Skip to main content

యూఎస్ మిలటరీ స్థావరాలపై ఇరాన్ దాడి

ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ జనవరి 7న క్షిపణుల వర్షం కురిపించింది.
Current Affairsఅమెరికా సైనికులు, సంకీర్ణ దళాలు ఉన్న అల్ అసద్, ఇర్బిల్ మిలటరీ స్థావరాలపై ఇరాన్ డజనుకు పైగా బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడిలో 80 మంది అమెరికా సైనికులు చనిపోయారని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ సైనిక జనరల్ సులేమానీని అమెరికా చంపినందుకు ప్రతీకారంగానే ఈ క్షిపణి దాడి జరిగిందని ఇరాన్ అధికార టీవీ పేర్కొంది. దాడిలో ఇరాకీ సైనికులకు గాయాలు కాలేదని ఇరాక్ మిలటరీ వెల్లడించింది.

తాజా దాడి అమెరికాకు చెంపపెట్టులాంటిదని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ వ్యాఖ్యానించారు. ‘అమెరికాకు భయపడి వెనక్కువెళ్లబోం’ అని ఈ దాడి ద్వారా స్పష్టం చేశామని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ స్పష్టం చేశారు.

కొంత నష్టం : ట్రంప్
ఇరాన్ క్షిపణి దాడిలో తమ సైనికులెవరూ చనిపోలేదని, తమ మిలటరీ స్థావరాలకు కొంత నష్టం మాత్రం వాటిల్లిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జనవరి 8న వెల్లడించారు. శాంతిని కోరుకునే అందరితో శాంతియుత సంబంధాలనే కోరుకుంటామన్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థను నిర్మూలించేందుకు కలసిరావాలని ఇరాన్‌ను కోరారు. దీంతో, తీవ్ర స్థాయికి చేరిన ఉద్రిక్తతలు కొంతమేరకు చల్లబడ్డాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడి
ఎప్పుడు : జనవరి 7
ఎవరు : ఇరాన్
ఎక్కడ : అల్ అసద్, ఇర్బిల్ మిలటరీ స్థావరాలు
Published date : 09 Jan 2020 05:35PM

Photo Stories