యూఎన్-ఉమెన్ డిప్యూటీ డెరైక్టర్‌గా అనితా
Sakshi Education
మహిళా సాధికారత, స్త్రీ-పురుష సమానత్వంపై కృషి చేసే ఐక్యరాజ్యసమితి సంస్థ యూఎన్-ఉమెన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా భారత సంతతికి చెందిన మహిళ అనితా భాటియా నియమితులయ్యారు.
ఈ మేరకు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యూటెరస్ మే 31న ప్రకటించారు. కలకత్తా విశ్వవిద్యాలయంలో బీఏ చదివిన అనితా వ్యూహాత్మక భాగస్వామ్యాలు, వనరుల సమీకరణ, నిర్వహణలో నిష్ణాతురాలు.
అమెరికాలోని యేల్ వర్సిటీ నుంచి రాజకీయ శాస్త్రంలో పీజీ పూర్తి చేసిన అనితా జార్జిటౌన్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. ప్రపంచ బ్యాంక్ గ్రూప్‌లో క్షేత్రస్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకూ వివిధ హోదాల్లో పనిచేశారు. ఈ బ్యాంకులోని ప్రైవేటురంగ విభాగమైన అంతర్జాతీయ ఆర్థిక కార్పొరేషన్‌లో డెరైక్టర్‌గా కూడా వ్యవహరించారు. గతంలో భారత్‌కు చెందిన లక్ష్మిపురి యూఎన్-ఉమెన్‌కు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా పనిచేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : యూఎన్-ఉమెన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా భారత సంతతి మహిళ
ఎప్పుడు : మే 31
ఎవరు : అనితా భాటియా

Published date : 01 Jun 2019 05:44PM