యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ పురుషుల సింగిల్స్ చాంపియన్?
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ పురుషుల సింగిల్స్ విభాగంలో థీమ్ చాంపియన్‌గా అవతరించాడు. భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 14న న్యూయార్క్‌లో జరిగిన ఫైనల్లో రెండో సీడ్ డొమినిక్ థీమ్ 4 గంటల 2 నిమిషాల పోరాటంలో 2-6, 4-6, 6-4, 6-3, 7-6 (8/6)తో ఐదో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై విజయం సాధించాడు. విజేత థీమ్‌కు 30 లక్షల డాలర్లు (రూ. 22 కోట్లు), రన్నరప్ జ్వెరెవ్‌కు 15 లక్షల డాలర్లు (రూ. 11 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించాయి.
తొలి రెండు సెట్‌లు ఓడిపోయి...
కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన 27 ఏళ్ల థీమ్ 1949 తర్వాత యూఎస్ ఓపెన్ ఫైనల్లో తొలి రెండు సెట్‌లు ఓడిపోయి, ఆ తర్వాత వరుసగా మూడు సెట్‌లు గెలిచి విజేతగా నిలిచిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. 1949లో యూఎస్ నేషనల్ చాంపియన్‌షిప్ పేరుతో జరిగిన టోర్నీ ఫైనల్లో పాంచో గొంజాలెజ్ (అమెరికా) తన సహచరుడు టెడ్ ష్రోడెర్‌పై ఈ తరహాలో గెలిచాడు. 1968 నుంచి ప్రొఫెషనల్ ఆటగాళ్లకు కూడా గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడేందుకు అనుమతి ఇవ్వడంతో అప్పటి నుంచి టెన్నిస్‌లో ఓపెన్ శకం మొదలైంది.
చదవండి: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ మహిళల సింగిల్స్‌లో టైటిల్ విజేత?
రెండో ఆస్ట్రియా ఆటగాడిగా....
- 1990 తర్వాత జన్మించి పురుషుల సింగిల్స్ విభాగంలో గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ విజేతగా నిలిచిన తొలి ప్లేయర్ థీమ్.
- థామస్ ముస్టర్ (1995లో ఫ్రెంచ్ ఓపెన్) తర్వాత గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన రెండో ఆస్ట్రియా ఆటగాడిగా థీమ్ నిలిచాడు.
- గ్రాండ్‌స్లామ్ టోర్నీల చరిత్రలో ఫైనల్లో టైబ్రేక్ ద్వారా ఫలితం రావడం ఇది రెండోసారి మాత్రమే. 2019 వింబుల్డన్ ఫైనల్లో ఫెడరర్‌పై జొకోవిచ్ టైబ్రేక్‌లో గెలిచాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ పురుషుల సింగిల్స్ చాంపియన్
ఎప్పుడు : సెప్టెంబర్ 14
ఎవరు : డొమినిక్ థీమ్
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా