Skip to main content

Loan apps: అక్రమ రుణ యాప్‌లకు చెక్‌!.. ఆర్థిక మంత్రి సీతారామన్‌ నిర్ణయం

డిజిటల్‌ మోసాల ఉదంతాలు పెరుగుతున్న నేపథ్యంలో అక్రమ రుణాల యాప్‌లను కట్టడి చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.
Govt cracks down on illegal loan apps
Govt cracks down on illegal loan apps

ఇందులో భాగంగా చట్టబద్ధంగా అనుమతులు పొందిన యాప్‌ల లిస్టును రిజర్వ్‌ బ్యాంక్‌ తయారు చేయనుండగా, అవి మాత్రమే యాప్‌ స్టోర్స్‌లో అందుబాటులో ఉండేలా ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ  (మెయిటీ) జాగ్రత్తలు తీసుకోనుంది. వివిధ శాఖలు, ఆర్‌బీఐ అధికారులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు.

Also read:  RBI: నవంబర్‌ 30 నుంచి డిజిటల్‌ రుణాలకూ కొత్త నిబంధనలు
 
వీటి ప్రకారం మనీ లాండరింగ్‌ కోసం ఉపయోగించేందుకు అద్దెపై తీసుకుని ఉండొచ్చని భావిస్తున్న ఖాతాలను ఆర్‌బీఐ పర్యవేక్షించనుంది. అలాగే నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ) దుర్వినియోగం కాకుండా నిద్రాణంగా ఉంటున్న సంస్థల లైసెన్సులను సమీక్షించడం లేదా రద్దు చేయడం వంటి చర్యలు తీసుకుంటుంది. అలాగే నిర్దిష్ట కాలవ్యవధిలో పేమెంట్‌ అగ్రిగేటర్ల రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యేలా చూడటం, నమోదు చేసుకోని అగ్రిగేటర్లను కార్యకలాపాలు నిర్వహించనివ్వకపోవడం వంటి అంశాలపై దృష్టి పెడుతుంది.  

Also read: 5 రాష్ట్రాలకు Grant in aid రూ. రూ.4,189.58 కోట్లు విడుదల

ఇక ఇలాంటి యాప్‌లు విస్తరించకుండా డొల్ల కంపెనీలను గుర్తించి, వాటిని డీ–రిజిస్టర్‌ చేసే బాధ్యత కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ తీసుకుంటుంది. అలాగే కస్టమర్లు, బ్యాంకు ఉద్యోగులు, చట్టాలు అమలు చేసే ఏజెన్సీలు, ఇతర వర్గాల్లోనూ సైబర్‌ భద్రతపై అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకుంటుంది. 

Also read: Fifth Strongest Economy: ప్రపంచంలో ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 10 Sep 2022 05:26PM

Photo Stories