యూనివర్సిటీ ఆఫ్ లక్నో స్మారక నాణేం ఆవిష్కరణ
Sakshi Education
ఉత్తరప్రదేశ్‌లోని ‘యూనివర్సిటీ ఆఫ్ లక్నో’ శతాబ్ధి వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 25న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా యూనివర్సిటీ స్మారక నాణేన్ని, తపాలా బిళ్లను ఆయన విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ... ఆత్మవిశ్వాసం, ఆత్మసమీక్ష వంటి లక్షణాలను పెంపొందించుకోవాలని యువతకు సూచించారు. ఈ కార్యక్రమంలో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. 1920 ఏడాదిలో యూనివర్సిటీ ఆఫ్ లక్నోను స్థాపించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : యూనివర్సిటీ ఆఫ్ లక్నో స్మారక నాణేం ఆవిష్కరణ
ఎప్పుడు : నవంబర్ 25
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : వర్చువల్ విధానంలో
ఎందుకు : యూనివర్సిటీ ఆఫ్ లక్నో శతాబ్ధి వేడుకల సందర్భంగా
క్విక్ రివ్యూ :
ఏమిటి : యూనివర్సిటీ ఆఫ్ లక్నో స్మారక నాణేం ఆవిష్కరణ
ఎప్పుడు : నవంబర్ 25
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : వర్చువల్ విధానంలో
ఎందుకు : యూనివర్సిటీ ఆఫ్ లక్నో శతాబ్ధి వేడుకల సందర్భంగా
Published date : 26 Nov 2020 06:07PM