను పీఎఫ్‌సీకి విక్రయించడం తెలిసిందే. అలాగే, హెచ్‌పీసీఎల్‌లో వాటాలను ఓఎన్‌జీసీకి కట్టబెట్టింది.
International Monetary Fund: ప్రపంచంలో వేగవంతమైన ఎకానమీ కలిగిన దేశం?
ఈవీఎస్‌ఈల టెస్టింగ్ ముసాయిదా విధానం విడుదల
దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో బ్యాటరీల మార్పిడి వ్యాపారాలకు సంబంధించి ముసాయిదా విధానాన్ని నీతి ఆయోగ్ విడుదల చేసింది. స్వాపింగ్ కేంద్రాల ఏర్పాటుకు అవసరమయ్యే పత్రాల దాఖలు, ట్రేడ్ లైసెన్సుల మంజూరు మొదలైన వాటి కోసం సింగిల్ విండో పోర్టల్ ఏర్పాటు చేయాలని ఇందులో ప్రతిపాదించింది. అలాగే, స్వాపింగ్ స్టేషన్లలో ఉపయోగించే ఎలక్ట్రిక్ వాహన సరఫరా పరికరాల (ఈవీఎస్‌ఈ) టెస్టింగ్ పటిష్టంగా ఉండాలని పేర్కొంది.
GK Important Dates Quiz: ప్రపంచ పిచ్చుకల దినోత్సవం ఎప్పుడు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రైవేటీకరణకు వచ్చే ప్రభుత్వరంగ కంపెనీలను మరే ఇతర ప్రభుత్వరంగ సంస్థ కొనుగోలు చేయకుండా నిషేధం విధింపు
ఎప్పుడు : ఏప్రిల్ 21
ఎక్కడ : కేంద్ర ఆర్థిక శాఖ
ఎందుకు : యాజమాన్య నియంత్రణ ఒక ప్రభుత్వరంగ సంస్థ నుంచి మరో ప్రభుత్వరంగ సంస్థలకు బదిలీ అయితే, సహజసిద్ధంగా ఉన్న అసమమర్థతలన్నవి కొనసాగొచ్చని..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్