యూఎస్ కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి నల్ల జాతి స్వలింగ సంపర్కుడు?
Sakshi Education
2020 ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి రిచీ టోరెస్(32) సరికొత్త చరిత్ర సృష్టించాడు.
యూఎస్ కాంగ్రెస్(పార్లమెంట్)కు ఎన్నికైన తొలి నల్ల జాతి స్వలింగ సంపర్కుడిగా(గే) టోరెస్ రికార్డుకెక్కాడు. ప్రస్తుతం న్యూయార్క్ సిటీ కౌన్సిల్ సభ్యుడిగా పని చేస్తున్న ఆయన న్యూయార్క్ రాష్ట్రంలోని 15వ కాంగ్రెషనల్ జిల్లా నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యాడు. తన సమీప ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి పాట్రిక్ డెలిసెస్‌ను ఓడించాడు. తాను ఆఫ్రో-లాటినో అని టోరెస్ తెలిపాడు. 2013 నుంచి న్యూయార్క్ సిటీ కౌన్సిల్ సభ్యుడిగా కొనసాగుతున్నాడు.
సందర్భం:
స్వలింగ సంపర్కం, ప్రైవేటుగా జరిగే లైంగిక చర్య నేరం కాదు : భారత సుప్రీంకోర్టు
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమెరికా కాంగ్రెస్(పార్లమెంట్)కు ఎన్నికైన తొలి నల్ల జాతి స్వలింగ సంపర్కుడు
ఎప్పుడు : నవంబర్ 4
ఎవరు : డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి రిచీ టోరెస్
ఎక్కడ : అమెరికా

Published date : 05 Nov 2020 05:50PM