Skip to main content

యూఎస్ గ్రాండ్‌ప్రి రేసు విజేతగా బొటాస్

యునెటైడ్ స్టేట్స్ (యూఎస్) గ్రాండ్‌ప్రి రేసు విజేతగా మెర్సిడెస్ జట్టు డ్రైవర్ వాల్తెరి బొటాస్ నిలిచాడు.
అమెరికాలోని ఆస్టిన్‌లో నవంబర్ 4న జరిగిన 56 ల్యాప్‌ల ఈ రేసులో బొటాస్ గంటా 33 నిమిషాల 55.653 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన లూయిస్ హామిల్టన్ రెండో స్థానంలో నిలిచాడు. 21 రేసుల ప్రస్తుత సీజన్‌లో 19 రేసులు ముగిశాక హామిల్టన్ 381 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. హామిల్టన్ సహచరుడు బొటాస్ 314 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ సీజన్‌లో మరో రెండు రేసులు (బ్రెజిల్, అబుదాబి గ్రాండ్‌ప్రి) మిగిలి ఉన్నాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
యునెటైడ్ స్టేట్స్ (యూఎస్) గ్రాండ్‌ప్రి రేసు విజేత
ఎప్పుడు : నవంబర్ 4
ఎవరు : మెర్సిడెస్ జట్టు డ్రైవర్ వాల్తెరి బొటాస్
ఎక్కడ : ఆస్టిన్, అమెరికా
Published date : 05 Nov 2019 05:41PM

Photo Stories