Skip to main content

Fed Interest rate hike : 0.75 శాతం పెంపు

అమెరికా కేంద్ర బ్యాంకు (Federal Reserve System) ధరల కట్టడికి మరోసారి వడ్డీ రేట్ల పెంపు అస్త్రాన్ని బయటకు తీసింది.
Fed Interest rate hike
Fed Interest rate hike

తాజాగా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేటును 0.75 శాతం పెంచింది. దీంతో ఫెడ్‌ ఫండ్స్‌ రేట్లు 2.25–2.50 శాతానికి చేరాయి. ద్రవ్యోల్బణ అదుపునకు 2022 జనవరి మొదలు 2022 జూన్‌ వరకూ  వడ్డీ రేటును 1.5 శాతం పెంచింది. నాలుగు దశాబ్దాలలోలేని విధంగా సీపీఐ 9 శాతానికి చేరడంతో ఈ ఏడాది(2022) చివరికల్లా వడ్డీ రేటును 3.4 శాతానికి చేర్చే యోచనలో ఫెడ్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ ఉంది. ఆర్థిక మాంద్య పరిస్థితులకంటే ధరల అదుపే తమకు ప్రధానమంటూ ఫెడ్‌ చైర్మన్‌ జెరోమీ పావెల్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో ఆరు ప్రధాన కరెన్సీల మారకంలో డాలరు ఇండెక్స్‌ 107ను దాటి కదులుతోంది. రేట్ల పెంపు అంచనాలతో ఈ నెల మొదట్లో రెండు దశాబ్దాల గరిష్టం 109.29ను తాకిన సంగతి తెలిసిందే. అయితే రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావంతో ఆర్థిక మాంద్య ముప్పు పొంచి ఉన్నట్లు విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. 

Also read: Unclaimed deposits: క్లెయిమ్‌ చేయని నిధులు రూ.48,262 కోట్లు
 

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 28 Jul 2022 06:03PM

Photo Stories