Skip to main content

యూరోపియన్‌ సొసైటీ ప్రైజ్‌ గెలుచుకున్న మాజీ ఆరోగ్య మంత్రి?

కేరళ మాజీ ఆరోగ్య మంత్రి కేకే శైలజకు ప్రతిష్టాత్మక సెంట్రల్‌ యూరోపియన్‌ యూనివర్శిటీ ఓపెన్‌ సొసైటీ ప్రైజ్‌-2021 లభించింది.
Current Affairs కరోనా సమయంలో ఆమె అందించిన సేవలు, చూపిన నాయకత్వ పటిమకు ఈ అవార్డు ఇస్తున్నట్లు సెంట్రల్‌ యూరోపియన్‌ యూనివర్సిటీ (సీఈయూ) ప్రకటించింది. కరోనా కారణంగా అవార్డు ప్రదానోత్సవ వేడుకలను వర్చువల్‌గా నిర్వహించినట్లు జూన్‌ 19న యూనివర్సిటీ తెలిపింది. అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో ఆమెను అత్యుత్తమ ప్రజా సేవకురాలిగా సీఈయూ అధ్యక్షుడు మైఖేల్‌ ఇగ్నేషిప్‌ ప్రకటించారు. తన సేవ ద్వారా ప్రపంచంతో పాటు యువ మహిళలకు ఆమె మార్గదర్శకత్వం చూపించారన్నారు.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : సెంట్రల్‌ యూరోపియన్‌ యూనివర్శిటీ ఓపెన్‌ సొసైటీ ప్రైజ్‌-2021 విజేత
ఎప్పుడు : జూన్‌ 19
ఎవరు : కేరళ మాజీ ఆరోగ్య మంత్రి కేకే శైలజ
ఎందుకు : కరోనా సమయంలో ఆమె అందించిన సేవలు, చూపిన నాయకత్వ పటిమకు
Published date : 21 Jun 2021 07:46PM

Photo Stories