యూఎస్ ఓపెన్ టైటిల్ విజేతగా బియాంకా
Sakshi Education
యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ విజేతగా కెనడాకి చెందిన బియాంకా ఆండ్రీస్కూ అవతరించింది.
అమెరికాలోని న్యూయార్క్‌లో సెప్టెంబర్ 8న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 15వ సీడ్ బియాంక 6-3, 7-5తో 8వ సీడ్, 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత సెరెనా విలియమ్స్ (అమెరికా)పై విజయం సాధించింది. దీంతో కెనడా తరఫున గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన తొలి ప్లేయర్‌గా బియాంకా రికార్డు నెలకొల్పింది. చాంపియన్ బియాంకాకు 38,50,000 డాలర్లు (రూ. 27 కోట్ల 59 లక్షలు)... రన్నరప్ సెరెనాకు 19,00,000 డాలర్లు (రూ. 13 కోట్ల 62 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ విజేత
ఎప్పుడు : సెప్టెంబర్ 8
ఎవరు : బియాంకా ఆండ్రీస్కూ
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా
క్విక్ రివ్యూ :
ఏమిటి : యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ విజేత
ఎప్పుడు : సెప్టెంబర్ 8
ఎవరు : బియాంకా ఆండ్రీస్కూ
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా
Published date : 09 Sep 2019 05:50PM