యూఎస్, రష్యా అణు ఒప్పందం మరో అయిదేళ్లు
Sakshi Education
అమెరికా, రష్యా మధ్య అణ్వాయుధాల నియంత్రణ ఒప్పందాన్ని మరో అయిదేళ్లు పొడిగించాలని అగ్రరాజ్యం అమెరికా ప్రతిపాదించింది.
ఈ అణు ఒప్పందాన్ని కుదుర్చుకున్న సమయంలోనే పొడిగించడానికి కూడా వీలు కల్పించారు.దీంతో జాతి ప్రయోజనాల కోసం అమెరికా అధ్యక్షుడు జో బెడైన్ తాజా నిర్ణయం తీసుకున్నారని అధ్యక్షభవనం వైట్ హౌస్ జనవరి 22న తెలిపింది. అమెరికా ప్రతిపాదనని రష్యా స్వాగతించింది. తాము కూడా ఒప్పందాన్ని పొడిగించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొంది.
2010లో బరాక్ ఒబామా హయాంలో కుదిరిన ఈ అణు ఒప్పందం ఫిబ్రవరి 5తో ముగియనుంది. దీని ప్రకారం ఒక్కో దేశం 1,550కి మించి అణు వార్‌హెడ్‌లను మోహరించడానికి వీల్లేదు.
2010లో బరాక్ ఒబామా హయాంలో కుదిరిన ఈ అణు ఒప్పందం ఫిబ్రవరి 5తో ముగియనుంది. దీని ప్రకారం ఒక్కో దేశం 1,550కి మించి అణు వార్‌హెడ్‌లను మోహరించడానికి వీల్లేదు.
Published date : 23 Jan 2021 06:19PM