Skip to main content

యూఎన్‌హెచ్‌ఆర్సీకి పాక్, చైనా ఎంపిక

ఐరాస మానవహక్కుల మండలి (యూఎన్‌హెచ్‌ఆర్సీ)కి చైనా, రష్యా, క్యూబాలతో సహా పాకిస్తాన్ కూడా చోటు సంపాదించింది.
Current Affairs
ఆ దేశాల్లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని, సామాజిక గ్రూపులు బలంగా వ్యతిరేకించినప్పటికీ మండలిలో స్థానాన్ని పొందగలిగాయి. 193 సభ్యదేశాలు గల ఐరాస జనరల్ అసెంబ్లీలో రహస్య ఓటింగ్ జరగగా, పాకిస్తాన్ 169 ఓట్లు పొందగా, ఉజ్బెకిస్తాన్ 164, నేపాల్ 150, చైనా 139 ఓట్లు సాధించాయి. సౌదీ అరేబియా 90 ఓట్లు పొంది, రేస్ నుంచి తప్పుకుంది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఐరాస మానవహక్కుల మండలి (యూఎన్‌హెచ్‌ఆర్సీ)కి ఎంపిక
ఎప్పుడు : అక్టోబర్ 14
ఎవరు : చైనా, రష్యా, క్యూబా, పాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, నేపాల్
Published date : 15 Oct 2020 05:05PM

Photo Stories