యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ మహిళల డబుల్స్ టైటిల్ విజేత?
Sakshi Education
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ మహిళల డబుల్స్ విభాగంలో అన్‌సీడెడ్ జోడీ లౌరా సిగెముండ్ (జర్మనీ)-వెరా జ్వొనరేవా (రష్యా) జంట విజేతగా నిలిచింది.
భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 12న న్యూయార్క్‌లో 80 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో ఈ జంట 6-4, 6-4తో మూడో సీడ్ నికోల్ మెలికార్ (అమెరికా)-యి ఫాన్ షు (చైనా) జోడీపై విజయం సాధించింది. విజేత సిగెముండ్-జ్వొనరేవా ద్వయంకు 4,00,000 డాలర్లు (రూ. 2 కోట్ల 94 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి .
పావిచ్-సోరెస్ జంటకు పురుషుల డబుల్స్ టైటిల్
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ పురుషుల డబుల్స్ విభాగంలో అన్‌సీడెడ్ ద్వయం మ్యాట్ పావిచ్ (క్రొయేషియా)-బ్రూనో సొరెస్ (బ్రెజిల్) టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో పావిచ్-సోరెస్ జంట 7-5, 6-3తో వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్)-నికోలా మెక్‌టిక్ (క్రొయేషియా) జోడీపై గెలిచింది. విజేతగా నిలిచిన పావిచ్-సోరెస్ జంటకు 4,00,000 డాలర్లు ప్రైజ్‌మనీగా (రూ. 2 కోట్ల 93 లక్షలు) లభించాయి .
చదవండి: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ పురుషుల, మహిళల విభాగాల్లో టైటిల్ విజేతలు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ మహిళల డబుల్స్ టైటిల్ విజేత
ఎప్పుడు : సెప్టెంబర్ 12
ఎవరు : లౌరా సిగెముండ్ (జర్మనీ)-వెరా జ్వొనరేవా (రష్యా) జంట
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా

Published date : 19 Sep 2020 11:50AM