యూపీ నుంచి ఢిల్లీకి ఉన్నావ్ కేసు బదిలీ
Sakshi Education
ఉన్నావ్ అత్యాచార ఘటనకు సంబంధించి నమోదైన మొత్తం ఐదు కేసులనూ ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీకి బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ఆగస్టు 1న ఆదేశించింది.
అలాగే బాధితురాలికి తక్షణమే రూ. 25 లక్షల తాత్కాలిక పరిహారం అందజేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని నిర్దేశించింది. జూలై 28న ఉన్నావ్ అత్యాచార బాధితురాలి కారును ట్రక్కు ఢీకొట్టిన ఘటనపై దర్యాప్తును వారం రోజుల్లోనే పూర్తి చేయాలని కూడా సీబీఐకి సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అలాగే ఉన్నావ్ అత్యాచర ఘటన ప్రధాన కేసు విచారణను ప్రారంభించిన నాటి నుంచి 45 రోజుల్లోపే పూర్తి చేయాలని కూడా సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది.
Published date : 02 Aug 2019 05:23PM